Wednesday, February 11, 2009

Intinti ramayanam - Veena venuvaina sarigama

చిత్రం: ఇంటింటి రామాయణం (1979)
రచన: వేటూరి
సంగీతం: రాజన్ నాగేంద్ర
గాయకులు: S.P.బాలు, S.జానకి
*********************
పల్లవి:
వీణ వేణువైన సరిగమ విన్నావా
ఓ .... తీగ రాగమైన మధురిమ కన్నావా
తనువు తహతహలాడాల
చెలరేగాల చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో // వీణ వేణువైన //

చరణం 1:
ఊపిరి తగిలిన వేళ - నే వంపులు తిరిగిన వేళ
నా వీణలో నీ వేణువే - పలికే రాగమాల
ఆ...ఆ.. లాలలా... ఆ...
చూపులు రగిలిన వేళ - ఆ చుక్కలు వెలిగిన వేళ
నా తనువున అణువణువున - జరిగే రాసలీల // వీణ వేణువైన //

చరణం 2:
ఎదలో అందం ఎదుట - ఎదుటే వలచిన వనిత
నీ రాకతో నా తోటలో - వెలసే వనదేవత
ఆ... ఆ.. లాలలా... ఆ...
కదిలే అందం కవిత - అది కౌగిలికొస్తే యువత
నా పాటలో నీ వల్లనే - నవతా నవ్య మమతా.. // వీణ వేణువైన //

No comments:

Related Posts with Thumbnails