Wednesday, February 29, 2012

Good Morning - 62


Tuesday, February 28, 2012

మిరపకాయల కొనుగోలు

త్వరలో రాబోతున్న ఆవకాయ పచ్చళ్ళ సీజన్ కి కావలసిన మిరపపొడి చేసుకోవటానికి ఎండు మిరపకాయలు తీసుకోవటానికి తోడుగా వెళ్లాను నేను. (వార్నీ!.. ఇది కూడా పోస్ట్ వ్రాయాలా? అనుకోకండి..) మార్కెట్లో అప్పుడప్పుడే దుకాణాలు తెరుస్తున్నారు. ఎప్పుడూ వెళ్ళే దుకాణం ఇంకా తీయలేదు. ఆ ప్రక్కనే ఉన్న దుకాణంకి వెళ్ళాం.

అక్కడ క్రింద కుప్పగా పోసిన మిరప కాయలని చూశాం.. ఆశ్చర్యం.!! ఆ ఎండిన కాయల మీద వర్షం కురిసిందా అన్నట్లుగా నీళ్ళు. అర్థం అయ్యింది. ఆ కొట్టువాడే అలా నీరు పోసి, తూకం ఎక్కువ రావాలని చూస్తున్నాడు అనీ. కొద్ది దూరం వెళ్ళి, మేము రెగ్యులర్గా వెళ్ళే షాప్ వాడు ఓపెన్ చేసేదాకా ఆగాం. 

ఆ నీళ్ళు చల్లిన షాప్ అతను, వాటి పైన మరిన్ని ఎండిన కాయలని గుట్టగా పోసి, వాటినన్నింటినీ బాగా కలపసాగాడు. అంటే - ఆ చల్లిన నీరు అన్ని కాయలకీ పట్టేలా అన్నమాట. ఒకరకముగా చెప్పాలంటే - అతనిదీ తప్పు కాదు. బేరాలు బాగా చేసి, బాగా తక్కువకి అడిగే కొనుగోలుదారుల కోసం అలా చేస్తుంటారు. వారికోసం చేస్తుంటే - నిజాయితీగా కోనేవారూ బలవుతూ ఉంటారు.

కాసేపట్లో మేము ఎదురుచూస్తున్న షాప్ వాడు కొట్టు తెరిచాడు. అక్కడే కొనుగోలు చెయ్యటానికి వెళ్ళాం. మమ్మల్ని గుర్తుపట్టి, మాకోసం అనీ చాలా బాగున్న కాయల సంచీ విప్పాడు.

కారప్పొడి కాసింత ఘాటుగా ఉండాలని, ఎక్కువరోజులు రావాలని అనుకొని, సన్నని, ఎర్రని ఎండు మిరపకాయలని ఎన్నుకున్నాము. 


ఇలా అయితే, మరింత ఘాటుగా, ఎక్కువరోజులుగా, కూరల్లో తక్కువ వేసినా సరిపోయేలా ఉంటుంది. 


సన్నగా ఉండి, ఆ కాయలని చెవిదగ్గర పెట్టుకొని ఊపితే, ఆ కాయ లోపల ఉన్న గింజల చప్పుడు వినిపించితే, అవి బాగా ఎండిన కాయలు. అలా వినిపించలేదు అంటే - ఇంకా పచ్చిగా ఉన్నవే (లేదా వాటిపై నీళ్ళు చల్లిన కాయలు) అని అర్థం. 


ఇలాంటి కాయలని కొని, వెంటనే గిర్నీలో పొడి చేయించినా, అందులోని తేమవల్ల ఆ కారంపొడి ఎక్కువ రోజులు రాదు. 


కొద్దిరోజులలో ఘాటు దిగిపోయి, చప్పగా కారం ఘాటు లేకుండా, కూరల్లో వేసినా ఎరుపురంగులో కర్రీలు ఉండవు. 


ముఖ్యముగా మాంసాహారం అయితే - రుచి లేకుండా ఉంటుంది. 


బాగా ఎండిన కాయలని మధ్యగా వ్రేళ్ళతో తుంచితే, రెండు ముక్కలుగా విరిగిపోతుంది. పచ్చివి అయితే వంగి, విరిగిపోతుంది. 


అలాగే వీటిల్లో పసుపు, ఎరుపు రంగులో మచ్చలుగా ఉన్న కాయలని తీసేయ్యాలి. అవి తెగులు సోకినవి. ఆ కాయలని వీటిల్లో వేసి, కారం పొడి పట్టిస్తే , ఈ మచ్చల కాయల లోని తెగులు వల్ల మిగతా కారం పొడి పాడయ్యే ప్రమాదం ఉంది. 

డెబ్బై రూపాయలకి కిలో ఎండు మిరపకాయలు చెప్పిన అతను, నేనేమీ మాట్లాడకపోయేసరికి తనంతట తానుగా కిలో యాభై ఐదుకి చొప్పున అమ్మాడు. ఆ రేటుకి ఆరు కిలోలు తీసుకున్నాం. వాటిని ఎండలో ఆరబెట్టేసి, పొడి చేయించాలి. ఇక పచ్చళ్ళ మామిడికాయల కోసం ఎదురుచూడాలి.

ఈ క్రిందున్న ఫోటోలోనివే - మేము ఈసారి తీసుకున్న ఎండు మిరపకాయలు. ముందుగా " దిష్టి " తగలకుండా - ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి.. అన్నీ.. పోవాలి.. (అతిగా ఉన్నా, తప్పదు కదా.. )


Monday, February 27, 2012

Sunday, February 26, 2012

Jean Pant - Alteration

మీరు క్రొత్తగా కొన్న జీన్ ప్యాంట్ పొడవు బాగా ఎక్కువైనదని క్రింద పొడవు కత్తిరించి, కుట్టిస్తాము కదా.. చాలామంది అలాగే ఎక్కువైనది మడిచేసి, వేసుకుంటారు. కొద్దిమంది మాత్రం ఆ ఎక్కువైనా పొడవు కత్తిరించేసి, కుట్టిస్తారు. లేదా ఇంట్లోన ఉన్న కుట్టుమెషీన్ మీద కుట్టేస్తారు. బయట టైలర్స్ వద్ద ఉన్న, లేదా ఇంట్లోన ఉన్న మెషీన్స్ మీద కానీ ఆ కత్తిరించిన బట్టని మడిచి కుట్టడం వీలు కాదు.

ప్యాంట్ లోపలి భాగాన ఉన్న నాలుగుపొరల జాయింట్ - ఇది తొడల జాయింట్ వద్ద నుండి పాదాల వరకూ ఉంటుంది. ఈ కుట్టు మీదుగా మెషీన్ ని నడిపించటం వీలు కాదు. ఒకవేళ కుట్టడానికి ప్రయత్నించినా - సూది దిగక, విరిగిపోవటం మామూలే.. అందుకే జీన్ ప్యాంట్ ని మడిచి కుట్టేవారు చాలా తక్కువగా ఉంటారు. జీన్ ప్యాంట్ ని కుట్టేవారి కోసం వెదికినా, వారు ఎక్కడో ఉంటారు. సమయానికి దొరకరు. పోనీ అలాగే వాడుకుందాం అనుకుంటే - వాడుకలో ఆ అంచుల వద్ద చినిగి అసహ్యముగా కనిపిస్తుంది. అక్కడికి మడిచి కుట్టుకోవాలన్నా - అప్పుడు ఆ పొడవు సరిపోక అలాగే వాడాల్సివస్తుంది.

ఇప్పుడు ఆ ఇబ్బందిని ఎలా తొలగించుకొని, అంచులని లోపలి మడిచి, సాధారణ కుట్టు మెషీన్ మీద ఎలా కుట్టాలో ఇప్పుడు మీకు తెలియచేస్తాను.

1. ముందుగా మీ జీన్ ప్యాంట్ వేసుకొని చూసి, ఎంత పొడవు మీకు అవసరమో చూసుకొని, అక్కడ మార్క్ చెయ్యండి.

2. ఆ మార్క్ చేసిన దగ్గర నుండి రెండు అంగుళాలు లోపలి మడవటానికి వీలుగా ఉంచేసి, మిగతా ఎక్కువైన బట్టని అడ్డముగా కత్తిరించండి.

3. ఇప్పుడు మీరు ఆ కాలి భాగం ని తీసుకొని, లోపలి భాగములో ఉండే లావాటి మడత కుట్టు వద్ద ఇలా కత్తెర తో కత్తిరించండి.4. ఇప్పుడు ఆ కత్తిరించిన వరకూ లోపలికి మడిచి, మళ్ళీ ఇంకో మడత పెట్టి, మామూలు మెషీన్ మీద ఆ అంచుని కుట్టేయవచ్చును. ఇప్పుడు మీరే అనుకుంటారు.. ఇంత ఈజీగా, సూది విరగకుండా అంచు కుట్టొచ్చును అనీ.

Saturday, February 25, 2012

Thursday, February 23, 2012

Tuesday, February 21, 2012

My Photography - 16

పుడమి తల్లి ప్రసవిస్తున్న వేళ
చాముండేశ్వరి ఆలయం.
శ్రీ శైలం డ్యాం లోపలి భాగం.
శ్రీ కాళహస్తి మండపం.
శ్రీ చాముండేశ్వర ఆలయం పైభాగం. 
పచ్చని పంటపొలాలు. 
శ్రీ రాజరాజేశ్వర స్వామీ, వేములవాడ యొక్క ధర్మ గుండం.
శ్రీ రాజరాజేశ్వర స్వామీ, వేములవాడ యొక్క ధర్మ గుండం.

Monday, February 20, 2012

Sunday, February 19, 2012

G Chat on Orkut profile

G Talk (జి టాక్) గురించి మీకు ప్రత్యేకముగా చెప్పాల్సిన అవసరం లేదు. జిమెయిల్ లో అకౌంట్ ఉన్నవారందరికీ అది సుపరిచితమే! ఆ జి చాట్ (గూగుల్ చాట్) లో టెక్స్ట్ చాట్ మాత్రమే కాదు, ఆడియో మరియు వీడియో చాట్ కూడా చేసుకోవచ్చును. అలాగే చిన్న సైజులోని ఫైల్స్ అంటే ఫొటోస్, పాటలు.. అందులో పంపించుకోవచ్చును. ఇన్ని లాభాలు ఉన్న ఆ జి చాట్ ని చాలామంది వాడుతారు.

ఇప్పుడు - ఇంతగా అందరికీ సుపరిచితమైన ఆ గూగుల్ చాట్ ని మీరు మీ జిమెయిల్ అక్కౌంట్ ద్వారానే వాడుకోవటం మీకు తెలిసి, అలాగే వాడుతూనే ఉండి, ఉండొచ్చును. మీకు ఒక ఆర్కుట్ అకౌంట్ ఉండి, అక్కడ మీ స్నేహితులకు స్క్రాప్స్ వ్రాస్తూనే, అక్కడనుండే జి చాట్ ద్వారా మీ స్నేహితులని చాట్ ద్వారా పలకరించటం బహుశా మీకు తెలిసి ఉండక పోవచ్చును. చాలామంది అర్కుటర్స్ కి ఈ విషయం తెలీక, జిమెయిల్ అకౌంట్ ని ఓపెన్ చేసి, అందులోంచి గూగుల్ చాట్ ఓపెన్ చేసి వాడుతూ ఉంటారు.

ఇప్పుడు మీ ఆర్కుట్ అకౌంట్ ద్వారానే గూగుల్ చాట్ ఎలా చేసుకోవచ్చునో ఇప్పుడు తెలియచేస్తున్నాను. నిజానికి ఈ విషయం నాకు రెండున్నర సంవత్సరాల క్రిందటే అనుకోకుండా తెలిసినా, దాన్ని బాగా వాడుకున్నాను. కొద్దిమందికి ఇలా చేసుకోవచ్చునని చెప్పాను. వారు అలా ఫాలో అయ్యి, వారూ శుభ్రముగా వాడేసుకుంటున్నారు.

మీకు ఆర్కుట్ సోషల్ సైట్ అకౌంట్ ఉంటే - ముందుగా ఆ అకౌంట్ ని మీ పాస్ వర్డ్ తో, ఓపెన్ చెయ్యండి. అలా ఓపెన్ చేశాక ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యండి.
 http://www.orkut.co.in/Main#Application?uid=13168132843810282771&appId=162010468262
లేదా ఈ లింక్ ని కాపీ చేసి, ఇంకో టాబ్ ఓపెన్ చేసి, అందులో పేస్ట్ చేసి, ఓపెన్ చెయ్యండి. అప్పుడు మీకు ఒక పేజీ ఓపెన్ ఇలా అవుతుంది.


ఇలా 1 వద్ద చూపినట్లుగా Post లేదా Unpost లలో ఏదో ఒకటి ఎంచుకొంటే, ఆ తరవాత ఈ క్రింది ఫోటో మాదిరిగా వస్తుంది. 

ఇక్కడ 2 వద్ద చూపినట్లుగా Add Chat app. in your profile ని ఎంచుకోండి. మీ మీ ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడ్ ని బట్టి, కాసింత సమయములో మీ ఆర్కుట్ ప్రొఫైల్ కి ఆ అప్లికేషన్ జత చేయబడుతుంది. అది ఆడ్ అయ్యేదాకా బఫరింగ్ జరుగుతూ ఉంటుంది. అది ముగినట్లుగా వచ్చేసేంతవరకూ అలాగే వదిలెయ్యండి. ఆ తరవాత మీ ఆర్కుట్ ప్రొఫైల్ లో గూగుల్ చాట్ కనిపిస్తుంది. Saturday, February 18, 2012

Friday, February 17, 2012

Thursday, February 16, 2012

Wednesday, February 15, 2012

Tuesday, February 14, 2012

Related Posts with Thumbnails