Tuesday, April 27, 2010

Jokes

వెంగలప్ప : (కాల్ సెంటర్ కి ఫోన్ చేసి) "దయచేసి నా మొబైల్ బిల్ ఎంతైంది చెప్పగలరా?.."
కాల్ సెంటర్ అమ్మయి : "సర్! మీరు 123 కి డయల్ చేసి మీయొక్క కరంట్ (ప్రస్తుతపు అన్న అర్థం లో) బిల్ అమౌంట్ తెలుసుకోవచ్చు.."
వెంగలప్ప : "నీకు బుద్ధుందా! నేను అడుగుతున్నది నా మొబైల్ బిల్..కరంట్ బిల్ కాదు.."

***

మిత్రుడు: "మా ఆవిడది ఎక్చేంజ్ చేసి క్రొత్త ఫోర్డ్ కార్ తీసుకున్నాను.."
సర్దార్జీ: (పరాకుగా విని) "వావ్!.. నిజమా!! ఎంత అద్భుతమైన ఆఫర్ ఇది.." 

***

టీచర్: "ఈ ప్రపంచములో అతి పురాతన జంతువు ఏది?"
వెంగలప్ప : "జీబ్రా.."
టీచర్: "ఎలా?."
వెంగలప్ప : "ఎందుకంటే అదొక్కటే నలుపు తెలుపు రంగుల్లో ఉంటుంది. మిగతావన్నీ రంగుల్లో ఉంటాయి.. కదా!"

***

జడ్జ్: "ఇలా మూడోసారి నేరారోపణ మీద కోర్టుకి రావటం సిగ్గుగా లేదూ.."
వెంగలప్ప : "నా సంగతి సరే! మీరైతే రోజూ కోర్టుకి వస్తున్నారుగా! మీకు సిగ్గుగా అనిపించటం లేదా?.."

***

ప్రశ్న: స్త్రీలకి 35 తరవాత పిల్లలు కలుగుతారా?
వెంగలప్ప : "లేదు.. ఆ  మంది చాలు!.."
***

వెంగలప్ప ఒక సాఫ్ట్వేర్ కంపనీ ఇంటర్వ్యూ కి వెళ్ళాడు.
మేనేజర్: "నీకు MS ఆఫీసు గురించి ఏమైనా తెలుసా?."
వెంగలప్ప : " ఒకవేళ మీరు ఆ అడ్రస్ ఇస్తే అక్కడికి వెళతాను.."

***

వెంగలప్ప అతని గర్ల్ ఫ్రెండ్ వద్దనుండి ఒక SMS అందుకున్నాడు. " I MISS YOU "
వెంగలప్ప జవాబు: " I Mr YOU " !!.

***

వెంగలప్ప తన డాక్టర్ కోర్స్ ముగిసాక క్రొత్తగా హాస్పిటల్ పెట్టాడు.
మొదటి పేషంట్ ని కన్నులూ, చెవులూ, ముక్కూ, నాలుక.. బ్యాటరీ సహాయముతో చూసి ఏమన్నాడు అంటే:
" హమ్మయ్య! బ్యాటరీ బాగా పనిచేస్తున్నది.. "

***

మొదటిసారి వెంగలప్ప  ఏరోప్లేన్ లో బాబాయ్ వెళ్ళినప్పుడు - "బోంబే బోంబే.." అని అరవసాగాడు.. "
అందులోని ఎయిర్ హోస్టెస్ " బి సైలెంట్.." అండీ.
వెంటనే వెంగలప్ప  " అలాగా..  ఓంబే  ఓంబే.." అరవసాగాడు.
***

టీచర్: "బుద్ధుడు, గాంధీ, కృష్ణుడు, రామ్, అంబేద్కర్, క్రీస్తు..వీరిలో కామన్ విషయమేమిటో చెప్పు"..
వెంగలప్ప : "వాళ్ళందరూ గవర్నమెంట్ సెలవు దినాలలో పుట్టారు.."

Ee Vishala Prashantha - Nirajanam.

చిత్రం : నీరాజనం (1989)
సంగీతం : ఓ. పి. నయ్యర్
గానం : ఎం. ఎస్. రామారావు.
********************************
పల్లవి :
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో
నిదురించు జహాపనా!
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో
నిదురించు జహాపనా!  // ఈ విశాల ప్రశాంత //

చరణం  1 :
పండు వెన్నెల్లో వెండి కొండల్లే
తాజ్ మహల్ ధవళ కాంతుల్లో.. ఓ..
పండు వెన్నెల్లో వెండి కొండల్లే
తాజ్ మహల్ ధవళ కాంతుల్లో
నిదురించు జహాపనా!
నిదురించు జహాపనా!  // ఈ విశాల ప్రశాంత //

చరణం 2 :
నీ జీవిత జ్యోతి నీ మధురమూర్తి
నీ జీవిత జ్యోతి నీ మధురమూర్తి
ముంతాజ్ సతి సమాధి సమీపాన
ముంతాజ్ సతి సమాధి సమీపాన
నిదురించు జహాపనా  // ఈ విశాల ప్రశాంత //

Monday, April 26, 2010

డౌన్లోడ్ డైలాగ్ బాక్స్

మీరు ఏదైనా పాట కానీ, వీడియో గానీ, ఫైల్ గానీ.. డౌన్లోడ్ కి పెట్టారు అనుకుందాము.. అయ్యేదాకా ఎదురుచూసి ఆతర్వాత ఆ డైలాగ్ బాక్స్ క్లోజ్ చెయ్యాల్సిన్ అవసరం లేదు.. డౌన్లోడ్ చేసేటప్పుడు ఇలా వచ్చిన బాక్స్ లో ఇక్కడ క్లిక్ చేస్తే చాలు.. ఆ ఫైల్ డౌన్లోడ్ ముగియగానే వెంటనే ఈ డైలాగ్ బాక్స్ కూడా మాయమవుతుంది..

Sunday, April 25, 2010

చిన్ని జోక్

చిన్ని జోక్:


ఒక బ్యాంకు ని దొంగలు దోచుకున్నారు.
నగదు అంతా మూట గట్టుకొన్నాక  ఆ దొంగల నాయకుడు ఒక క్లర్కుతో - "మేము దొంగతనం చేస్తుండగా నీవు చూసావా.." అని అడిగాడు.

ఆ క్లర్క్:  " ఆ! చూశాను.." అంటాడు.

వెంటనే ఆ దొంగల నాయకుడు అతన్ని తుపాకీతో కాల్చేస్తాడు.
ఇప్పుడు ఇంకో క్లర్క్ ని అడుగుతాడు "నన్ను చూశావా?.. " అని.

ఆ రెండో క్లర్క్ అంటాడు కదా! " నేను చూడలేదు.. మా ఆవిడ చూసింది.."

Saturday, April 24, 2010

Oke oka maata.. Chakram

చిత్రం: చక్రం
సంగీతం: చక్రి
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: చక్రి
******************************పల్లవి:
ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగా
నా పేరు నీ ప్రేమనీ - నా దారి నీ వలపనీ,
నా చూపు నీ నవ్వనీ - నా ఊపిరే నువ్వనీ
నీకు చెప్పాలని...

ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగా

చరణం 1:
నేను అని లేను అని - చెబితే ఏం చేస్తావు
నమ్మనని నవ్వుకొని - చాల్లే పోమంటావు
నీ మనసులోని ఆశగా - నిలిచేది నేననీ
నీ తనువులోని స్పర్శగా - తగిలేది నేననీ
నీ కంటి మైమరుపులో - నను పోల్చుకుంటానని
తల ఆన్చి నీ గుండెపై - నా పేరు వింటానని
నీకు చెప్పాలని..

ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగా

చరణం 2:
నీ అడుగై నడవడమే - పయనమన్నది పాదం
నిను విడిచి బతకడమే - మరణమన్నది ప్రాణం
నువ్వు రాకముందు జీవితం - గురుతైన లేదనీ!
నిను కలుసుకున్న ఆ క్షణం - నను వదిలిపోదనీ
ప్రతి ఘడియ ఓ జన్మగా - నే గడుపుతున్నాననీ
ఈ మహిమ నీదేననీ - నీకైనా తెలుసా అనీ
నీకు చెప్పాలని..

ఒకే ఒక మాట మదిలోన - దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట పెదవోపలేనంత - తీయంగా
నా పేరు నీ ప్రేమనీ - నా దారి నీ వలపనీ..
నా చూపు నీ నవ్వనీ - నా ఊపిరే నువ్వనీ..
నీకు చెప్పాలని..

ఒకే ఒక మాట మదిలోన - దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట పెదవోపలేనంత - తీయంగా

Friday, April 23, 2010

ప్రేరణ - కృతజ్ఞతలు

నేను ఈ బ్లాగుని వ్యయ, ప్రయాసలకి ఓర్చి, అన్నీ మీకు తెలియచేయడం వెనుక గల అనేకానేక కారణాల్లో ఒక కారణం:

ఒకరు చేసిన ఒక చిన్ని మాట సహాయం వల్ల నా జీవితములో చాలా ఎత్తుకి ఎదిగాను. వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన బాధ్యత నామీద ఉంది. కాని అది ఎలా చెప్పుకోవాలో తెలీక ఆగిపోతున్నాను. మీలో ఎవరైనా తీరుస్తారని ఇదంతా చెప్పటం..

ఖాళీ సమయాల్లో ఏమి చేయ్యాల్లో తోచని నేను టీవీకి అతుక్కపోయేవాడిని. అలా రోజులు గడుస్తూనే ఉన్నాయి.. నేను అలాగే టీవీకి అతుక్కపోసాగాను. సాయంత్రం ఎనిమిదికి మొదలెడితే రాత్రి ఒకటి, రెండూ అయ్యెడిది. ఇలా కాదని ఏదో వేడి నీళ్ళకి చన్నీళ్ళు అన్నట్లు ఉంటుందని ఇంట్లో పెట్టుకొని పని చేసుకునే మెషినరీ వర్క్ చెయ్యాలని నిర్ణయించుకున్నాను. దాని వల్ల ఓ.. అని డబ్బు సంపాదించాలని గాదు.. గాని నాకున్న కొన్ని అహాలు చల్లార్చుకోవాలని / తృప్తి కలగాలని చెయ్యటం. [ఇక్కడ పైన ఇచ్చిన ఇంట్రో కి డైరెక్ట్ గా వెళ్ళొచ్చు.. మిగతా విషయాల్లో మీకు చెప్పాల్సిన / అవసరం వచ్చే (?) కొన్ని సంగతులు ఉన్నాయని అనుకొని సూటిగా, సుత్తి లేకుండా చెప్పలేక పోతున్నాను.]

నాకున్న పని పద్దతులు అంటే: " పాడిందే పాడటం పాచిపళ్ళ దాసరి.." (ఇదొక సామెత) అన్నట్లు చేసినదే చేయటం, ఏదో మామూలుగా చేసి వదిలేయటం, ఏదో మమః అనిపించటం, ఉన్నవాటినే చెయ్యటం, క్రొత్తగా క్రియేటివి ని చూపించక పాతదే చేయటం.. నాకు నచ్చదు. కొద్దిగా పర్ఫెక్షనిస్ట్ ని కాబట్టి, కొద్దిగా ఎప్పటికప్పుడు క్రొత్తదనం ఉండాలని అనుకొని ఆ పనిని ఎంచుకున్నాను. ఆ పనిలో అలాంటి లక్షణం చాలా పుష్కలముగా ఉంది. అందుకే ఆ పని చెయ్యాలని ఎంచుకున్నాను.

అందరూ ఆలాంటి పని అంతా నేర్చుకున్నాక అలా కావలసిన ఎక్విప్మెంట్ కొంటారు. కాని నామీద నాకున్న ఆత్మవిశ్వాసం వల్ల ఏ..మీ రాకున్నా అంటే మెషినరీ ఎలా వాడాలో ఏ..మీ తెలీకుండానే ఖరీదు చేసాను. ఇదే కాదు నేను ఇప్పుడు వాడుతున్న కంప్యూటర్ కూడా అంతే! అదీ ఎలా వాడాలో తెలీకనే కొన్నాను. నేనేమీ పువ్వులేమీ పెట్టడం లేదు.. నిజం. ఈ మాట నా పాత టపాల్లో వ్రాసాను కూడా. అందరిలాగానే ఓ మంచి రోజు చూసి వసంత పంచమి రోజున ప్రారంభించాను. ఆ రోజు ఎలా ప్రారంభించాను అంటే - ముఖ్యమంత్రో , మంత్రో వచ్చి ఎలా ప్రారంభిస్తారో అలా అన్నమాట! కొద్దిరోజులకి మెల్లగా మొదలెట్టాను.. ఏమీరాదు.. ఏమి చెయ్యాలో తెలీదు. అయినా మొదలెట్టాను. తప్పదుగా.. ఇక టీవీ రెగ్యులర్ గా చూసేది అప్పుడప్పుడు కి మారింది. 
 
మొదలైతే పెట్టాను గాని.. అసలు ఏమైనా అర్థం అయితేనా! ఇలాంటివాటికి కోచింగ్ ఇచ్చేవారూ ఉన్నారు.. కాని ఏముందీ పని? అని నామీద నాకే (అతి) విశ్వాసం. అటూ ఇటూ చేసి పని మొదలెట్టాను.. మొట్టమొదటి పని ఘోరముగా విఫలం! ఆ రోజు ఇక నాతో కాదు అని భావనకి రావటం. ఆరోజు మొత్తానికి మూడ్ ఆఫ్ అయిపోవటం.. ఓహ్! తలచుకుంటే నేనేనా.. అని ఇప్పుడు అనిపిస్తుంది కాని అప్పట్లో అయితే అంతే! ఏదీ అర్థం కాదు.. సాయంత్రాలు బయట షికారులు బంద్. ఏదో సాధించేయ్యాలని, ఏదో కుళ్ళబోడిచెయ్యాలని కసి. కొన్ని నెలలు గడిచాయి. బంధుమిత్రులు ఎకసేక్కాలు.. "ఏదో చేస్తానని తెచ్చాడు. రోజూ అగర్బత్తీ ముట్టించటానికి, పూజ కోసం కొన్నాడు.." అని. వారి మాటలు విని ఎన్ని సార్లు మనసులో బాధపడ్డానో!

ఒకసారి బయటవారి పని చేసినప్పుడు చెత్త పని అంటూ వచ్చిన కామెంట్స్ కి కన్నీళ్లు తిరిగాయి. మా ఆవిడ - "ఎందుకంత రంధీ పెట్టుకుంటావు.. నీతో అవుతుంది నాకు తెలుసు.." అని ఓదార్పు చెప్పింది. పని రాక ఈ రంగములో ఓడిపోతానేమోనని అనుకున్న నాకు ఆ మాటలు నాలో పట్టుదలని రగిలించాయి. 
 
అప్పటికే మార్కెట్లో ఇద్దరు ఫుల్ కోచింగుతో, ఫుల్ టైం వర్క్ మొదలెట్టారు. నేనో పార్ట్ టైం అన్నమాట. వారు నాకన్నా చాలా అడ్వాన్సుగా ఉన్నారు. వారు గజ ఈతగాళ్ళయితే నేను ఇప్పుడిప్పుడు ట్యూబులూ కట్టుకొని ఈత నేర్చుకుంటున్న వాడినన్న మాట! నామీద నాకు ఎందుకో ఆత్మవిశ్వాసం.. ఏ రోజుకైనా సాధిస్తానని. అలా మొదలెట్టాను..

తొందర పడకుండా, నెమ్మదిగా అలోచించి, పెర్ఫెక్ట్ గా చెయ్యటమే లక్ష్యముగా పెట్టుకున్నాను. నాకు తెలుసు - ఈ ప్రపంచము అంతా సక్సెస్ మీదే ఆధారపడి ఉందని. ఎప్పుడైతే సక్సెస్ అయ్యామో అప్పుడే మనల్ని కీర్తి, కాంత, కనకం.. అన్నీ వరిస్తాయని. అలా మొదలెట్టాను. ఎంతగా ఇబ్బంది పడ్డా, ఏమైనా దానేమ్మటే పడ్డాను. సూర్య సన్ అఫ్ కృష్ణన్ లో చెప్పినట్లు "ఒకడు దేనికోసమైనా తెగిస్తే వాడికి అది  దొరుకుంది. అది నాకు ఆరోజు అర్థమయ్యింది డాడీ.. " అంటాడు హీరో.  అప్పటికి ఆ సినిమా రాకున్నా నా పని భాష ( దేహ భాష లాగేనే అనుకోండి) అలాగే ఉంది. రాత్రంతా కష్టపడటం.. రోజు రోజుకీ నాలో ఏదో క్రొత్తగా నేర్చుకోవాలి అనేలా లక్ష్యం ఏర్పడటం.. అందులో నా చిన్ని పాప తీరా నేను పని మీద ఉండగానే దగ్గరికి వచ్చి ముద్దు ముద్దుగా "డాడీ! పంకోవా?(పడుకోవా) రావా! పీజ్!(ప్లీజ్)"అనేది. అలా మాట్లాడాక ఏ కన్నతండ్రి మనసు నీరవ్వదు? తనని నా చాతీ మీద పడుకోబెట్టి నిద్రపుచ్చితేనే పడుకునేది. ఎక్కడ తనని వదిలి వెల్లుతానేమోనని నేను వేసుకున్న షర్టుని గట్టిగా పట్టుకోవటం.. ఓహ్! మరవలేను ఆ రాత్రులని.

తనని అన్యమస్కముగానే తను పడుకోగానే పక్కకు దించి, నా పనిని నేను మొదలెట్టడం. రాత్రంతా పని చేసి / నేర్చి తెల్లవారుజ్హామున పడుకోవటం.. ప్రొద్దున్నే శరీరం కట్టేలాగా పట్టేయటం.. ఆఖరికి టాయిలెట్ కి వెళ్ళినా నిలబడే పని కానివ్వాల్సిన అంత నొప్పులు. అయినా భరించాను.. అంతగా శ్రమించాను.. ఫలితముగా మార్కెట్లో బాగా గుర్తింపు. నాలా మిగిలిన ఇద్దరు పని చెయ్యలేక పోయారు. నాకు పోటీగా ఇంకో ముగ్గురు రంగములోకి దిగారు. చెప్పాగా పనితో మమేకము అయి, అంకిత భావముతో పని చేస్తే అది ఎలా సాధించలేము.? రోజు రోజుకీ నన్ను నేను అప్డేట్ చేసుకుంటూ ముందుకి వెళ్లాను.. ఆ క్రమములో చాలా ఎత్తుకి ఎదిగాను. ఎవరినీ పని ఇమ్మని అడగలేదు. ఇప్పటికి కూడా / ఇంతవరకూ ఎవరినీ అడగలేదు. నా పనితనమే నా శత్రువులనీ నా దగ్గరికి రప్పించింది.

నా పోటీదారులకి చేయరాని పనులని నేను అవుట్ సోర్స్ పద్దతిలో చేసివ్వటం స్థాయికి ఎదిగాను. అదీ ఒంటరిగా.. నాలాంటి మెషినరీ ఉన్న వారికి సలహాలు, ఎలా చెయ్యాలో నేర్పించే స్థాయికి ఎదిగాను.. సినిమా కథలాగా ఉందా.. కాని వాస్తవం ఇది.

మార్కెట్లో నా పనికి వంకపెట్టే స్థాయిలో లేకుండా చూసుకున్నాను. నాతో అన్ని పనులూ జరుగుతాయన్న నమ్మకాన్ని తీసుకొచ్చాను. ఇక అసలైన పని అందులో ఒకటుంది. అదే చాలా కష్టం.. ఇప్పటిదాకా చేసినవి ఒకెత్తు. వీటికి కన్నా ఎక్కువ కష్టం దీనిది. అందుకే మొదట్లో నా వల్ల కాదనుకున్నాను. ఆ సెక్షన్ వదిలేసాను.

ఆ తరవాత అదే బాగుంది. అది లేకుండా పని చేస్తే - నేను ఏదైతే అనుకున్నానో అదే - ఆ పనిలో మొనాటనీ వచ్చేస్తున్నది అనుకొని దాని కోసం మళ్ళీ పోరాటం సాగించాను. ఇంతకు ముందు చేసిన పనికి ఇది భిన్నం. ఇప్పుడంటే అలవాటయ్యింది గానీ అప్పట్లో మళ్ళీ విపరీతమైన శ్రమ. అక్కడ అంతా తెలివికీ, చేతి వ్రేళ్ళకే పని. మిగతా దేహం అంతా ఖాళీగా ఉంటుంది.

మొదలెట్టాను అన్నమాటే గాని ఏమీ అర్థమయ్యేది కాదు. ఎలాగో అలాగో కష్టపడి కొద్దిగా నేర్చాను. ఈ పనుల్లో మూడు స్థాయిలు. అవేమిటంటే! - టర్నర్ గ్రూప్ సంస్థ అధిపతి టెడ్ టర్నర్ చెప్పిన కొటేషను (తెలుగులొకి మార్చాను)అది.  
 • అడ్డు తొలగు
 • అనుసరించు
 • అధిగమించు
ఇలా వీటిల్లో మొదటిది అడ్డు తొలగు అనేది. ఇంత దూరం వచ్చాక వదిలేయ్యలేను. చేస్తే మొదట్లోనే వదిలేసేది ఉండేను. ఇక రెండోది. అనుసరించు అనేది. ఇన్ని రోజులూ అలాగే నెట్టుకోచ్చాను. అలా చేసేసరికి ఏదైనా క్రొత్తగా వస్తే నీళ్ళు నమలాల్సిన పరిస్థితి. ముందుకు తప్ప వెనక్కి వెళ్ళలేని పరిస్థితి. ముందుకే సాగాలనుకున్నాను. కానీ వాస్తవం భయంకరముగా ఉంది. ఏమీ అర్థం కావటం లేదు.. ఏమి చెయ్యాలి? ఎలా చెయ్యాలి? ఎప్పుడు చెయ్యాలి?.. ఏమీ తోచనిపరిస్థితి. [ఇక్కడినుండీ ముందు చెప్పిన ఇంట్రో కొనసాగింపు]
 
ఒకసారి ఒకపనిపై ఎదుర్చూస్తున్న నాకు కాస్త సమయం చిక్కటముతో, ఈనాడు దినపత్రిక చూస్తున్నాను. అందులో - వసుంధర పేజిలో ఒక ఇంటర్వ్యూ! ఎవరిదా అని చూసాను. ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి గారి సతీమణి పద్మజా రెడ్డి గారిది. ఆవిడ గారు ఒక సంస్థని నడుపుతున్నారు. అందులోని సాధకబాధల గురించి ఇంటర్వ్యూ చేసారు. ఎందుకులే చదవటం అనుకున్నాను - కాని ఎదురుచూపుల్లో ఉన్న నేను కాలక్షేపం కోసం చదివాను.

అందులో ఒకసారి వాళ్ళ కంపనీ ప్రాబ్లం గురించి చెబుతూ "..మొదట్లో చాలా ప్రాబ్లంస్ ని ఎదురుకున్నాము..కాని అనుభవం లేక పోవటముతో ఎలా ఆ ప్రొబ్లెంస్ ని ఎదురుకోవాలో తెలీదు. అందుకే నష్టాల్లోకి కూరుకపోయాము. ఎలా దీన్ని ఫేస్ చెయ్యాలో అని ఆలోచిస్తే  అప్పుడు  తెలిసింది.. అసలు వర్కర్లకి బేసిక్ నాలెడ్జ్ లేదు.. అలా ఇక్కడి వాతావరణానికి క్రొత్తదైన ఈ పనిని ఎలా చెయ్యాలో తెలీక నష్టాల్లోకి వెళ్ళాము. ఆతర్వాత వారికి మళ్ళీ బేసిక్ నుండి పని నేర్పించటముతో ఇప్పుడు చాలా మార్పు వచ్చింది.."

అది కాజువల్ గా చదివి ఊరుకున్న నాకు తరవాత అందులో - ఇప్పుడు నేను ఎదురుకుంటున్న సమస్యకి పరిష్కారము ఉందనిపించింది. నేనూ బేసిక్ నుండి పని నేర్చుకుంటే? అనిపించింది. ఎన్ని లెక్కలు వేసుకొని చూస్తే అదే సరియైనది అనిపించింది. చూద్దాం! ఇలా చేస్తే పోలా అనుకొని (అపనమ్మకముతోనే) మొదలెట్టాను - బేసిక్స్ మొదలెట్టాను. చిత్రం! కొద్దిరోజుల్లోనే నా సమస్యకి పరిష్కారం దొరికి తీరింది. ఏదైతే కష్టం అనుకున్నానో అదే ఇప్పుడు తేలిక అయ్యింది. చాలా ఈజీగా బేసిక్స్ నేర్చుకున్నాను. సగం కూడా నేర్చుకోలేదు - కాని ఇప్పుడు అందులో కూడా చాలా సక్సెస్ అయ్యాను. నేను ఉంటున్న ఏరియాలో నేనే నంబర్ వన్ ని. నాతో కాని పని అంటూ ఎదీలేకుండా పోయింది.

అలా బాగా సక్సెస్ అయ్యాను. అయినా కళ్ళు నెత్తిమీదకి ఎక్కించుకోలేదు. నాకు పోటీగా ఆ ఐదుగురే కాక ఇంకో ఇద్దరు కూడా వచ్చారు. ఊహు.. వారితో కాలేదు. వారి సమస్య ఏమిటంటే - నాలా బేసిక్స్ లేకపోవటమే! కాని అది వారికి తెలీదు. అది తెలిసి వారూ బేసిక్స్ నేర్చుకుంటే నా పని అంతే! ముమ్మాటికి నిజం అది.

ఇంత కష్టపడ్డందులకి మీకు ఏమొచ్చింది అని మీరు అనొచ్చు. చెప్పాలని లేదు కానీ, అయినా చెబుతున్నాను. రోజూ మూడు గంటలు కష్టపడ్డందులకి - పని రోజుల మొదట్లో ఒక ప్రైవేట్ కార్మికుడి జీతం, మధ్యలో ఇద్దరి స్కూల్ టీచర్ల నెలజీతం, ఆ తరవాత ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీతం.. ఇలా వచ్చింది. (ఇంకం టాక్స్ కూడా కట్టానులెండి. ) ఇంకా వచ్చేదేమోగాని.. చాలా మంది అసూయతో పని మానేశారు.. అయినా డోన్ట్ కేర్. వేరే పని మొదలేడుదామని అనుకుంటున్నా.. అదీ బేసిక్స్ నుండే మొదలెట్టాలి. ఇందులో కూడా ఇంటరెస్ట్ ఉండే దిగుతున్నాను. అదీ పార్ట్ టైమే!

ఇన్నిరోజులుగా ఆవిడ చెప్పిన చిన్ని సమాధానం వల్ల ప్రేరణ పొంది, ఇంతగా అభివృద్ధిలోకి వచ్చాను. కాని ఆవిడకి ప్రతిగా నేను ఏమీ చేయలేకపోయాను. తనకి నేను బాగా ఋణపడిపోయాను. కనుక ఇలాగైనా నేను ఇలా నా బ్లాగు ద్వారా ఆవిడకి, ఈనాడు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.  ఆవిడ స్పీకర్ గారి భార్య కాబట్టి ఆవిడ (చుట్టూ ఉన్న భద్రతావలయాన్ని దాటుకొని ) వద్దకి వెళ్ళలేను. అందుకే ఇక్కడే చెబుతున్నాను.

ఆవిడ చేసిన చేసిన చిన్ని సాయానికి కృతజ్ఞతలు చెప్పుకోవటం నా ధర్మం. మీలో ఎవరికైనా ఆవిడ మెయిల్ ID తెలిస్తే చెప్పండి. నేను ఇదంతా ఆవిడకి చెప్పి కృతజ్ఞతలు తెలియ చేసుకుంటాను. మీకు ఇది సిల్లీ గా అనిపించినా, నవ్వుకున్నా నేను పట్టించుకోను. నా బ్లాగడం నాది. నా తృప్తి నాది.

Tuesday, April 20, 2010

Bommanu geesthe - Bommarillu

చిత్రం : బొమ్మరిల్లు
సంగీతం:దేవిశ్రీ ప్రసాద్
రచన: భాస్కరభట్ల రవికుమార్
గానం: గోపిక పూర్ణిమా, జీన్స్ శ్రీనివాస్
****************************

 

పల్లవి:
బొమ్మను గీస్తే నీలా ఉంది - దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది
సర్లే పాపం అని దగ్గరకెళ్తే - దాని మనసే నీలో ఉందండి
ఆ ముద్దేదో నీకే ఇమ్మంది
సరసాలాడే వయసొచ్చింది - సరదా పడితే తప్పేముంది
ఇవ్వాలని నాకూ ఉంది - కాని సిగ్గే నన్ను ఆపింది
దానికి సమయం వేరే ఉందండి

చరణం 1:
చలిగాలి అంది - చెలికి వొణుకే పుడుతుంది
వెచ్చని కౌగిలిగా - నిన్ను అల్లుకుపొమ్మంది
చలినే తరిమేసే - ఆ కిటుకే తెలుసండీ శ్రమ పడిపోకండి - తమ సాయం వద్దండి
పొమ్మంటావే బాలికా - ఉంటానంటే తోడుగా
అబ్బో యెంత జాలిరా - తమరికి నామీదా
యేం చెయ్యాలమ్మ - నీలో ఏదో దాగుంది నీ వైపే నన్నే లాగింది

చరణం 2:
అందంగా ఉంది - తన వెంటే పదిమంది
పడకుండా చూడు - అని నా మనసంటుంది
తమకే తెలియంది - నా తోడై ఒకటుంది
మరెవరో కాదండి - నా నీడేనండి
నీతో నడిచి దానికి - అలుపొస్తుందే జానకి
హయ్యొ అలక దేనికి? - నా నీడవు నువ్వేగా!
ఈ మాట కోసం - యెన్నాళ్ళుగా వేచుంది
నా మనసు యెన్నో - కలలు కంటుంది

బొమ్మను గీస్తే నీలా ఉంది - దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది
సర్లే పాపం అని దగ్గరకెళ్తే - దాని మనసే నీలో ఉందండి
ఆ ముద్దేదో నీకే ఇమ్మంది -
సరసాలాడే వయసొచ్చింది - సరదా పడితే తప్పేముంది
ఇవ్వాలని నాకూ ఉంది - కాని సిగ్గే నన్ను ఆపింది
దానికి సమయం - వేరే ఉందంది..

Monday, April 19, 2010

Word Verification in Blog

కొంతమంది  బ్లాగర్లు వారి వారి బ్లాగుల్లోకి వచ్చి కామెంట్స్ వ్రాయమంటారు. సరే అని వారి ఆహ్వానాన్ని మన్నించి వారి బ్లాగుల్లోకి వెళతాము కదా. లేదా మనమే ఇతరుల బ్లాగుల్లోకి వెళ్లుతాముగా. వారు వ్రాసినది చదివి.. తీరా కామెంట్ వ్రాసే సమయానికి 6-8 అక్షరాలుండే వర్డ్ వెరిఫికేషన్ అంటూ వస్తుంది. అలా పెట్టకండి. దానివల్ల లాభం ఏమీ లేదు. విజిటర్స్ ఇలా చదివేసి ఆహా, ఒహొ మనసులో అనుకొని, ఇది మనకి పనికొస్తుందా (?) అని ఆలోచిస్తూ వెళ్ళిపోతారు గాని కామెంట్స్ ఏమీ వ్రాయరు. అతి కొద్ది మంది మాత్రం వ్రాస్తారు. ఇలా వ్రాసేవారికి అడ్డం పడ్డట్టు ఆ వర్డ్ వెరిఫికేషన్ వస్తుంది. అదిచూసాక కామెంట్స్ వ్రాసే వారికి ఒక్కోసారి మూడ్ ఉండదు. వ్రాసేవారు సగములోనే డ్రాప్ అవుతారు. నాకైతే మరీనూ! మొన్న ఇలాగే వ్రాయబోయాను. కాని ఈ అష్టవంకర్ల పదాన్ని చూసి  రెండుసార్లు  ఫెయిల్  అయ్యాను. మూడోసారికి వ్రాసేశాను. ఎందుకో  అనీజీగా అనిపించింది. అందుకే ఇదంతా చెప్పటం. అందుకే ఎవరైనా అలా వర్డ్ వెరిఫికేషన్ పెట్టుంటే తీసేయండి. అది ఎలా అంటే:
 • ముందుగా బ్లాగ్ హోం పేజీలోకి వెళ్ళండి.
 • అందులో ఉన్న సెట్టింగ్స్ నొక్కండి.
 • ఆతర్వాత అందులో  Comments  అనే బార్ మీద నొక్కండి.
 • అప్పుడు ఓపెన్ అయ్యే పేజిలో దాదాపు సగము పేజి క్రింద మీకు ఇలా కనపడుతుంది.
 • అందులో Show word verification for comment? అని ఉంటుంది. అక్కడ NO అని ఎంచుకోండి.
 • చివరిగా Save settings 2 ని నొక్కండి అంతే! వర్డ్ వెరిఫికేషన్ తొలగిపోతుంది.
నేనూ మొదట్లో తెలీక పెట్టాను. కామెంట్స్ ఉండేటివి కావు. (నాలా ఎంతమంది ఇబ్బంది పడ్డారో!) ఎవరూ చూడటం లేదోనని నేనూ బ్లాగుని పట్టించుకోలేదు. ఆ తరవాత కొద్దిగా అప్పుడప్పుడూ వ్రాస్తుంటే.. ఒకతను "అలా వర్డ్ వెరిఫికేషన్ తీసేయండి. ఇబ్బందిగా ఉంది" అంటే వెంటనే తీసేసాను. (భాషా రజనీ స్టైల్లో - ఈ కామెంట్స్ వ్రాసేవారు ఒక్కరు చెబితే వందమంది చెప్పినట్లే - అనుకోవాలి) అలా వ్రాస్తుంటేనే బ్లాగర్లకి సంతోషం వేసి "నాబ్లాగుని చాలామంది చూస్తున్నారు.. " అనుకుంటూ ఇంకా మంచి మంచి విషయాలు చెప్పటానికి ప్రయత్నిస్తారు. స్కూల్ పిల్లాడికి నోట్బుక్ లో "Good" అని వ్రాస్తే ఎలా పొంగిపోయి ఇంకా బాగా చదువుతాడో అలాగా అన్నమాట! ఏమైనా మంచి విమర్శలు చేయాలనిపించినప్పుడు, మీకు ఇబ్బంది అనిపిస్తే (పేరు, డిటైల్స్ తెలుస్తాయి అనుకుంటే)  పోస్ట్ బాక్స్ లో టైప్ చేసాక క్రింద Anonymous అని ఉంటుంది అది క్లిక్ చేసి పోస్ట్ చెయ్యండి. ఇదిగో ఇలా:


ఇక్కడ:
 • 1 వద్ద మీ కామెంట్ ని టైప్ చెయ్యండి. సాధారణముగా ఇంగ్లీష్ లో వస్తుంది. తెలుగులో వ్రాయాలంటే తెలుగు లిప్యంతరము లో వ్రాసి కట్ లేదా కాపీ, పేస్ట్ పద్దతిలో ఇక్కడ పెట్టాలి.
 • 2 వద్ద క్లిక్ చెయ్యండి.
 • 3 వద్ద Publish your comment ని నొక్కండి. - అంతే!
 • Email follow-up comments to వద్ద చిన్న బాక్స్ ఉందిగా, ఇది అంతగా ఉపయోగం ఉండదు. అక్కడ క్లిక్ చేస్తే, ఆ పోస్టుకి మీ తరవాత ఎవరైనా కామెంట్స్ వ్రాస్తే వారి కామెంట్స్ మీకు ఈ మెయిల్ రూపములో అందుతాయి. ఒకవేళ మీరు ఏదైనా అభ్యంతకరమైన / మెచ్చుకోలు కామెంట్ పోస్ట్ చేస్తే, ఆ కామెంట్ మీద / పోస్టు మీద ఎవరైనా ఇంకో కామెంట్ వ్రాస్తే.. అది మనకి ఈ మెయిల్ రూపములో అందుతుంది. అలా ఇది ఉపయోగపడుతుందన్నమాట. అంటే  ఆ పోస్ట్ మీద వచ్చే కామెంట్స్ అన్నీ ఆ బ్లాగర్ కి మాత్రమే కాకుండా మీకు కూడా వస్తాయి. ఇదేదో బాగుందని క్లిక్ చేసేరు.. మీ మెయిల్ బాక్స్ వీటితోనే నిండిపోవచ్చు. అయినా మన పనులన్నీ వదిలేసి ఎవరేమి వ్రాస్తున్నారా అని ఎదురుచూడటమే ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త !!

Sunday, April 18, 2010

Emaindo gaani - Nenu meeku telusaa???

చిత్రం: నేను మీకు తెలుసా???
సంగీతం: అచ్చు
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: శ్రీ రాం పార్ధసారధి
********************************

పల్లవి:
ఏమైందో గానీ చూస్తూ చూస్తూ చేజారి వెళ్ళిపోతోంది మనసేలా.
ఏం మాయ వల వేస్తూ వేస్తూ ఏ దారి లాగుతూ ఉందో తననలా..
అదుపులో ఉండదే చెలరేగే చిలిపితనం.
అటు ఇటు చూడదే గాలిలో తేలిపోవడం.
అనుమతి కోరదే పడి లేచే పెంకితనం.
అడిగినా చెప్పదే ఏమిటో అంత అవసరం.
ఏం చేయడం మితిమీరే ఆరాటం. తరుముతూ ఉంది ఎందుకిలా.
// ఏమైందో గానీ చూస్తూ చూస్తూ చేజారి వెళ్ళిపోతోంది మనసెలా.. //

చరణం 1:
తప్పో ఏమో అంటుంది - తప్పదు ఏమో అంటుంది
తడబాటు తేలని నడక - కోరే తీరం ముందుంది
చేరాలంటే - చేరాలి కదా బెదురుతూ నిలబడక
సంకెళ్ళుగా సందేహం బిగిసాక - ప్రయాణం కదలదుగా
కలలా అలాగా మది ఉయ్యాల ఊపే భావం ఏమిటో పోల్చుకో త్వరగా..

చరణం 2:
లోలో ఏదో నిప్పుంది - దాంతో ఏదో ఇబ్బంది
పడతావటే తొలి వయసా - ఇన్నాళ్ళుగా చెప్పంది
నీతో ఏదో చెప్పింది కదా - అది తెలియదా మనసా
చన్నీళ్ళతో చల్లారను కాస్తైనా - సంద్రంలో రగిలే జ్వాల
చినుకంత ముద్దు - తనకందిస్తే చాలు అంతే!
అందిగా అంతేగా తెలుసా..

ఏం మాయ వల వేస్తూ వేస్తూ
ఏ దారి లాగుతూ ఉందో తననలా..
అదుపులో ఉండదే చెలరేగే చిలిపితనం -
అటు ఇటు చూడదే గాలిలో తేలిపోవడం
అనుమతి కోరదే పడి లేచే పెంకితనం
అడిగినా చెప్పదే ఏమిటో అంత అవసరం
ఏం చేయడం మితిమీరే ఆరాటం -
తరుముతూ ఉంది ఎందుకిలా
// ఏమైందో గానీ చుస్తూ చుస్తూ చేజారి వెళ్ళిపోతోంది మనసెలా.. //

నోకియా ఫోన్ కోడ్స్

మీరు నోకియా ఫోన్ వాడుతున్నారా? అయితే కొన్ని మొబైల్ ఫోన్ సాఫ్ట్వేర్ కోడ్స్ ఇప్పుడు మీకు చెబుతాను. 

1. *#0000 # అని మొబైల్ ఫోన్లో టైప్ చేస్తే ఆ  ఫోన్ మోడల్ వెర్షన్ ఏమిటో తెలుస్తుంది. అంటే ఆ మోడల్ ఎన్నో తరం లోనిది, ఆ సాఫ్ట్వేర్ ఎప్పటిదో ఆ తేదీ.. అన్నది మీకు తెలుస్తుంది.

2. *#06#  అని టైప్ చేస్తే మీ మొబైల్ తాలూకు IMIE నంబర్ తెలుస్తుంది. IMIE అంటే International Mobile Equipment Identity అని అర్థం. ప్రతి మోటారు వాహనానికి బాడీ నంబర్, చాసిస్ నంబర్ అంటూ ఎలా ఉంటుందో అలాగే మొబైల్ పరికరానికి కూడా అలాగే ఉంటుంది. ఇది ఎందుకంటే మనం చేసే ప్రతి కాల్ ఈ నంబర్ ని జత చేసుకుంటూ అవతలివారికి వెళుతుంది. ఆపరేటర్స్ కి మాత్రం తెలుస్తుంది. - మీరు మీ మొబైల్ నంబర్తో కాల్ చేసినప్పుడు, సిమ్ నంబర్తో బాటూ మొబైల్ యూనిట్  IMIE వారివద్ద  రిజిస్టర్ అవుతుంది.

3. *#92702689# ఈ నంబర్ నొక్కితే మీ మొబైల్ యూనిట్ యొక్క తయారు తేదీ, IMEI నంబరూ, రిపైర్స్ ఏమైనా ఉన్నాయో ఆ వివరాలు, ఆ మొబైల్ ని ఎన్ని గంటలు వాడామో (అంటే ఇన్ కమింగ్, అవుట్ గోయింగ్ ) ఆ వివరాలు తెలిపే లైఫ్ టైమర్ కూడా ఉంటుంది. లైఫ్ టైమర్ ని మార్చడం వీలుకాదు. కొండకచోట సాఫ్ట్వేర్ కీ తెలిసినవారు మారుస్తారు.

4. *#7370#  ఈ కోడ్ నొక్కితే మీ ఫోన్ ఫాక్టరీ సెట్టింగులలోకి వెళుతుంది. అంటే ఆ ఫోన్ తయారు చేరుసాక మార్కెట్లోకి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంటే మీ సిమ్ లోని నంబర్లతో బాటూ మీ మెస్సేజ్ బాక్స్ , కాల్ డిటైల్స్ అన్నీ డెలీట్ అవుతాయి.. మీరు మార్చుకున్న సెట్టింగులన్నీ అన్నీ పోయి - మీరు కొన్నప్పుడు ఎలా ఉంటుందో అలా మారిపోతుంది.

5. 12345 ఇది కూడా పైన లాగానే పని చేస్తుంది. దీన్ని మనం సెట్టింగులలోకి వెళ్లి, restore factory settings అన్న దాంట్లోకి వెళ్ళితే కోడ్ అడుగుతుంది. ఈ నంబర్ ని నొక్కితే మనం కొన్నప్పుడు ఎలా ఉంటుందో అలాగే  మారిపోతుంది.  అలాగే  కాల్  టైమర్స్ ని కూడా 00:00.00 గా చేసుకోవచ్చు. బయట ఫోన్ ఎంత దుమ్ముగా ఉన్ననూ లోపల కాల్ టైమర్స్ లాగ్ చూస్తే క్రోత్తఫోన్ లా ఏదో కొద్ది గంటలు మాత్రమే వాడాము అన్నట్లు చూపించుకోవచ్చు. దీన్ని ఇంకో రకముగా కూడా వాడొచ్చు. ఎలా అంటే: ప్రతినెల మొదటి తారీఖున ఇలా అన్నీ జీరోలు చేసుకుంటే.. నెల చివరి రోజున మనం ఎన్ని నిముషాలు డయల్ కాల్స్   చేసాము, ఎన్ని నిముషాల ఇన్కమింగ్ కాల్స్ విన్నాము, మొత్తం ఎన్ని నిముషాలపాటు చెవిదగ్గర ఉంచుకున్నమో తెలుస్తుంది.

6. *(కాల్ బటన్)3 ఈ మూడు బటన్స్ ని ఒత్తిపట్టుకొని, మీ మోబిల్ స్విచ్ ఆన్ చేస్తే మీ మొబైల్ ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ మళ్ళీ కొత్తగా మారుతుంది. అంటే ఫాక్టరీ సెట్టింగ్స్, ఫోన్ మెమొరీ ని పూర్తిగా క్రొత్తగా ఫార్మాట్ చేస్తుంది. ఈ పద్ధతి వైరస్ అంటిన ఫోన్లకి చాలా అనువైనది.

7. *#3370#  ఈ కోడ్ నొక్కితే రెండు సిమ్ లు వాడుతున్నట్లయితే స్వాప్ చేసుకోవచ్చు. అంటే సిమ్ 1 లో ఉన్నది సిమ్ 2 లోకి, అలాగే సిమ్ 2 లో ఉన్నది సిమ్ 1 లోకి  మారుతుందన్నమాట. ఇది అన్ని మొబైల్స్ లో ఉండదు. కొన్నింట్లోనే ఉంటుంది.

Friday, April 16, 2010

యూ-ట్యూబ్ వీడియో - నాది మీరే కాపీ చేసారు

మొన్న నా యూ-ట్యూబ్ అక్కౌంట్ కి ఒక మెయిల్ వచ్చింది. ఏమిటా అని ఓపెన్ చేసి చూసాను. ఒకతను నేను పెట్టిన వీడియో అతనిది అని అతని బాధ. నాకు నవ్వొచ్చింది. అసలు ఏమిజరిగిందో చెబుతాను - ఆతర్వాత మీకే తెలుస్తుంది.

మా టీవీలో ఐడియా సూపర్ సింగర్స్ ప్రోగ్రాం లో నా ఆర్కుట్ మిత్రురాలు పాల్గొన్న కార్యక్రమం వచ్చింది. ఆ విషయం తను నాకు చెప్పింది. ఎలాగూ నా సిస్టం కి ఇన్ బిల్ట్ టీవీ ట్యూనర్ ఉంది కాబట్టి ఆ ప్రోగ్రాం ని రికార్డు చేసి ఆమెకీ సర్ప్రైస్ చేసినట్లుగా ఆవిడ రికార్డు పంపుదామని అనుకున్నాను. ఆవిడ ప్రోగ్రాం వచ్చింది.. చూస్తూ రికార్డ్ కూడా చేసాను. అలాగే ఆరోజే - న్యాయనిర్ణేతలుగా చంద్రబోసు గారూ, భాస్కర భట్ల రవికుమార్ గారూ ఉన్నారు. ఆ ప్రోగ్రాం లో మధుప్రియ (గోదావరిఖని) అనే అమ్మాయి పాడిన "ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని.." అనే పాట కూడా వచ్చింది. అదీ రికార్డ్ చేసాను. ఆ పాటని చాలా రోజులుగా నా సిస్టమ్ లోనే ఉండిపోయింది.

అప్పటికే నాకు యు-ట్యూబ్ లో నా అక్కౌంట్ ఉంది. అందులో ఒక్క వీడియో కూడా పెట్టలేదు. చాలా రొజూ ఖాళీగా ఉంచాను. టీవీ ప్రోగ్రాం లు పెట్టొద్దు అనే నిబంధన చూసి ఏవీ టీవీ ప్రోగ్రామ్లు అందులో పెట్టలేదు. అందులో ఒక వీడియో కోసం వెదుకుతుండగా ఈ " ఆడపిల్లనమ్మా.." అనే పాట కూడా కనిపించింది. కాని అది క్లారిటీగా లేదు. నా దగ్గర ఉందిగా నాదగ్గర ఉంచుకుంటే లాభం ఏముంటుంది అని ఆ క్లారిటీ వీడియోని వీలు చూసుకొని యు-ట్యూబ్ లోకి ఎక్కించాను. అలా పెట్టిన వీడియో కి రాను రాను హిట్స్ పెరగసాగాయి. దాన్ని ఇంకా మంచి ప్రజెంటేషన్ చేస్తే ఎలా ఉంటుంది అనుకొని వీలున్నప్పుడల్లా చాలా బాగా దాని గురించిన మిగతా విషయాలు పెట్టసాగాను. ఆ 2: 39 నిముషాల వీడియోకి ఇప్పటికి ముప్పై వేలకి పైగా హిట్స్ ఉన్నాయి.  అదలా ఉంటే - ఇక అసలు సంగతికి వద్దాం!

మొన్న ఒక మెయిల్ వచ్చింది. యు-ట్యూబ్ వారు దాన్ని ఎండార్స్ చేసారు. మామూలుగా ఉండే మెచ్చుకోలు కామెంట్ కావచ్చని యధాలాపముగా ఓపెన్ చేశా. కాని షాక్!  ఆ మెయిల్లో అతను - ఆ వీడియో నాది అని గోల. నాకైతే నిజముగా నవ్వొచ్చింది. నిజానికి అది మా టీవీ వారి వీడియో. బాగుందని అందరూ చూడాలని ఆ అమ్మాయి టాలెంట్ పదిమందికి తెలియాలని పెట్టాను. ఇంకా ఆ పాట సాహిత్యం కూడా తెలుగులో వ్రాసి అక్కడే పోస్ట్ చేసాను. అలాగే టాగ్స్ అంటే ఏమిటో తెలీని నేను అవేమిటో తెలుసుకొని మరీ పెట్టాను. అలాంటి వీడియో ని మనోడు కాపీచేసి నాది అని అతని యు-ట్యూబ్ అకౌంట్ లోకి మార్చుకున్నాడు. మార్చుకోనీ.. ఏమీ బాధలేదు. "నాది అంటూ మీరే కాపీ చేసారు.." అంటూ నన్ను అనడమే వింతగా ఉంది. పోనీ అతని వీడియో చూసాను. సేం టూ సేం నాదే! నేను వ్రాసిన పదాలూ, కామాలూ, ఫుల్ స్టాపులూ.. అన్నీ సేం టూ సేం!  ఆఖరికి లిరిక్ కూడా.. అతని యు-ట్యూబ్ ఎకౌంటు లో అదొక్కటే వీడియో ఉంది. నేను వ్రాసిన పదాలూ, అప్లోడ్ చేసిన వీడియో ఇంకా నావద్దె ఉన్నాయి.. ఇలా కాపీ చేసి నాదే అనిపించుకోవటం ఒకరకముగా పోనీ అనుకున్నా, ఒరిజినల్ గా పెట్టిన వారిని ఇలా కాపీ చేసావు అనడం ఏమీ బాగో లేదు.  ఎంతైనా కలికాలం..

Wednesday, April 14, 2010

మీకు మానవత్వం ఉంటే ఈ మెయిల్ ని..

మీకు ఎప్పుడైనా

"ఈ ముద్దుల పాప [ఫోటో] అనారోగ్యముగా ఉంది.. ఈమెకి కిడ్నీ ఫెయిల్యూర్, ఆపరేషను కి ఆరు లక్షలు కావాలి..  అన్ని సైటులు ఒప్పుకున్నాయి.. మీరు చెయ్యాల్సినదల్లా ఈ మెయిల్ ని ఫార్వార్డ్ చెయ్యండి.. అలా చేస్తే ఆ పాప కి ఆ సైట్లవారు ఒక్కో ఫార్వార్డ్ కి పది పైసలవంతున వస్తుంది. మీకు మానవత్వం ఉంటే ఈ మెయిల్ ని దయచేసి ఫార్వార్డ్ చెయ్యండి"

అని ఉంటుంది. ఆ మెయిల్ ని మనకు మానవత్వం ఉన్నదని అనిపించుకోవటానికి ఆ మెయిల్ ని ఫార్వార్డ్ చేస్తాము.. సాధారణముగా ఇలాంటి "విజ్ఞప్తులు" మెయిల్ ID లకి వస్తాయి. నిజానికి ఇలాంటి మెయిల్స్ (దాదాపు) అన్నీ వట్టి (ఫేక్) విజ్ఞప్తులే. ఎక్కడా అసలు వారు అంటే - అలాంటి పాపలు కాన్సరుతో ఉండరు. వారికి అలాంటి జబ్బులూ ఉండవు. వీరి "కష్టాన్ని" చూసి అన్ని సైట్లూ అలా పది పైసలు ఇస్తామని అంగీకారం తెలపవు. వారికేమి లాభం! అలా చేస్తే. ఆ మధ్య గూగుల్ వాడే ప్రకటించాడు - ఇలాంటివి నమ్మొద్దని, అవన్నీ అబద్ధాలేనని. సరే ఆ సంగతి అలా ఉంచుదాం!

ఒకసారి ఈ మెయిళ్ళని ఒకసారి బాగా పరిశీలించండి. అసలు ఆ పాప ఏ దేశానికి చెందినది? తల్లి తండ్రులు ఎవరు? వారు ఏ ఊర్లో ఉంటారు? వాళ్ళు ఇప్పుడు ఏ హాస్పిటల్ లో ఉన్నారు? వారికి సాయం చెయ్యాలనుకుంటే వారి మెయిల్ ID గానీ, ఫోన్ నంబర్ కానీ, అడ్డ్రెస్ కానీ, హాస్పిటల్ అడ్రెస్ కానీ, డాక్టర్ ఫోన్ నంబర్ గానీ, వారు ఎక్కడ ఉంటారో ఆ అడ్రెస్ కానీ లేవే! అసలు పాపకి వచ్చిన జబ్బు గురించిన డిటైల్డ్ వివరాలు ఏవీ ఆ మెయిల్ లో ఉండవు. నిజమే అయితే అలా పెట్టడానికి ఏమి ఇబ్బంది.?  విరాళాలు పంపేవాళ్ళు వెంటనే ఆ నంబర్స్ కి ఫోన్ చేసి నిజమని తెలుసుకొని ఇంకా గొప్పగా సాయం చేస్తారుగా! ఈ మధ్య టీవీ ఛానల్స్ లలో కూడా ఇలాంటివి బాగానే చూపుతున్నారు. అలా చూపినప్పుడు ఎంత రెస్పాన్సు వస్తుందో అందరికీ తెలిసిన విషయమే! ఇలా  పది పైసలు ప్లాను ఎందుకు? కిడ్నీ మార్పిడి ఒక్కో ప్రదేశములో ఒక్కో రేటు అవుతుంది. అమెరికాలో నైతే భాగా ఎక్కువ గానూ, ఇండియా లో నైతే ముంబై లో ఒక రేటు.. హైదరాబాద్ లో ఒకరేటు, వైజాగ్ లో ఇంకో రేటు, అనకాపల్లిలో మరొక రేటు లో జరుగుతుంది. వారు ఎక్కడ మారుస్తారో చెప్పనప్పుడు ఎంత ఖచ్చితముగా ఆరు లక్షలు అంటే ఎలా నమ్మాలి? సరే అదంతా పోనీయండి. ఇక అసలు సంగతికి వస్తే..

నేనూ మొదట్లో నమ్మాను.. ఆ తరవాత తెలిసింది - అవన్నీ (దాదాపు) అబద్దమే అని. మెయిల్ ID కి ఇలాంటివి ఫోటోతో (వేరేవారివి ఫోటో) సహా పంపుతారు. అందుల్లోనే మాల్వేర్ని ఆడ్ చేస్తారు! JPEG ఫోటోలో ఇలా పెట్టడం చాలా తేలిక. దాన్ని మన మెయిల్ బాక్స్ లో ఉంచుకుంటే మనవన్నీ రహస్యాలు అది నెట్ ద్వారా అవతలి వ్యక్తికి చేరేస్తాయి. ఫార్వార్డ్ చేస్తే అన్ని మెయిల్స్ ID లు హోల్ సెల్ గా ( భూమి గుండ్రముగా ఉండును - అన్నట్లు ) వారికి అందుతాయి. ఇక అప్పుడు స్పామ్ మెయిల్స్ మొదలవుతాయి.. మీకొచ్చే మెయిల్ బాక్స్ లో మీకు కావాల్సిన మెయిల్స్ చెక్ చేసుకోవాలంటే - చచ్చేంత విసుగు వచ్చేలా వందల సంఖ్యలో ఉంటాయి. మీకు అవసరమయ్యే మెయిల్స్ వీటి మధ్యలో ఎక్కడో ఉంటుంది. విసుగొచ్చి డెలీట్ చేస్తే అదీ పోతుంది. అది ఎలాంటిదో తెలీక (జీవితాన్ని మలుపు త్రిప్పే - ఉద్యోగములో జాయిన్ అవమనే మెయిల్ ఉంటే) అదీ గోవిందా.. అప్పుడు మన జిందగీ బర్బాద్.. ఆ పాపకి సాయం ఏమిటో కాని మనం కూడా తరవాతి జీవితానికి అలా డబ్బులకి అడుక్కోవాల్సి ఉంటుంది. మీకు ఇంకో కోణం తెలుసా.. ఆ మధ్య ఒక నైజీరియన్ ని హైదరాబాద్ లో కోటిన్నర రూపాయల ఫ్రాడ్ కేసులో సైబర్ పోలీస్ పట్టితే అతని వద్ద ఐదు వేలకి పైగా ఈమెయిలు ID లు దొరికాయి. ( బహుశా అందులో నాదీ ఉండి ఉండొచ్చు..)

ఇంతగా ఎలా చెబుతున్నా! అని మీ సందేహం అయితే - నేనూ అలాంటి బాధితున్నే! వారానికి నా జిమెయిల్ ID కి 70 కి పైగా అబద్ధాల స్పాం మెయిల్స్ వస్తున్నాయి.. అందులో ఒకొక్కటి చూస్తూ డిలీట్ చేయాల్సివస్తున్నది.. ఎంత సమయం వృధానో చూడండి. ఒక చిన్ని ఫార్వార్డ్ ఎంత కష్టాన్ని తెస్తుందో.. అందుకే అలాంటివాటి గురించి పట్టించుకోకండి.. వివరాలు అన్నీ ఉండి, నమ్మదగినది అని అనిపించినప్పుడు మాత్రమే - ఫార్వార్డ్  చేయండి.  - ఇలా చెప్పానని ఏమీ అనుకోకండి. నా అనుభవం చెప్పాను..

తాజాకలము:  ఇలా మెయిల్స్ వచ్చినప్పుడు: అందులో ఇలా సహాయం చేయమని లేదా ఈ దేవుడి / దేవత ఫోటోని మీ మిత్రులకి 10 మందికి పంపు.. నీవు అనుకున్న కోరిక నెరవేరుతుంది అని ఉంటుంది. అలా వాటిని పంపడములో ముఖ్యలక్ష్యము ఏమిటంటే ఇ-మెయిల్స్ ID లని సంపాదించడం! అలా సేకరించటానికి అలా దేవుళ్ళ / దేవతల ఫొటోస్ పెడతారు. లేదా మంచం మీదున్న పాపల ఫొటోస్ పంపుతారు. తెలీక అలా పంపిన ఇ-మెయిల్ ని మన మెయిల్ లిస్టులోని అందరినీ ఆడ్ చేస్తూ అందరికీ ఫార్వార్డ్ చేస్తుంటారు. (అందరికీ ఇ-మెయిల్ పంపటానికి స్టాంపులంటూ, SMS అంటూ ఏమైనా డబ్బుల ఖర్చు ఏమీ లేదుగా ) చివరికి అటు తిరిగి ఇటు తిరిగి (మొబైల్ లో ఉండే పాము ఆట గురించి తెలుసుగా.. అన్నిటినీ మింగుతూ పెద్దగా అవుతుంది అలాగే ఇదీ) చివరకు మొదట పంపినవాడిని చేరుతుంది. కావాలంటే ఈ క్రింది ఫోటో చూడండి. సరిగా కనపడకుంటే ఫోటో మీద నొక్కండి. ఫోటో లోని ఇ-మెయిల్ ID లన్నిటినీ కనపడకుండా చేశాను. వారి ఫోన్ నంబర్స్ కూడా..అన్ని మెయిల్ అడ్రస్లు ఉన్న ఈ ఫోటో లో A నుండి H వరకే ఉంటే - మొత్తం మెయిల్స్ ID లు ఎంత పొడవు దూరం వరకూ ఉన్నాయో ఊహించండి. అందులో అల్ఫాబెటికల్ ఆర్డర్లో H వరకు మాత్రమే ఉన్నాయి. ఇక I నుండి Z వరకి ఉన్న ఈ-మెయిల్ IDలు ఎన్ని ఉంటాయో ఊహించండి. అది సరే! ఇలా సేకరించిన వాడికి ఏమి లాభం అనుకుంటున్నారా? కోటివిద్యలూ కూటికోసమే అన్నట్లు - ఇదో క్రొత్త బిజినెస్. ఇలా, అలాగే  ఎక్జిబిషన్ దగ్గర ఫోన్ నంబర్స్ సేకరించి కొన్ని మార్కెటింగ్ సంస్థలకి ఒక్కో అడ్రెస్ కి రెండురూపాయలకు అమ్ముకుంటారు. ఈ విషయం అబద్దం కాదు నిజమే! ఆ మధ్య ఈనాడు దినపత్రికలో చదివాను. ఆ మార్కెటింగ్ సంస్థలు అడ్రెస్లూ, ఫోన్ నంబర్లూ, ఈ-మెయిల్ ID లూ  తీసుకొని... వారి మార్కెట్ చేసుకుంటాయి. నాకీమధ్య రియల్ ఎస్టేటు, క్లబ్బుల, భీమా సంస్థల నుండి ఆఫర్లు వస్తే ఎలా తెలుసబ్బా అని పరిశోధిస్తే ఇవన్నీ తెలిసాయి. 

Tuesday, April 13, 2010

కొన్ని ఎక్సర్సైజులు

ఇప్పుడు మీకు కొన్ని ఎక్సర్సైజులు చూపిస్తాను.. నేర్చుకోండి. చాలా సులభమైనవి అవి.. చూడండి.. నేర్చుకోండి ఆరోగ్యముగా ఉండండి 


ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి.. డౌన్లోడ్ చేసుకొని చూసి, నేర్చుకొని ఆరోగ్యముగా ఉండండి. ఇది నా పుట్టినరోజుకి (16)  మీకిస్తున్న చిరుకానుక అనుకోండి. ఇంకోటి కూడా త్వరలో ఇస్తాను..

డౌన్లోడ్ కొరకు లింక్: Diet Exercises  
సైజ్: 1 .63 MB
ఇది winrar పద్దతిలో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్నాక ఫైల్స్ ని ఎక్స్ట్రాక్ట్ (extract) చేసుకోవాలి. ఇందుకు ఇదే బ్లాగులోని winrar (అప్లోడ్ & డౌన్లోడ్) ని ఒక సారి చూడండి. 

బ్లాగుని తెలుగులో వ్రాయాలనుకుంటే..

బ్లాగుని తెలుగులో వ్రాయాలనుకుంటే మీరు ఇలా చెయ్యండి.

ముందుగా మీ బ్లాగుని తెరచి, Settings ని నొక్కండి. అందులో క్రింది వైపున Global Settings 1ఇలా ఉంటుంది..


2. ఇందులో ఉన్న మొదటిది: select post editor :: ఇందులో మీరు మొదటిది అయిన Updated editor ని ఎన్నుకోండి. ఇది  Old editor కన్నా బాగుంటుంది. 

ఇక రెండోది అయిన Enable Transliteration :  మొదటి గడిలో Enable 3 ఎంచుకొని, రెండో గడిలో Telugu 4 ని ఎంచుకోండి. ఆతర్వాత Save Settingsని నొక్కండి. 

ఇక ఇప్పుడు బ్లాగు హోం పేజి తెరచి, అందులోని ఇలా ఉన్న టూల్ బార్ లో  అన్న అక్షరం వద్ద ఉన్న చిన్న త్రికోణాన్ని నొక్కండి. అప్పుడు ఇలా వస్తుంది. 


ఇందులో తెలుగు ని ఎంచుకొని వ్రాసేసేయండి. ఇక akkada ilaa roman engleeshulo vraasthoo spes baar nokkagaane తెలుగులోకి మారుతుంది.. 

మీకు శుభం కలుగు గాక!

Monday, April 12, 2010

జిమెయిల్ లో మెసేజ్ బాడీలో ఫోటోని అప్లోడ్ చెయ్యటం

మీరు జిమెయిల్ వాడుతుంటారా? అందులో మీరు ఎవరికైనా మెయిల్ చేసేటప్పుడు ఫొటోస్ ని మీరు అటాచ్ మెంట్ రూపములోనే పంపుతున్నారా? మెసేజ్ బాడీ లో పంపుటలేదా?.. అదెలా వీలవుతుంది?
"అలా పంపటం వీలుకాదే.." అని అనుకుంటున్నారా?..
అలాని అధైర్యపడాల్సిన అవసరం లేదు.. ఐయాం హియర్.. యు డోన్ట్ ఫియర్!! నేనున్నానుగా..

ఇలా చెయ్యండి.. :  

1. ముందుగా మీరు జిమెయిల్ ఓపెన్ చేసి అందులో సెట్టింగ్స్ ని నొక్కండి.

2. సెట్టింగ్స్ పేజి ఓపెన్ అయ్యాక మీరు అందులోని హెడర్ లో Labs కి వెళ్ళండి.


3. లాబ్స్ లో అన్ని రకాల ఆడాన్ లు ఉంటాయి. అందులో Insert Image అని ఒక ఆప్షన్ ఇలా క్రింది ఫోటోలోలా ఉంటుంది. దాంట్లో ప్రక్కన ఉన్న గడిలో Enable అన్న ప్రక్కన ఉన్న వృత్తములో ఓకే చెయ్యండి.

4. ఇప్పుడు మీరు Save Changes ని నొక్కండి.

5. ఇప్పుడు Compose Mail ని ఓపెన్ చెయ్యండి. అందులో ఇలా కనిపిస్తుంది.

6. ఇప్పుడు ఆ Image tool నొక్కి ఏదైనా ఫోటో మెస్సేజ్ బాడీ లో అప్లోడ్ చెయ్యొచ్చు.. ఆ ఇమేజ్ టూల్ ని నొక్కితే ఇలా ఒక బాక్స్ వస్తుంది. అందులోని Browse ని నొక్కి మీరు ఏ ఫోటో పెట్టాలనుకుంటున్నారో  అది అప్లోడ్ చెయ్యండి చాలు.. అంతే!.

Thursday, April 8, 2010

స్కానర్ వల్ల మీ పిల్లలకి మీరే ఇవ్వగలిగే అందమైన కానుక

మొన్నీమధ్య స్కానర్ కొందామని కంప్యూటర్ షాప్ కి వెళ్లాను. నిజానికి నాకు స్కానర్ వల్ల పెద్దగా ఏమీ ఉపయోగం ఉండదు.. కాని ఒక చిన్ని సరదాకోసం కొనాలని అనుకున్నాను. అదేమిటంటే -  మీ పిల్లలకి మీరే ఇవ్వగలిగే అందమైన కానుక.  అనే టపాకి  కొనసాగింపుగా ఆ స్కానర్ కొందామని వెళ్లాను. ఆ షాప్ అతను కాస్త తెలిసిన వాడవటం తో ఎప్పుడూ అక్కడికే వెళతాను. అతను నాకు రెండు మోడల్స్  చూపించాడు.  ఒకటేమో - HP కంపనీది. ఇది 1200 * 1200 రిజల్యూషన్ లో స్కాన్ చేస్తుందంట. ఇంకో మోడల్ ఏమో - చైనా తయారీ. ఇదే అప్పుడు లేటెస్టుగా మార్కెట్లోకి వచ్చిందంట! .. ఇది మాత్రం 1200 * 4800 రిజల్యూషన్ తో స్కాన్ చేస్తుందంట. దీని రేటేమో మూడువేల రెండొందలు రూపాయలు మాత్రమే! రెండూ దాదాపు ఒకటే రేటు. దీన్నే తీసుకోమని ఆ షాప్ అతను చెప్పాడు. తీసుకుందామని నిర్ణయించుకున్నాను.. కాని ఒక్క విషయం వద్ద ఆగిపోయాను. ఆ HP మోడల్ ఏమో విండోస్ XP మీద పనిచేస్తుంది. ఈ చైనా స్కానర్ మాత్రం XP మీదనే కాకుండా విండోస్ 7 మీదకూడా పనిచేస్తుందంట! గ్యారంటీ ఒక సంవత్సరం ఎక్కువగానే అంటే - 2 సంవత్సరాల గ్యారంటీ ఉంది. కాని ఎందుకో అంతరాత్మ ఆగమంది. నేను గమనించిన విషయాల్లో నా అంతరాత్మ చెప్పింది చాలా వరకు నిజమయ్యాయి. కొద్దిరోజులు ఆగితే ఇంకా మంచి క్లారిటీ గల స్కానర్, మంచి బ్రాండ్ లో అదే రేటులో వస్తుందని అనిపించి - అలాగే నేనిప్పుడు XP వాడుతున్నాను, త్వరలోనే విండోస్ 7 కి మారాలని అనుకుంటున్నాను. అలా మారాక తీసుకుందామని అందుకే కొనక వాపస్ వచ్చేశాను.

నిజానికి నాకు ఆ స్కానర్ వల్ల ఎక్కువ అవసరం ఉండదు. ఇప్పుడు కొంటున్న కారణం కూడా ఏమిటంటే - మా పిల్లల చేతి వ్రాతలూ, వారు వేసే పిచ్చి / అందమైన బొమ్మలూ, వారి నోట్సూ, స్కూల్ రిపోర్ట్స్, పరీక్ష పేపర్ల సమాధాన పత్రాలనీ.. ఇలా అన్నీ స్కాన్ చేసి ఒక DVD లోకి నింపుదామని. వారు పెద్దయ్యాక వారి చిన్నప్పటి చేతివ్రాతలూ, బొమ్మలూ చూసి ఆనందిస్తారని - అనుకొని ఈపనిలోకి దిగటం. నిజానికి ఇలా స్కాన్ చేసి దాన్ని సిస్టమ్ లోకి ఎక్కించటం, ఆ ఫోటోని ఒక ఫోల్డర్ లోకి వెయ్యటం, ఆ ఫోటో గురించి డిటైల్స్ వ్రాయటం.. అబ్బో! చాలా పని ఉంటుందని తెలుసు.. కాని తప్పదుగా.. నా పిల్లల అనుభూతులని నేనేగా పదిలముగా దాచి ఉంచి, తిరిగి ఇచ్చేది! ఇష్టమైన పనిని చేస్తే ఎంత కష్టమైనా చాలా ఈజీగా అనిపిస్తుంది. అందుకే వారికోసం చేయబోతున్నాను. నిజానికి ఈ ఆలోచన నాకీమధ్యే వచ్చింది. అదెలా అంటే:

ఆర్కుట్ లోని ఒక మిత్రురాలు తన చిన్నప్పటి తన అందమైన చేతివ్రాతనీ, పెన్సిల్ తో వేసిన బొమ్మలనీ, స్కెచ్చులతో వేసిన అందమైన బొమ్మలూ, వాటర్ కలర్స్ ఉపయోగించిన  పెయింటింగులను  పెట్టారు. నాకెందుకో ఆ కాన్సెప్ట్ బాగా నచ్చింది. నావి అలా (తెలీక) దాచుకోలేక పోయాను. నావి సరే.. సగం జిందగీ గడిచిపోయింది.. వారివన్నా అలా DVD లో దాచుదామని ఆలోచనతో ఈ స్కానర్ కొనాలన్న ఆలోచన. బహుశా నేను ఆ స్కానర్ ఈ సంవత్సరములో జూన్ నెలలో కొంటానేమో. అప్పుడే ఎందుకు అంటే! - అప్పుడు నాకూ కాస్త సమయం వీలు ఉంటుంది. కొన్నాక వారివి అన్నీ స్కాన్ చేసి DVD లో దాచుతాను. పిల్లల బొమ్మలు చూస్తుంటే నవ్వొస్తున్నది.. ఆ నవ్వులు కలకాలం నిలవాలన్నది నా ఈ చిన్ని ప్రయత్నం. అలాంటి వాటిల్లో ఒక "అద్భుత సృష్టిని" ఇక్కడ మీకు చూపుతాను.. ఇది LKG తరగతి లో వేసినది. అప్పుడు వేసిన దానిని ఇన్ని సంవత్సరాలు కాపాడాను. ఒకవేళ నేను, వారు పెద్దయ్యాక అందించేలోగా చెదలు పట్టి పాడయితే! తేమ వల్ల చెడిపోతే.? అందుకే వారి కోసం స్కానర్ ని కొనబోతున్నాను. అలాగే స్కానర్ వల్ల ఇంకో అద్బుత ఆలోచన కూడా వచ్చింది. చాలా మందికి ఉపయోగపడే విషయం అది. దానికో బ్లాగు పెట్టి అందులో పోస్ట్ చేస్తాను. ఆ వివరాలు వీలైనంత తొందరలో చెబుతాను.


Tuesday, April 6, 2010

శ్రీమన్నారాయణ నారాయణ హరీ హరీ!

భక్తి పూర్వకమైన ఈ రింగ్ టోన్ ని డౌన్లోడ్ చేసుకోండి. గంభీరమైన స్వరముతో ఉండే ఈ రింగ్ టోన్ చాలా మానసిక ప్రశాంతతని కలుగజేస్తుంది.

డౌన్లోడ్ కొరకు ఈ లింక్ ని నొక్కండి:  శ్రీమన్నారాయణ నారాయణ హరీ హరీ!     
సైజు: 774 KB
సమయం:  49 సెకనులు

Just Dial service

మీరు భారతదేశములో

మీరున్న ఊర్లో గానీ, వేరే ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికైనా పర్యాటక ప్రదేశానికి వెళ్ళినప్పుడో, ఆఫీస్ పనిమీద వేరే నగరానికి వేల్లాల్సివచ్చినప్పుడో, లేదా ఊరుకాని ఊరులో మీకు అత్యవసరముగా :

కంపనీ,
వస్తువుల తయారీ గురించి,
సేవల రంగం,
హాస్పిటల్,
సినిమా టాకీస్,
బ్యాంక్,
అన్ని విద్యాసంస్థల,
ప్రభుత్వ కార్యాలయాల,
RTC బస్ స్టాండ్,
రైల్వే స్టాండ్,
విమానాశ్రయం,
పూల గుచ్చాల విక్రేత,
టూరిస్టు గైడు,
టాక్సీ ఏజంటు,
మంచి సౌకర్యాల వసతి గృహాలు,
భీమా కార్యాలయాలు,
భీమా ఏజంట్లు,
జేవేల్లరీ షాపులూ,
సూపెర్ మార్కెట్స్,
బట్టల కొట్లూ..
వైద్యులూ,
బ్యూటిషియన్స్,
...
...
...
ఆఖరికి శ్మశాన వాటికల (లభ్యత ఉంటే)
ఇలా ఎవరిదైనా అడ్రెస్ & ఫోన్ నంబర్ కావాలా? మీరేమీ గాభరా పడాల్సిన అవసరం లేదు. సింపుల్ గా మీరు నెట్ ఓపెన్ చేసి http://www.justdial.com/  అని లాగిన్ అవ్వడమే..
మీకు భారతదేశములో 240 పైగా నగరాలలోని మీకు యే వివరాన్నైనా చిటికెలో అందిస్తుంది. ఒకవేళ మీరు నెట్ దూరముగా ఎక్కడో ఉన్నారే అనుకుందాము. వీరిని ఫోన్ లో కూడా సంప్రదించొచ్చు. అదెలాగో కూడా చెబుతాను..

 (మీరు హైదరాబాద్ వాసులు అయితే 040  STD కోడ్ వాడాలి. వేరే నగరాల వారైతే ఆయా నగరాల కోడ్ వాడాలి. ఉదాహరణకి: ఢిల్లీ = 011 , ముంబై = 022, చెన్నై = 044  ఇలా..)
 • ఇప్పుడు మీ మొబైల్ నుండి మీ దగ్గరలోని నగరం STD కోడ్ + 69999999 లేదా 244444444 కలిపి డయల్ చెయ్యండి. ఉదాహరణకి నేను ఆంధ్రప్రదేశ్ లోని, హైదరాబాద్ నగరం లోని ఆ సంస్థకి ఫోన్ చేయాలి అంటే 04024444444  నంబర్ లేదా 04069999999 కి ఫోన్ చేస్తానన్న మాట.
 • కాల్ కలవగానే ఒక ఆపరేటర్ మీతో మాట్లాడుతాడు. మీకు దేని గురించి ఇన్ఫర్మేషన్ కావాలని అడుగుతాడు.
 • మీకు దేని గురించి సమాచారం కావాలో దాన్ని గురించి వారికి మీరు చెప్పండి.
 • వారు ఆ మనమడిగిన సమాచారం గురించి ఏమైనా డిటైల్స్ ఉన్నాయో వారి వద్ద నున్న సిస్టమ్ లో చూస్తారు.
 • అలా చూసాక ఇంకా మనకి ఆ సమాచారం లోని ఇంకా డిటైల్స్ ఇంకా ఏమైనా కావాలా అడుగుతారు.
 • ఆ తరవాత మీ గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్.. అంటే మీ పేరు, ఊరు, ఏమి చేస్తుంటారు, మీ ఫోన్ నెంబర్.. ఇలాంటివి అడుగుతారు.  మీకిష్టముంటే చెప్పవచ్చు, లేకుంటే లేదు. ( నేనైతే నా పేరు రాజ్ అని.. ఇంకొన్ని విషయాలు చెప్పాను. నేనెప్పుడు ఫోన్ చేసినా "Hello Good morning RAJ.." అంటూ పలకరిస్తారు.. అంటే నా నంబర్ వారివద్ద ఫీడ్ అయి ఉంది. )  
 • మా సర్వీస్ వాడుకున్నందులకి ధన్యవాదాలు చెప్పి, ఆ ఇన్ఫర్మేషన్ మనకి యే ఫోన్ నంబర్ కి రావాలో ఆ ఫోన్ నంబర్ అడుతుతారు. మన మొబైల్ నంబర్ చెబితే థాంక్స్ చెప్పి.. లైన్ ని ముగిస్తారు.
 • ఆ ముగించిన మరుక్షణం లోనే మనం అక్కడ చెప్పిన మొబైల్ నంబర్ కి SMS పంపిస్తారు. వారి వద్ద ఎంత సమాచారం ఉంటే అంత. అంటే ఉదాహరణకి మీరు ట్రావెల్స్ వారి గురించి అడిగితే మీరు అప్పుడు కాల్ చేసిన ఏరియాలో దగ్గరగా ఉన్న ట్రావెల్స్ ఏజంట్ల అడ్రస్ (పోస్టల్ అడ్రెస్ అంత క్లియర్ గా) + వారివి ఎన్ని ఉంటే అన్ని ఫోన్ నంబర్స్  మనకి SMS రూపములో వస్తాయి.
 • ఈ సమాచారాన్ని SMS అందుకున్నందులకి మన వద్ద ఒక్క నయా పైసా కూడా చార్జ్ చేయరు. అంటే మనం వారికి చేసిన లోకల్ కాల్ మాత్రమే మనకి ఖర్చు.
 • నేనీ సర్వీసుని గత పదేళ్ళ పైగా నుండీ వాడుతున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా ఆ ఫోన్ నంబర్స్ మాత్రం గుర్తుపెట్టుకుంటాను. అక్కడ నాకేమి అవసరం వచ్చినా వెంటనే వీరికి ఫోన్ చేసి నాకు కావలసిన ఇన్ఫర్మేషన్ SMS ద్వారా అందుకుంటాను.
ఇప్పుడు ఈ సంస్థ వారు అమెరికా లో కూడా ఈ సర్వీసు ని అందిస్తున్నారు. ఈ సర్వీసుని అమెరికాలో కూడా అందుకోవాలంటే..
1800JUSTDAIL లేదా 1800 5878 3425 (మీకు అర్థం కావాలని విడిగా వ్రాసాను.. కాని అంతా ఒక్కటే = 180058783425 ) కి ఫోన్ చెయ్యండి.

మీరు ఏమైనా థాంక్స్ చెప్పుకోవాలని అనిపిస్తే వారితో నేను ఇంట్రడ్యూస్ చేసానని చెప్పండి.. నాకొక "తుత్తి" మిగులుతుంది.

Friday, April 2, 2010

Intro of WINRAR (Upload & Download)

WINRAR సాఫ్ట్వేర్ గురించి మీకు పరిచయం చేస్తున్నాను.. మీకు ఇంటర్నెట్ నుండి పాటలూ, సాఫ్ట్వేర్ లూ, ఫోటోలూ..డౌన్లోడ్ చేసుకుంటున్నప్పుడు  చాలా  ఉపయోగపడే  ఈ WINRAR సాఫ్ట్వేర్ ఉచితం కాదు. ఇప్పుడు మీకు అందిస్తున్నది ట్రయల్ వర్షన్. ఇది మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. This is NOT to FREE. It is trial version. Please purchase from licenced authorities.. here put this software for easy learning purpose ONLY.

మనం ఇంటర్నెట్ నుండి ఫోటోలు, పాటలు, సాఫ్ట్వేర్ లూ.. డౌన్లోడ్ చేసుకున్నప్పుడు అవి జిప్ ( ZIP ) ఫార్మాట్ లో వస్తాయి. వాటిని అందులోంచి ఓపెన్ చేసుకోవాలంటే ఈ సాఫ్ట్వేర్ తప్పనిసరి. అలాగే కొన్ని పాటలని, ఫోటోలని భద్రముగా పంపాలంటే కూడా ఈ సాఫ్ట్వేర్ అవసరము. ఈ సాఫ్ట్వేర్ ని వాడటం చాలా తేలిక.

ఇప్పుడు అప్లోడ్ ఎలా చేస్తామో / ZIP ఫార్మాట్ కి ఎలా మార్చాలో చూపిస్తాను.  
ముందుగా మీరు ఈ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి.
మీరు ఇంటర్నెట్ ద్వారా ఎవరికైనా ఫొటోస్, పాటలు.. పంపాలనుకుంటే ముందుగా ఒక ఫోల్డర్ లోకి మీరు పంపాలనుకున్నవి  వేయండి.

ఆ తరవాత  ఫోల్డర్ మీద రైట్ క్లిక్ చేసి వచ్చే మెనూ లో Add to archive ని ఎన్నుకోనాలి.

ఆ తర్వాత వచ్చే ఈ బాక్స్ లోని RAR లేదా ZIP ని ఎంచుకొని, OK  నొక్కాలి. నేను ఇక్కడ RAR ఎన్నుకున్నాను.


ఇప్పుడు ఇలా ఆ ఫోల్డర్ సేవ్ అవుతుంది.మీరు అనుకుంటే - ఒక ఫైల్ ని రహస్యముగా కూడా పంపొచ్చు. అది ఎలా అంటే!..
యే ఫైల్ పంపాలని అనుకుంటున్నారో ఆ ఫైల్ మీద రైట్ క్లిక్ చేసి ఆ వచ్చే మెనూ లో Add to archive క్లిక్ చేసాక ఒక బాక్స్ వస్తుందిగా.. అందులో మీదనున్న Advance (1) మీద క్లిక్ చేసి Set Password (2) ని నొక్కండి.
ఆ తరవాత ఇలా ఇంకో బాక్స్ వస్తుంది.
అందులో (3) అన్న దగ్గర ఏదైనా పాస్ వర్డ్ ని పెట్టి.. ( ఉదా: 12345 )
(4) గడిలో కూడా అదే పాస్ వర్డ్ ని టైపు చెయ్యండి.
(5) వ నంబర్ గడిలో క్లిక్ చెయ్యండి.
ఆ తరవాత (6) అయిన OK ని నొక్కండి.


ఇప్పుడు (7) ని అయిన OK నొక్కండి.


చివరిగా ఇలా ఫైల్ ఎంక్రిప్ట్ ( encrypt ) పద్దతిలో SAVE అవుతుంది.

మీరు దీన్ని మెయిల్స్ ద్వారా నిశ్చింతగా పంపించొచ్చు. దీన్ని అందుకున్న వారికి ఇంకో మెయిల్లో పాస్ వర్డ్ ని పంపించండి.. లేదా ఫోన్ చేసి చెప్పండి. అప్పుడు వారు దాని సహాయముతో ఈ ఎంక్రిప్ట్ ఫైల్ ని ఓపెన్ చేసుకుంటారు.
అదెలా అంటే: మీరు పాస్ వర్డ్ వారికి తెలియ చేసారుగా. ఇప్పుడు.. ఆ ఫైల్ ని ఎలా బయటకి తీయాలంటే! ముందుగా ఆ ఫైల్ మీద రైట్ క్లిక్ చేయండి. వచ్చే మెనూ లోంచి అందులో Extract files ని ఎంచుకోండి.

ఇప్పుడు ఇలా వస్తుంది.. (1) దగ్గర OK ని నొక్కండి.అలా నొక్కాక పాస్ వర్డ్ ని అడిగే పాపప్ విండో వస్తుంది. అందులో ఆ పాస్ వర్డ్ ని ఎంటర్ చెయ్యండి.

ఇలా... (3) దగ్గర పాస్ వర్డ్ ఎంటర్ చేసి, (4) వద్ద OK నొక్కండి. అంతే! ఆ ఎంక్రిప్ట్ ఫైల్ వచ్చేస్తుంది..

చాలా ఈజీగా.. సేఫ్ గా ఉంది కదూ!..

Download for testing -> Trail version : WINRAR  
Size: 1.18MB

Thursday, April 1, 2010

బ్లాగు పేరు మారుస్తానని వోటింగ్ - ఫలితం

నా బ్లాగు పేరు మారుస్తానని వోటింగ్ పెట్టానుగా! ఇప్పుడు ఫలితం చెబుతున్నాను.
నా బ్లాగు పేరు ఇంగ్లీషులో ఉండి కదా.. దాన్ని తెలుగులో ఉంటే బాగుంటుందేమోనని అభిప్రాయ సేకరణ చేసాను.. బాగా రెస్పాన్స్ వచ్చింది మొత్తం డెబ్భై ఆరు మంది పాల్గొన్నారు! ఆ రిజల్టు ఇక్కడ చూపుతున్నాను..


బ్లాగు పేరు మార్చండి అంటారేమోనని ఎదురు చూసాను.. కాని 46% మంది మాత్రం మార్చమన్నారు.. మిగతావారు ఇదే బాగుందనీ, వేరేది మార్చమనీ అన్నారు.. ఫలితముగా ఏదీ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను..  అంతవరకూ ఇదే - అంటే My VALUABLE LESSONS అనే ఉంచుతున్నాను.. మీకు అనవసరముగా శ్రమ కలిగించానని అనుకుంటాను.. మీరంతా వోటింగులో పాల్గొన్నందులకి మీకు నా కృతజ్ఞతలు.
Related Posts with Thumbnails