Saturday, October 19, 2013

Ramappa Temple - 4

మూడో భాగం Ramappa Temple - 3 తరవాయి భాగం.

ఇప్పుడు ఆ రామలింగేశ్వర స్వామీ ఆలయము లో ఎడమ ప్రక్కగా ఉన్న శిథిలమైన గుడి ఒకటి ఉంది అని చెప్పాగా. ఆ గుడి గురించి చెబుతున్నాను.

ఈ గుడి రామప్ప గుడి ప్రాకారములో ఉంటుంది. శ్రీ రామలింగేశ్వర స్వామీ ఆలయానికి ఎడమ వైపుగా ఉంటుంది. గోపురం కూలి వర్ష ధారలు గోడలపంటి ఏర్పరిచిన గుర్తులు కనిపిస్తాయి. పై ఫోటోలో మీకు కనిపిస్తున్నది ఆ గుడి ఎడమవైపున భాగం. 

ఆలయం లోకి వెళ్ళటానికి ఇదే దారి. తురుష్కుల దండయాత్రల్లో కాళ్ళూ, తొండాలు విరిగిన రెండు ఎనుగుల మధ్య నుండి లోపలి వెళ్ళాల్సి ఉంటుంది. తూర్పు అభిముఖముగా ఈ గుడి ఉంటుంది. ఈ రెండు ఏనుగుల మధ్య ఒక ఫోటో దిగితే చాలా బాగుండే ప్రదేశం అది. 

ఎత్తైన పీఠం మీద ఉన్న ఆ గుడి శిల్ప కళ. పైన రాతి కప్పు కొద్దిగా పడిపోయిన విషయాన్నీ ఇక్కడ మీరు చూడవచ్చును. 

ఆ గుడి - కొద్దిగా లాంగ్ షాట్ నుండి ఇలా ఉంటుంది. 

ఆ గుడి ఎడమ వైపు భాగం ఇలా ఉంటుంది. మరీ ఎడమలో రామలింగేశ్వర ఆలయ గోపురం కూడా కనిపిస్తున్నది. 

ఇసుక రాతితో కట్టిన స్తంభాలు, కళా నిర్మాణాలు. 


పైకప్పు ఆలయ ప్రక్క భాగాల్లో ఇలా అక్కడక్కడ కూలిపోయింది. అంత బరువు పైకప్పులని వెయ్యటం మరీ గొప్ప విషయం. 

పైకప్పు సాదా సీదాగా ఉంచకుండా దానికీ చక్కని నగిషీ చెక్కారు. ఈ నగిషీ పనితనములో క్రిందికి వ్రేలాడినట్లు ఉన్న బొడ్డేలు చెక్కి, సున్నితమైన ఆ పనితనముతో ఉన్న ఆ పైకప్పుని ఎలా స్థంభాల మీదకి చేర్చారో గానీ ఆలోచిస్తుంటే అద్భుతములా అగుపిస్తుంది. ఆ చదరాలు, వాటిలో గీతలు, సమాన దూరాలు, బొడ్డేలు.. ఓహ్!.. అద్భుతమే. 

ఆ గుడి గోడలూ ఇసుకరాతి నిర్మాణాలే. 

ఇది గుడి ఎడమ ప్రక్క భాగం. క్రింద పునాదుల వద్ద ఆధార పీఠం కదిలిన విషయాన్నీ మీరు ఇక్కడ చూడవచ్చును. 

ఆ గుడి లోపలి భాగం. లోపల కూర్చోనేట్లుగా చేశారు  మధ్యలో నంది విగ్రహం నల్లసరం గ్రానైట్ రాతితో చేశారు. ఆ నందిని చూస్తుంటే - ఆ శిల్పకలకి చాలా ముగ్ధులమై పోతాం. ఆ నునుపుదనం కేవలం ఈ కాకతీయుల శిల్పుల కళా నైపుణ్యమని, అదే వారి ప్రత్యేకత అని కూడా చెప్పుకోవచ్చును. 

నంది కుడి వైపున నుండి ఇక్కడ చూడవచ్చును. నిజముగా ఆ సైజులోని నల్లని నంది అక్కడికి వచ్చి కూర్చుందా అన్నట్లు అగుపిస్తుంది. ఆ కూర్చున్న గద్దె, ఆ నంది మూతీ దండయాత్రల్లో నాశనం చేశారు. 

కాలి గిట్టల వరకూ ప్రతిభాగాన్ని నునుపుగా చేశారు. గిట్టలలోని చీలిక కూడా చెక్కారు. అదే కాకుండా నుదిన వచ్చే రక్తపు సిరనీ స్పష్టముగా కనిపించేలా చెక్కారు. ఇంకా అద్భుతం అంటే ఆ నందికి వేసిన (చెక్కిన) ఆభరణాలు. అవి నిజమైనవా అన్నట్లు ఉంటాయి. అక్కడక్కడ సన్నని రంధ్రాలు వాటిని 3D లో చూపిస్తాయి. ఇవి నిజమై ఉంది, శాపవశాత్తున ఇలా రాతి రూపములోకి మారాయా అని అనుకుంటాము. 

(ఇంకా ఉంది.. మరో భాగములో కలుద్దాం..) 

No comments:

Related Posts with Thumbnails