Sunday, February 8, 2009

Pelli chesi choodu - O bhavi bharatha

చిత్రం: పెళ్లి చేసి చూడు (1952)
రచన: పింగళి నాగేంద్రరావు
సంగీతం: ఘంటసాల
గానం: ఘంటసాల
****************

ఓ.. భావి భారత విధాతలారా..
యువతీ యువకులారా..
స్వానుభవమున చాటు నా సందేశమిదే..
వారెవ్వా..తాదిన్న తకదిన్న తాంగిటకతక తరికిటకతోం

పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని
చల్లగ కాలం గడపాలోయ్
ఎల్లరి సుఖము చూడాలోయ్
మీరెల్లరు హాయిగా ఉండాలోయ్
కట్నాల మోజులో మన జీవితాలనే
బలిచేసి కాపురములు కూల్చు
ఘనులకు శాస్తి కాగా
పట్నాల పల్లెల దేశదేశాల
మన పేరు చెప్పుకొని ప్రజలు సుఖపడగా
తాదిన్న తకదిన్న తాంగిటకతక తరికటకతోం
ఇంటా బయటా జంట కవుల వలె
అంటుకు తిరగాలోయ్.తరంపం.. (2)
కంటి పాపలై దంపతులెప్పుడు
చంటి పాపలను సాకాలోయ్ (2) // పెళ్లి చేసుకొని //

నవభావములా.. నవరాగములా..
నవజీవనమే నడపాలోయ్ (2)
భావ కవులవలె ఎవరికి తెలియని
ఏవో పాటలు పాడాలోయ్ (2) // పెళ్లి చేసుకొని //

No comments:

Related Posts with Thumbnails