Thursday, March 31, 2016

Good Morning - 603


ఈరోజు మార్చి 31 ఆర్ధిక సంవత్సరపు అకౌంట్స్ చివరిరోజు. అప్పులు, ఆస్థులు, బకాయిలు లెక్కచూసుకొనే రోజు కూడా.. మనం కూడా ఈ సంవత్సరంలో ఏర్పడిన అపార్థాలు, కోపాలు, అపోహలు, బాధలు, తప్పేదో జరిగిందని బాధపడటాలు, తిరస్కారాలు, భయాలు, ఓటములు, ఈర్ష్యా ద్వేషాలు, తప్పుడు ప్రవర్తనలు, తప్పులు, పొరబాట్లు, కుమిలిపోవటాలు, నీచంగా భావించటాలు.. వంటి ఖాతాలను ముగిద్దాం. వాటన్నింటినీ కాలగర్భములో కలిపేద్దాం.. వాటినుండి నేర్చుకొన్న పాఠాలతో - క్రొత్త సంవత్సరాన్ని ప్రారంభిద్దాం. 

నూతన సంతోషకర మరియు ఆర్ధిక సంవత్సర శుభాకాంక్షలు. 

Tuesday, March 29, 2016

Quiz


ఒక ఇంటిలో తొమ్మిదిమంది పిల్లలు మాత్రమే ఉన్నారు.. వారిలో - 
A బట్టలు ఇస్త్రీ చేస్తున్నాడు, 
B టీవీ చూస్తున్నాడు, 
C వంట చేస్తున్నాడు, 
D చెస్ ఆట ఆడుతున్నాడు, 
E స్నానం చేస్తున్నాడు, 
F రేడియో వింటున్నాడు, 
G నిద్రపోతున్నాడు, 
I ఫోన్ లో మాట్లాడుతున్నాడు.. 
మరి H ఏమి చేస్తున్నాడు..?
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు : 
D తో H చెస్ ఆట ఆడుతున్నాడు.


Sunday, March 27, 2016

Quiz

ఇందులో ఎన్ని 7 లు ఉన్నాయి.?

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు : 6 Six 
ఆరు 7 లు ఉన్నాయి. 


Thursday, March 24, 2016

Deceptive Site Ahead

నిన్నరాత్రి బ్లాగ్ లో పోస్ట్ పెడదామని బ్లాగ్ ని గూగుల్ క్రోమ్ నందు ఓపెన్ చేశాను. అలా ఓపెన్ అయ్యి, వెంటనే ఈ క్రింద ఎరుపురంగులో ఉన్న తెరపట్టు Screen shot కనిపించడం మొదలెట్టింది. అది సెక్యూరిటీ ఎర్రర్ / కాషన్ నోటీస్. 


నా బ్లాగ్ అగ్రిగేటర్స్ అయిన మాలిక ఆర్గ్. మీద సైబర్ దాడి జరిగిందనీ, ఆ సైట్ నుండి మీ బ్లాగ్ విషయాలు, డేటా దొంగిలించవచ్చన్న ఊహతో గూగుల్ క్రోమ్ వారు అలా నా బ్లాగ్ తెరచుకోకుండా చేశారు. వేరే సైట్ నుండి చక్కగా ఓపెన్ అయ్యింది. సరే.. అంతా మన మంచికే అనుకొని, నా బ్లాగ్ వైపు రాలేదు. రాత్రి పన్నెండున్నరకు ఒకసారి మళ్ళీ బ్లాగ్ ని తెరచి చూశాను. చక్కగా తెరచుకుంది. కానీ అప్పటికి అప్డేట్ పోస్ట్ పెట్టాలన్న మూడ్ లేక ఊరుకున్నాను.

ఇలా జరగటం అన్నది - దాదాపు పది సంవత్సరాల బ్లాగర్ గా ఉన్న సమయములో ఇదే మొదటిసారి. ఎన్నడూ ఇలా ఇబ్బందిని ఎదురుకోలేదు. మిగతావాళ్ళకు కూడా తెలియాలని ఇలా బ్లాగ్ లో పోస్ట్ గా పెడుతున్నాను. 

Saturday, March 19, 2016

పొడుపు కథలు - 27


కాళ్ళు, చేతులు లేని అందగత్తెకు బోలెడు దుస్తులు. ఏమిటది? 
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
విడుపు : 


Tuesday, March 15, 2016

పొడుపు కథలు - 26


కాళ్ళు లేవు కానీ నడుస్తుంది. 
కళ్ళు లేవు గానీ ఏడుస్తుంది.
ఏమిటది ? 
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు :


Saturday, March 12, 2016

పొడుపు కథలు - 25


ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు. 
ఏమిటది ? 
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
విడుపు :  

Wednesday, March 9, 2016

పొడుపు కథలు - 24

నాకు కన్నులంటే చాలా ఉన్నాయి. 
నేను చూసేది మాత్రం రెండింటితోనే.. 
ఏమిటది ? 
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
విడుపు : 


Friday, March 4, 2016

నన్ను మీ పేజీకి అడ్మిన్ గా చెయ్యరూ..

ఫేస్ బుక్ లోని ఒక పేజికి నేను అడ్మిన్ ని. కొంతకాలం క్రిందట ఒక మెస్సేజ్ - "నన్ను అడ్మిన్ గా చెయ్యండి. నేనూ ఈ పేజీని మరింత బాగా మైంటైన్ చేస్తానూ.." అని. ఎవరు పంపారు అని చూశా. ఒక అబ్బాయి.

హ్మ్!.. ఓకే. కానీ అడ్మిన్ అన్నాక అడ్మిన్స్ గా ఉన్నవారందరి మనస్తత్వాలు బాగా కలిస్తేనే ఆ పేజీ నిర్వహణ బాగుంటుంది. ముక్కూ, మొహం తెలీని - ముఖ్యముగా వారెలా మైంటైన్ చేస్తారో తెలీనప్పుడు - కీలకమైన అడ్మిన్ పోస్ట్ ఎలా ఇవ్వగలం? ఒకవేళ ఇచ్చినా వారు అడ్మిన్ అయ్యాక - ఒక మంచి శుభ ముహూర్తంలో మనల్ని అడ్మిన్ పోస్ట్ నుండి తీసేసి, ఆ పేజీకి రాకుండా బ్లాక్ చెయ్యవచ్చును. ఇలాంటివి ఎన్నెన్నో " పేజిపోట్లు " బయటకు రాకుండా కాలగర్భంలో కలసిపోయాయి. ( ఇలాంటివి రాకుండా ఉండాలంటే వారికి మేనేజర్ పోస్ట్ ఇవ్వాలి.. అది తరవాత చెప్పుకుందాం ) అందాకా పేజీని నిర్వహించి, బాగా పాపులారిటీ సంపాదించాక - చిన్న తప్పుతో - అప్పటిదాకా పడిన శ్రమని అప్పనముగా మరొకరికి ఇవ్వడం జరుగుతుంది. విత్తనం వేసి, మొక్కగా పెంచి, వృక్షముగా మారి ఫలాలను ఇచ్చేసమయంలో ఆ చెట్టే వేరొకరు ఆక్రమించుకుంటే ఎలా బాధగా ఉంటుందో - ఇదీ అలాగే ఉంటుంది. 

ఎందుకైనా మంచిది అని - మీరు నిర్వహిస్తున్న పేజీ లింక్ ఇవ్వండి. అది చూశాక - మీ నిర్వహణ తీరు చూశాక, అప్పుడు నిర్ణయిస్తామని చెప్పాను. తను నిర్వహిస్తున్న పేజీ లింక్ ఇచ్చాడు. ఆ లింక్ ద్వారా ఆ పేజీని తెరిచాను. అంతలోపే ఇంకో టాబ్ లో అతని పేరు మీదున్న ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేశాను. మరొక టాబ్ లో గూగుల్ లో అతని పేరు మీద మరేమైనా ప్రోఫైల్స్ ఉన్నాయో అని వెదికాను. కానీ లేవు.

అతని ప్రొఫైల్ లో సరిగా వివరాలు లేవు. ఆ ప్రొఫైల్ అంతా ప్రైవేట్ గానే ఉంది. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి, ఫ్రెండ్ అయ్యాకనే తన అకౌంట్ లోని పోస్ట్స్ ని చూసేలా సెట్టింగ్స్ ఉన్నాయి. అంటే అతను తన గురించి పబ్లిక్ గా ఏమీ  తెలీకుండా జాగ్రత్తగా ఉన్నాడన్నమాట. ఓకే.!

అతనిచ్చిన లింక్ ద్వారా తను నిర్వహిస్తున్న పేజీని తెరిచా.. షాక్.. ఆ పేజీలో అన్నీ ఈకార్డ్స్ యే. అవీ ఒక ప్రఖ్యాత తెలుగు ఈకార్డ్ రచయిత చేసినవి. తను అవి ఫోటోషాప్ ద్వారా చేస్తుంటారు. నా పేజీలో కొన్ని స్వయంగా వేశారు కూడా. తన పేజీ ప్రకటన వరకూ క్రాప్ చేసి, ఇక్కడ పోస్ట్ చేస్తున్నాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయి పేరుకీ, ఆ ఈకార్డ్స్ మీదున్న క్రియేటర్ పేరు కలవడం లేదు. తన పేరు వేరు. క్షణంలోనే అర్థమయ్యింది.. ఇది ఆ రచయిత పేరు మీద ఫేక్ పేజీ అనీ. ( నా పేజీ పేరు మీద కూడా మరో ఆరు పేజీలు తెరవబడ్డాయి. బాగా ఆదరణ పొందిన వాటికి ఈ బాధలు తప్పవేమో.. )

తనని అడిగాను - ఈ ఈకార్డ్స్ అన్నీ మీరే చేసి, పోస్ట్ చేశారా ? అని. అందులకు అతడు - అవును నేనే చేశాను.. అని చెప్పాడు. ఎంతగా అబద్ధం చెప్పాడు.

ఇక ఇలా కాదనుకొని, ఇంకో ట్యాబ్ లో - గూగుల్ లో ఒక కవిత / భావన ని కాపీ చేసి, ఈ కవితను ఈ కార్డ్ గా చేసి, వెంటనే నాకు పంపండి అని అడిగాను. దానికి అతడు " ఇప్పుడు నేను పెళ్ళిలో ఉన్నాను.. దగ్గరలో సిస్టం లేదు. రెండు రోజుల్లో చేసి పంపిస్తాను.." అన్నాడు. సరే! అలాగే కానివ్వండి. టేక్ యువర్ ఓన్ టైం అని చెప్పాను.. ఇప్పటికి నెల రోజులయింది. కానీ చెప్పిన కవిత ఈకార్డ్ లేదు, ఆ అబ్బాయి జాడ కూడా లేదు. ఇలా ఉంటాయి. కాపీరాయుళ్ళ లీలలు.

ఇదంతా ఎందుకు చెప్పానూ అంటే - మీరూ ఒక ఆదరణ పొందిన ఫేస్ బుక్ పేజీ నిర్వహిస్తున్నట్లైతే - కాసింత జాగ్రత్తగా ఎలా ఉండాలో తెలియచెయ్యడానికి. గుడ్డిగా నమ్మెయ్యకూడదని..


Related Posts with Thumbnails