Thursday, March 31, 2011

Social NW Sites - 23 - చాట్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.

చాట్ లో ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. మొదలగున్నవి.::

1. మిగతా రెండింటి (వాయిస్, వీడియో) కన్నా టెక్స్ట్ చాట్ చెయ్యటం మీకు మంచిది అని గుర్తు పెట్టుకోండి.

2. వీడియో చాట్ అసలుకే చెయ్యకండి. అవతలి వ్యక్తిని బాగా చూసి, పరిచయం ఉంటేనే తప్ప చెయ్యకండి.

3. వాయిస్ చాట్ ని ఏదైనా విషయం త్వరగా చెప్పాలీ అనుకున్నప్పుడు / చాట్ టైపు చెయ్యటం కష్టం అనుకున్నప్పుడు చెప్పేస్తే మంచిది.

4. చాట్ మర్యాదలు నేర్చుకోండి. మొదట తప్పనిసరిగా Good Morning, Good Evening అంటూ మొదలెట్టండి. పెద్దవారు అయితే వారి అనుమతితో సర్ అని చెప్పండి. అలాగే బాగున్నారా? ఎలా ఉన్నారు..? అని అడిగండి. ఆ తరవాత వారు అడక్కముందే మీరెలా ఉన్నారో చెప్పండి. ఆడవారిని ఆంటీ అని సంభోదించకండి. వారిని ఏమని పిలవాలో అడిగి అలాగే పిలవండి.

5. చివరిసారిగా ఎప్పుడు చాట్ చేశామో గుర్తుంటే గుర్తు చెయ్యండి. అంతే కాని నిందలు వెయ్యకండి. ఎప్పుడూ ఆన్లైన్ లో ఉంటావూ, నాతో చాట్ చెయ్యవూ, మేమెప్పుడు గుర్తుంటామూ అనే నిందా పూర్వక మాటలు మాట్లాడకండి. దానివలన వారికి మాట్లాడాలని ఉన్నా - నాకు పని ఉంది అంటూ త్వరగా చాట్ నుండి వెళ్ళిపోతారు. అలా మీ మధ్య సంబంధాలు దెబ్బతింటాయి. అలా ఎందుకో నా అనుభవాల్లో చెబుతాను. అది చివరి పోస్ట్ గా ఉంటుంది.

6. చాట్ లో మాట్లాడేటప్పుడు అవైలబుల్ లోకి వచ్చి మాట్లాడండి. ఇన్విజిబుల్ లో ఉండకండి. ఒకవేళ ఉంటే ఆ విషయం వారికి చెప్పండి. అలా ఎందుకు ఉండాల్సి వచ్చిందో. వారు అర్థం చేసుకుంటారు.

7. ఒక విషయాన్ని పెద్ద పేరాల్లో చెప్పకండి. కొందరు బాగా సేపు పెద్దగా టైపు చేసి ఒకేసారి ఎంటర్ నొక్కుతారు. అవతలివారికి ఇదంతా వచ్చేసరికి బాగా ఎదురు చూడాల్సివస్తుంది. అలాగే అదంతా చదవాలంటే విసుగ్గా కూడా ఉంటుంది. మన మీద ఉన్న ఒక మంచి ఇంప్రెషన్ పోతుంది. వామ్మో వారు చాట్ కి పింగ్ చేశారా అనుకుంటూ నేను బీజీ అంటూ సమాధానం ఇస్తారు. అందుకే చిన్న చిన్న ముక్కల్లో చెప్పండి. ఒక వాక్యం కాగానే ఫుల్ స్టాప్ పెట్టగానే ఎంటర్ కొట్టడం నేర్చుకోండి. అది ఎదుటివారు చదివేలోగా మనం ఇంకో వాక్యం టైపు చెయ్యవచ్చును.

8. ఎదుటివారు చెబుతుంటే "ఊ" కొట్టడం మరవకండి. ఎప్పుడూ ఊ కొట్టడములో ఊ.. ఊ.. అంటూ ఉంటే వారికీ బోర్ వస్తుంది. ఊ, అలాగా, ఓహో, అయితే, అవునా, అప్పుడేమైంది?, హ్మ్మ్, నిజమా, అలా జరిగిందా..... అంటూ డిఫరెంట్ మాటలు మాట్లాడండి. దీనివలన మీరు శ్రద్ధగా వింటున్నారు అనే భావం వారికి అర్థం అవుతుంది.

9. చాట్ లో పర్సనల్స్ అంటూ ఏమీ చెప్పకండి. చదువూ, పేరూ, ఏ ఊరు అంతే చాలు.. అంతే కాని కాలేజీ పేరూ, ఏ ఊరు లోని కాలేజీ, ఏ గ్రూప్, అమ్మా నాన్నలు ఏమి చేస్తారూ, ఎక్కడ పని చేస్తారూ, మీరెంతమంది, వారు ఏమి చేస్తున్నారో... ఇవన్నీ అనవసరం. మనం ఇక్కడ వచ్చింది స్నేహానికే. అంతే కాని పెళ్లి చూపులప్పుడు అడగాల్సిన ఎంక్వైరీ ప్రశ్నలు ఇక్కడ అవసరమా? అయినా అవన్నీ తెలుసుకొని చేసేది స్నేహం కాదు. అవసరార్థ స్నేహం అంటారు.

10. మొదట్లో చాట్స్ పెద్దగా మాట్లాడకండి. చిన్న చిన్న బిట్స్ బిట్స్ గా మాట్లాడండి. అంటే రెండు మూడు నిముషాల్లో మాట్లాడటం అయిపోయేవిగా ఉండాలి. ఇలా కొద్దిరోజుల వరకూ బిట్స్ బిట్స్ గానే మాట్లాడాలి. ఇలా ఎందుకూ అంటే - అప్పుడు అవతలివారు ఏమైనా అబద్ధాలు చెప్పినా మనకి కాస్త గుర్తు ఉంటాయి. ఆ వెంటనే మన మ్యూచువల్ మిత్రులని ఆ విషయాల గురించి అడిగితే వారు చెప్పినవి నిజమో కాదో తెలిసిపోతుంది.

11. ఉదాహరణకి నేను ABC సాఫ్ట్వేర్ కంపనీ లో పనిచేస్తానూ అని చెబితే, ఈ విషయాన్ని మన మ్యూచువల్ ఫ్రెండ్స్ ని అడిగితే చెప్పేస్తారు. అది నిజమో కాదో అని. కాదని అంటే - ఇంకో ఇద్దరినీ తెలుసుకుంటే సరి. అప్పుడు నిజమెంతో అడగవచ్చు. ఆ విషయం మీద నన్ను తరచి తరచి ప్రశ్నించవచ్చును. అప్పుడు నేనే ఇబ్బంది పడతాను. రేపొద్దున మీ ఫ్రెండ్స్ కి నేను ఆడ్ రిక్వెస్ట్ పెడితే - వారు ఎంక్వయిరీ కోసం మిమ్మల్ని అడిగితే - నేను అబద్ధాల కోరు, మొన్న ఇలా అబద్ధం ఆడాడూ అని చెబితే - వారు ఇక నా ఫ్రెండ్ రిక్వెస్ట్ రెజెక్ట్ చేసి, ఇక ఎప్పుడూ నేను వారికి ఆడ్ రిక్వెస్ట్ పెట్టకుండా నన్ను బ్లాక్ లిస్టు లో పెట్టేస్తారు. నాకు నేను అలా చేసుకోవటం ఏమైనా బాగుంటుందా?.. అలా చేసుకుంటే కొన్ని మంచి మంచి స్నేహాలు కోల్పోతాం. జీవితములో ఇక తిరిగి పొందలేము.. ఇలాంటి అబద్ధాల కోరులు ముగ్గురు తగిలారు. ఇక నాకు ఈ జన్మలో ఆడ్ రిక్వెస్ట్ పెట్టకుండా బ్లాక్ లిస్టు లో పెట్టాను.

12. చాట్స్ లలో ఎవరిమీదా చెప్పకండి. అవతలి వారు మీతో బాగోలేనప్పుడు, వారు ఆ చాట్స్ ని మీ శత్రువులకి చూపి, మీ మధ్య ఇంకా కక్షలు రేపుతారు. కనుక తస్మాత్ జాగ్రత్త.

13. చాట్స్ ఎప్పుడూ కంటిన్యూగా చెయ్యండి. మధ్యలో బీజీ లేదా, ఏదైనా వస్తే అవతలివారికి చెప్పి, ఒక ఇదు నిముషాలు అంటూ సమయం చెప్పండి. వారు అంతలోగా వేరే పనులు చేసుకుంటారు. వారికి చెప్పకుండా వదిలేసిపోతే అవతలివారు కారణం అడిగితే - మీరు కారణం చెబుతారు. అది విని వారు ఇక మళ్ళీ చాట్ చేయ్యకపోవచ్చును. మీరు నమ్మకున్నా ఇది నిజం. నాకే అలాంటివి చాలా జరిగాయి. వరంగల్ లో ఉండే అతను ఎంతో ఇంట్రస్టింగ్ గా ఉన్న చాట్ మధ్యలోంచి లేచి, టీ పెట్టేసుకొని హాయిగా త్రాగేసి పన్నెండు నిమిషాల తరవాత వచ్చాడు. ఇప్పుడు MBA చేస్తున్న నా మిత్రురాలు - తన ఫ్రెండ్ దగ్గర నుండి ఫోన్ వచ్చిందని నాతో ఏమీ అనకుండా వెళ్ళిపోయి, ఫోన్ మాట్లాడింది. ఐదా? పదా? నలభై నాలుగు నిమిషాలు. అంత సేపూ వెయిటింగ్.. పై రెండూ నా అత్యవసర విషయాల్లో వారితో మాట్లాడుతున్నాను. ఒక ముక్క చెప్పేస్తే సరిపోయేదిగా.. ఇప్పుడు వీరిద్దరితో నేను చాటింగ్స్ కి పోవటమే లేదు. వారు చేసినా పొడిపొడి మాట్లాడేసి, నాకు పని ఉంది అని బై చెప్పేస్తున్నాను.

14. ఇంకో అతను ఫ్రెండ్ వచ్చాడని కనీసం "బై" కూడా చెప్పకుండా సిస్టం షట్ డౌన్ చేసి వెళ్ళిపోయాడు. చాలాసేపు అతడికోసం ఎదురు చూశాను. తెల్లారిన చెప్పాడు.. ఇలా వెళ్లానని. నేను ఏమీ అనలేదు. అలాగా అని ఊరుకున్నాను. మరొకతను చాట్ చేస్తూ నిద్రపోయాడు. ఈ ఇద్దరూ వారంతట వారే చాట్ పింగ్ చేశారు కూడా. వారిద్దరినీ ఇక నాతో చాట్ చెయ్యకుండా బ్లాక్ లిస్టు లో పెట్టాను. వారు ఏమి వ్రాసినా స్క్రాప్స్ మాత్రమే వ్రాయాలి ఇక. "అన్నా చాట్ ఓపెన్ అవటం లేదు ఎందుకో.." అని వారు అంటే - ఏమైనా వైరస్ వచ్చిందేమో అని తప్పించుకుంటున్నాను. హ అహహ హ్హ అ

15. ఇంకో అతనికి ఎలా మాట్లాడాలో తెలీదు. అతడి చాట్ చూడండి. ఒకసారి "నీ అయ్య ఎం చేస్తాడు.." అన్నాడు. కోపం వచ్చినా తమాయించుకొని, కూల్ గా చెప్పాను. అయినా అలాగేనా అడిగే పద్ధతి? అదేకాక వెంటనే "అన్నో! వదిన ఏమి చేస్తుంది?.." అడిగాడు. చదువుకున్నా ఎదగని మనస్థత్వం వారిది. ఇలాంటి స్నేహాలు మనకి అవసరమా..? ఆ తరవాత ఏమి జరిగి ఉంటుందో మీకు చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటాను. వెంటనే పీకేసి బ్లాక్ లిస్టు లో పడేశాను.

16. నా మిత్రురాలినీ ఒకరు రోజూ చాట్ లో అన్నీ అడుగుతూ ఉంటే - ఆవిడ భయపడిపోయి "అక్కౌంట్ డెలీట్ చేస్తానూ.." అంటే - "అదేమీ అవసరం లేదు. అతను ఎలాంటివాడు?.." అని అడిగితే - "మంచివాడే కాని, ఈ మధ్యనే అలా చేస్తున్నాడు.." అంటే - "చాట్ బ్లాక్ లిస్టులో అతన్ని పెట్టండి, ఇక చాట్ చెయ్యలేడు, సరిపోతుంది.." అని ఎలా చెయ్యాలో చెప్పాను... ఇప్పుడు ఆమె సంతోషముగా ఉంది.

17. అవతలివారు "నాకు పని ఉంది బై.." చెబితే, వెంటనే ఆ చాట్ అక్కడితో ముగించేసి మీరూ "బై.." చెప్పెయ్యండి. అలాగే గుడ్ బై విషేష్ చెప్పటం మరచిపోకండి.

18. అవతలివారు చాట్ టైపు చేస్తున్నప్పుడు మీరు ఆగటం మంచిది. ఒకరు వ్రాశాక ఇంకొకరు వ్రాస్తే బాగుంటుంది. లేకుంటే చాట్ కన్ఫ్యూస్ గా అవుతుంది.

19. మీరు చాట్ పింగ్ చేస్తే - అడగాల్సింది త్వరగా అడిగేసి, చాట్ క్లోజ్ చెయ్యటం మంచి పద్ధతి. అందరికీ సమయం చాలా విలువైనది. అవతలివారు మీకన్నా ముందే బై.. నైస్ మీట్ యూ.. అని చెబితే మీరు అంతగా బోర్ కొట్టించేశారు అన్న సూచన అని బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మీరు తప్పించుకోవాలంటే వెంట వెంటనే జవాబు ఇవ్వండి. చాట్ ని ఒక నిముషం ఆపితే - క్రింద Sent at.. అంటూ చాట్ ఆపేసిన సమయం వస్తుంది. క్రింద ఫోటో చూడండి. అది రాకుండా జాగ్రత్త పడితే చాలు. అంటే ఒక నిముషం పాటూ ఏమీ టైపు చెయ్యలేదు అన్నమాట. అలా ఉన్నప్పుడు మరలా కలుద్దామా అని చెప్పటం మంచిది.

20. మరీ అవసరం ఉంటేనేగాని చాట్ కి వెళ్ళకండి.

21. ఎవరూ చాట్ చెయ్యకుండా సెట్టింగ్స్ పెట్టుకోవచ్చును. కాని అలా ఉండి, నష్టపోయే బదులు.. ఉంచుకోవటమే బెస్ట్. ఎవరికైనా ఏదైనా వెంటనే చెప్పాలీ అంటే ఈ మార్గం చాలా దగ్గరగా + పర్సనల్ గా ఉంటుంది.

22. చాట్ మధ్యలో - అలా వదిలేసి మీ పని మీరు చేసుకుంటూ ఉండిపోకండి. అవతలివారికి మీరు స్నేహాన్ని కూడా ఇలాగే మధ్యలో వదిలేసే మనస్థత్వం ఉన్నవారు అని అనుకోవచ్చును. అలాని మీకో ముద్ర పడొచ్చును. అందుకే తస్మాత్ జాగ్రత్త.

23. చాట్ చేస్తున్నప్పుడు ఎదుటివ్యక్తి ఎలాంటివాడో, అతని మానసిక స్థితి ఏమిటో అతని చాట్ లోని భావాల వల్ల తెలిసిపోతుంది. ఎలా మొదలెట్టాడూ, ఎలా చాట్ చేస్తున్నాడూ, ఎంత త్వరగా, సమర్థవంతముగా జవాబు ఇస్తున్నాడూ, చాట్ ని ఎంత హుందాగా నడిపిస్తున్నాడూ, తన భావాలని ఎలా బయటకి ఎలా ప్రదర్శిస్తున్నాడూ, ఎదుటివారు చెప్పేది ఎంతగా ఆసక్తిగా వింటున్నాడూ, మనం చెప్పే మాటలకి ఎలాంటి ఆసక్తిని ప్రదర్శిస్తున్నాడూ, మనం అడిగే వాటికి ఎంతటి సబ్జెక్ట్ నాలెడ్జ్ తో జవాబు ఇస్తున్నాడో తెలిసిపోతుంది. ఇలాంటివి ఇంకో రెండు మూడు సార్లు చూస్తే / చేస్తే చాలు. ఆ వ్యక్తి మన మనసుకి ఎంత దగ్గరో / దూరమో మీకే తెలుస్తుంది.

24. ఎక్కడైనా అవతలివారు చెప్పిన విషయం అర్థం కాకుంటే అర్థం కాలేదు.. మీరు చెప్పేది, మళ్ళీ ఒకసారి హుందాగా అడగటములో తప్పేమీ లేదు. మీకు అది ప్లస్ పాయింట్ అవుతుంది.

25. అవతలి వారు చెబుతున్నారు కదా అని, పర్సనల్ విషయాలలోనికి వెళ్ళకండి. కాస్త దాపరికం అంటూ ఉంటేనే స్నేహం బాగుంటుంది.

26. కష్టాలనీ, కన్నీళ్ళనీ, బాధలూ, సంతోషాలు పంచుకోవటానికి చాట్స్ ఉత్తమమైన వేదిక. అలాని చెప్పి ప్రతివారితో పంచుకోవటం వృధా ప్రయాస. మీ గోడుని వినే ఓపిక ఉండీ, మీకు తగిన సలహాలు నిజాయితీగా, నిర్భీతిగా ఇచ్చేవారు అయి ఉండీ, మీ సంతోషాన్ని రెట్టింపు చేసేవారినీ, మీ దుఃఖాలనీ, మీ రహస్యాలనీ కాపాడగలిగి ఉండేవారు ఉంటేనే వారికి చెప్పటం అలవాటు చేసుకోండి. లేదా ఆ తరవాత ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా తేల్చుకోవటానికి అప్పుడప్పుడూ టెస్ట్ చేస్తుండండి.

27. ఎవరైనా చాట్ ఏవైనా చెబితే అవి మనసు లోపలికి ఇంకిపోవాలి. మనసుని బ్లాటింగ్ పేపర్ లా మార్చేయ్యాలి. అంతే కాని వాటిని మన చేతల ద్వారా బయట చెప్పకూడదు. దానివల్ల లేనిపోని చిక్కులు మొదలవుతాయి.

28. నేను అప్పుడప్పుడూ క్రొత్తవారినీ, పాతవారినీ టెస్ట్ చెయ్యటానికి కొన్ని విషయాలు వారి స్క్రాప్స్ లో గానీ, చాట్స్ లో గానీ పెడుతూ ఉంటాను. నా స్క్రాప్ బుక్ లో "పెట్టిస్తుంటాను" కూడా. అది చూసినవారు ఆ విషయాన్ని ఇతరులకు స్ప్రెడ్ చేస్తుంటారు. భూమి గుండ్రముగా ఉంది అన్నట్లు - చివరకి నాకు తెలుస్తుంది. ఎవరు చెప్పారు అంటే ఫలానా అని చెబుతారు. చివరికి ఎవరు మొదట చూసి స్ప్రెడ్ చేశారో చెబుతారు. అప్పుడు ఏమీ చెయ్యను - జస్ట్ నా పాచిక పారింది అనుకొని వారికీ, నాకూ మధ్య గాజు గోడ లేపుతాను. అలా గాజు గోడ ఉంది అని నాకు మాత్రమే తెలుస్తుంది. వారికి అది తెలిసేసరికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఒక్కోసారి జీవితకాలం పట్టొచ్చు కూడా.

29. మనం ఎదుటివారి పట్ల ఏదైనా తప్పుగా చేసి ఉంటే క్షమించమని అడగటానికి ఇది సరియైన వేదిక అని నేను అంటాను. క్షమించమని అడగటానికి నామోషీగా ఉంటే - ఇంగ్లీష్ వాడు సింపుల్గా నేర్పించి వెళ్లాడే - సారీ అని.. అలా చెప్పెయ్యండి. సారీ చెప్పటం తప్పేమీకాదు. రెండున్నర గంటల సేపు ఉండే సినిమా టాకీస్ లో కాలు తాగితేనే సారీ చెప్పేస్తాం. జీవితాంతం స్నేహంగా ఉండబోయే మనం ఇక్కడ చెప్పటానికి అభిజ్యాతం (Ego) ఎందుకూ.? ఒక్కసారి చెబితే మీ గుండెల మీద ఉన్న అపరాధ భావం పోతుంది. రేపు మీరిద్దరూ దూరం అయినా మీ జీవితములో ప్రభావం చూపదు. "అప్పుడే చిన్నగా సారీ చెప్పేస్తే పోయేది.. ఒక మంచి స్నేహాన్ని కోల్పోయాను.." అని వృద్ధాప్యంలో / అంతా అయ్యాక బాధపడటం ఉండదు. ఈ పనిని మీ ఇద్దరి మధ్య పొరపొచ్చాలు వచ్చిన తొలినాళ్ళలో చెయ్యటం మంచిది. సారీ చెప్పటం వల్ల మనకేదో నష్టం జరుగుతుంది అని కాదు. ఏమీ పోదు. మీ ఆస్థులు ఏమీ కరిగిపోవు. అలా చేస్తే మీకు ప్లస్ పాయింట్ అవుతుంది కూడా. నేను మాత్రం అప్పుడే సారీ చెప్పాను అని ఎప్పుడైనా అనటానికి మనకంటూ ఒక ఆధారం ఉంటుంది. ఒక్కరి దగ్గర ఎవరూ చూడకుండా చెబుతాముగా.. ఇంకా ఇబ్బంది ఎందుకూ..? పది మంది వద్ద చులకన అయ్యే బదులు ఒక్కరివద్ద సారీ చెప్పటం వల్ల అపరాధ భావం పోతుంది అన్నప్పుడు చెప్పటమే మంచి పద్ధతి కదా..

30. ఇలా చెప్పిన సారీని అందరి ముందు అవతలివారు నాదే గొప్ప అని ప్రదర్శిస్తే, వారిని ఇక వారి మానాన వారిని వదిలెయ్యండి. ఇక అలాంటి స్నేహితుడు మీకు నిశ్చయముగా అవసరం లేదు.

31. చాట్స్ లలో పనికిరాని సోదీ చెప్పుకొంటూ కాలం వెళ్ళబుచ్చే బదులు దాని బదులుగా ఏదైనా నేర్చుకోవటానికి ఆ సమయాన్ని కేటాయించండి. నేను మొదట్లో ఇలా చాలా సమయం వృధా చేశాను. ఆరునెలల నుండీ క్రొత్త విషయాలు నేర్చుకుంటున్నాను. చాలా బాగా ఎదిగాను అని అనుకుంటున్నాను. పనికిరాని విషయాల మీద సమయం కేటాయించే బదులు మీకు ఉపయోగపడి, మీకు కాస్త గుర్తింపునీ, మీలోని టాలెంట్స్ ని అభివృద్ధి చేసుకోవటానికి వాడండి. మీకు కాస్త సెలెబ్రిటీ హోదాలా విజయం వస్తుంది. ఆ కిక్ ఈ పనికిరాని విషయాల చాట్ మీద వచ్చే ఆనందం కన్నా చాలా గొప్పగా ఉంటుంది. ఆ రుచి చూస్తే ఇంకా కావాలంటారు. నేను నా నిజమైన స్నేహితుల వల్ల ఈ మధ్యే ఆ రుచి చూశాను. వారికి నా కృతజ్ఞతలు.

32. అప్పుడప్పుడూ మీ మిత్రులని చాట్ ద్వారా పలకరించండి. జస్ట్ ఒకటీ, రెండు నిముషాలు మాట్లాడితే సరిపోతుంది.

33. గర్వముగా ఫీలవుతూ, చాట్ లో సమాధానం చెప్పేవారిని వదిలెయ్యండి.

34. అలాగే ఇతరులమీద తగిన ఆధారాలు లేకుండా చాడీలు చెప్పేవారి మీద సమయాన్ని వెచ్చించకండి. అవన్నీ వింటూ ఉంటే మీ మనసు పాడు చేసుకుంటూ ఉంటారు. ఇలాంటివి నెట్లో కూడా ఉంటాయా అని హాస్చర్యపడి పోకండి. నిజమే!.. నేను నిజమే చెబుతున్నాను. ఈరోజు వేరేవారి మీద చెబుతారు - రేపు మీ మీద చెప్పరని గ్యారంటీ ఏమిటీ? ముందే నరంలేని నాలిక నాయే!.. అని నానుడి ఉంది కదా..

35. చాట్స్ లలో తెలుగులో కూడా చాట్ చేసుకోవచ్చును. నేను సోది, సినిమా కబుర్లు, రాజకీయాలు వదిలేసి కొద్దిగా సమయం కేటాయించాను అని చెప్పానుగా. అలా ఇది నేర్చుకున్నాను. తెలుగులో చాట్ కూడా ఈజీగా చేస్తున్నాను. ఇలా చేస్తుంటే నా మిత్రులందరూ బాగా ఆసక్తిగానూ, ఆశ్చర్యముగానూ చూస్తున్నారు. వారికి ఇలా చెయ్యటం రావటం లేదు. బాగా కుళ్ళు కుంటున్నారు నా మీద. హ అహహ హ్హ. నిజానికి నాకూ తెలీదు. నా మిత్రుడు చంద్రశేఖర్ రెడ్డి - ఇలా నాతో చాట్ చేస్తే - అడిగా. అతను ఎలా చెయ్యాలో చెప్పారు. అలా ఆసక్తి పెరిగి నేను నేర్చుకున్నాను. అతనికి నా కృతజ్ఞతలు.

36. ఈ తెలుగులో ఎలా వ్రాయాలీ అంటే - ఈ బ్లాగులో తెలుగులో వ్రాయటం ఎలా అన్న పోస్ట్ లలో చెప్పినట్లుగా టైప్ చేస్తే సరి. అది ఎలా చేస్తున్నానో శాంపిల్ గా చూపటానికి ఒక ఫోటో అప్లోడ్ చేద్దామంటే అప్లోడ్ అవుతున్నాయి కాని, కనిపించటం లేదు. బ్లాగ్ సర్వర్ లో ప్రాబ్లెం అనుకుంటాను. అది సెట్ అయ్యాక ఆ ఫోటో పెడతాను. అప్డేట్ చేస్తాను. ఈరోజు ఆ సర్వర్ ప్రాబ్లెం పోయింది.

37. నేనూ నా మిత్రుడు మాట్లాడుకున్న చాట్ ఇది. మీకూ ఒక ఇన్ఫో గా ఉంటుందని పెడుతున్నాను. ఇలా పెట్టడానికి కారణాలు ఉన్నాయి. అలా ప్రోఫైల్స్ పెట్టి, ఎదుటివారికి ఆడ్ రిక్వెస్ట్ లు  పెట్టి ఎదుటివారిని ఫూల్ చేస్తుంటారు. ఎవరిని నమ్మాలో, నమ్మోద్దో తెలీని స్టేజికి తీసుకవస్తారు. ఉన్నది ఉన్నట్లుగా చెబితే ఆడ్ చేసుకోమా.. ఎందుకా దాపరికాలు? క్రింద ఫిమేల్ అని పెట్టి, పైన అబ్బాయి ఫోటో పెట్టాడు అతను. అంతకు ముందే చెప్పాను.. ఇవి మార్చు అనీ. చేయ్యకపోయేసరికి బ్లాక్ లిస్టు లో పెట్టాను. ఆ ప్రొఫైల్ వదిలేసి, ఇంకో ప్రొఫైల్ ఓపెన్ చేసి మళ్ళీ నాకు పంపాడు. నా మిత్రునికీ పంపాడు. అలా ఈ చాట్ నడిచింది. ఒకసారి వద్దు అనుకున్నాను. కారణం అడిగితే చెప్పాను కూడా.. ఇలా ఇలా అంటూ. అయినా మళ్ళీ వెంట పడ్డాడు. ఆడ్ చేసుకోమని. ఆ మార్పులు చేసేదాకా కుదరదని, బ్లాక్ చేశాను. ఇలా కాదనుకొని, ఆ అబ్బాయి ఫిమేలంటూ ఇంకో ప్రొఫైల్ పెట్టి, మళ్ళీ పంపిస్తే ఎలా!.. ఇలా ఇబ్బంది పెట్టడం దేనికీ. నాకు అతని పద్ధతి నచ్చలేదు.. ఇప్పటికీ ఆ ప్రొఫైల్ లో లో అలాగే ఉంది కూడా.. 

38. తెలుగులో ఎలా చాట్ చేస్తామో చెప్పటానికీ ఇక్కడ చూపిస్తున్నాను. ఇంగ్లీష్ లోలాగానే ఇక్కడ తెలుగులో కూడా వేగముగా టైపింగ్ చెయ్యవచ్చును. నిజం.. ఉదాహరణగా చూడండి. 


First : updated on 28-March-2011
Second : updated on 31-March-2011

Social NW Sites - 22 - చాట్

సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఉన్న మరొక గొప్ప విషయం - చాట్స్. ఇది రెండువైపులా పదును ఉన్న కత్తి. సరిగ్గా వాడటం తెలీకపోతే అన్నింటికన్నా ప్రమాదముగా ఉంటుంది. తెలిస్తే అంతా బాగానే ఉంటుంది. మొదట్లో తెలీక ఇందులో చాలా దెబ్బలు తింటుంటారు. నాకూ మొదట్లో అలాంటి అనుభవాలు చాలా ఎదురయ్యాయి కూడా. జాగ్రత్తగా వాడటం తెలిస్తే - నిజముగా బాగా ఉపయోగకరమైనది. అది ఎలాగో ఇప్పుడు మీకు చెబుతాను.

ఈ చాట్స్ కూడా మూడు రకాలు.

ఒకటేమో అందరికీ తెలిసిన టెక్స్ట్ చాట్ - ఇందులో అక్షరాలు టైపు చేస్తూ SMS లాగా పంపిస్తూ ఉంటాము. ఏదైనా విషయం గురించి డిస్కషన్ చేస్తూ, అత్యసరముగా మాట్లాడాలి అంటే ఇది బెస్ట్.

రెండోది : వాయిస్ చాట్ : ఇందులో ఇయర్ ఫోన్స్, మైక్రో ఫోన్ సహాయముతో మాట్లాడుకోవటం. ఇందులో ఆ టెక్స్ట్ చాట్ కన్నా ఇదే ఈజీగా అనిపిస్తుంది. అక్షరాలు టైపు చెయ్యలేని వారికి, బాగా త్వరత్వరగా మాట్లాడేవారికి ఇది అద్భుత అవకాశం.

మూడోది అయిన చాట్ - వీడియో చాట్ : ఇందులో అవతలి వ్యక్తిని చూస్తూ, మాట్లాడుకోవచ్చును. ఇది అన్నింటికన్నా బెస్ట్ చాయిస్. కాని ఇది బాగా తెలిసిన వ్యక్తుల కోసమే వాడాలి. లేకుంటే ఇబ్బంది పడతారు.

సాధారణముగా యాహూలోనో, జిమెయిల్ లోనో మెయిల్ ID ద్వారా అక్కౌంట్ ఓపెన్ చేసుకొని, అందులో చాట్ చేస్తుంటారు. నిజానికి ఈ చాట్ ని సోషల్ సైట్లలో ఓపెన్ చేసుకొని కూడా చాట్ చెయ్యొచ్చు. ఈ విషయం చాలా మందికి తెలీదు కూడా. ఆర్కుట్ లోని మిత్రులతో జిమెయిల్ ఒపెన్చేసి, అందులో చాట్ చేస్తూ ఉంటారు. నేను అలాగే ఈ చాట్ ని మొదట్లో చేసేవాడిని. ఆతరవాత సౌలభ్యం తెలిశాక ఆర్కుట్ లోనే ఓపెన్ చేసుకొని చాట్ చేస్తూ, ఇటు స్క్రాప్స్ వ్రాస్తూ ఫోటో కామెంట్స్, అప్డేట్స్ అన్నీ చూసుకుంటూ చేస్తుంటాను. ఇలా చేయ్యనివారు ఆ చాట్ అయ్యేవరకూ ఆగి, అప్పుడు సోషల్ సైట్ లోకి వచ్చి అప్పుడు తమకి వచ్చిన స్క్రాప్స్ కి జవాబులు ఇస్తుంటారు. ఇలా చెయ్యటం వల్ల మనం ఇచ్చిన జవాబులు అలా ఆలస్యముగా వారికి అంది, వీరికి కాస్త నిర్లక్ష్యమో అని అనుకునేలా ఉంటుంది. ఈ సెట్టింగ్ కూడా చాలా చిన్నదే.. అప్లికేషన్స్ లలోకి వెళ్లి చాట్ అనే అప్లికేషన్ ని ఆడ్ చేసుకుంటే సరి. క్రొత్తగా ఓపెన్ చేసిన ప్రోఫైల్స్ లలో అటోమేటిక్ గా ఓపెన్ అవుతుందని విన్నాను. ఇలా క్రింది దానిలాగా ఇటు స్క్రాప్స్ కి రిప్లై ఇస్తూ, చాట్ చేస్తూ పోవచ్చును.

కొన్ని అవసరాలకి ఈ చాట్స్ ఉపయోగం చాలా బాగా ఉంటాయి. ఒక విషయములో పర్సనల్ గా మాట్లాడుకోవటానికీ, త్వరత్వరగా మాట్లాడుకోవటానికీ, సహాయం కోరటానికీ, సహాయం చెయ్యటానికీ, హెచ్చరించటానికీ, ఏదైనా నేర్చుకోవటానికీ, ఏదైనా ఫైల్ పంపించుకోవటానికీ.. అలాగే ఎదుటివ్యక్తి ఎలాంటివాడో తెలుసుకోవటానికి ఈ చాట్స్ బాగా ఉపయోగపడతాయి. కనుక బాగా ఇరువురూ జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా - దెబ్బ తింటాము.

ఈ చాటింగ్ లు అతిగా చెయ్యటం కూడా అంత మంచిది కాదు.. చాటింగ్స్ లలో వెంట వెంటనే జవాబులు వ్రాస్తూ రావలసి ఉండటం వల్ల ఆలోచించటానికి తగిన సమయం ఉండదు. కొద్దిగా టాలెంట్ ఉండి, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈజీగా చెయ్యవచ్చును. అది చేతగానివారప్పుడు ఆ జోలికి పోవటం అంత మంచిది కాదు. ఆడవారు మాత్రం ఈ చాటింగ్స్ తక్కువగా చెయ్యండి. అవతలి వ్యక్తి గురించి మీకు బాగా తెలిసి ఉంటేనే గాని దాని జోలికి వెళ్ళకండి. ఇక వాయిస్ చాట్స్, వీడియో చాట్స్ అసలే వద్దు.

ఇక టెక్స్ట్ చాట్స్ ని ఇంగ్లీష్ లో గాని, రోమన్ తెల్గీష్ లో కానీ, మరే ఇతర భాషల్లో గానీ, తెలుగులో చాట్స్ చెయ్యవచ్చును. అది మీమీ ఆసక్తిని బట్టి ఉంటుంది. మనం ఎక్కువగా ఇంగ్లీష్ లో, మన తెలుగువారు అయితే తెల్గీష్ లో (రోమన్ ఇంగ్లీష్ లో వ్రాయటం), టైపింగ్ మీద బాగా ప్రాక్టీస్ ఉన్నవారు తెలుగులోనే చాట్ చేస్తారు. తెలుగులో చాట్ చెయ్యటం కూడా ఈజీనే. కాకపోతే ఎలా వ్రాయాలో తెలిసి ఉండాలి. ఫోనెటిక్ పద్ధతి తెలిస్తే అందులో కూడా బాగా తేలికగా చెయ్యగలుగుతారు.

చాట్లలో అవతలి వారి నైజం ఎలాంటిదో చాలా ఈజీగా పసిగట్టేయవచ్చును. మొదట్లో మీకు ఆడ్ అవగానే అవతలి వారు మీకు చాట్ అవైలబుల్ లోక్ వచ్చినప్పుడు చాట్ కి రమ్మని పింగ్ (అంటే - ఆ అవతలివారిని చాట్ లో మాట్లాడుకుందాం అని మీ ఇద్దరి మధ్య చాట్ ఓపెన్ చెయ్యటం అన్నమాట) చెయ్యండి. అప్పుడు తీరికగా ఎదుటివారితో మాట్లాడవచ్చును.

ఒకప్పుడు చాట్ లలో కేవలం టెక్స్ట్ చాట్ తప్ప మరేమీ ఇతర సౌకర్యాలు ఉండేవి కావు. ఈ మధ్య చాలా సదుపాయాలూ కలిపించారు. వాయిస్ చాట్, వీడియో చాట్, గ్రూప్ చాట్, చాట్ లోనే ఏవైనా ఫైల్స్ పంపుకోవటం, అవతలివారు హద్దులు దాటితే వారిని ఇక చాట్ చెయ్యకుండా బ్లాక్ చెయ్యటం, చాట్ బాక్స్ పెద్దగా చెయ్యటం.. ఉన్నాయి. ఈ క్రింది ఫోటో చూడండి. ఇందులో ఎర్ర రంగులో నంబర్లు ఉన్నాయిగా.. అక్కడ


1 వద్ద నొక్కితే అది వీడియో చాట్,

2 వద్ద నొక్కితే వాయిస్ చాట్,

3 వద్ద అయితే గ్రూప్ చాట్ చేసుకోవచ్చును. అది ఇలా ఉంటుంది.  ఈ క్రింద ఫోటోలో చూపినట్లుగా 1 వద్ద నొక్కితే క్రింద బాక్స్ ఓపెన్ అవుతుంది.  2 వద్ద ఆ గ్రూప్ చాట్ చేసే ఫ్రెండ్ అకౌంట్ పేరు గానీ, మెయిల్ ID గానీ అక్కడ కాపీ, పేస్ట్ చెయ్యాలి. 3 వద్ద నొక్కి వారిని అందులోకి వచ్చేలా చేయవచ్చును.


4 actions వద్ద ఉన్న త్రికోణాన్ని నొక్కితే చిన్న మెనూ వస్తుంది.

5 వద్ద Block నొక్కితే - మనం ఎవరితో చాట్ చేస్తున్నామో వారు మనల్ని బాధిస్తే / ఇబ్బంది పెట్టితే, ఇక వారితో చాట్ చెయ్యాల్సిన పని అంటూ మనకి లేకుంటే దాన్ని నొక్కితే - ఆ అవతలి వ్యక్తి ఇక మనకి చాట్ పింగ్ చెయ్యలేడు. ఇక మళ్ళీ మనం అక్సేప్ట్ చేసేదాకా మనతో చాట్ ఇబ్బంది పెట్టలేరు. ఈ విషయం చాలామందికి తెలీకపోవచ్చును. ఇబ్బంది పడుతున్న ఆడవారు ఈ సౌకర్యాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి.

6 వద్ద అయితే ఒక ఫైల్ ఇటునుండి అటు - వారికీ పంపించుకోవచ్చు. ఇలా చెయ్యాలీ అంటే ఇద్దరూ చాట్ అవైలబుల్ లో ఉండాలి. అలా పంపించుకున్న ఫైల్స్ - "మై డాక్యుమెంట్స్" లో కనిపిస్తాయి.

7 వద్ద మనం టెక్స్ట్ చాట్ చేసుకుంటాము. 

8 వద్ద నొక్కితే చాట్ ని ఇక అందముగా చెప్పటానికి మన భావ వ్యక్తీకరణ ఎలా ఉందో అలాగే అక్కడ ఈ స్మైలీ ల సహాయముతో అక్కడ చూపవచ్చును.

9 వద్ద బాణం గుర్తుని నొక్కితే చాట్ బాక్స్ పెద్దగా అవుతుంది.


10 అవతలి వ్యక్తి చాట్ కి అవైలబుల్ లో ఉన్నాడా, బీజీ లో ఉన్నాడా, ఇన్విజిబుల్ లో ఉన్నాడా? అని తెలుస్తుంది. ఎలా అంటే పచ్చ లైట్ లో ఉంటే చాట్ కి అవైలబుల్ అనీ, ఎర్రని రంగులో ఉంటే బీజీ అనీ, బూడిద రంగులో ఉంటే ఇన్విజిబుల్ / లేదా ఆఫ్ లైన్ / చాట్ కి అవైలబుల్ లో లేరు అని అర్థం.

గ్రూప్ చాట్ లో ఒకటి వద్ద నొక్కితే, క్రింద Add people to this chat ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్ లో అవతలివారు కాకుండా - ఇంకో మూడో వ్యక్తి ఎవరితోనైనా  చాట్  చేయ్యదలిచామో  వారి మెయిల్ ID లేదా వారి ప్రొఫైల్ పేరు అక్కడ పేస్ట్ చేసి, క్రిందన ఉన్న Invite ని నొక్కాలి. ఆ మూడో వ్యక్తి అందుబాటులో ఉంటే వారూ ఆన్ లైన్ లోకి వస్తారు. ఇలా ఇంకొందరినీ చాట్ కి ఆహ్వానించవచ్చును.

ఈ క్రిందన మూలన ఉన్న ఎర్రని రంగులో ఉన్న వృత్తం లోని మూల వద్దకి కర్సర్ ని ఉంచితే - అలా బాణం గుర్తు వస్తుంది. అలాగే నొక్కి పట్టి పెద్దగా డ్రాగ్ చేస్తే ఆ చాట్ బాక్స్ పెద్దగా అవుతుంది. ఇది జిమెయిల్ లో రాదు. కేవలం ఆర్కుట్ లో మాత్రమే వస్తుంది.


ఇక విజువల్ చాట్స్ అంటే ఇలా వస్తుంది.. ఇటుస్క్రాప్స్ వ్రాస్తూ చాట్ చేసుకోవచ్చును. స్క్రీన్ మీద ఏదైనా అర్థం కాకున్నా, ఎదుటివారిని చూపిస్తూ అడగటానికి, బంధుమిత్రులతో చాట్ చెయ్యటానికి దీన్ని వాడుకోవచ్చును. ఎప్పుడో ఒకసారి వాడుకుంటే చాలా మంచిది అని నా అభిప్రాయం. దీన్ని వాడేటప్పుడు మీ బ్యాక్ గ్రౌండ్ మీద, మీ మీద కాస్త దృష్టి సారించాలి. లేకుంటే అన్నీ ఇతరులకి కనిపిస్తాయి. ఈ క్రింది ఫోటో వేరేవారి సహాయముతో పెడుతున్నాను. ఇలా వీడియో చాట్ కూడా చేసుకోవచ్చును. అప్పుడు ఇలా కనిపిస్తుంది.

అక్కడ పైన వారిని చూస్తూ చాట్ చేసుకోవచ్చును. కాకపోతే బాగా తెలిశాక చాలా అరుదుగా ఇలా వీడియో చాట్ చేసుకోండి. కాస్త సెక్యూర్ గా ఉంటారు.

First : updated on 31-March-2011

Monday, March 28, 2011

Temporary Post

నా బ్లాగ్ లో ఫొటోస్ అప్లోడ్ చేసినా కనిపించటం లేదు. ఎందుకో తెలీదు. ఇందాక సోషల్ సైట్ - 22 కి కొన్ని ఫొటోస్ అప్లోడ్ చేశాను. అప్లోడ్ అయ్యాయి. కాని పబ్లిష్ అవటం లేదు. ఇలా కాదనుకొని క్రొత్తగా మళ్ళీ చేసి మళ్ళీ పెట్టాను. అవీ పబ్లిష్ కాలేదు. (తాజా కలము: ఇది ప్రపంచములోని ఇతర బ్లాగర్ లకీ ఉంది. నిన్నటి నుండే ఇలా ప్రాబ్లం లా ఉన్నట్లుంది. కంప్లైంట్స్ దగ్గర ఇందాకే చూశాను)

ఇలా కాదనుకొని మళ్ళీ వేరే గ్రీటింగ్ కార్డ్స్ చేసి మళ్ళీ వేరే టపాగా పోస్ట్ చేశాను. ఊహు.. రాలేదు. క్రిందన ఒక చిన్న నలుచదరం డబ్బా వచ్చేసి, అందులో ఒక చిన్న చుక్కలా వస్తున్నది. ఏదో జరిగిందేమో అని ఆగాను. రెండురోజులు ఇమేజెస్ కోసం వెయిట్ చేద్దాం. అసలు బ్లాగ్ సర్వర్లో ఏమైనా ప్రోబ్లేమా..? ఇప్పుడు క్రింద ఒక శాంపిల్ గ్రీటింగ్ కార్డ్ పోస్ట్ చేస్తున్నాను. 69.9 KB సైజులోనిది. అది కనిపిస్తే సర్వర్ ఓకే అయింది అనుకుంటాను. లేకుంటే వేరే ప్రాబ్లం ఏదో ఉంది అనుకుంటాను. కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాను.

Monday, March 21, 2011

DONGALA MUTA - Review

నటీనటులు : బ్రహ్మానందం, రవితేజ, చార్మి, బ్రహ్మాజీ, సుబ్బరాజు, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, సునీల్..

దర్శకత్వం : రాం గోపాల్ వర్మ

కథ: బ్రహ్మానందాన్ని కిడ్నాప్ చేసి డబ్బులు దండుకోవాలని ఒక మాఫియా గ్యాంగ్ ప్రయత్నిస్తుంటుంటే, అనుకోకుండా వచ్చేసి అతన్ని రవితేజ ఎలా కాపాడుతాడు అన్నదే ఈ సినిమా స్టోరీ.. నిజం చెప్పాలీ అంటే కథలో క్రొత్తదనం అంటూ ఏమీ లేదు. పాత కథనే కాని నూతన టెక్నాలజీ కోసం అని ఈ కథని ఎంచుకున్నారు. అంతే తప్ప మరేమీ లేదు. నిజానికి ఇంతకన్నా కథని బాగా చెప్పొచ్చు. కాని స్క్రీన్ ప్లే కోసం, కథనం కోసమే ఇలా చేశారు. అంతే కాని క్రొత్తగా అంటూ ఏమీ లేదు.

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ : ఈ సినిమాలో పాటలు లేవు. మ్యూజిక్ వర్క్ బాగా చేయ్యబోయారు. నిజానికి ఇలాంటి వాటిల్లో సన్నివేశపరముగా ఇంకా బాగా చెయ్యొచ్చు. కాని దర్శకుడు అలాంటి సన్నివేశాల మీద దృష్టి పెట్టలేదు. అలా చేస్తే సీన్స్ బాగా పండేవి.

నటన : రవితేజ - ఇలాంటి పాత్రలు అతనికి క్రోత్తకాదు. చెయ్యటానికీ ఏమీ లేదు. చార్మి - ని కేవలం అందచందాల కోసం వాడుకున్నారు తప్ప మరేమీ లేదు, ఇలాంటి కథల్లో ఆడవారు ఉంటే టెంపో వస్తుంది కాబట్టి తప్పలేదు. బ్రహ్మానందం - ఆయనకి ఇలాంటివి క్రొత్తకాదు. మనీ, మనీ మనీ, అనగనగా ఒకరోజు లో చేసి చేసి, బాగా చించేశాడు కాబట్టి ఇక్కడ చెయ్యటానికి అంత స్కోప్ లేకపోయింది.

దర్శకత్వం : రాంగోపాలవర్మ చాలా రోజుల తరవాత చేసిన తెలుగు సస్పెన్స్ సినిమా ఇది. ఇందులో కథ కన్నా కథనాన్ని నమ్ముకున్నాడు. ఎక్కువగా నూతన సాంకేతికతని బాగా చూపాలని, తెలుగు సినిమా ఫీల్డ్ కి ఒక క్రొత్త విషయాన్ని చెప్పాలని చూశాడు. అందులో బాగా సక్సెస్ అయ్యాడు. కేవలం ఐదు రోజుల్లో ఏడుగురు సిబ్బందితో సినిమా తీయటం నిజముగా నూతన ప్రక్రియ. కేవలం ఆరు కేమరాలకి అద్దె అరవై వేలు + ఇతరత్రా ఖర్చు అంతా కలిపి ఆరు లక్షల్లో ఈ సినిమా తీశారు. నటీనటుల పారితోషకం ఇందులో లేదు. ఇది నిజముగా సినిమా రంగానికి ఒక వరమనే చెప్పొచ్చు. కథ కోసం ఈ సినిమాకి వెళ్లటం మాత్రం - వృధా. ఆ కథ కన్నా కథనం అంతా ఆ డిజిటల్ కేమరాలని ఎలా వాడుకోవాలో చూపటానికి ఈ కథనం తయారు చేసుకున్నాడు అనుకోవాలి. అతి తక్కువ ఖర్చులో ఎలా తీయాలి అన్నది ఇక్కడ అయన చెప్పిన విషయం. కథని ఇంకా డెవలప్ చేస్తే బాగుండేది.

చిన్ని చిన్ని సందుల్లో కెమరా వెళ్ళను చోట్లలోకి వెళ్ళి మరీ ఫోటోగ్రఫీ తీశాడు. ఇది చాలా క్రొత్తగా ఉంది. నిజానికి ఇలా తీయటం వల్ల అనుకున్న విధముగా వారి ఎక్సప్రెషన్స్ బాగా చూపవచ్చును. పెద్ద కేమరాలకన్నా ఇలా తీయటం నాకు నచ్చింది. అక్కడక్కడా కెమరా షేక్స్ ఇబ్బంది పెడతాయి. మామూలుగా సినిమాలు కేమరాని స్టాండ్ మీద పెట్టి ఆపరేట్ చేస్తుంటారు. కాని ఇక్కడ చేతుల్లో పట్టుకొని నడుస్తూ షూట్ చేశారు. స్టడీ క్యాం కెమరా వాడే ఎఫెక్ట్ ని మామూలు కెనాన్ డిజిటల్ కెమరా తో తీయటం నిజముగా సాహాసమే. ఎడిట్ చేసేటప్పుడు - చిన్న మానిటర్ లో చూసినప్పుడు వారికి ఈ షేకింగ్స్ కనిపించవు. అదొక్కటే లోపం అయినా ఆ లోపాన్ని బాగా హాండిల్ చేశారు. మొదటి ప్రయత్నం లో ఆ మాత్రం చెయ్యటం బాగా గొప్ప విషయమే.

ఇలా డిజిటల్ కేమరాతో షూట్ చేసి ఒక మూవీ చెయ్యటం నాకు క్రొత్తగా అనిపించలేదు. ఎలా అంటే నా సోషల్ సైట్ మిత్రుల్లో శివ మరియు కంచర్ల అనిల్ లాంటి యువకులు ఇలా చిన్న చిన్న మూవీలు తీసి నెట్లో అందరికీ షేర్ చేస్తుంటారు. వారికి ఈ వర్మకి ఉన్నంత సదుపాయాలూ లేకున్నా ఉన్నంతవరకూ బాగా తీస్తారు. అవి చూసి - ఈ సినిమా చూస్తే టేకింగ్ పరముగా క్రొత్తగా ఏమీ అనిపించలేదు. వారిలాగానే కేమరాని హ్యాండిల్ చేశారు అనిపించింది. వారూ & వర్మ కో - స్పెషల్ లైటింగ్ అంటూ ఏమీ వాడకుండా, ఉన్న నేచురల్ వెలుతురినే వాడి ఇలా తీశారు. అలాంటి సమయాల్లో కాస్త డల్ గానే ఉంటుంది సినిమా.

కాకపోతే వర్మ కాస్త అక్కడక్కడా అతి చేశాడు. వర్మ - కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం అలా ఛార్మి వెనక, ప్రక్కనుండి, ఆఖరికి క్రింద నుండీ యాంగిల్స్ చూపెట్టడం అసలు బాగోలేదు. అలా చేస్తేనే చూస్తారు అనుకోవటం కూడా అతని పొరబాటు.. మనకి గ్రహపాటు. డిజిటల్ కేమరాని ఆటవస్తువులా వాడి తన పనితనాన్ని చూపెట్టడం బాగుంది కాని ఈ ముక్కలు పాయసం తింటున్నప్పుడు వచ్చే ఇసుక రాళ్లులా మనకి తోస్తాయి. డిజిటల్ లో తీస్తే సినిమా నిర్మాణ ప్రక్రియ చాలా తేలికగా ఉంటుంది. ఎడిటింగ్ చాలా ఈజీగా ఉంటుంది కూడా.. నిర్మాణ వ్యయం చాలా తగ్గుతుంది. ఈ ప్రక్రియని ఎప్పుడో, చాలా సంవత్సరాల క్రిందటే వాడారు. కాని అంతగా క్లిక్ అవలేదు.

కొన్ని పాత్రల ఎలివేషన్ అంతగా బాగా లేదు. ఏదో గొప్పగా ఊహించేసుకుంటాము.. కాని అక్కడ ఏమీ ఉండదు. అలాంటి వాటిల్లో చార్మీ, బ్రహ్మాజీ, సుబ్బరాజు, సత్యరాజు, సునీల్ పాత్రలు ముఖ్యం. ఛార్మీని కథకు మెయిన్ పాయింట్ గా మార్చ బోయినా - ఆ పాత్ర కి అనుకున్నంత డెప్త్ లేదు. కేవలం గ్లామర్ డాల్ గా మిగిలిపోయింది. బ్రహ్మాజీ ఒక డిఫెరెంట్ స్టైల్ తెలుగువారికి చూపించాడు. జేబుల్లో చేతులు పెట్టుకొని అదో రకమైన చూపులతో ఏదో అవబోతుంది అన్నట్లు హైప్ తీసుకవచ్చాడు. కాని అనుకున్న హైప్ కి అతని పాత్రని డెవెలప్ చెయ్యలేదు వర్మ. మిగిలిన పాత్రలని పేకలో ఈక లాగా చెప్పుకోవచ్చును.


రెండో ఆట 9:20 కి మొదలైన చిత్రం 10:40 కి అయిపోతుంది. ఇందులోనే ఇంటర్వల్ సమయం కూడా ఉంది. అంటే గంటా పావు లో సినిమా అయిపోతుంది అన్నమాట. వన్డే మ్యాచుల్లా కాకుండా 20-20 అని అని అనుకోవాలి. ఇలా చిన్న చిన్న చిత్రాలు చాలానే తెలుగు తెర మీద ప్రదర్శింపబడ్డాయి. వంశీ "మంచు పల్లకీ" (9 రీళ్లు మాత్రమే) తరవాత నేను చూసిన స్ట్రెయిట్ చిన్న ఫిలిం ఇదే!.

మధ్యలో ఆంగ్ల సినిమా BLOODY BIRD అనే సినిమాని తమిళనాడులో దినేష్ అనే దర్శకుడు ప్రేరణగా తీసుకొని తమిళ్ లో - విలన్ గుడ్ల గూబ వేషం వేసుకొని ఒక నాటకం వేసేవారిని అందరినీ చంపుతూ ఉండే - సినిమా డబ్బింగ్ అయి తెలుగులో వచ్చింది. ఆ సినిమాని కేవలం 24 గంటల్లో తీశారు. ఇలాంటి వాటిల్లో స్క్రీన్ ప్లే నే బలం. ముఖ్యముగా షాట్ డివిజన్ అనేది మరీ ప్రాణం. ఎందుకంటే కథనం మాత్రమే దర్శకుడు నమ్ముకొని సినిమాని తీస్తాడు కాబట్టి.

ఇక్కడా ఈ సినిమాలో బాగానే చూసుకున్నారు. కాని కొన్ని సీన్లకి ఇంటర్ లింకింగ్ అంటూ లేకపోయింది. మధ్యలో ఒక షాట్ మిస్ అయ్యిందా అనిపిస్తుంది. సమయం కూడా చాలా తక్కువే ఉండి కాబట్టి మళ్ళీ షూట్ చేసి అ సీన్స్ కలిపేది ఉండెను. కాని ప్రచారం - షూటింగ్ ఆరు రోజులు చేశారని అనాల్సి వస్తుందని ఏమో.. అసలు ప్యాచ్ వర్క్ చేశారా అనేది సరిగ్గా తెలీనప్పుడు మనమేమీ ఆ విషయములో స్పష్టముగా చెప్పలేము.

కెమరా పనితనం బాగుంది. డిజిటల్ కెమరాలో ఉన్న లిమిట్స్ అక్కడక్కడా కనిపించినా - ఆ డిజిటల్ కేమరాలని బాగా వాడుకున్నారు. కెమరా ని స్టాండ్ కి పెట్టి తీసే సినిమా నుండి - చేతిలో పట్టుకొని, నడుస్తూ షూట్ చెయ్యటం నిజముగా రిస్క్ యే!. అక్కడ ఆ కేమరామెన్ ప్రతిభ బాగా తెలిసిపోతుంది. ముఖ్యముగా చిన్నని, సన్నని సందుల్లో బాగా ఆపరేట్ చేశారు. రిఫ్లేక్తర్స్, లైట్స్ వాడకుండా తీయటం కూడా గొప్ప విషయమే.

ఈ చిత్రానికి ఎడిటింగ్ ఫరవాలేదు. ముఖ్యముగా కొన్ని సీన్లు తీసేసినా ఫర్వాలేదు అన్నట్లు ఉండి. కొన్ని రిపీట్ అయ్యాయి. సరియైన లైటింగ్ వాడకుండా నేచురల్ వెలుతురులో ఈ సినిమా తీశారు కనుక వెలుతురు నుండి చీకట్లోకి వెళ్ళినప్పుడు, చీకట్లో నుండి వెలుతురు లోకి వచ్చినప్పుడు - కెమరా లోని సెన్సార్ వల్ల - ఆటో ఫోకస్ లోకి లెన్స్ మారుతున్నప్పుడు వచ్చే గ్లేర్ లాంటి సీన్ ఎడిటింగ్ లో తీసేస్తే బాగుండేది. ఇది డిజిటల్ కెమరా తో తీశాము అని చెప్పటానికా అలా ఉంచేశారేమో అనుకోవాలి కాబోలు..

ఈ సినిమా ప్రధాన ఉద్దేశ్యమేలా అని అనుకోవాలంటే - మొన్ననిర్మాతల మండలి మీటింగ్లో సినిమా వ్యయం బాగా పెరిగిపోయింది. అతి తక్కువ ఖర్చులో సినిమాలు తీస్తే నిర్మాణ వ్యయం తగ్గుతుంది. ఫలితముగా నిర్మాత కాస్త లాభాలు కళ్లారా చూస్తాడు అని చర్చ వచ్చింది. అందుకే కాబోలు.. ఇలా కూడా సినిమా తీయవచ్చు అని వర్మ తీసి చూపాడు. నిజానికి అదే అనుకుంటే ఆ ప్రకాష్ రాజ్, సుబ్బరాజు, సునీల్ పాత్రలలో వేరే క్రొత్తవారిని ఎన్నుకుంటే ఇంకా (రెమ్యునరేషన్) వ్యయం తగ్గేది. అలాగే కొంత కొత్తదనం కూడా వచ్చేది.

ఈ సినిమాని డిజిటల్ లో తీశారు. అలాగే డిజిటల్ పద్ధతిలో తెరమీద చూపారు. ఈమధ్యనే క్రొత్తగా వచ్చిన పద్ధతి ఇది. సినిమా రీలు పద్దతిలో (ఒక్కో కాపీకి 45 వేలు నుండి 60 వేలు ఖర్చు) కాకుండా హార్డ్ డిస్క్ (5 వేలు - 8 వేలు) లో సినిమాని నింపేసి, సిస్టం ద్వారా తెర మీదకి సినిమాని ప్రొజెక్ట్ చెయ్యటం అన్నమాట. అన్నమాట. బీరువా సైజులో ఓక్ సర్వర్, మెషీన్ (15-20 లక్షలు) వాడి నేరుగా తెరమీదకి ప్రాజెక్ట్ చెయ్యొచ్చు. దీని వలన ఖర్చు బాగా తగ్గుతుంది. ఒక ఆపరేటర్ చాలు.

ఈ సినిమానే ఆరు లక్షల వ్యయముతో (నటీనటుల పారితోషకాలు కాకుండా) సినిమా తీశారు. అంటే నిర్మాతకి ఎంత ఖర్చు తగ్గి, ఎంత ఆదానో మీరు ఇక్కడ చక్కగా గమనించవచ్చును. ప్రతి ప్రింట్ మీద స్క్రీన్ కి పైనో క్రింద మూలనో ఒక సీక్రెట్ నంబెర్ వెయ్యటం మూలాన (ఇది స్క్రీన్ మీద మూలన కనిపిస్తుంది.) పైరసీ అయినా ఎక్కడి నుండి కాపీ అయ్యిందో ఈజీగా కనిపెట్టేయ వచ్చును. డిజిటల్ పద్దతిలో కాబట్టి ఆడియో క్వాలిటీ బాగుంది. DTS సర్రౌండ్ కూడా క్లారిటీ గా ఉంది కూడా. ఇలా వస్తున్న నూతన టెక్నాలజీ సహాయముతో సినిమాని ఇంకా బాగా తీసి, తక్కువ వ్యయం చేసి (సినిమా లో దమ్ము ఉంటే) నిర్మాత లాభాలు గడించవచ్చు అనే సూత్రం మీద తీసిన సినిమా ఇది.

Thursday, March 17, 2011

Mail forwarding - Malver

చాలాసార్లు చెప్పానుగా.. ఈ మెస్సేజ్ మెయిల్ ని అందరికీ పంపండీ అని కొన్ని మెయిల్స్ వస్తుంటాయి. వాటిని ఈ చదూకున్న మూర్ఖులు వారి ఫ్రెండ్స్ లిస్టులో ఉన్నవారందరికీ పంపిస్తూ ఉంటారు అనీ!.. అలా మెయిల్ ID వారి చేతికి చిక్కి, ఆ తరవాత వారు పంపే మెయిల్ ఎంతగా ఇబ్బంది పెడతాయో ఎన్నోసార్లు వివరముగా చెప్పాను. ఇప్పుడు మరో రెండు వివరణలతో ఈ విషయాన్ని మరింత క్లియర్ గా చెప్పాలని అనుకుంటున్నాను.

మొన్న DHL (ఫేక్) కంపనీ నుండి నాకో మెయిల్ వచ్చింది. అది చూడగానే అనుకున్నాను. అది ఫేక్ అనీ. ఎలా అంటే అందులో నేను ఏమీ పార్సెల్ వెయ్యలేదు. అలాగే, నాకు పార్సల్ అంటూ ఏమీ రాదనీ తెలుసు. చెప్పగా.. ఈ మెయిల్ మీ ఫ్రెండ్స్ కి అందరికీ పంపండీ.. అనే మెయిల్స్ ని అందరికీ పంపిస్తే అందులో బలయిన వాళ్ళల్లో నేనూ ఒకడిని. మళ్ళీ దాన్ని ఇతరులకు ఎవరో పంపారు. అందులో నా మెయిల్ ID  ఉన్నట్లుంది. అందుకే ఇలా అనేక బాధలకి గురి అవుతున్నాను. అలా రాగానే దాన్ని వెంటనే ఓపెన్ చెయ్యలేదు. కావాలని అలాగే కొద్దిరోజులు ఉంచేశాను. ఒక ఆటాచ్మెంట్ ఫైల్ ఉంది చూడండి అనీ.. అది ఓపెన్ చేస్తే ఏమవుతుందో నాకు తెలుసు అందుకే ఆగాను.

ఇలా వచ్చినదాన్ని కొన్ని రోజులతర్వాత ఓపెన్ చేసి చూశాను.. అలా ఎందుకూ అంటే - ఆంటీ వైరస్ సాఫ్ట్వేర్ అప్దేటేడ్ అవుతుంది అని. ఏదో ఒక మాల్వేర్ నా సిస్టం లో తిష్ట వెయ్యటానికి రెడీగా ఉందన్న మాట. ఈ ఫార్వర్డ్ మెస్సేజెస్ వల్ల ఎంత ప్రమాదం జరిగేదో..


ఈ చదూకున్న మూర్ఖులు తెలివే ఉండదు.. నిజమా కాదా? అని అర్థం చేసుకోరు. ఇక దాన్ని ఏదో మహాద్భాగ్యముగా ఫీలయ్యి, అందరికీ పంపిస్తూ ఉంటారు. అందుకే వారూ అనేక చిక్కులకు గురి అవుతూ ఉంటారు. వారి సిస్టమ్స్ స్లో గా నడవటం.. తరచూ హాంగ్ అవటం, డాటా వాడకం ఎక్కువగా ఉంటుంది కూడా (ఎలా అంటే మీ సిస్టం నుండి ఈ నెట్ కనెక్షన్ ద్వారా డాటా దొంగిలించటం జరుగుతుంది కదా).. ఇక ఇంతే కాదు.. ఇంకో విషయం కూడా చెబుతున్నాను.. అది వింటే - అర్థం అయితే మీ వంట్లో వణుకు రావటం ఖాయం. 

నేను ఆన్ లైన్లో బాగా ఉంటున్నాను, ఎప్పుడు చూసినా ఆన్ లైన్ లోనే ఉంటున్నాను - అని కంప్లైంట్స్ వస్తుంటే ఏమో అనుకున్నాను. నేను తప్ప ఎవరైనా నా సిస్టం నుండి ఎవరైనా లాగిన్ అవుతున్నారా అంటే ఎవరూ లేరు. నేను నెట్ కి దూరం ఉన్న సమయాల్లో కూడా నా పేజీలోకి ఎవరో వచ్చేస్తున్నారు అని అనుమానం వేసింది. ఇలా కాదని అనుకోని నిఘా పెట్టాను. నేను నా మెయిల్స్ చెక్ చేస్తుండగానే - ఎక్కడి నుండో ఒకరు నా మెయిల్ ID తో నా మెయిల్ బాక్స్ లోకి లాగిన్ అయ్యారు. అప్పుడు తెలిసింది.. వీరి వల్ల నేను ఎల్లప్పుడూ నేను ఆన్లైన్ లో కనిపిస్తున్నానని. ఇక చూడండి.. నా టెన్షన్.. ఇది మీరు నమ్మలేకున్నారా? నిజం. చూడండి మీరే.. నావి ఫైర్వాల్, అన్ని రకాల అప్డేట్స్ ఉన్నా తప్పలేదు.
ఆ పసుపు వర్ణములో హైలైట్ చేసి ఉంది చూడండి. అలాగే కనిపిస్తుంది అక్కడ. కనిపించకపోతే పెద్దగా చూడండి. మన మిత్రులు అనబడేవారు అలా ఫార్వార్డ్ చేస్తూ - ఇలా మనల్ని చిత్రహింసల పాలు చేస్తుంటారు. ఆ మెయిల్ ID కి ఉన్న పాస్ వర్డ్ ని బ్రేక్ చేసి ఇలా లాగిన్ అవుతూ ఉంటారు. దాని వల్ల నేను ఎప్పుడూ అలా ఆన్లైన్ లో ఉంటున్నానని నా మిత్రులు అనుకుంటున్నారన్నమాట. అందుకే

మీరు నిర్ధారించుకోకుండా ఏదీ / ఏ మెయిల్ కూడా ఫార్వార్డ్ చెయ్యకండి ప్లీజ్!.. 

Sunday, March 13, 2011

Social NW Sites - 21 - మిత్రులతో వారు యే విధముగా వ్యవహరిస్తున్నారు.?

ఇప్పుడు వారు వారి మిత్రులతో ఎలా ఉన్నారో / ఉంటున్నారో తెలుసుకుందాం. ఇది తెలుసుకోవటానికి కొంత సమయం పడుతుంది. ఇందులో కూడా మళ్ళీ స్క్రాప్ బుక్ చూడకతప్పదు. మిత్రులతో ఎలా ఉంటున్నారనేది - కాలక్రమంలో తెలుస్తూనే ఉంటుంది. మొదట్లో తెలుసుకోవటం కొద్దిగా కష్టమే!. కాని కొంత అనుభవం ఉంటే తెలుసుకోవచ్చును. ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉంది. నీ స్నేహితులు ఎవరో చెప్పు - నీ గురించి చెబుతాను అని ఒక మహానుభావుడు అన్నారు. ఇది నిజమే!. వారికి వచ్చే స్క్రాప్స్ చూస్తేనే వారు ఇతరులతో ఎలా వ్యవహరిస్తున్నారో తెలిసిపోతూనే ఉంటుంది. దాన్ని బట్టే ఒక అంచనాకి రావచ్చును. వారు ఇతరులతో ఎలా ఉంటున్నారనేది. ముందే చెప్పానుగా - అలా స్క్రాప్స్ చూడటం మొదట్లోనే చెయ్యండి. ఆ తరవాత వద్దు. అందులోని విషయాలు మనకి తెలీకుండానే అవతలివారికి చెప్పేస్తుంటాము. మన బాడీ లాంగ్వేజ్ కూడా అలాగే మారిపోతుంది కూడా. కనుక తస్మాత్ జాగ్రత్త.

Saturday, March 12, 2011

Social NW Sites - 20 - వారు ఇతర మిత్రులకు ఎలా స్క్రాప్స్ పంపుతున్నారు.?

మీకు వచ్చిన ఆడ్ రిక్వెస్ట్ లోని అతను, లేదా మీకు క్రొత్తగా ఆడ్ అయిన మిత్రుడు - అంతకు ముందు తన మిత్రులతో ఎలా వ్యవహరిస్తున్నాడో  కాస్త గమనించాలి. చాలామంది స్క్రాప్ బుక్స్ లోకి తొంగి చూద్దామన్నా, చాలా స్క్రాప్ బుక్స్ - స్నేహితులు మాత్రమే చూసేలా సెట్టింగ్స్ పెడతారు. ఇలాంటివారివి ఆడ్ అయ్యాకే చూడగలం. వీరు మిత్రులకి ఎలా వ్రాస్తున్నారో - వారి స్క్రాప్స్ బుక్ లోకి వెళ్లి, చూడగలం (ఓపెన్ టూ ఆల్ అనే సెట్టింగ్ లో ఉంటేనే.)

ముందే చెప్పానుగా.. ఎవరి స్క్రాప్స్ బుక్ చూసినా, మొదట్లోనే చూడాలి. ఆ తరవాత వద్దే వద్దు. చూసి వేరు వేరుగా అర్థాలు చేసుకోగలం. అలా చూసి ఎన్నో అపార్థాలు చేసుకుంటూ మనసులు పాడు చేసుకుంటూ, సఖ్యముగా ఉండలేకపోతాము. అది ఎలానో Social NW Sites - వివాదాలు అనే టపాలో చెబుతాను.

ఆ నూతన స్నేహితుడికీ, మీకు మధ్య మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే చూడండి. మ్యూచువల్ ఫ్రెండ్ అంటే - ఆ నూతన మిత్రుడి ఫ్రెండ్ లిస్టు లో, మీ ఫ్రెండ్ లిస్టు లో రెండింటిలో కామన్ గా ఉన్న మిత్రుడు అన్నమాట. అందులో బాగా ఆన్లైన్ లోకి వచ్చే ఆ మ్యూచువల్ స్నేహితుడి స్క్రాప్ బుక్ లో అతడి స్క్రాప్స్ వెదకండి. ఇక్కడ ఒక చిన్న గమనిక. అలా ఇతరుల స్క్రాప్స్ బుక్ చూడవద్దు అంటాడు.. మళ్ళీ చూడాలి అంటాడు ఏంటీ! అని అనుకోకండి. జస్ట్ అన్నీ కాదు ఆ నూతన మిత్రుడు వ్రాసినవే - అవి కూడా కొన్నే! అదీ పై పైనే చూడండి. అతని వ్రాసే స్టైల్, ఇతరులతో ఎలా వ్యవహరిస్తున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడూ, తను వ్రాసిన ఒక స్క్రాప్ కీ - ఇంకో స్క్రాప్ కీ గల సమయం తేడా ఎంత, ఎన్ని రోజులు తేడా ఉందో గమనించాలి. అలా చూడటం కూడా జస్ట్ ఒక అభిప్రాయం రావటానికి అంతే. కాని రంధ్రాన్వేషణ లా లోతుగా వెళ్ళకండి. అలా చేస్తే మీరు వెళ్ళిన ఉద్దేశ్యమే మారిపోతుందిఇలా చెయ్యటం కూడా మొదట్లోనే చెయ్యండి. ఆ తరవాత అలా చూడటం మానేయ్యండి. అలా రఫ్ గా చూస్తే - కాసింత అభిప్రాయానికి రావచ్చును. ఇదంతా బాధపడలేం అని మీరనుకుంటే ఇంకో మార్గమూ చెబుతాను.

వారికీ, మీకు మధ్య ఉన్న మ్యూచువల్ స్నేహితులలో మీకు బాగా తెలిసిన వారిని చాట్ కి ఆహ్వానించండి. అందులో అతని ప్రొఫైల్ ఐడి లింక్ ఇచ్చి, అతని గురించి అడగండి. అప్పటికే అతను మీ స్నేహితుడికి స్నేహితుడు అయి ఉంటాడు కదా! అతని మనస్తత్వం ఏమిటో అతనికి తెలిసే ఉంటుంది. మీ మనస్తత్వం కూడా మీ స్నేహితునికి తెలుసుకదా. అతను ఎంతవరకు మీతో సఖ్యముగా ఉండగలడో, అతనికి కాస్త తెలుస్తుంది.  మీకు అతని గురించి కాస్త విలువైన సమాచారం చెబుతాడు - అతను ఎవరూ, ఎలా పరిచయం, ఏమి చేస్తుంటాడు, ఎలా మాట్లాడుతాడు, ఏమైనా ఇబ్బందులు పెడుతున్నాడా, అతని వ్యక్తిత్వం.. ఇలా అన్నీ అపుడే తెలిసిపోతాయి. అప్పుడు మీరు మీ మనస్తత్వానికి వారు సరిపోయేదీ లేనిదీ చూసుకొని, ఆడ్ చేసుకోవచ్చును.. లేదా రిజెక్ట్ చెయ్యవచ్చును. ఒకవేళ వారు చెప్పింది కాస్త అనుమానం ఉందే అనుకోండి. అప్పుడు ఇంకో మ్యూచువల్ ఫ్రెండ్ ని అడగండి. సరిపోతుంది. వారు చెప్పిన దాంట్లో ఏవైనా ఇబ్బంది విషయాలు ఉంటే తప్ప, సగం ఓకే అనిపిస్తే ఆడ్ చేసుకోండి. - ఇక్కడ ఒక విషయం బాగా గుర్తు పెట్టుకోండి. వారి అభిప్రాయాలు వారు చెప్పారు. అవే నిజం కాకపోవచ్చును. మీరంతట మీరుగా బేరీజు వేసుకోండి. మనకి అలా సహాయం చేసిన ఆ మ్యూచువల్ ఫ్రెండ్స్ అభిప్రాయాలని అక్కడే మరచిపోవటం మంచిది. వాటిని గుర్తు పెట్టుకొని, తరవాత నీమీద అప్పుడు ఇలా అన్నాడు అని ఆ నూతన మితునికి చెప్పటం మరీ దారుణం. అలా చేస్తే - ఇక మీమీద ఎవరికీ నమ్మకం ఉండకపోవచ్చును. సహాయం చేసిన మిత్రున్ని వంచించటం అంత మంచి పద్ధతి కాదు.

ఆ నూతన మిత్రుడు స్క్రాప్ బుక్ చూస్తే అందులో వచ్చే స్క్రాప్స్ బట్టి అతను ఎదుటివారికి ఎలా స్క్రాప్స్ వ్రాస్తాడో, ఒక అంచనాకి రావచ్చును. ఇలాంటి సైట్లలో ఎక్కువగా యూత్ ఉంటుంది గనుక, వారి వారి స్టైల్ లోనే స్క్రాప్స్ ఉంటాయి.

కొద్దిమందికి స్క్రాప్స్ కూడా వ్రాయరాదు. ఏదో వ్రాశామా, లేదా అన్నట్లు వ్రాస్తుంటారు. వాటికి అర్థం ఏమిటో తెలుసుకోనేసరికి పుణ్యకాలం గడిచిపోతుందేమో!.

మరికొంతమందికి మరీ బద్ధకముగా స్క్రాప్స్ వ్రాస్తుంటారు. అసలు ఎవరో బలవంతం చేసి వ్రాయమన్నట్లుగా వ్రాస్తుంటారు. నా ఇద్దరు మిత్రులూ.. ఇద్దరూ నాకు ఒకసారి ఇలా - GM :) స్క్రాప్ పెట్టారు. అంటే దాని అర్థం Good Morning & హాపీ స్మైలీ. అసలు స్క్రాప్స్ వ్రాసేదే నెలకు ఒకసారి అన్నట్లు ఉంటుంది. నాకూ విసుగు వచ్చేసి నేనూ - GE :) (Good Evening & Happy smily) అని రిప్లై ఇచ్చేశాను. అప్పుడు వారికి తగినట్లుగా చెప్పినవారిమి అవుతాము. ఇంకో బాగా దగ్గరి మిత్రుడు, చిన్నప్పటి మిత్రుడు నా పుట్టినరోజుకి hpy b'day అని చెప్పాడు. కాస్త పెద్దగా చెబితే ఏమి పోయేది. ఇది టెలిగ్రాం కాదు కదా - ఎక్కువ పదాలు వాడితే ఎక్కువ బిల్ కట్టాల్సివస్తుంది అనీ! నాకూ చిర్రెత్తుకొచ్చి నేనూ tnx అని చెప్పేసి ఊరుకున్నాను. అవతలి వారు ఎంతగా కన్సర్న్ చూపిస్తే అంతగా మనం చూపటం మన ధర్మం.

ఇంకొంతమంది పనికిరాని సోది అంతా అందరికీ స్క్రాప్స్ గా పంపిస్తుంటారు. అలాంటివారు ఎదుటివారికి అది ఇష్టమా కాదా అని తెలుసుకోరు. బాగున్నవి పంపిస్తే ఓకే.. వారికి ఇష్టం లేనివి పంపితే - ఏమి బాగుంటుంది?

ఇంకొంతమంది ఉంటారు.. వారికి వ్రాసిన వాటికి సమాధానం ఇవ్వటమే రాదు. నాలుగైదు స్క్రాప్స్ వ్రాస్తే - ఏ ఒక్కదానికో జవాబు ఇస్తుంటారు. ఇక వారితో స్నేహం ఎలా ముందుకు వెళుతుంది. అసలు ఈ స్నేహం చెయ్యటమే ఇరువురి నుండి నడవాలిగా. ఒక్కరి నుండి ఎన్నిరోజులని స్నేహ హస్తాన్ని చాచగలం. అవతలివారూ అందుకోవాలిగా.. అలా అందుకున్నప్పుడే స్నేహం కొనసాగుతుంది కదా!. ఇలా వారు చెయ్యనప్పుడు వారిని అలా వారి మానాన వారిని వదిలేయ్యటం మంచిది. దైనందిక జీవితములో మీరే ఒకరికి విష్ చేస్తున్నారే అనుకుందాము. ఎప్పుడూ మీరే విష్ చేస్తున్నారు కాని అవతలి వారు తమంతట తాముగా మీకు విష్ చెయ్యకున్నా సరే! కాని ప్రతిగా విషేష్ చెప్పకుంటే - వాడికి కళ్ళు నెత్తికి ఎక్కాయి ఆనుకొని, మీరు ఇంకా అలాగే కొనసాగించరుగా.. ఇక్కడే అంతే!.. వారంతట వారుగా విష్ చేయ్యకపోనీ, కాని మీ స్క్రాప్స్ కి అతను బదులు ఇవ్వకపోతే - మీరు వారిని పలకరించటం మానేయ్యండి. వినటానికి ఏటేటో ఉన్నా తప్పదు మరి.

ఇంకొంతమంది మహానుభావులు ఇలా వచ్చేసి, అలా వెళుతుంటారు. వారి పని వారు చూసుకొని - అంటే ఏమైనా వచ్చాయా అని చూసుకుంటారు. కాని రిప్లైస్ అసలు ఇవ్వరు. వారి పుట్టినరోజులకి మనం గ్రీటింగ్స్ చెప్పినా వారు - కనీసం ఒక థాంక్స్ కూడా బదులు చెప్పరు. అలా ఉంటారు వారు. పోనీ వారేమైనా బీజీ పర్సన్స్ అంటే కూడా కాదు, పోనీ నెట్ కి రావటం లేదా అంటే - ఇలా వచ్చేసి అలా పోతూనే ఉంటారు. వారివి మాత్రం అప్డేట్ చేస్తూ పోతూనే ఉంటారు. అలాంటివారు మీ ఫ్రెండ్స్ లలో ఉన్నారే అనుకోండి.. మెల్లమెల్లగా వారిని దూరం చేసుకోమనే నేను సలహా ఇస్తాను.

ఇంకొంతమంది ఉంటారు. వారికి స్క్రాప్స్ పెట్టినా బదులు ఇవ్వరు. వేరే వారికిమాత్రం బదులు ఇస్తూనే ఉంటారు. అలాంటివారిని కూడా ఒక నాలుగైదు సార్లు చూసి వదిలెయ్యండి - శాశ్వతముగా. వారి చర్యలకి అర్థం - మీతో నేను మాట్లాడదలచుకోలేదు అని చెప్పకనే చెబుతున్నారు అన్నమాట.

ఇంకొంతమంది ఉంటారు - వాళ్ళని వాళ్ళు అంబానీల కన్నా గొప్పగా ఊహించేసుకుంటారు. వారు చేసేది చిన్న ఉద్యోగమైనా - ఆ మొత్తం సంస్థ వారిమీదే ఆధారపడింది అన్నట్లుగా ఉంటారు. అలాంటివారు కాస్త రిలాక్స్ అవుదాం అన్న ఆలోచన వారికి ఉండదు. ఎంతసేపూ పనే పని అంటూ ఉంటారు. యే సంస్థ అయినా రోజులో ఇరవై నాలుగు గంటలూ ఆఫీస్ లో ఉద్యోగం చేయ్యనివ్వరుగా. కాని వీరే అలా గొప్పగా ఫీల్ అవుతుంటారు. తాము లేకపోతే ఆ సంస్థ మూతపడుతుంది అన్నంత బీజీ  చూపిస్తారు. నిజానికి ఉండొచ్చు ఉండకపోవచ్చు. సోమవారం నుండి శనివారం రాత్రి వరకూ బీజీ అనుకుందాం!.. మరి ఆదివారం ఏమి చేస్తారు? ఆరోజు బీజీ అని అనుకుందాము. వారివారి అప్డేట్స్ చూసుకొని, ఎదుటివారికి జవాబు ఇవ్వాల్సిన అవసరం చూపకుండా వెళ్ళిపోతారు. ఈ మధ్య నేను  ఇలాంటివారిని కొందరిని గమనించాను. ఉన్న స్క్రాప్స్ కి రిప్లైస్  ఇవ్వరు గాని, వేరే ఇతరులతో చాట్, మెయిల్స్, క్రొత్తగా ఆడ్ రిక్వెస్ట్స్ అనీ చేస్తుంటారు. కాని రోజూ ఒక పావుగంట కేటాయిస్తే చాలు - వచ్చిన అన్నింటికీ రిప్లైస్ ఇవ్వొచ్చు. ఇది నేనూ నమ్మలేదు. నేను ఈ మధ్య కొంత బీజీ అయ్యాను. అయినా ఉదయాన, రాత్రి కాస్త వీలు చేసుకొని అన్నీ ముగించేవాడిని. ఓస్! ఇంతేనా.. ఈ మాత్రం దానికి ఎందుకు అంత బీజీ ప్రదర్శిస్తారో అసలు అర్థం కాలేదు నాకు.

ఆమధ్య ఒక పెళ్ళికి ఉదయాన్నే వెళ్ళాల్సి ఉండెను. కాని నిద్ర లేవటం కాస్త ఆలస్యం అయ్యింది. లేచి బ్రష్ వేసేలోగా సిస్టం ఆన్ చేశాను. అది ఓపెన్ అయ్యి, లాగిన్ అయ్యేసరికి, నా మొబైల్ చార్జింగ్, అవసరమైన వస్తువులు అన్నీ చూసుకున్నాను. సోషల్ సైట్ ఓపెన్ చేసి చూశాను. ఏమున్నాయో, ఏమి వచ్చాయో, ఏమి అప్డేట్స్ అయ్యాయో.. స్నానం చేసి, పూజ చేసుకొని... వచ్చేసి, డ్రెసప్ అవుతూ కొన్ని స్క్రాప్స్స్ వ్రాశాను. వేరొకరి సహాయముతో వచ్చిన వాటికి, ఏవేవి పంపాలో అవి - కాపీ పేస్ట్ & పోస్ట్ చేయించాను. ఒకరు ఒకటి నావల్ల అయ్యే పని చెబితే - పెళ్ళికి వెళుతున్నాను అని చెప్పి రాత్రికి మీ ప్రశ్నకి సమాధానం చెబుతాను అని చెప్పాను. అంతలోగా నా తయారు అయిపొయింది. నా అప్డేట్స్, స్టేటస్ మెస్సేజ్,  ఫొటోస్, కామెంట్స్ మూడు నిమిషాల్లో ముగించాను. ఒకరు చాట్ కి అప్పుడే వచ్చారు. సారీ చెప్పి తరవాత కలుస్తాను అని చెప్పాను. విషయమేదైనా ఉంటే స్క్రాప్ పెట్టండి. వీలుంటే మధ్యలో సమాధానం ఇస్తాను అని చెప్పాను. సిస్టం ని షట్ డౌన్ చెయ్యమని చెప్పేసి..  ఇంట్లోవారికి బై చెప్పేశాను. అంతా కలిపి పావుగంటలో అంతా ముగించేశాను. హాయిగా పెళ్ళికి వెళ్లాను. జర్నీలో హాయిగా రెస్ట్ తీసుకున్నాను. ఇదంతా నా గొప్పకోసం చెప్పటం లేదు.  కాస్త కూల్ గా ఉండి చేస్తే అన్ని పనులూ చెయ్యొచ్చు అని చెబుతున్నాను అంతే!. చెయ్యాలీ అనుకుంటే మనసు అన్నీ నేర్పిస్తుంది. కష్టం అని అనుకుంటే ఏదీ రాదు.

మరికొంతమంది స్క్రాప్స్ కాపీ చేసి తమవిగా పంపుతుంటారు. ఏదో ఒకసారి అంటే ఓకే అనుకోవచ్చు.. కాని వారు పంపే ప్రతిదీ అలాగే ఉంటుంది. ఒక్కటన్నా వారి క్రియేటివిటీ ఉండదు.

ఇలా వారి వారి స్క్రాప్స్ చూసి, ఒక అవగాహనకి రండి. అన్నింటికన్నా మీకు మీ సమయం ముఖ్యమైనది. ఎక్కువగా వృధా చెయ్యకండి. ఆ సమయములో ఎన్నో విషయాలు చాలా బాగా నేర్చుకోవచ్చును.

Friday, March 4, 2011

Social NW Sites - 19 - వారి మిత్రులు వారికి యే విధముగా భావిస్తూ స్క్రాప్స్ పంపుతున్నారు.?

ఇంతవరకూ మీరు సోషల్ సైట్ లో చాలా విషయాలు నేర్చుకున్నారు. అవి మీరు పాటిస్తున్నారు అని అనుకుంటున్నాను. ఇప్పుడు వారి మిత్రులు వారికి యే విధముగా భావిస్తూ స్క్రాప్స్ పంపుతున్నారు.? అనేది చూద్దాం!.

మనకి వచ్చిన ఆడ్ రిక్వెస్ట్ రాగానే ఎలా పరిశీలించాలో, ఏమేమి చూడాలో మీకు పాత టపాలలో వివరముగా చెప్పాను. అలా వారి రిక్వెస్ట్ ఒప్పుకొనే ముందు - అతని మిత్రులు అతనితో ఎలా ఉంటున్నారు? అనేది కూడా కాస్త ఓ లుక్కెయ్యండి. అతని స్క్రాప్ బుక్ ఓపెన్ చెయ్యండి. చాలా స్క్రాప్ బుక్స్ మిత్రులు అయితేనే చూసేలా సెట్టింగ్స్ ఉంటాయి. అందులో అంత గొప్ప రహస్యాలు కూడా ఉండవు. ఏవేవో కబుర్లు తప్పించి. తమ మిత్రులు మాత్రమే చూసేలా సెట్టింగ్స్ పెట్టినా, ఇతరులు చూడలేరు అని ధీమా ఒక్కటే మిగులుతుంది. ఆడ్ అయ్యాక అన్నీ తెలుస్తూనే ఉంటాయి. అప్పుడు ఆ స్క్రాప్ బుక్ లో రహస్యాలు (ఏమైనా ఉంటే) హాయిగా చదివేస్తారు. ఇలా సెట్టింగ్స్ పెట్టుకునేవారు - కాస్త గోప్యముగా ఉండేవారు అని అర్థం.

ఇంకొంత మంది ఉంటారు - తమ స్క్రాప్ బుక్ కొందరు చూడకుండా ఇలా సెట్టింగ్స్ పెట్టుకొని ఉంటారు. అలా పెట్టుకున్నా అందులోని విషయాలు ఎలాగూ వేరు వేరు దారుల్లోంచి అసలువారికి తెలుస్తూనే ఉంటాయి. ఎలా అంటే వారికి ఆడ్ అయిన మిత్రులు ఆ ఎవరికీ తెలియోద్దు అని అనుకుంటామో వారికి, వీరు ఆ సమాచారాన్ని చేరేస్తుంటారు. ఇలాంటి చాలా సంఘటనలని నేను చూశాను. నాకూ అవతలివారు ప్రైవేట్ స్క్రాప్ లలోనూ, మెయిల్ ద్వారానో, చాట్ లోనో, ఫోన్ ద్వారానో.. చెప్పారు. అందుకే ఏవీ రహస్యాలు కాలేవు అని అనేది.

మరికొంతమంది ఓపెన్ గానే స్క్రాప్ బుక్ పెడతారు. వీరు కా-స్త ఓపెన్ గా ఉండే మనస్తత్వం అని అనుకోవచ్చును. కా-స్త అని ఎందుకు అనడం అంటే అన్నీ ఓపెన్ గా ఉంటాయని, వీరు అన్నీ ఓపెన్ గా ఉంచారు అని అనుకోకండి. ఏవి దాచేయ్యాలో, అవి దాచేసే ఘనాపాటీలు.

ఇప్పుడు మీరు ఆ స్క్రాప్ బుక్ సెట్టింగ్ చూసి అవతలివారు ఎలాంటివారో కాస్త తెలుసుకోగలిగారు కదా!. ఇప్పుడు ఆ స్క్రాప్ బుక్ లోనవి చూద్దాం. నిజానికి ఇలా చెయ్యటం అంత సంస్కార పద్ధతి కాదు. ఇద్దరు వ్రాసుకున్న / చెప్పుకున్న విషయాలని ఇలా చాటుగా ఉంది చూడటం మంచి పద్ధతి కాదు. ఇలా ఎందుకు అంటున్నానూ అంటే - ఇలా చూడటం ఒకసారికే అని అనుకుంటాము. కాని ఎందుకో మళ్ళీ మళ్ళీ బాగా చూడాలి చూడాలి అనిపిస్తుంది. అలా చూడటం అలవాటుగా మారుతుంది. అందులోని స్క్రాప్స్ చదివి, చూసి కడుపు ఉబ్బరముతో చస్తాము. ఎవరికైనా చెప్పాలని అనిపిస్తుంది. కాని చెప్పకుండా ఆగలేము. అలా విన్నవారి నుండి (వారికీ ఇదే పరిస్థితి.. ఆపులేకపోవటం..) అలా అలా - భూమి గుండ్రముగా ఉండును అన్న విధముగా తెలిసిపోతాయి. ఈ మధ్యలో ఉన్నవారు కాస్త రహస్యముగా కూడా ఉంచరు. ఎవరు చెప్పారు మీకు అని గద్దిస్తే - నాపేరు చెప్పకు, నాకు ఫలానా వారు చెప్పారు, వారికి ఆ ఫలానా వారు చెప్పారు అని అంటారు. అలా చివరకి మన పేరు బయట పడుతుంది. అప్పుడు నెత్తీ నోరు కొట్టుకున్నా వారు వినరు. పైకి మామూలుగా మాట్లాడినా లోపల ఒక గాజుగోడ అంటూ ఏర్పడుతుంది. అలా గాజు గోడ అంటూ ఏర్పడ్డాక అంతా మామూలుగా ఉంది అని అనుకుంటాము. కాని మునపటి అంతగా స్నేహం మాత్రం ఉండదు. బాగా పరిశీలిస్తే గాని, అప్పుడు ఈ విషయం కనిపించదు. ఈ విషయం తెలియటానికి ఒక్కోసారి జీవితకాలం కూడా పట్టొచ్చు. అందుకే కాస్త మరీ మరీ జాగ్రత్తగా ఉండండి.

అందుకే ఒకసారి మాత్రమే - అదీ ఆడ్ అయ్యేటప్పుడే రఫ్ గా చూడండి. అవతలి వారు ఎలా వారికి స్క్రాప్స్ వ్రాస్తున్నారు.. మనం చూసిన రోజు రాత్రివరకూ ఎన్ని స్క్రాప్ వచ్చాయి.. అందులో ఒక రోజులో ఎన్ని స్క్రాప్స్ ఉన్నాయి, ఎన్ని గ్రీటింగ్స్ ఉన్నాయి, ఎన్ని కబుర్లు ఉన్నాయి అంటూ చూడండి. ఇదంతా లోతుగా పరిశీలించకండి. అలా చేస్తే కడుపుబ్బరం రావటం గ్యారంటీ.. పై పైన చెయ్యండి. ఎంతగా అంటే - ఏమి చూశారూ అంటే సరిగా గుర్తులేదు అని చెప్పెసేలా ఉండాలి. ఇక్కడ ముఖ్యముగా నేర్చుకోవాల్సింది ఏమిటంటే - వారికి ఎలా స్క్రాప్స్ ఉంటున్నాయని, అంతే కాని అందులో ఏమున్నాయని కాదు. వినటానికి కాస్త గందరగోళముగా ఉన్నా సరిగ్గానే చెప్పాను.

వారికి ఎలాంటి స్క్రాప్స్ వస్తున్నాయో చూద్దాం.. కేవలం గ్రీటింగ్స్ మాత్రమే వస్తుంటే కేవలం పరిచయస్తుల్లాగా మిగిలిపోతారు అని సూచన. ఇది నాకు ఎన్నోసార్లు రుజువయ్యింది కూడా. అవియే కాకుండా వేరే స్క్రాప్స్ ఉంటే మితృత్వాన్ని బాగానే నెరుపుతున్నారు అనుకోవచ్చును. ఒకరోజులో ఎన్ని స్క్రాప్స్ ఉన్నాయో చూస్తే -వారి పాపులారిటీని చూడొచ్చు. అందులో వారిని ఎలా సంభోదిస్తూ, ఎలాగా ఉద్దేశిస్తూ స్క్రాప్స్ వ్రాస్తున్నారో, చూడండి.

ఇలా చూడటం మొదటి ఐదు స్క్రాప్ పేజీలు  - అంటే యాభై స్క్రాప్స్ మాత్రమే చూడండి. తెలిసిపోతుంది. ఇలా చూడటం కూడా కేవలం ఆడ్ అయ్యేటప్పుడే చూడండి. లేకుంటే అలవాటుగా మారిపోయి, మిమ్మల్ని చాలా ఇబ్బందుల్లోకి నెట్టివేయటం ఖాయం. చాలామంది దీన్ని సరదా అలవాటుగా తీసుకుంటుంటారు. కాని వారు క్రమక్రమముగా సరదాలని కోల్పోతుంటారు. ఎప్పుడూ అందరి స్క్రాప్ బుక్స్ చూడటమే పరమావధిగా భావిస్తుంటారు. వారు ఒప్పుకోకున్నా ఇది వారికి వ్యసనముగా మారుతుంది. ఎదుటివ్యక్తి మనసులోని ఉద్దేశ్యాన్ని ముందే మనకి తెలిసేలా ఒక విద్యని దేవుడు వరముగా ఇస్తే - ఆ తరవాత ఏమి జరిగిందో - అనే కాన్సెప్ట్ మనం చాలా సినిమాల్లో చూసే ఉన్నాము కదా!.. అలా అవచ్చును. అలా క్రమక్రమముగా మిత్రులతో దూరముగా జరుగుతూ ఉంటాము. ఇదంతా గమనించేసరికి మిత్రులకి చాలా దూరములో ఉంటారు. ముందే చెప్పానుగా గాజుగోడలు అంటూ ఏర్పడతాయనీ. దూరం నుండి చూస్తే అంతా బాగుంటుంది, కాని దగ్గరగా చూస్తే అడ్డముగా ఏదో ఉంది అనిపిస్తుంది.

వారికి వారి ఫ్రెండ్స్ ఎన్నిరోజులలో రిప్లై ఇస్తున్నారు కూడా ఇక్కడ గమనించవచ్చును. ఆ స్క్రాప్స్ కి ఉన్న తేదీలను గమనిస్తే - ఆయా స్క్రాప్స్ రెగ్యులర్ గా ఉన్నాయో లేవో చూడొచ్చును. అలా కాకుండా మొదటి పేజీలోనో, రెండో పేజీలోనో స్క్రాప్స్ తేదీలు చాలా గ్యాప్ ఉండి ఉన్నట్లయితే - వారు ఎక్కువగా ఏమీ వ్రాయరు అన్నమాట.

కొందరు అసలుకే స్క్రాప్స్ బుక్ మైంటైన్ చెయ్యరు.. ఇలా రాగానే అలా డెలీట్ చేస్తుంటారు. అసలుకి ఏమీ కూడా ఉంచరు. ఇలాంటివారికి బాగా కష్టపడి, టాలెంట్ ఉపయోగించి స్క్రాప్స్ పంపితే, చూసిన తరవాత ఎలాగూ అవి డెలీట్ అవుతాయి కదా.. అందుకే ఇలా మైంటైన్ చేసేవారికి  మామూలుగా పంపండి. ఎంత బాగా వ్రాయాలి అన్న టెన్షనూ, మీకూ సమయం బాగా మిగిలిపోతుంది.

ఇంకొందరు కొన్ని స్క్రాప్స్ మాత్రమే మైంటైన్ చేస్తుంటారు. ఎక్కువగా స్క్రాప్స్ ఉండవు. ఏదో వారికి నచ్చినవీ మాత్రమే ఇందులో ఉంటాయి. నన్నడిగితే - ఈ పద్ధతే మంచిది అని అంటాను. ఏవైనా ఇబ్బందికర స్క్రాప్స్ ఉంటే వెంటనే డెలీట్ చేస్తారు కాబట్టి ఎక్కువగా ఏమీ టెన్షన్స్ రావు. అంతా మామూలువి ఉంటాయి కాబట్టి ఎవరెంత చూసుకున్నా పరవాలేదు అన్నట్లు ఉంటాయి. నేను ఇలాగే చేస్తుంటాను. మొదటి పేజీ ఒక్కటి మాత్రం ఏమీ తీసేయ్యను. రెండో పేజీ నుండి మాత్రం అన్నీ తీసేస్తుంటాను. అలా రోజుకి 20-60+ స్క్రాప్స్ అలా డెలీట్ చేస్తుంటాను. అవన్నీ ఉంచుకుంటే అందరికీ టైం పాస్ చేసినట్లు ఉంటుంది. అంత సీను అవసరమా..

ఇంకొందరు ఉంటారు. వారి స్క్రాప్ బుక్ లో వచ్చిన ప్రతి స్క్రాప్ అలాగే ఉంచేసుకుంటారు. దాని వాళ్ళ లాభం ఏమీ లేకపోగా, నష్టాలే అధికం. స్క్రాప్ బుక్ లో ఇన్ని స్క్రాప్స్ ఉన్నాయి అని చూపిన్చుకోవటానికి గొప్ప కోసం ఉంచుకుంటున్నట్లు అనిపిస్తుంది కాని, వచ్చే కీడు ఎక్కువ. ఎందుకంటే ఈమధ్య ఖాళీ దొరికితే ఎదుటివారి స్క్రాప్ బుక్ చూడటం చాలామంది మిత్రులకి అలవాటుగా మారింది. ఎక్కువ శాతం వారిలో ఈ అలవాటు ఉంది. అందుకే మనకి ఇబ్బందికరమైనవి, వారికి స్కూప్ ఇచ్చే అటువంటి ఆసక్తికర స్క్రాప్స్ తీసెయ్యండి. అప్పుడు అందరూ బాగుంటారు. ఎలా అంటే - ఒక అమ్మాయి ఫలానా మిత్రుడు మంచివాడు కాదు.. మొన్న నాకు ఐ లవ్ యూ అన్నాడు.. అని అన్నారు అనుకోండి. ఈ స్క్రాప్ పొందిన వారు అలాగే ఉంచేస్తే - ఆ అమ్మాయి చెప్పిన పర్సనల్ విషయాన్ని అందరికీ చూపించినట్లవుతుంది. ఆ వ్రాసిన అమ్మాయికి ఇబ్బందికరముగా మారుతుంది. చూసినవారికి ఇదేదో ఆసక్తికర విషయములా ఉందే అనుకొని, ఇంకా మిగతా స్క్రాప్స్ నీ, ఆ అమ్మాయి స్క్రాప్స్ నీ, ఆ అబ్బాయి స్క్రాప్స్ నీ ఆయా తేదీలలో, ముందు రోజుల్లో ఏమి జరిగిందో FBI ఏజంట్ లా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. ఇదంతా అవసరమా చెప్పండి. నిజం చెప్పాలంటే - వారి స్క్రాప్ బుక్ లైబ్రరీలా అనిపిస్తుంది. వారికీ, ఇంకో ఫ్రెండ్ కీ ఏదైనా తేడా వస్తే - అప్పుడు ఆ తేదీవరకూ స్క్రాప్ బుక్ లోపలకి వెళ్లి ఆరోజు , ముందు రోజు ఏమి జరిగిందో చూడొచ్చు / చదవవచ్చును. అక్కడ అంతా డిటైల్డ్ గా సమాచారం అక్కడ కనిపిస్తుంది. చెప్పాగా లైబ్రరీ మాదిరిగా ఉంటుందని.

సంవత్సరం క్రింద ఒకరి స్క్రాప్ బుక్ చూశాను.. అందులో డెబ్బై ఆరు వేల స్క్రాప్స్ ఉన్నాయి. ఇప్పుడు అవి లక్షకు దగ్గరగా ఉండొచ్చును. అవన్నీ ఏమి చేసుకుంటారు?.. అవేమైనా తిరిగి మళ్ళీ చూసుకోరు కదా..! ఎందుకో అన్నీ.. అందులోనిది మనకు అవసరమైనది ఉంది, అందుకే అలా దాచుకున్నాము అనుకుందాం. కాని దాన్ని వెలికి తీయటానికి ఎంతసమయం ఖర్చు చెయ్యాలి.? ఇష్టం అనుకుంటే ఉంచేసుకోవచ్చు కాని అవతలివారికి మాత్రం మనం ఏమేమి మాట్లాడుకున్నామో అన్నీ తెలవటానికి ఇది చక్కని నాలుగు లైన్ల ఎక్స్ ప్రెస్ హైవేలా సహకారం అందించిన వారిమీ అవుతాము. నమ్మకున్నా ఇది మాత్రం నిజం.

నేనూ, నా స్నేహితురాలు మాట్లాడుకున్నప్పుడు నా ప్రొఫైల్ విజిట్స్ ఎప్పుడూ లేనిది యాభై + వరకూ వస్తాయి. తను మాట్లాడని రోజున పాతిక వరకు మాత్రమే విజిట్స్ ఉంటాయి. విచిత్రంగా ఉన్ననూ - ఇది మాత్రం నిజం. చాలాసార్లు ఇది జరిగింది. దీన్ని బట్టే తెలుస్తూనే ఉంది కదా.. స్క్రాప్ బుక్ చూస్తుంటారని.. ఇలాంటివి మరెన్నో ఉదాహరణలు ఇవ్వొచ్చు.

ఇంత పక్కాగా ఎందుకు చెబుతున్నానూ అంటే - మామూలుగా నేను ఎవరి స్క్రాప్ బుక్ చూడను. నా బీజీ నాది. అంత సమయం ఉండదు. అవన్నీ చూసి మనసు పాడు చేసుకొని అనుమానం చూపులతో స్నేహం ఎందుకు చెయ్యాలో అనుకొని అసలు చూడను - ఎప్పుడో ఒకసారి తప్ప. అ మధ్య మిత్రుల రెండు మూడు గొడవల వల్ల వారివి నేను పరిశోధించాల్సివచ్చింది. అలాని ఎందుకు చూడాల్సివచ్చిందీ అంటే ఆ ఇద్దరి మిత్రుల గొడవలో ఎవరిదీ సరియైనది అని తేల్చటానికి. ఆహా!.. అప్పుడే తెలిశాయి. అసలు విషయాలు. మనం మంచివారు అనుకున్న మిత్రులు ఎలా మాట్లాడుతారో అక్కడ స్పష్టముగా కనిపించింది. అప్పుడే అనుకున్నాను. చాటుగా మాట్లాడుకొనే వారు ఇలా మాట్లాడుకుంటారా అని. మనమీద ఇలా మాట్లాడుకుంటారా అని అనిపిస్తుంది. అప్పటిదాకా వారికి బాగా విలువ ఇచ్చిన నేను - తగ్గించుకోవాల్సి వచ్చింది. అలా మేలూ / ప్రమాదాలూ కూడా జరుగుతాయి. అందుకే ఎదుటివారి స్క్రాప్ బుక్స్ చూడవద్దనేది.

ఇక మిత్రులని ఎలా సంభోదిస్తున్నారు అనీ.. చాలామంది తెలీక సార్, అత్తయ్యా, తాత, ఆంటీ, అంకుల్, అమ్మమ్మ.. లాంటి పెద్ద పెద్ద విశేషాణలతో సంభోదిస్తూ, తెలీక మాట్లాడుతుంటారు. అలా మాట్లాడితే అవతలివారు ఎలా ఫీల్ అవుతుంటారో గమనించరు. పరిచయం అయిన మొదట్లోనే అవతలివారు పెద్దవారు అని తెలిస్తే, వెంటనే అడగాలి - మిమ్మల్ని ఏమని సంభోదించాలీ అనీ. అప్పుడు ఎదుటివారు చెప్పిన దానికి ఫిక్స్ అయిపోయి అలాగే పిలుస్తుంటే, చాలా బాగుంటుంది. హర్ష అనీ నా మిత్రుడు నాకు పరిచయం అయిన క్రొత్తలో - మిమ్మల్ని నేను ఫ్రెండ్ అని పిలవాలా? లేక సార్ అనా? లేదా బ్రదర్ అనా!.. అని అడిగాడు. నేను వెంటనే బ్రదర్ అని చెప్పాను. ఇప్పటికీ ఇన్ని రోజులయినా అతను నన్ను బ్రదర్ కి షార్ట్ కట్ అయిన బ్రో! అనే పిలుస్తాడు. ఇది చాలా మంచి పద్ధతి. నా స్నేహితురాలికి, నేను తనకి పరిచయం చేసిన ఇంకో పెద్ద వయసు ఫ్రెండ్ ని పరిచయం అయిన మొదట్లోనే అడిగారు - మీరు నా కంటే పెద్దవారు కదా మిమ్మల్ని ఏమని పిలవాలీ, మీరు చెబితే అలాగే పిలుస్తానూ అని. అందుకు ఆవిడగారు - నాకు ఉన్నది అమ్మాయిలే, అబ్బాయిలు లేరు కనుక నీవు అత్తయ్యా అని పిలువు (కోడలి వరుసలో) అని చెప్పారు. ఇలా అడిగి పిలుచుకోవటం సంస్కారం. ఇలా ముందే అడిగి ఫిక్స్ అవటం చాలా మంచిది. ఎదుటివారి అభిమానాన్ని మరింతగా చూరగొంటాము

నన్ను సార్ అన్నవారితో నేనూ వారిని సార్, మేడం లాంటి పదాలు వాడటం ఈమధ్య మొదలెట్టాను. ఎందుకో నాకు అలా పిలిపించుకోవటం ఇష్టం లేదు. ఫ్రెండ్ అనిపించుకోవటమే ఇష్టం. . అందుకే మీకు ఫ్రెండ్స్ అయినవారిని మొదట - మిత్రమా, నేస్తం, ఫ్రెండ్.. అలాంటి సంభోదనలతో మాట్లాడండి. వారికి ఇష్టం అయితే అప్పుడే అక్కయ్య, ఆంటీ, అమ్మా, సార్, అంకుల్.. లాంటివి వారిని అడిగి, అనుమతి తీసుకొని, మాట్లాడండి. లేకపోతే వారిని ఇబ్బంది పెట్టి - మీరు ఇబ్బంది పడతారు.

updated on :
1st : 4-March-2011 Evening.
Related Posts with Thumbnails