చరణం 2:
ఒక కన్ను నవ్వేటివేళలో
ఒక కన్ను చెమరించసాగునా..
ఒక చోట రాగాలు వికసించునా
ఒక చోట హృదయాలు ద్రవియించునా (2)
ఎనలేని ప్రాణదానం ఎద బాధ తీర్చునా.. // సుడిగాలిలోన //
చిత్రం: కింగ్ (2008)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
డైరెక్టర్: శ్రీను వైట్ల
గాయకులు: సాగర్, దివ్య ******************** పల్లవి:
చూపు చాలు ఓ మన్మధుడా - ఆగనంది నా గుండె దడ
తెలుసుకో సుందరా - నా మనసులో తొందరా..
మాట చాలు ఓ మాళవికా - ఆగలేదు నా ప్రాణమిక
తెలుసులే అందమా - నీ మనసులో సరిగమ
కలుపుకోవ నన్ను నీవు - యుగ యుగాల కౌగిలిగా
కలిసిపో మరింత నాలో - నువ్వు నేనుగా.. // చూపు చాలు ఓ //
చరణం 1:
ఏరి కోరి నీ యెద పైన - వాలి పోనిది వయసేనా..
తేనే తీపి పెదవి అంచుతో - పేరు రాసుకోనా..
నింగి జారి తనుకుల వాన - కమ్ముకుంటే కాదనగలనా..
అందమైన అద్బుతాన్నిలా - దారికి పిలుచుకోనా..
హే.. హె.. ఆడించు నన్ను.. పాడించు నన్ను -
నీ హాయి నీడలో.. తెలుసు లే అందమా -
నీ మనసులో సరిగమ.. // చూపు చాలు ఓ //
చరణం 2:
ఆడ మనసులో అభిలాష - అచ్చ తెలుగులో చదివేసా..
అదుపు దాటి వరదయ్యింది - ఈ చిలిపి చినుకు వరస…
హె నన్ను నేను నీకొదిలేసా.. ఆదమరపులో అడుగేసా
అసలు కొసరు కలిపి తేసుకో ..వలపు తలుపు తెరిచా
అనుకున్న కొన్ని అనలేని వాణ్ణి - ఆరాలు తీయనా..
తెలుసులే అందమా.. నీ మనసులో సరిగమ.. // చూపు చాలు ఓ //
చిత్రం: నువ్వు-నేను (2001)
రచన: కులశేఖర్
సంగీతం: R.P.పట్నాయక్
గానం: K.K., ఉష ***************** పల్లవి:
నువ్వే నాకు ప్రాణం - నువ్వే నాకు లోకం
ప్రేమే రాగబంధం - ప్రేమే వేదమంత్రం
కష్టాలెన్ని ఎదురైన గాని
మనకున్న బలమే - ప్రేమ ప్రేమా //నువ్వే నాకు //
చరణం 1:
నీలో ఆశ రేపే శ్వాస - పేరే ప్రేమ కాదా
లోలో పల్లవించే పాట - పేరే ప్రేమే కాదా!
జీవితానికో వరం - ప్రేమనీ
ప్రేమలేని జీవితం - లేదనీ
ఒకటై పలికేనట - ఈ పంచభూతాలు //నువ్వే నాకు //
చరణం 2:
నిన్ను నన్ను కలిపే వలపు - పేరే ప్రేమ కాదా?
మిన్ను మన్ను తడిపే చిలిపే - చినుకు కాదా
లోపమంటూ లేనిదే - ప్రేమనీ
ప్రేమ నీకు శాపమేం కాదనీ
ఎదలో పలికేనట - కళ్యాణ రాగాలు //నువ్వే నాకు //
చిత్రం: 7/G బృందావన్ కాలనీ (2004)
రచన: A.M. రత్నం
గానం: శ్రేయా ఘోషాల్
సంగీతం: యువన్ శంకర్ రాజా ******************** పల్లవి:
తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా
నీకై నేను బ్రతికి ఉంటినీ ఓ...
నీలో నన్ను చూసుకొంటినీ
తెరచి చూసి చదువు వేళ
కాలి పోయే లేఖ రాశా నీకై
నేను బ్రతికి ఉంటినీ ఓ...
నీలో నన్ను చూసుకుంటిని
చరణం 1:
కొలువు తీరు తరువుల నీడ
చెప్పుకొనును మన కథనిపుడు
రాలిపోయిన పూల గంధమా
రాక తెలుపు మువ్వల సడిని
తలచుకోనును దారులు ఎపుడు
పగిలిపోయిన గాజుల అందమా
అరచేత వేడిని రేపే చెలియ చేయి నీ చేత
ఒడిలో వాలి కథలను చెప్ప రాసిపెట్టలేదు
తొలి స్వప్నం కానులే ప్రియతమా..
కనులు తెరువుమా
చరణం 2:
మధురమైన మాటలు ఎన్నో
కలసిపోవు నీ పలుకులలో
జగము కరుగు రూపే కరుగునా
చెరిగిపోని చూపులు అన్నీ
రేయి పగలు నిలుచును నీలో
నీదు చూపు నన్ను మరచునా
వెంటవచ్చు నీడబింబం వచ్చి వచ్చిపోవు
కళ్ళముందు సాక్ష్యాలున్నా తిరిగి నేను వస్తా
ఒకసారి కాదురా ప్రియతమా ఎపుడు పిలిచినా.... // తలచి తలచి //
చరణం 1:
కునుకుపడితె మనసు కాస్త కుదుటపడతది
కుదుటపడ్డ మనసు తీపి కలలు కంటది (2)
కలలే మనకు మిగిలిపోవు కలిమి సివరకూ (2)
ఆ కలిమి కూడ దోచుకునే దొరలు ఎందుకు? // పాడుతా తీయగా //
చరణం 1:
ఊపిరి తగిలిన వేళ - నే వంపులు తిరిగిన వేళ
నా వీణలో నీ వేణువే - పలికే రాగమాల
ఆ...ఆ.. లాలలా... ఆ...
చూపులు రగిలిన వేళ - ఆ చుక్కలు వెలిగిన వేళ
నా తనువున అణువణువున - జరిగే రాసలీల // వీణ వేణువైన //
చరణం 2:
ఎదలో అందం ఎదుట - ఎదుటే వలచిన వనిత
నీ రాకతో నా తోటలో - వెలసే వనదేవత
ఆ... ఆ.. లాలలా... ఆ...
కదిలే అందం కవిత - అది కౌగిలికొస్తే యువత
నా పాటలో నీ వల్లనే - నవతా నవ్య మమతా.. // వీణ వేణువైన //
చరణం 2:
ఎదలో జరిగే విరహ సెగల వనవాసం బదులే అడిగే
మొదటి వలపు అభిషేకం వధువై బిడియం ఒదిగే సమయం..
ఎప్పుడో.. జతగా పిలిచే అగరు పొగల సహవాసం
జడతో జగడం జరిగే సరసం.. ఎప్పుడో అన్ని పూవుల్లో ఆమె నవ్వే..
అన్ని రంగుల్లో ఆమె రూపే..
అన్ని వేళల్లో ఆమె ధ్యాసే..
నన్ను మొత్తంగా మాయ చేసే.. // బుగ్గే బంగారమా //
చరణం 1:
తెల్లావు కడుపుల్లో - కర్రావులుండవా? ఎందుకుండవ్?
కర్రావు కడుపునా ఎర్రావు పుట్టదా.. ఏమో? (2)
గోపయ్య ఆడున్నా - గోపెమ్మ ఈడున్నా
గోధూళి కుంకుమై - గోపెమ్మకంటదా
ఆ పొద్దు పొడిచేనా - ఈ పొద్దు గడిచేనా..
ఎందువలనా అంటే - అందువలన
ఎందువలనా అంటే - దైవఘటన // గోవుల్లు తెల్లనా //
చరణం 2:
పిల్లన గ్రోవికీ - నిలువెల్ల గాయాలూ.. పాపం!
అల్లన మొవికీ - తాకితే గేయాలూ.. ఆహా! (2)
ఆ మురళి మూగైనా - ఆ పెదవి మోడైనా
ఆ గుండె గొంతులో - ఈ పాట నిండదా?
ఈ కడమి పూసేనా - ఆ కలిమి చూసేనా
ఎందువలన అంటే - అందువలన
ఎందువలనా అంటే - దైవఘటన // గోవుల్లు తెల్లనా //
చిత్రం: సితార (1983)
సంగీతం: ఇళయరాజా
గాయకులు: S.P.బాలు ***************** పల్లవి:
కిన్నెరసాని వొచ్చిందమ్మా వెన్నెల పైటేసి (2)
విశ్వనాధ పలుకై అది విరుల తేన చినుకై
కూనలమ్మ కులుకై అది కూచిపూడి నడకై
పచ్చనిచేల పావడ కట్టి (2)
కొండమల్లెలే కొప్పున పెట్టి
వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెరసాని // కిన్నెరసాని //
చరణం 1:
ఎండల్లకన్నే సోకని రాణి పల్లెకు రాణి
పల్లవపాణి కోటను విడిచి పేటను విడిచి (2)
కనులా గంగా పొంగేవేలా నదిలా తానే సాగేవేళ
రాగాల రాదారి పూదారి అవుతుంటే
ఆ రాగాల రాదారి పూదారి అవుతుంటే // కిన్నెరసాని //
చరణం 2:
మాగాణమ్మ చీరలు నేసే
మలిసందేమ్మా కుంకుమ పూసే
మువ్వలబొమ్మా ముద్దుల గుమ్మా (2)
గడపాదాటి నడిచే వేళ అదుపే విడిచి
ఎగిరే వేళ వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే
ఈ వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే // కిన్నెరసాని //
చరణం 1:
నిజంలాంటి ఈ స్వప్నం - ఎలా పట్టి ఆపాలీ
కలే ఐతే ఆ నిజం - ఎలా తట్టుకోవాలి
ఔనో కాదో అడగకంది - నా మౌనం..
చెలివో, శిలవో తెలియకుంది - నీ రూపం..
చెలిమి బంధమల్లుకుందే - జన్మ ఖైదులా // ఎదుట నిలిచింది చూడు //
చరణం 2:
నిన్నే చేరుకోలేక - ఎటెళ్ళిందొ నా లేఖ
వినేవారు లేక - విసుక్కుంది నా కేక
నీదో కాదో రాసున్న - చిరునామా
ఉందో, లేదో ఆ చోట - నా ప్రేమ
వరంలాంటి శాపమేదో - సొంతమైందిలా //ఎదుట నిలిచింది చూడు //
1. జీవితం ఓ నిండుమేఘములా ఉండాలనుకోవడం సరికాదు..! అడ్డంకుల ఉరుములూ, సవాళ్ళ పిడుగులూ, సవాల చినుకులూ.. నిర్దయగా మన మీద పడతాయి. అంత మాత్రానికే కుంగిపోవాలా? కుంగిపోవాల్సిన అవసరం లేదు.. మన జీవితానికి మనమే రూపకర్తలం..
2. భవిష్యత్తు కాన్వాస్ ని - అద్భుత చిత్రముగా మలచుకోవడమా.. లేక పిచ్చిగీతల పాలుజేయడమా అన్నది మన చేతిలోనే ఉన్నది..
3. ఇనుప కండలు, ఉక్కు నరాలు బిగించి - ఎదురుపడే సమస్యలను దూదిపింజల్లా ఊదేయండి. వాన వెలిసాక హరివిల్లు వచ్చినంత సుందరముగా.. సహనముతో, సాహాసంతో విజయపథములో సాగిపొండి.. 4. మనము అంటే మన ఆలోచనలే!. అవే మనల్ని రూపొందించాయి. మాటలకన్న అవే ముందుంటాయి.. జీవిస్తాయి.. నడిపిస్తాయి..
5. భయమే మృత్యువు. భయం - పాపం, నరకం, పెడత్రోవలోని జీవితం.. ప్రపంచములోని అన్ని వ్యతిరేక భావనలూ అందులోనించే జనిస్తాయి.
6. అనుభవము ఏకైక గురువు.. మనము ఎన్నైనా మాట్లాడవచ్చు.. హేతుబద్దముగా తర్కించుకోవచ్చును. కాని - అనుభవంలోనుంచే చూస్తేనే.. ఆ విషయం బోధపడుతుంది.
7. సింహం అంత నిర్భయతత్వము, పువ్వు లాంటి మృదుత్వము.. మన పనిలో ఈ రెండూ కావాలి.
9. ఒక ఆలోచనని స్వీకరించు. అదే ప్రధానముగా జీవించు. దాని గురించే ఆలోచించు.. కలలు కను.. ఊపిరిగా భావించు.. నీ మనసు, కండరాలు, నరాలు, శరీరంలోని ప్రతిభాగమూ ఆ ఆలోచనతోనే నిండిపోనీ.. అదే విజయానికి రహదారి.
10. ఎక్కడికి విసిరితే అక్కడే అంటుకపోయే లక్షణం బంకమన్నుకి ఉంటుంది. మన ఆలోచనలూ అలాగే ఉండాలి. ఏ పనిని చేస్తే ఆ పనిమీదే మనసు లగ్నం కావాలి.
11. స్వచ్చత, సహనం, కాపాడుకోవడం.. ఈ మూడూ విజయానికి అత్యంత అవసరం. ప్రేమ వీటికన్నా - అత్యున్నతం.
12. ఎవరినీ తీసిపారేయ్యోద్దు! చులకన చెయ్యొద్దు.. వీలైతే చేయందించు! లేదా- చేతులు జోడించు.. వారి తోవలో వాళ్ళని వెళ్ళనీ..
13. ఏ సమస్యా ఎదురుకానిరోజు - నీవు తప్పు దారిలో నడుస్తున్నట్లు లెక్క. ఒకసారి నిన్ను నీవు సమీక్షించుకో..
14. ఒక సరియైన వ్యక్తిని కలుసుకునేముందు - పది మంది అనామకులని "విధి" పరిచయం చేస్తుంది. మొదటి వ్యక్తి వద్దే ఆగిపోయేవాడు - అనామకుడుగానే మిగిలిపోతాడు.
15. నేడు - రేపటికి "నిన్న" అవుతుంది. నిన్నటి గురించి రేపు బాధపడకుండా ఉండాలంటే - "నేడు" కూడా బాగుండాలి.
16. మలుపు తిరగటానికి కరెక్ట్ ప్లేస్ - DEAD END. "ఇక అంతే - అయిపోయింది, ఇంకేమీ లేదు" అన్నచోట ఆగిపోకు. పక్కకి తిరుగు.. మరో దారి కనపడుతుంది.
17. నిన్నేవడైనా తప్పు పట్టాడంటే - నువ్వు తప్పు చేస్తున్నావని కాదు. నీవు చేస్తున్న పని - వాడికి నచ్చలేదన్నమాట.
19. నిన్నటి నుండి పాఠాన్ని గ్రహించి, రేపటి గురించి కలలు కంటూ ఈరోజుని ఆనందించు. కేవలం బ్రతికేస్తూ జీవితాన్ని వ్యర్థం చేసుకోకు!.. ఇవ్వటంలో నీకు ఆనందం ఉంటే ఇస్తూ ఆనందించు. అలాకాని పక్షములో నీ ఆనందానికి అడ్డువచ్చేవారిని నీ దినచర్యనుంచి తొలగించు. రాజీపడి మాత్రం బ్రతక్కు..
20. దెబ్బ తిన్న చోటే నిలబడితే గాయం మానదు. అదే వేరే చోటకి మారితే - కలిగే కొత్త స్నేహితులతో మనసు తాలూకు గాయం మానొచ్చు..
చిత్రం: సఖి
సంగీతం: A.R.రెహ్మాన్
గానం: స్వర్ణలత ****************** సాకీ:
ప్రేమలే నేరమా ప్రియా ప్రియా - వలపు విరహమా ఓ నా ప్రియా..
మనసు మమత ఆకాశమా - ఒక తారై మెరిసిన నీవెక్కడో..
పల్లవి:
కలలై పోయెను నా ప్రేమలు - అలలై పొంగెను నా కన్నులు (2)
మదికే అతిధిగ రానేలనో - సెలవైనా అడగక పోనేలనూ..
ఎదురు చూపుకు నిదరేది - ఊగెను ఉసురె కన్నీరై..
మనసు అడిగిన మనిషేక్కడో - నా పిలుపే అందని దూరాలలో.. // కలలై //
చరణం 1:
అనురాగానికి స్వరమేది - సాగర ఘోషకు పెదవేది.. (2)
ఎవరికీ వారే ఎదురు పడి - ఎదలు రగులు యెడబాటులలో..
చివరికి దారే మెలిక పడి - నిను చేరగ నేనే శిలనైతిని..
ఎండ మావిలో నావనులే - ఈ నిట్టూర్పే నా తెరచాపలే.. // కలలై //
చిత్రం: మహర్షి
సంగీతం: ఇళయరాజా
గాయకులు: S.P. బాలు ****************** పల్లవి:
ఆ ఆఅ ఆఆ ఆ ఆ ఆఅతన
నాననాన తానా నాననానా..
సుమం ప్రతి సుమం సుమం
వనం ప్రతి వనం వనం (2)
జగం అణువణువున కలకలలం
భానోదయాన చంద్రోదయాలు // సుమం ప్రతి సుమం //
చరణం 1:
హాహా ఆఅ అహహహహా ఆఅ ఆఅ ఆఅ
వేణువ వీణియ ఏమిటీ రాగము (2)
అచంచలం సుఖం మధుర మధురం
మయం బృదం తరం గిరిజ సురతం
ఈ వేల నాలో రాగోల సాలు (2)
కాదు మనసా ఆ ఆ .. ప్రేమ మహిమా
నాదు హృదయం
భానోదయాన చంద్రోదయాలు // సుమం ప్రతి సుమం //
చరణం 2:
తరర తారర తారరా
ఆ రంగులే రంగులు అంబరానంతట (2)
స్వరం నిజం సగం వరము అమరం
వరం వరం వరం చెలియా ప్రణయం
ఆవేగమేది నాలోన లేదు
ఆవేగమేది నాలోన లేదు
ప్రేమమయమూ ప్రేమమయమూ నాదు హృదయం
భానోదయాన చంద్రోదయాలు // సుమం ప్రతి సుమం //
చిత్రం: నచ్చావులే!.. (2008)
సంగీతం: శేఖర్ చంద్ర
రచన: భాస్కరభట్ల రవికుమార్
కథ, కథనం & దర్శకత్వం: రవిబాబు
గానం: రంజిత్ ******************** పల్లవి:
మన్నించవా మాటాడవా కరుణించవా కనిపించవా.. (2)
ఐ అమ్ సో సారీ బేబీ ఓఓ…. ఐ అమ్ రియల్లీ సారీ బేబీ ఓఓఓ….
ఓహ్ చెలి పొరపాటుకీ గుణపాఠమి ఇకా ఇకా
మౌనమీ ఉరితాడులా విసిరెయ్యకే ఇలా ఇలా // మన్నించవా మాటాడవా //
చరణం 1:
నావల్ల జరిగింది తప్పు నేనేమి చెయ్యాలో చెప్పు
పగపట్టి పామల్లె నువ్వు బుసకొట్టకే
కోపంగా కన్నెర్ర చేసి కారాలు మిరియాలు నూరి
ఏవేవో శాపాలు గట్రా పెట్టేయ్యకే
కాళ్ళ వేల్ల పడ్డా కూడా ఊరుకోవా కుయ్యో మొర్రో అంటూ ఉన్నా
అలక మానవా అందం చందం అన్ని ఉన్న సత్యభామ
పంతం పట్టి వేధించకే నన్ను ఇలా
ఓహ్ చెలీ చిరునవ్వులీ కురిపించవా
హూ హూ రాదని విదిలించకే బెదిరించకే ఇలా హో // మన్నించవా మాటాడవా //
చరణం 2:
అరగుండు చేయించుకుంట - బ్లేడ్ ఎత్తి కోసేసుకుంట
కొరడాతో కొట్టించుకుంటా - క్షమించవే!
కాదంటే గుంజిళ్ళు తీస్తా - ఒంగొంగి దండాలే పెడతా
నూటొక్క టెంకాయ కొడతా - దయ చూపవే
గుండెల్లోన అంతో ఇంతో జాలే లేదా
ఉంటే గింటే ఒక్కసారి కనికరించావా
ఫ్రెండ్ షిప్ అంటే అడపా దడపా గొడవే రాదా
సారీ అన్నా సాధిస్తావీ నీడలా ఓహ్ చెలీ ఎడబాటునే కలిగించకే ఇలా
ఇలా నన్నిలా ఏకాకిలా వదిలేయకే అలా // మన్నించవా మాటాడవా //
నాన్న జేబులో - ఓ నోటు లేపుదాం
రెండు స్ట్రాలతో - ఓ డ్రింకు తాగుదాం
కదులుతుండగా - బస్సెక్కి దూకుదాం
మరింత క్లోజుగా - మోవ్ అవుదాం
ట్రీట్ ఇచ్చుకుందాం - వీకెండ్స్ లో
గిఫ్టులు ఇచ్చుకుందాం - మన మీటింగ్స్ లో
ఇలా ఎప్పుడూ - మనం ఫ్రెండ్స్ లా - ఉండేలాగా
దేవుడ్ని- వరము అడుగుదాం // ఒహో.. నేస్తమా.. //
చరణం 2:
బైక్ ఎక్కుదాం - బిజీ గా తిరుగుదాం
రంగు రంగుల - లోకాన్ని వెతుకుదాం
అప్పుడప్పుడు - అప్పు ఇచ్చుకుందాం
తీర్చాల్సినపుడు - తప్పించుకుందాం
డోంట్ సే సారీ - ఫ్రెండ్షిప్ లో
థాంకులు లేవే - మన మధ్యలో
నువ్వో అక్షరం - నేనో అక్షరం..
కలిపితేనే స్నేహమనే కొత్త అర్ధం.. // ఒహో.. నేస్తమా.. //
మనసులో నిన్ను కన్నా- మనసుతో పొల్చుకున్న
తలపుల పిలుపులు విన్నా-
సెగలలో కాలుతున్నా.. చలికి నే వణుకుతున్నా -
నీడే లేని జాడే తెలుసుకున్నా
మంచు చల్లనా ఎండ చల్లనా -
తాపం లోనా మంచు చల్లనా కన్నా
నీ కోపం లోనా ఎండ చల్లనా (2) // హృదయం ఎక్కడున్నదీ //
ఒక మారు కలిసిన అందం .. అల లాగ ఎగసిన కాలం (2)
కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే.. (2)
తన అల్లే కధలే పొడుపు..వెదజల్లే కళలే మెరుపు
ఎదలోనే తన పేరు కొట్టూకుంది నిన్నే..
అది నన్ను పిలిచినంది తరుణం .. నులివెచ్చగ తాకిన కిరణం
కన్ను తెరిచిన కలువను చూసానే..చూసానే..చూసానే // ఒక మారు కలిసిన అందం //
చరణం 1:
పాత పదనిస.. దేనికది నస.. నడకలు బ్రతుకున మార్చినదే
సాయంకాల వేళ..దొరుకు చిరుతిండి.. వాసనలు వాడుక చేసిందే
కుచ్చీ కూన చల్లగా..నీ..సా- నను తాకే కొండ మల్లికా.. నీ. సా -
సరిజోడు నేనేగా.. అనుమానం ఇన్కెలా.. // ఒక మారు కలిసిన అందం //
చరణం 2:
పేరు అడిగితే- తేనె పలుకుల - జల్లుల్లో ముద్దగా తడిసానే
పాలమడుగున- మనసు అడుగున - కలిసిన కనులను వలచానే
మంచున కడిగిన ముత్యమా - నీ మెరిసే నగవే చందమా హో..
కనులార చూడాలే..తడి ఆరిపోవాలే ల ర లాల లర లల లాల.. ఓ..
ల ర లాల లర లల లాల
కంటికెదురుగ కనపడగానే - అంతే తడబడినానే.. (2)
తన అల్లే కధలే పొడుపు - వెదజల్లే కళలే మెరుపు
ఎదలోనే తన పేరు కొట్టుకుంది నిన్నే - అది నన్ను పిలిచినంది తరుణం
నులివెచ్చగ తాకిన కిరణం కన్ను తెరిచిన కనులను చూసానే..చూసానే..చూసానే
చిత్రం: ఆనందం (2001)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం: మల్లికార్జున్, సుమంగళి ********************* పల్లవి:
కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేల
నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేల
ఎదుటే ఎప్పుడు తిరిగే వెలుగా ఇదిగో ఇపుడే చూసా సరిగా
ఇన్నాళ్ళు నేనున్నది నడిరేయి నిదురలోన అయితె
నాకీనాడే తొలి పొద్దు జాడ తెలిసిందా క్రొత్తగా// కనులు తెరచినా //
చరణం 1:
పెదవుల్లొ ఈ దరహాసం నీకోసం పూసింది
నీ జతలొ ఈ సంతోషం పంచాలనిపిస్తోంది
ఎందుకనొ మది నీకోసం ఆరాటం పడుతోంది
అయితేనేం ఆ అలజడిలొ ఒక ఆనందం వుంది
దూరం మహా చెడ్డదని ఈ లోకం అనుకుంటుంది
కాని ఆ దూరమే నిన్ను దగ్గర చేసింది
నీలో నా ప్రాణం వుందని ఇపుడేగా తెలిసింది
నీతో అది చెప్పిందా నీ ఙ్ఞాపకాలే నా ఊపిరైనవని // కనులు తెరచినా //
చరణం 2:
ప్రతి నిమిషం నా తలపంతా నీ చుట్టు తిరిగింది
ఎవరైనా కనిపెడతారని కంగారుగా వుంటోంది
నా హృదయం నీ ఊహలతో తెగ ఉరకలు వేస్తోంది
నాక్కూడా ఈ కలవరమిపుడే పరిచయమయ్యింది
అద్దంలో నా బదులు ఆరే నువ్వే కనిపించావే
నేనే ఇక లేనట్టు నీలో కలిగించావే
ప్రేమా ఈ కొత్తస్వరం అని అనుమానం కలిగింది
నువ్వే నా సందేహానికి వెచ్చనైన రుజువియ్యమంది మది //కనులు తెరచినా //
చిత్రం: తొలి కోడి కూసింది (1981)
రచన: ఆచార్య ఆత్రేయ
సంగీతం: M.S.విశ్వనాథన్
గానం: S. జానకి ***************
పల్లవి:
అందమైన లోకమనీ రంగు రంగులుంటాయని
అందరూ అంటుంటారు రామ రామా
అంత అందమైంది కానేకాదు చెల్లెమ్మా // అందమైన //
చరణం 1:
ఆకలి ఆశలు ఈ లోకానికి మూలమమ్మా (2)
ఆకలికి అందముందా రామ రామా..
ఆశలకు అందముందా చెప్పమ్మా చెల్లమ్మా..
ఆశలకు అందముందా చెప్పమ్మా // అందమైన //
చరణం 2:
గడ్డి మేసి ఆవు పాలిస్తుంది - పాలు తాగి మనిషీ విషమౌతాడు (2)
అది గడ్డి గొప్పతనమా - ఇది పాల దోష గుణమా.. (2)
మనిషి చాలా దొడ్దాడమ్మా చెల్లెమ్మా- చెల్లెమ్మా..
తెలివి మీరి చెడ్డాడమ్మా చిన్నమ్మా.. // అందమైన //
చరణం 3:
ముద్దుగులాబీకీ ముళ్ళుంటాయి - మొగలిపువ్వులోన నాగుంటాది (2)
ఒక మెరుపు వెంట పిడుగూ - ఒక మంచిలోన చెడుగూ
లోకమంత ఇదే తీరు చెల్లెమ్మా చెల్లెమ్మా..
లోతుకెళ్తే కథే వేరు చిట్టెమ్మా // అందమైన //
చరణం 4:
డబ్బు పుట్టి మనిషీ చచ్చాడమ్మా - పేదవాడు నాడే పుట్టాడమ్మా (2)
ఆ ఉన్నవాడు తినడూ - ఈ పేదను తిననివ్వడూ..
కళ్ళులేని భాగ్యశాలి నువ్వమ్మా -
ఈ లోకం కుళ్ళు నీవు చూడలేవు చెల్లెమ్మా // అందమైన //
చిత్రం: గాయం (1993)
రచన: సిరివెన్నెల
సంగీతం: శ్రీ
గానం: చిత్ర ************* పల్లవి:
అలుపన్నది వుందాఎగిరే అలకు - ఎదలోని లయకు
అదుపన్నది ఉందాకలిగే కలకు - కరిగే వరకు
మెలికలు తిరిగే - నది నడకలకు
మరి మరి ఉరికే మది తలపులకు లల లల లలలలా.. // అలుపన్నది //
చరణం 1:
నా కోసమే చినుకై కరిగి - ఆకాశమే దిగదా ఇలకు
నా సేవకే సిరులే చిలికి - దాసోహమే అనదా వెలుగు
ఆరారు కాలాల అందాలు - బహుమతి కావా
నా ఊహలకు కలలను తేవా - నా కన్నులకు లల లల లలలలా.. // అలుపన్నది //
చరణం 2: నీ చూపులే తడిపే వరకు - ఏమైనదో నాలో వయసు
నీ ఊపిరే తగిలేవరకు - ఎటు ఉన్నదో మెరిసే సొగసు
ఏడేడు లోకాల ద్వారాలు - తలుపులు తెరిచే తరుణం కొరకు
ఎదురుగా నడిచే - తొలి ఆశలకు లల లల లలలలా.. // అలుపన్నది //
చిత్రం: మంచిమనిషి (1964)
రచన: C. నారాయణ రెడ్డి
సంగీతం: S.రాజేశ్వర రావు, T. చలపతి రావు
గానం: ఘంటసాల, P.సుశీల ******************* పల్లవి:
అంతగా నను చూడకు.. ష్.. మాటాడకు
అంతగా నను చూడకు..
వింతగా గురి చూడకు - వేటాడకు హొయ్ - || అంతగా నను చూడకు ||
చరణం 1:
చలి చలి గాలూ వీచెను సన్నని మంటలు లేచెను
చలి చలి గాలూ వీచెను సన్నని మంటలు లేచెను
తలపులే కవ్వించెను వలపుల వీణలు తేలించెను హొయ్ || అంతగా నను ||
చరణం 2:
జిలిబీ ఊహలు రేగెను నా చేతులు నీకై సాగెను
జిలిబీ ఊహలు రేగెను నా చేతులు నీకై సాగెను
పెదవులే కవ్వించెను పదునౌ చూపులు బాధించెను హొయ్ || అంతగా నను ||
చిత్రం: అప్పు చేసి పప్పు కూడు (1959)
రచన: పింగళి
సంగీతం: S.రాజేశ్వర రావు
గానం: A.M. రాజా, P.సుశీల ***************** పల్లవి:
చేయి చేయి కలపరావె హాయి హాయిగా
నదురు బెదురు మనకింక లేదు లేదుగా..
చేయి చేయి కలపరావె హాయి హాయిగా
నదురు బెదురు మనకింక లేదు లేదుగా..
ఆహా ... చేయి చేయి..
పెద్దవారి అనుమతింక లేదు లేదుగా చేయి చేయి
కలుపుటేలా హాయి హాయిగా..
పెద్దవారి అనుమతింక లేదు లేదుగా చేయి చేయి
కలుపుటేలా హాయి హాయిగా..
ఉహు.. చేయి చేయి..
చరణం 1:
మగని మాటకెదురాదుట తగదు తగదుగా
నాతి చెంత విరహము నే తాలలేనుగా..
మగని మాటకెదురాదుట తగదు తగదుగా
నాతి చెంత విరహము నే తాలలేనుగా..
అహ.. చేయి చేయి..
చరణం 2:
వీలు కాని విరహమింక వలదు వలదుగా
దాసి మీద వలపు మీకు తగదు తగదుగా... వీలు కాని విరహమింక వలదు వలదుగా దాసి మీద వలపు మీకు తగదు తగదుగా... //చేయి చేయి //
చిత్రం: పెళ్లి చేసి చూడు (1952)
రచన: పింగళి నాగేంద్రరావు
సంగీతం: ఘంటసాల
గానం: ఘంటసాల ****************
ఓ.. భావి భారత విధాతలారా..
యువతీ యువకులారా..
స్వానుభవమున చాటు నా సందేశమిదే..
వారెవ్వా..తాదిన్న తకదిన్న తాంగిటకతక తరికిటకతోం
పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని
చల్లగ కాలం గడపాలోయ్
ఎల్లరి సుఖము చూడాలోయ్
మీరెల్లరు హాయిగా ఉండాలోయ్
కట్నాల మోజులో మన జీవితాలనే
బలిచేసి కాపురములు కూల్చు
ఘనులకు శాస్తి కాగా
పట్నాల పల్లెల దేశదేశాల
మన పేరు చెప్పుకొని ప్రజలు సుఖపడగా
తాదిన్న తకదిన్న తాంగిటకతక తరికటకతోం
ఇంటా బయటా జంట కవుల వలె
అంటుకు తిరగాలోయ్.తరంపం.. (2)
కంటి పాపలై దంపతులెప్పుడు
చంటి పాపలను సాకాలోయ్ (2) // పెళ్లి చేసుకొని //
నవభావములా.. నవరాగములా..
నవజీవనమే నడపాలోయ్ (2)
భావ కవులవలె ఎవరికి తెలియని
ఏవో పాటలు పాడాలోయ్ (2) // పెళ్లి చేసుకొని //
నిజంగా నేనేనా - ఇలా నీ జతలో ఉన్నా
ఇదంతా ప్రేమేనా - ఎన్నో వింతలు చూస్తున్నా
ఎదలో ఎవరో చేరి - అన్నీ చేస్తున్నారా
వెనెకే వెనెకే ఉంటూనే - నీపై నన్నే తోస్తున్నారా
హరే హరే హరే హరే రామా..
మరీ ఇలా ఇలా వచ్చేసింది ధీమా
ఎంతో హుషారుగా ఉన్నాదేదో లోనా.. ఏమ్మా! // హరే హరే // నిజంగా నేనేనా
చరణం 1:
ఈ వయస్సులో ఒకో క్షణం ఒకో వసంతం
నా మనస్సుకి ప్రతిక్షణం నువ్వే ప్రపంచం
ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం
అడుగులలోనా అడుగులు వేస్తూ
నడచిన దూరం ఎంతో ఉన్నా
అలసట రాదూ గడచిన కాలం ఇంతని నమ్మనుగా.. నిజంగా నేనేనా
చరణం 2:
నా కలే ఇలా నిజాలుగా నిలుస్తూ ఉంటే
నా గతాలనే కవ్వింతలై పిలుస్తూ ఉంటే
ఈ వరాలుగా ఉల్లాసమై కురుస్తూ ఉంటే
పెదవికి చెంపా తగిలిన చోట పరవశమేదో
తోడౌతుంటే పగలే అయినా గగనంలోనా తారలు చేరేనుగా.. నిజంగా నేనేనా
వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా.. గిచ్చే గిచ్చే పిల్ల గాలుల్లారా.. (2)
కళ్ళల్లోన పొంగుతున్న బాధలేన్నో మాకున్నాయ్
గుండెలోన దాచుకున్న గాధలెన్నో మాకున్నాయ్
తీరుస్తారా బాధ తీరుస్తారా? గాలివాన లాలి పాడేస్తారా?
చరణం 1:
పిల్లపాపలా వాన బుల్లి పడవలా వాన చదువు
బాధనే తీర్చి సెలవులిచ్చినా వాన గాలివాన
కబాడ్డీ వేడి వేడి పకోడీ ఈడు జోడు డి డి డి డి
తోడుండాలి ఓ లేడి ఇంద్రధనుస్సులో
తళుకుమనే ఎన్ని రంగులో ఇంటి సొగసులే
తడిసినవి నీటి కొంగులో శ్రావణమాసాలా
జలతరంగం జీవనరాగాలకిది ఓ మృదంగం కళ్ళల్లోన & వచ్చే వచ్చే
చరణం 2:
కోరి వచ్చిన ఈ వాన గోరువేచ్చనై నాలోన
ముగ్గులా సిగ్గు ముసిరేస్తే ముద్దులాంటిదే
మురిపాలా మెరిసే మెరిసే అందాలు
తడిసే తడిసే పరువాలు గాలివానల పందిళ్ళు
కౌగిలింతల పెళ్ళిళ్ళు నెమలి ఈకలో
ఉలికి పడే ఎవరి కన్నులో చినుకు చాటున
చిటికెలతో ఎదురుచూపులో
నల్లని మేఘాల మేరుపందం
తీరని దాహాలా వలపు పందెం కళ్ళలోన & వచ్చే వచ్చే
చిత్రం : ఘర్షణ (వెంకటేష్) సంగీతం : హరీష్ జయరాజ్ గాయకులు : టిప్పు, శాలిని సింగ్ రచన : కుల శేఖర్ చిత్రం విడుదల : 2004 *****************
సాకీ:
చెలిమను పరిమళం - మనిషికి తొలివరం
బ్రతుకున అతిశయం - వలపను చినుకులే
ఇరువురి పరిచయం - తెలియని పరవశం
తొలి తొలి అనుభవం - పరువపు పరుగులే
పల్లవి:
నన్నే నన్నే చూస్తూ నా గుండెల్లో గుచ్చేస్తూ
నువ్వేదో ఏదో ఏదో చెయ్యోద్దె!
సోకుల గాలం వేస్తూ నీ మాటల్లో ముంచేస్తూ
ఓ యమ్మో అమ్మో ప్రాణం తియ్యోద్దె
నీకో నిజమే చెప్పన్నా (2)
నా మదిలో మాటే చెప్పనా
యదలో ఏదో తుంటరి థిల్లానా
నాలో ఏదో అల్లరి
అది నిన్నా మొన్నాలేనిదీ
మరి ప్రేమో ఏమో ఒకటే హైరానా హ్హ..ఒహు వహా..ఒహు వహా..
ఏమిటంటారు ఈ మాయని.. ఒహు వహా..ఒహు వహా..
ఎవరినడగాలో ప్రేమేనా అనీ // నన్నే నన్నే చూస్తూ //
చరణం 1:
ఇదివరకెరగని స్వరములు పలికెను
పగడపు జిలుగుల పెదాల వీణా!
బిడియములేరగని గడసరి సొగసుకు
తమకములేగసేను నరాల లోనా
హా లోనా ఏమైందో ఏమిటో ప్రేమిందో ఏమిటో
నా వాటం మొత్తం ఏంటో మారింది
ఈ మైకం ఏమిటో - ఈ తాపం ఏమిటో!
నా ప్రాయం మాత్రం నిన్నే కోరింది ఒహు వో..ఓ హువా ఒహువా..
నన్నే నన్నే మార్చి - నీ మాటలతో ఏమార్చి ప్రేమించే ధైర్యం నాలో పెంచావోయ్!
కన్ను కన్ను చేర్చి నా కల్లోకే నువ్వొచ్చి ఏ-కంగా బరిలోకే దించావోయ్!!
చెలిమను పరిమళం మనసుకి తొలివరం
బ్రతుకున అతిశయం వలపను చినుకులే
ఇరువురి పరిచయం తెలియని పరవశం
తొలి తొలి అనుభవం పరువపు పరుగులే
చరణం 2:
మనసున అలజడి వలపని తెలిపిన
జిలిబిలి పలుకుల చలాకీ మైనా
కళలను నిజముగా ఎదురుగ నిలిపిన
వరముగా దొరికిన వయ్యారి జానా ఓ జాణ
ఈ లోకం క్రొత్తగా ఉండయ్యో బొత్తిగా
భూగోళం కూడా నేడే పుట్టింది
నీ వల్లే ఇంతగా మారాలే వింతగా
నువ్వంటే నాకు పిచ్చే పట్టింది లా ల లా లా ల లలాల లా ల ల్లా // నన్నే నన్నే చూస్తూ //
నా ప్రేమను కోపం గానో నా ప్రేమను ద్వేషం గానో
నా ప్రేమను శాపం గానో చెలియా - ఫీల్ మై లవ్
నా ప్రేమను భారం గానో నా ప్రేమను దూరం గానో
నా ప్రేమను నేరం గానో సఖియా - ఫీల్ మై లవ్
నా ప్రేమను మౌనం గానో నా ప్రేమను హీనం గానో
నా ప్రేమను శూన్యం గానో
కాదో లేదో ఏదో గానో ఫీల్ మై లవ్ -
ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ - ఫీల్ మై లవ్
చరణం 1:
నేనిచ్చే లేఖలన్నీ చిన్చేస్తూ - ఫీల్ మై లవ్
నే పంపే పువ్వులన్నీ విసిరేస్తూ - ఫీల్ మై లవ్
నే చెప్పే కవితలన్నీ చీ కొడుతూ - ఫీల్ మై లవ్
నా చిలిపి చేష్టలకే విసుగొస్తే - ఫీల్ మై లవ్
నా ఉలుకే నచ్చదంటూ నా ఊహే రాదనీ
నేనంటే గిట్టదు అంటూ నా మాటే చేదని
నా జంటే చేరనంటు అంటూ అంటూ అనుకుంటూనే - ఫీల్ మై లవ్
చరణం 2:
ఎరుపెక్కి చూస్తూనే కళ్ళారా - ఫీల్ మై లవ్ ఏదోటి తిడుతూనే నోరారా -
ఫీల్ మై లవ్ విదిలించి కొడుతూనే చెయ్యారా -
ఫీల్ మై లవ్ వదిలేసి వెళుతూనే అడుగారా -
ఫీల్ మై లవ్ అడుగులకే అలసటోస్తే చేతికి శ్రమపెరిగితే
కన్నులకే కునుకు వస్తే పెదవుల పలుకాగితే
ఆ పైనా ఒక్కసారి హృదయం అంటూ నీకొకటుంటే -
ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్... ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్... ఫీల్ మై లవ్
కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవూ
ఆనందంగా గడపడానికి కావాలి ఒక దీవీ (2)
సెలవు సెలవు సెలవు కనుగొను కొత్త దీవి నీవు
సెలవు సెలవు సెలవు కనుగొను కొత్త దీవి నీవు
కొలంబస్ కొలంబస్ ఇచ్చారూ సెలవూ
ఆనందంగా గడపడానికి కావాలి ఒక దీవీ
కొలంబస్ కొలంబస్ ఇచ్చారూ సెలవూ
ఆనందంగా గడపడానికి కావాలీ ఒక దివీ
సెలవు సెలవు సెలవూ కనుగొను కొత్త దివీ
నీవూ సెలవు సెలవు సెలవు
కనుగొను కొత్త దివీ నీవు
శని ఆది వారాల్లేవని అన్నవీ ఓ ఓ..
మనుషుల్ని మిషన్లు కావద్దన్నవీ
చంపే సైన్యమూ అణు ఆయుధం ఆకలి పస్తులూ డర్టీ పాలిటిక్స్
పొల్యుషన్ ఏదీ చొరబడలేని దీవి కావాలి ఇస్తావా // కొలంబస్.. //
చరణం 1:
వారం అయిదునాళ్ళు శ్రమకే జీవితం
వారం రెండునాళ్ళు ప్రకృతి కంకితం
వీచే గాలిగా మారి పూలను కొల్లగొట్టు మనసులు
చక్కబెట్టు మళ్ళి పిల్లల్లోకం మనదంతా ఆడి
పక్షుల రెక్కలు అద్దెకు దొరికితే
ఒంటికి తొడిగి పైకేగురు
పక్షుల కెన్నడూ పాస్ పోర్ట్ లేదూ
ఖండాలన్నీ దాటేల్లూ
నేడు విరామ మేఘవద్దు
అయినా విశ్రమించలేదు
నేడు నిర్వాణ చేపలల్లే - ఈదుదాం కొలంబస్ //కొలంబస్ కొలంబస్ //
చిత్రం: ఆమె ఎవరు?
రచన: దాశరధి
సంగీతం: వేద
చిత్రం విడుదల సంవత్సరం: 1966 ***************
పల్లవి:
ఓ నా రాజా.. రావా రావా.. (2)
చెలిని మరిచితివా? ఓ నా రాజా.. రాజారావా.. రావా.. // ఓ నా రాజా //
చరణం 1:
నీరూపే ఆశ రేపేను నీమాటే వీణ మీటేనూ.. (2)
గతాలే నన్ను పిలిచాయి..
ఆహా ఏమి ఈడు లేదోయి కలగా కరిగిందంతా
జగమే ఏంటో వింతా రేయి పగలూ నిన్నే వెతికేనోయి // ఓ నా రాజా //
చరణం 2:
వృధాగా కాలమీదేను నిరాశ పొంగివొచ్చేను (2)
తరంగంలా లాగా రావోయీ ప్రియా
నన్ను ఆదుకోవోయి ఏదో తీయని బాధ
కన్నిరోలికే గాధ రేయి పగలూ నిన్నే వెదికేనోయి // ఓ నా రాజా //
చరణం 3:
నీకోసం నేనే వచ్చాను నీ ఇంటికి దీపమైనాను (2)
నాతోనే ఆడుకోవయ్యా నీ కోపం నేడు నీకేలా
నీ అడుగులలో నేనూ నాకన్నుల్లో నీవు నాలో నీవు - నీలో నేనే // ఓ నా రాజా //
(విషాద గొంతులో) చరణం 4:
వరించిన మంచి వధువును లే
స్పృశించే తీపి మధువును లే ప్రియా
నీ ప్రేమ కథనోయి సదా నీ నీలి నీడనునే
ఏనాటిదో ఈ బంధం ఎన్నడు చెడదీ బంధం
రేయీ పగలూ నిన్నే వేదికేనోయీ.. // ఓ నా రాజా //
ఆ ఆ ఆ.. ఆ ఆ ఆ.. ఆ నా చెలి రోజావే
నాలో ఉన్నవే నిన్నే తలచేనే నేడే (2)
కళ్ళల్లో నీవే - కన్నీటా నీవే కనుమూస్తే నీవే -
ఎదలో నిండేవే కనిపించవో - అందించవో తోడు! // నా చెలి రోజావే //
చరణం 1:
గాలి నన్ను తాకినా నిన్ను తాకు జ్ఞాపకం
గులాబీలు పూసినా చిలిపి నవ్వు జ్ఞాపకం
అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం
మేఘమాల సాగితే మోహ కథలు జ్ఞాపకం
మనసు లేకపోతే మనిషి ఎందుకంటా..
నీవు లేకపోతే బతుకు దండగంటా
కనిపించవో అందించవో తోడు // నా చెలి రోజావే // ఆ ఆ ఆ .. ఆ ఆ
చరణం 2:
చెలియ చెంతలేదులే చల్లగాలి ఆగిపో
మమత దూరమాయనే చందమామ దాగిపో
కురుల సిరులు లేవులే పూలవనం వాడిపో
తోడులేదు గగనమా చుక్కలాగ రాలిపో
మనసులోని మాట ఆలకించలేవా
వీడిపోని నీడై నిన్ను చేరనీవా
కనిపించవో అందించవో తోడు // నా చెలి రోజావే //
రంగు రంగోలి కోరింది నువు పెట్టిరంగే పెట్టిన
మేఘం విరిసి గాజుల సవ్వడి ఘల్ ఘల్,
రంగు రంగోలి కోరింది నువుపెట్టే
రేంజ్ పెట్టిన మేఘం విరిసి సుందరి,
వందరి,చిందల ,వందల,చల్లని పున్నమి వెన్నల
పూవైనా పూస్తున్న నీ పరువంగానే పుడతా,
మధుమాసపు మల్లెల మాటలు రగిలించే ఉసురే,
నీవే నా మదిలో అడ నీనే నీ మతమై రాగా,
నా నాడు నీడకు నీ శబ్దం ఉందేమో,
తోడే దొరకని తోడూ విలవిలలాడే
వంటరి వీనం ..మ్మ్.. ప్రేమించే....ఉహవా నీ నేనా అడిగా.. // ప్రేమించే ప్రేమవా //
చరణం 2:
నెల నెలా వాడుక అడిగి నెలవంకల గుడి కడదామా,
నా పొదరింటికి వీరే అతిధులు రాతరమా
తుమ్మెద తెన్నలు తేలే నీ మదిలో చోటిస్తావా
నీ వడిగి ఎదపై ఎవరో నిదురించ తరమా
నీవే సంద్రం చేరి గల గలా పారే నది తెలుసా // ప్రేమించే ప్రేమవా //
కు కు కు కు కూ కు కు కు కూ కూ కోకిల రావే
కు కు కు కు కు కూ కోకిల రావే
రాణివాసము నీకు ఎందుకో కో కో
రెక్క విప్పుకో చుక్కలందుకో కో కో
చరణం 1:
రంగుల లోకం పిలిచే వేళ
రాగం నీలో పలికే వేళ
విరుల తెరలే తెరచి రావే
బిడియం విడిచి నడచీ రావే
నా పాటల తోటకు రావే
ఈ పల్లవి పల్లకిలో
నా పాటల తోటకు రావే
ఈ పల్లవి పల్లకిలో
స్వరమై రావే
విరి పొదల ఎదలకు //కు కు కు కూ కోయిల//
చరణం 2:
సూర్యుడు నిన్నే చూడాలంట
చంద్రుడు నీతో ఆడాలంతా
బురుజు బిరుదు విడిచి రావే
గడప తలుపు దాటి రావే
నువ్వు ఏలే రాజ్యం ఉంది
ఆ నాలుగు దిక్కులలో
నువ్వు ఏలే రాజ్యం ఉంది
ఆ నాలుగు దిక్కులలో
లయగా రావే ప్రియ హృదయ జతులకు // కు కు కు కూ కోయిల //
ఈ గాలీ ఈ నేలా ఈ వూరు - సెలయేరు
ఈ గాలీ ఈ నేలా ఈ వూరు - సెలయేరు
నన్నుగన్న నా వాళ్ళు ఆ నా కళ్ళ లోగిళ్ళు
నన్నుగన్న నా వాళ్ళూ ఆ నా కళ్ళ లోగిళ్ళు // ఈ గాలీ ఈ నేలా //
చరణం 1:
చిన్నారి గోరువంక కూసేను ఆ వంక
నా వ్రాత తెలిశాక వచ్చేను నా వంక (2)
ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్ళకు కలిసాక (2)
ఉప్పొంగిన గుండెలకేక ఎగసేను - నింగి దాక (2) // ఈ గాలీ ఈ నేలా //
చరణం 2:
ఏనాడు ఈ శిల్పి కన్నాడో ఈ కళనూ
ఏ ఉలితో ఈ శిలపై నిల్పాడో ఈ కళనూ (2)
ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ గగనూ (2)
ఈ రాలే జవరాలై ఇక నాట్యాలాడేను (2)..
తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో
తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో
విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో
శత జన్మాల బంధాల బంగారు క్షణమిది // తెలుసా మనసా ఇది //
చరణం 1:
ప్రతి క్షణం... నా కళ్ళల్లో నిలిచే నీ రూపం!
బ్రతుకులో అడుగడుగునా నడిపే నీ స్నేహం!
ఊపిరే నీవుగా ప్రాణమే నీదిగా
పది కాలాలు వుంటాను నీ ప్రేమ సాక్షిగా... // తెలుసా మనసా ఇది //
ఆహ్ హా- ఆహ్ హా ఆ...
వచనం:
డార్లింగ్, ఎవెరి బ్రీథ్ యు టేక్,
ఎవెరి మూవ్ యు మేక్ ఐ విల్ బి దేర్,
వాట్ వుడ్ ఐ డు వితౌట్ యు?
ఐ వాంట్ టు లవ్ యు ఫరెవర్!..
అండ్ ఎవెర్ అండ్ ఎవెర్!
చరణం 2:
ఎన్నడూ తీరిపోని రుణముగా వుండిపో!
చెలిమితో తీగసాగే మల్లెగా అల్లుకో
లోకమే మారినా కాలమే ఆగినా -
మన ఈగాధ మిగలాలి తుదిలేని చరితగా // తెలుసా మనసా ఇది // ఆహ్ హా.. అహ్ హా ఆ...
Some posts of my blog just collects the information, images and links hosted or posted by other search engines / server / groups / people / mails.. which are distributed for free over the Internet. We do not link to any copyrighted books, We do not host or upload any files.
www.achampetraj.blogspot.com is not responsible for the accuracy, compliance, copyright, legality, decency, or any other aspect of the content of other linked sites. If you have any legal issues please contact appropriate media file owners / hosters.
If you feel that any content on this blog has objectionable or violating your copyrights, or anybody has any copyright claim on it and doesn’t wish the information provided to be shown on this site,
P L E A S E put a comment in the posts, we will remove them off - IMMEDIATLY.. Any inconvenience is regretted.