Monday, December 31, 2012

నూతన సంవత్సర శుభాకాంక్షలు.

మిత్రులకీ, 
మీ కుటుంబ సభ్యులకీ, 
శ్రేయోభిలాషులకీ, 
తోటి బ్లాగర్స్ కీ, 
నా శత్రువులకీ..

మీకు - హృదయపూర్వక 2013 నూతన సంవత్సర శుభాకాంక్షలు. 

Sunday, December 30, 2012

Good Morning - 220


"Never think that you not like others.. 
Make others think that..
Why they are not like you.." 
- Albert Einstine. 

Saturday, December 29, 2012

Good Morning - 219

Telugu quotations


మనిషి సహజముగా తన 
బలహీనతలని ఎప్పుడూ ఒప్పుకోడు. 
వాటిని చూడడు. పట్టించుకోడు. 
తెలిసినా, తెలిపినా సరిదిద్దుకోడు. 

Friday, December 28, 2012

Good Morning - 218Good Morning - 217


పాడై పోయిన కొడుకు మొఖం మీద 
పులిపిరికాయ లాంటివాడు.
దాచిపెట్టలేం..
నొప్పి భరించి పులిపిరిని తీసేసినా 
మచ్చ అలాగే ఉంటుంది.


Thursday, December 27, 2012

మా తెలుగు తల్లికి మల్లెపూదండ


మా తెలుగు తల్లికి మల్లెపూదండ,
మా కన్నతల్లికి మంగళారతులు,
కడుపులో బంగారు కనుచూపులో కరుణ,
చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి.

గలగలా గోదారి కదిలిపోతుంటేను,
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను,
బంగారు పంటలే పండుతాయీ,
మురిపాల ముత్యాలు దొరలుతాయి.

అమరావతి నగర అపురూప శిల్పాలు,
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు,
తిక్కయ్య కలములో తియ్యందనాలు,
నిత్యమై నిఖిలమై, నిలిచి వుండేదాకా,

రుద్రమ్మ భుజశక్తి,మల్లమ్మ పతిభక్తి ,
తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి,
మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక,
నీపాటలే పాడుతాం. నీ ఆటలే ఆడుతాం,
జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. 

Wednesday, December 26, 2012

Good Morning - 216

Telugu quotations నమ్మకం.. 
ఇది ఏర్పడాలి అంటే కొన్ని సంవత్సరాలు కావాలి. 
కానీ నమ్మకం పోవటానికి కొద్ది క్షణాలు చాలు. 

నిజమే కదూ! స్నేహితులలో కానీ, బంధువుల్లో కానీ, చుట్టుప్రక్కల ఉన్నవారి మీద కానీ.. నమ్మకం ఏర్పడాలీ అంటే చాలా కాలం సమయం తీసుకుంటుంది. అదే నమ్మకం పోవటానికి కొద్ది క్షణాలు చాలు. ఇంకోరకముగా చెప్పాలీ అంటే - బొట్టు బొట్టు చేరిస్తే కుండలో నీరు నిండినట్లే, ఆడే కుండ పగిలితే అంత సమయం తీసుకొని చేర్చిన నీరు, కొద్ది క్షణాల్లో ఆ కుండ నుండి వెళ్ళిపోతాయి. ఇదీ అంతే! 

ఒకసారి మీ మీద ఏర్పడిన నమ్మకాలని వమ్ము చేసేలా అసలు ప్రయత్నించకండి. అవసరమైతే కొంత త్యాగం చేసి, మీ మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోండి. కాసింత ఓపికగా, నెమ్మదిగా ఉండండి. ఆ నమ్మకాన్ని వమ్ము చేసిన అసలు విషయమేమిటో, ఆ విషయం ఎలా వచ్చిందో, ఏమి చేస్తే ఆ విషయం తొలగిపోతుందో - ఆలోచించండి. ఆ దిశగా ప్రయత్నాలు ఆరభించండి. అలా చేస్తున్నప్పుడు మరింతగా అడ్డంకులు ఎదురవుతాయి. ఈ లోకం మీ మాటలు నమ్మదు. అయినా ప్రయత్న లోపం చెయ్యకండి. ఆశాభావం తో ముందుకు సాగండి. 

ఇలా చేస్తున్న ప్రయత్నాలలో - ఎవరినీ, ఎక్కడా కించపరిచే మాటలు తూలకండి. ఇవి మరీ ప్రమాదకరం. ఎందుకంటే ఒకసారి పౌరుష మాటలు అన్నామూ అంటే - వెనక్కి తీసుకోలేము. ఎదుటివారిని ఆ మాటలు తాకాక, వారు మీ పట్ల మరింతగా కఠినముగా మారుతారు. అప్పుడు ఎంత ప్రయత్నించినా - మనసు విరిగిపోయి, మీరు చేసే ప్రయత్నాల పట్ల విశ్వాసం చూపించరు. ఫలితముగా వారు మీకు శాశ్వతముగా దూరమై పోతారు. 

Tuesday, December 25, 2012

క్రిస్మస్ శుభాకాంక్షలు.


మిత్రులకూ, 
క్రైస్తవ సోదర, సోదరీమణులకు, 
వారి కుటుంబ సభ్యులకు, 
శ్రేయోభిలాషులకూ, 
క్రిస్మస్ వేడుకల శుభాకాంక్షలు..Monday, December 24, 2012

Sunday, December 23, 2012

ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు.


మీకూ, 
మీ కుటుంబ సభ్యులకూ, 
శ్రేయోభిలాషులకూ, 
తోటి బ్లాగర్లకీ, 
ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. 

Saturday, December 22, 2012

Friday, December 21, 2012

Good Morning - 213

Telugu Quotations


ప్రేమంటే - ప్రేమించిన వారితో సంతోషముగా, 
జీవితాంతం కలసి ఉండటం కాదు.. 
వారు మనకి దూరమైనా - 
జీవితాంతం వారి సంతోషాన్ని కోరుకోవటం. 

ప్రేమంటే అంతే కదూ! ప్రేమించినవారి శ్రేయస్సు, అభ్యున్నతిని, సంతోషాన్ని, ఎదుగుదలనీ.. అంతా మంచే కదా కోరుకునేది. అదే నిజమైన ప్రేమ. కానీ ఈరోజుల్లో కాసింత ఎడబాటు రాగానే ఎదుటివారిని నానా దుర్భాశాలడటం, తన ఆధిక్యత ప్రదర్శించటానికి దాడి చెయ్యటం, కొండకచోట యాసిడ్ దాడులూ, కత్తులతో దాడి చెయ్యటం.. జరుగుతునే ఉన్నాయి. కానీ నిజమైన ప్రేమికుల లక్షణం అది కాదు. ఎదుటివారి బాగునీ, వారి సంతోషాన్ని కోరుకోవటం.. 

ప్రేమలో ఉన్నప్పుడు వారి పట్ల చూపే శ్రద్ధ, అభిమానం, ఎదుటివారి సంతోషం కలిగించటం లాంటివి ఎలా చూపిస్తామో - వారు మనకి దూరం అయినప్పుడు, అప్పుడు కూడా చూపిస్తే అదే నిజమైన ప్రేమ. కొన్ని కారణాల వల్ల దూరమైనా ఆ విషయాన్ని అర్థం చేసుకోగలగాలి. తనవారి తప్పున్నా అది ఆలోచించి, అర్థం చేసుకోగలగాలి. నిజానికి ఇలా దూరం అవగానే కోపం, అసహ్యం, ప్రతీకార కాంక్ష కలుగుతుంది. కాదనను. అవి ఆ వ్యక్తిని క్షణకాలం కూడా నిలవనీయవు. ఎదుటివారి మీద పగ తీర్చుకోమంటుంది.. వీటన్నింటికీ తట్టుకోవటం కష్టమే అయినా, తట్టుకొని ఎదుటివారిలో సంతోషాన్ని కోరుకోవటం చాలా గొప్పవిషయం. అది అందరిలో రాదు కూడా. అవతలివారు సంతోషముగా ఉన్నారు అన్న వార్త విని / చూసి ఆనందపడటమే నిజమైన ప్రేమికుల లక్షణం. 

కానీ, నన్ను మరచి, ఇంకొకరితో ఎలా సంతోషముగా ఉన్నారు చూడు అనే నిందలు ప్రేమ కాదు.. జెలసీ / ఈర్ష్య అంటారు. ఆ కోణంలో తరవాత ఆలోచిద్దాం. 

ఇదే భావం స్నేహంలో కూడా ఉంటుంది. నిజానికి ప్రేమ, స్నేహం - ఈ రెండూ పరిచయ పునాదుల మీదే ఏర్పడతాయి. లోతుగా వెళుతున్నా కొలది వారిద్దరి బంధాన్ని ప్రేమగానే వేరేవారు అనుకుంటారు. కానీ, ప్రేమకీ, స్నేహానికి మధ్య సన్నని గీత ఉంటుంది. అది అందరికీ కనిపించదు కూడా. మంచి స్నేహితులు దూరమైనా - ప్రేమికులు దూరం అయినప్పుడు కలిగే దాదాపు అన్నీ భావాలు ఇక్కడా కలుగుతాయి. నిందాపూర్వక మాటలు వెలువడుతాయి. మొదట్లో అవి మామూలే.. ఆతరవాత అవతలివారి సంతోషాన్ని కోరుకొంటారు. అలాంటివారిని ఈ ఆన్లైన్ లోనూ, నిజజీవితములోనూ చూశాను. ఆ భావనని అనుభవిస్తున్నవారిని అడిగితే - అదో తీయని బాధగా వర్ణించటం కొసమెరుపు. 

Thursday, December 20, 2012

Good Morning - 212

Telugu quotations.


Wednesday, December 19, 2012

Good Morning - 211


తనని తాను తెలుసుకోవడం చాలా కష్టం. 
దానికి తీవ్ర సాధన కావాలి. 

మన వీపు గురించి మనకి తెలీనట్లే మన గురించి మనం ఏమాత్రం తెలుసుకోలేం. నిజానికి అది కష్టం కూడా. అంతెందుకు.. మీ గురించి మీరు చెప్పేసుకోండి, స్నేహం మీదనో, ప్రేమ మీదనో, మానవ బంధాల గురించో, మనమూ - మన పిల్లల గురించి ఉన్న అనుబంధం గురించో, జీవిత భాగస్వామి మధ్యన ఉన్న బంధం గురించో - ఇలా మనకి సంబంధించిన అంశాల మీద మనకి ఉన్న అభిప్రాయం ఏమిటో చెప్పమంటే - ఒకవేళ ఎవరూ అడగకున్నా, మీకు మీకుగా చెప్పుకోమంటే - రెండు, మూడు వాక్యాలు చెప్పేసి ఆగిపోతారు. కొందరికైతే ఏమి చెప్పాలో కూడా తెలీక తల గోక్కుంటారు. 

ఇలాంటి స్థితిలో ఉన్నామూ అంటే - అది మన గురించి మనమేమిటో - మనమే తెలుసుకోలేదన్నమాట. ఇలా తెలుసుకోకున్నా ఏమీ కాదు. ఆకాశము నుండి ఏమీ కూలదు కూడా. కానీ మీరు కాస్త ప్రయత్నించి, మీ గురించి  మిమ్మల్ని తెలుసుకోండి. అప్పుడు మీలో మీ జీవన శైలి మీద మీకు నమ్మకం కలిగి, మీలో చాలా ఆత్మ సంతృప్తి కలుగుతుంది. అది మీ ముఖములో చాలా స్పష్టముగా ప్రతిఫలిస్తుంది. మీరు చాలా ఆనందముగా ఉంటారు కూడా. 

నిజానికి ఇలా తెలుసుకోవటం చాలా కష్టమే!. అలా తెలుసుకోవాలంటే కొంతవరకూ మీ చుట్టూ ఉన్న పరిసరాలు, స్నేహ బృందం, ఆత్మీయుల అండా కావాలి. ఎక్కువగా అయితే మీమీదే ఆధారపడి ఉంటుంది అని మరచిపోవద్దు. ఇలా సాధన చెయ్యటం చాలా కష్టమే అయినా, సాధించాక చాలా మధురముగా ఉంటుంది. 

Tuesday, December 18, 2012

Good Morning - 210


మనిషి తన నుంచి తను విడికానంత కాలం, 
అతడు దేన్నీ చూడలేడు. 

అవును కదూ.. తన మీద, తాను చేసే పనుల మీద తనే న్యాయ నిర్ణయాధికారిగా ఉన్నంత కాలం - తాను చేసే పొరబాట్లు, మంచి ఏమిటో స్పష్టముగా తెలుసుకోలేడు. 

Monday, December 17, 2012

Good Morning - 209


మనిషి జనన మరణాల మధ్య దొరికే ఒకే ఒక్క అవకాశం జీవితం. పోరాటాలే తప్ప ఓటమి తెలియకూడదు. ప్రయత్నాలే తప్ప నిస్పృహలుండరాదు. ఆశాతత్వమే తప్ప నిరాశావాదం తలెత్తరాదు. అప్పుడు నీకు దక్కిన అవకాశం వందశాతం సద్వినియోగమే అవుతుంది. 

ఎంత సరియైన మాటలు.. 
నిజమే! అన్ని జన్మలలో మనిషి జన్మ ఉత్తమమైనది. 
జననానికీ, మరణానికీ మధ్య ఉన్న కాలమే జీవితం. 
ఆ జీవితాన ఎన్నెన్నో సమస్యలు, అడ్డంకులు, అవరోధాలు.. 
వాటితో నిత్యం పోరాటాలు చెయ్యక తప్పదు. 
ఆ పోరాటములో ఓటమి అస్సలు పొందకూడదు. 
ఒకవేళ పొందినా - రెట్టించిన కసితో మళ్ళీ పోరాడి, గెలుపు కోసం కృషి చెయ్యాలి. 
ఆ ప్రయత్నములో మనలో ఆశావాహ దృక్పథం ఉండాలి గానీ, 
మనం గెలవలేం అన్న నిరాశా, నిస్పృహవాదం మన మదిలో అస్సలు ఏర్పడరాదు. 
అలా చేసినప్పుడు మీకు దక్కిన ఆ అవకాశంని సంపూర్ణముగా ఉపయోగములోనికి తెచ్చుకున్నట్లే అవుతుంది. 

Sunday, December 16, 2012

Good Morning - 208


ఏదైనా విషయాన్ని అంగీకరించటముగానీ, అనంగీకరించటం గానీ మనతో బాటు చేసేవాళ్ళతో చాలా కలుపుగోలుగా ఉంటాం. వారి సహచర్యాన్ని ఎప్పుడూ కోరుకుంటాము కూడా. వారితోనే మన సంతోషాలనీ, ఆనందాలని, ఆలోచనలనీ పంచుకుంటాము. మనం అవును అంటే అవును, కాదు అంటే కాదు అనే వారితో చాలా సంతోషముగా సమయం గడిచిపోతుంది. కానీ, నిజానికి అలాంటివారితో మనం జీవితాన ఎదగలేము. నమ్మలేకున్నా, అర్థరహితంగా అనిపించినా - ఇది మాత్రం నిజం. 

మరీ ఖచ్చితముగా చెప్పాలీ అంటే - మనం చేసే పనులని ప్రశ్నించే సన్నిహితులు "మనవాళ్ళలో " ఉండాలి. అలాంటివారు ఉంటే మొదట్లో చికాకుగా, వీళ్ళు వేస్ట్ గాళ్ళు అని చిరాకు పడ్డా, చాలాసార్లు వారు మన అభిప్రాయాన్ని సమ్మతించనప్పుడు, మనం ఏమాత్రం వారి మీద చీకాకు పడకూడదు. అలా చేస్తే మనం జీవితాన ఎదిగే దారులని మన చేజేతులా కోల్పోతున్నాం అన్నమాటే! 

ఎందుకు అలా మన అభిప్రాయముతో ఏకీభవించటం లేదు - అని వారిని ప్రశ్నించండి. 
వారు చెప్పే సమాధానాన్ని సావధానముతో, శ్రద్ధగా వినండి. 
వారి చెప్పేది పూర్తిగా వినండి. 
సుత్తి చెబుతున్నాడు అనే ఆలోచనతో దయచేసి వినకండి. 
అలా చెప్పటం ముగిశాక, కొంత సేపు ఆలోచించండి. 
అలా అయ్యాక ఏమైనా సందేహాలు ఉంటే వాటిని అడగండి. 
అప్పుడు మీ అభిప్రాయం చెప్పండి. 
అప్పుడు వారు మన అభిప్రాయము / ఆలోచన సరియైనదా? కాదా? చెబుతారు. 
ఆ విశ్లేషనాత్మక అభిప్రాయం మన జీవితాలని ఖచ్చితముగా మారుస్తుంది. 
కనీసం మన ఆలోచన ధోరణి అయినా మారుతుంది.
అందువల్ల - మన చుట్టూ గల వారిలో కొందరిని " శ్రేయోభిలాషులని " ఎంచుకోవాలి. 

మొదట్లో నేనూ నా అభిప్రాయాలని అవుననే వారితోనే సమయం గడిపేవాడిని. నాకొక మిత్రురాలు పరిచయం అయ్యాక, ఇప్పుడు ఆ అభిప్రాయం మార్చుకున్నాను. ఇప్పుడు నేను చేసే ఒప్పులూ, తప్పులూ తెలుసుకుంటున్నాను. కొన్ని విషయాల్లో నేను చేసిన ఆలోచనలు ఎంతవరకు సబబు అని బాగా తెలుసుకున్నాను. మానసికముగా కాసింత పరిపక్వత మెల్లగా పెరగసాగింది. ఈ విషయం ఒప్పుకోవాలంటే కూడా బాగానే " గట్స్ " ఉండాలనుకోండి. అది వేరే విషయం. 

Saturday, December 15, 2012

Good Morning - 207

 
ప్రతి ఒక్కరూ ఎదుటివారిని తప్పు పడుతూ ఉంటారు. ఓ పెద్ద.! వారేమీ తప్పులు చేయనట్లు. తప్పుని తప్పు చేశావు అన్నట్లు చెప్పాలి గానీ, అలా చెప్పి వారే తప్పు చేసేలా ఉండకూడదు. అవతలి వారిలో తప్పు ఎంచటం చాలా తేలిక. వారి చర్యలని వ్రేలేత్తి చూపటం చాలా సులభం. కానీ అలా తప్పుని ఎంచే ముందు - మనం అలాంటి తప్పులు చేశామా? లేమా? అని ఒకసారి ఆలోచించుకోవాలి. అలాంటి తప్పులు మనం చేయనప్పుడే - అవతలివారికి ఇది తప్పు అని చెప్పే హక్కు ఉంటుందని నేను నమ్ముతాను. "నేరం నాది కాదు ఆకలిది" ఎన్టీ రామారావు గారి సినిమాలో ఒక పాటలో - " ..మనలో పాపం చెయ్యనివాడు ఎవడో చెప్పండి. యే దోషం లేనివారు ఆ శిక్షని విధించాలి.." అని అంటారు. 

ఒకరిని వ్రేలేత్తి దోషిగా చూపెట్టినప్పుడు - మిగతా మూడు వ్రేళ్ళు మనకేసి చూపిస్తాయి. వాటిని చూశాక ఎవరైనా తగ్గాల్సిందే. అయినా కొందరు మూర్ఖులు మాత్రం మారరు. వారెప్పుడూ ఇతరులలో తప్పులని ఎంచుతూ ఉంటారు. అలాంటి వారికి దూరముగా ఉండండి. లేదా వారి మాటలని వారికే అప్పజేప్పండి. అప్పుడు వారికి ఎదుటివారి బాధ ఏమిటో తెలుస్తుంది. 

ఇలాంటి సంఘటనల్లో నా జీవితములో జరిగిన ఒక సంఘటన చెబుతాను. 

నా బండి పాడయితే - తాత్కాలికముగా అన్నట్లు సెకండ్ హ్యాండ్ లో ఇంకో బండి తెచ్చుకున్నాను. ఆ బండి చూసి, ఒకరు " ఏమన్నా.. సెకండ్ హ్యాండ్ తెచ్చేశావు.. ఫస్ట్ హ్యాండ్ బండి కొనద్దా.? డబ్బులు లేవా?" అన్నాడు. నాకు చిరాకు వేసింది. అతనెప్పుడూ నాకు అడ్డు వస్తుంటాడు. ఇలా కాదు అనుకుంటూనే గట్టిగా షాక్ ఇచ్చేద్దామని నిర్ణయం తీసేసుకున్నా.. నవ్వుతూనే " అది కాదు భయ్యా!.. మీలాంటి పెద్ద పెద్ద వాళ్ళే - అన్నీ సెకండ్ హ్యాండ్ వి వాడుతున్నప్పుడు, మా బోటివాళ్ళు ఏదో అలా  సెకండ్ హ్యాండ్ వాడక తప్పుతుందా..? " అన్నాను. అంతే!. అలా అంటాను అని అతను ఊహించలేదు.. అప్పుడు నోరు మూత పడిందీ అంటే - ఇప్పటికి దాదాపు రెండు సంవత్సరాలు అయ్యింది.. నాతో మాటలు లేవు. నా వైపు చూడటానికి తల త్రిప్పటం లేదు. అంటేనే ఎంత లోతుగా నా మాటలు తగిలాయో చూడండి. అంత లోతుగా తగలటానికి కారణం - అతను వాడుతున్న బండి, కారు, ఇల్లూ, షాపు, ఫర్నీచర్.. ఇలా చాలావరకు సెకండ్ హ్యాండ్ వే. మాటకి మాట అన్న నేను అయితే మామూలుగానే ఉన్నాను. 

అందుకే ఎవరినీ గెలక్కండి.. గెలికి, వారితో తిరుగుమాట అనిపించుకొని, బంధాలు, స్నేహాలు, మనసులు పాడుచేసుకోకండి. ఒకసారి మనకి ఆపోజిట్ వాళ్ళు ఏదైనా అంటే భరించలేం అని మన గురించి మనకి తెలిసినప్పుడు, అవతలి పక్షం వారితో ఏ మాటా రాకుండా చూసుకోండి. మీరు బాగుంటారు. మనసులో ఆ మాట పదే పదే వెంటాడకుండా ఉంటుంది. 

Friday, December 14, 2012

Kanakadurga temple, Korvipally

ఆ మధ్య అలా లాంగ్ డ్రైవ్ కి వెళ్ళినప్పుడు - మార్గమధ్యాన చిన్న అందమైన ఆలయం కనిపించింది. చూశాను. అఆగి ఆ ఆలయాన్ని చూడాలని అనుకున్నాను. రెండో ఫోటో చూడండి. అలా ఆ ఆలయం కనిపించింది. ఎందుకో లోనికి వెళ్లి, దర్శనం చేసుకొని రావాలనిపించింది. సరే అని లోపలి వెళ్ళాం.. ఆ ఆలయం విషయాలు అన్నీ మీకు ఫోటోల రూపములోనే చూపిస్తాను. అప్పుడు డిజిటల్ కెమరా తీసుకరావటం మరిచాను. నా మొబైల్ ఫోన్ కేమరాతోనే ఫొటోస్ తీశాను. క్లారిటీ అంతగా రాలేదు. 

చాలా చిన్న ఆలయం. 44 నేషనల్ హైవే (నాగపూర్ - హైదరాబాద్) కు కాసింత దూరములో చేగుంట - మెదక్ రహదారి మీద ఈ ఆలయం ఈ మధ్యే కట్టారు. ఇలా బాగుంది అని ఒకరు చెబితే - దారిలోనే కదా చూద్దాం అని వెళ్లాను. చిన్న స్థలం లో గుడి, ప్రక్కన వివాహాది శుభకార్యక్రమాలు జరుపుకోవటానికి వీలుగా ఉండేలా ఖాళీస్థలం వదలటం చాలా బాగా నచ్చేసింది. మొదటి ఫోటో చూడండి. ఆ ఫోటోలో ఉన్న ఆలయం స్థలం ఎంతో - ఆ ఊరి స్థలం ఎంత ఉందొ చూడండి. ఆలయం పరిమాణం 500 గజాలు ఉండవచ్చును. దానితో మిగతా ఊరిని అంచనా వెయ్యండి. ఈమధ్య నేను చూసిన అందమైన ప్రదేశాల్లో ఇదీ ఒకటి. గుడి కడితే ఇలా కట్టాలి అనిపించేలా ఉంది. 
Related Posts with Thumbnails