Tuesday, October 25, 2016

Good Morning - 618


మీరు - ఎవరి నుంచి ఏమీ ఆశించకండి..! 
నిజాయితీగా వ్యవహరించండి. 
మీరు అలా ఉండగలిగితే - 
మిమ్మల్ని చూసి, మిగిలినవాళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తారు. 



Saturday, October 22, 2016

Good Morning - 617



స్నేహం అనేది ఒక ఆత్మ, రెండు దేహాలు నివసించే చోటు..

Tuesday, October 18, 2016

Good Morning - 616


నీ జ్ఞాపకాలే తోడుంటే 
ఎలాంటి గాయాన్నైనా చిరునవ్వుతో భరించటానికి 
నా మనసు ఎప్పుడూ సిద్ధమే.. 

Saturday, October 15, 2016

Good Morning - 615


అమ్మ ప్రేమని ఇలా ఒక్క ఫోటోలో చూపించవచ్చు. 

Friday, October 14, 2016

Good Morning - 614


నాకు తెలిసి, నీ మనసు విరిగినప్పుడు మాత్రం ఎవరూ నీకు సలహాలు ఇవ్వరు.. 

అవును... మన మనసు విరిగినప్పుడు - ఆ బాధలో ఏటో శూన్యం లోకి చూస్తూ, మన చుట్టూ ఉన్న పరిసరాలను పట్టించుకోకుండా మన లోకాన మనం ఉన్నప్పుడు - ఎవరూ సలహాలు ఇవ్వటానికి రారు. ఒకవేళ వచ్చినా, వారు ఏదో మమః అన్నట్లు మాట్లాడినట్లు మాట్లాడి ఊరుకుంటారు. ఆ సమయంలో మన మనసుకి ఆప్తులు అనుకున్నవారు మాత్రమే వచ్చి, మాట్లాడి సలహాలు ఇస్తేనే, పట్టించుకుంటాం.. 

Friday, October 7, 2016

[తెలుగుబ్లాగు:22403] గుణింతపు గుర్తులనే టైపు చెయ్యడం...

లేఖిని ఉపయోగించి యూనీకోడ్ లో కేవలం గుణింతపు గుర్తులనే టైపు చెయ్యడం వీలవుతుందా?

లేదంటే మార్గం ఏమిటి?

లేఖిని ఉపయోగించి లెక్కల్లో వాడే గుర్తులను టైపు చెయ్యవచ్చును. మామూలుగానే లేఖినిని తెరచి, పై గడిలో మనం ఇంగ్లీష్ ఫోనెటిక్ లో టైపింగ్ చేస్తుంటే, క్రిందన ఉన్న గడిలో తెలుగులో వెనువెంటనే తెలుగులో మారి వస్తుంది. ఆ ఉపకరణంలో కుడిప్రక్కన ఏ ఇంగ్లీష్ / కీ బోర్డ్ అక్షరాన్ని నొక్కితే - ఏ తెలుగు అక్షరం వస్తుందో తెలిపే పట్టిక కూడా ఉంది.  మీరు సామాన్య గణితపు గుర్తులు అనగా + - x / లని వాడదలచుకున్నారు. లేఖినిలో కూడా మామూలుగానే నేరుగా టైపు చేసుకోవచ్చు. కానీ మీకు గుణింతపు గుర్తు x వాడకంలోనే మీకు సమస్య ఎదురుకావొచ్చును. 

లేఖినిలో పై గడిలో నంబర్ కీ బోర్డ్ గుణింతపు గుర్తు అయిన * ( స్టార్ / పువ్వులా ఉండే గుర్తుతో ఉంటుంది ) ని నేరుగా టైపు చేస్తే, అదే గుర్తు క్రిందన ఉన్న గడిలో వస్తుంది. కానీ అది సరియైన గుర్తు కాదనుకొని మనం x ని ( ఇది కీ బోర్డ్ ఆంగ్ల అక్షరాలలో ఎక్స్ X గుర్తు ) వాడటానికి ప్రయత్నించినప్పుడే ఈ సమస్య గమనిస్తాం.. పై గడిలో ఈ x అని టైపు చేసినప్పుడు క్రిందన గడిలో  క్ష్ అని వస్తుంది. మిగతా + - / కీ లను వాడితే అచ్చు అలాగే క్రింద గడిలో వస్తాయి. ఈ సమస్యని తేలికగా తప్పించటానికి ఈ విధముగా చెయ్యండి. 



మీరు x గుర్తుని లేఖినిలో వాడేటప్పుడు చిన్న x వాడకుండా పెద్ద X ( Shift + X ) ని వాడండి. క్రిందన ఉన్న గడిలో కూడా అలాగే పెద్ద X వస్తుంది. అంతే.. మీ ఇబ్బంది తొలగిపోతుంది. 


Tuesday, October 4, 2016

Quiz


మూడు ఇళ్ళు వరుసగా ఉన్నాయి. వాటికి ఒక్కో వాచ్ మన్ చొప్పున ఉన్నారు. రాజ్  ఆ ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాచ్ మన్ లకు రూ. 4 ఇచ్చి లోపలికి వెళతాడు. ఆ ఇంట్లోకి వెళ్ళగానే తన దగ్గరున్న మిగతా డబ్బులు రెట్టింపు అయ్యాయి. మళ్ళీ ప్రక్కన ఉన్న రెండు ఇళ్ళలోకి ఇలాగే వెళ్లివచ్చాడు. మూడో ఇంటినుండి బయటకు రాగానే తన వద్ద డబ్బులన్నీ అయిపోయాయి. రాజ్ దగ్గర మొదట ఎంత మొత్తం ఉందొ చెప్పండి చూద్దాం..?? 
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

జవాబు :
ఎలా అంటే : రాజ్ మొదట 7 ( ఏడు ) రూపాయలు పట్టుకొని వస్తాడు. మొదటి ఇంటి వాచ్ మన్ కి  రూ. 4 ఇచ్చి మిగిలిన 3 రూపాయలతో లోపలికి పోగానే, రెట్టింపు అంటే 6 రూపాయలు అవుతాయి. 
రెండో ఇంటివద్ద ఉన్న వాచ్ మన్ కి 4 రూపాయలు ఇస్తే, మిగిలిన రెండు రూపాయలు ( 6 - 4 ) తో లోనికి వెళ్ళినప్పుడు, అవి రెట్టింపు అంటే 4 రూపాయలు అవుతాయి. 
ఇప్పుడు ఆ మూడో ఇంటివద్దనున్న వాచ్ మన్ కి ఆ నాలుగు రూపాయలు ఇచ్చితే, డబ్బులన్నీ అయిపోతాయి. ఆ మూడో ఇంటి లోనికి వెళ్ళితే - తన వద్ద మిగులు డబ్బులు ఏమీ లేవు గనుక శూన్య హస్తాలతో బయటకు వస్తాడు. 


Related Posts with Thumbnails