Wednesday, February 11, 2009

Missamma - Brundavanamanamadi



చిత్రం: మిస్సమ్మ (1955)
రచన: పింగళి
సంగీతం: S. రాజేశ్వర రావు
గాయకులు: A.M. రాజా, P. సుశీల
****************
పల్లవి:
బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే (2)
ఎందుకె రాధ ఈసునసూయలు అందములందరి ఆనందములే (2) // బృందావనమది //

చరణం 1:
పిల్లన గ్రోవిని పిలుపులు వింటే ఉల్లము ఝల్లున పొంగదటే (2)
రాగములో అనురాగము చిందిన జగమే ఊయల ఊగదటే.. (2) // బృందావనమది //

చరణం 2:
రాసక్రీడల రమణుని గాంచిన ఆశలు మోసులు వేయవటే (2)
ఎందుకె రాధ ఈసునసూయలు అందములందరి ఆనందములే // బృందావనమది //

No comments:

Related Posts with Thumbnails