Ramappa Temple - 10 తరవాయి భాగం.
రామప్ప గుడిలో మరో సంభ్రముగా కనిపించేవి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న మండపం స్థంభాలు, మధ్యలో ఉన్న పైకప్పు నగిషీ పనితనం. సరిగా పర్యవేక్షణ లేకుండా ఉండి, దానివల్ల కళాకాంతులు కోల్పోయినట్లుండే ఈ ఆలయ శిల్ప సంపద - నిజముగా వెల కట్టలేనివి. ఇంత అద్భుతమైన పనితనం కాపాడి, ముందు తరాల వారికి అందించే బాధ్యత ఆలయ నిర్వాహకులకు ఉంది.
ఆలయానికి ఎదురుగా ఉండే నాలుగు స్థంభాలలో ఇది ఒకటి. అచ్చు ఇలాగే మరో మూడు ఉంటాయి. వీటి మీద ఉన్న శిల్ప సంపద వెల కట్టలేనివి. చాలా అత్యద్భుతముగా ఉంటాయి.
ఇదే ఆ అద్భుత శిల్ప సౌందర్యం ఉన్న నాలుగు స్థంభాల మండపం లోని స్థంభాలు. వాటి మీద ఉన్న కళాకృతులు, నునుపుదనం.. ఓహ్! వర్ణింప వీలుకాదు. నేను చూసినవాతిల్లో మాస్టర్ పీస్ అనదగ్గ గొప్ప కళా నిలయాలు.
ఆ నాలుగు స్తంభాలలో - ప్రతివాటికీ ఉన్న ఈ డిజైన్ ని గమనించారా? చుట్టూ వలయాకృతిలో, సన్నని శిల్ప పట్టిని అలా సున్నితముగా, విరిగిపోకుండా - ఎలా చెక్కారో, ఎంతగా కష్టపడ్డారో ఒక పట్టాన అర్థం కాదు. ఆలోచిస్తుంటే - ఒక పట్టాన కొరుకుడుపడని శిల్ప సంపద. ఆ పట్టీలోని అన్నింటికీ రంధ్రాలు చెయ్యటం మరీ అద్భుతమనే చెప్పాలి.
చూశారు కదూ.. నేను చెప్పిన మాటలు నిజమే కదూ..
వీటిల్లో ఉన్న సన్నని గొలుసు డిజైన్స్ చూశారా ? నిజమే అవి అన్నట్లుగా ఎంత బాగా చెక్కారు కదూ..
(మరికొన్ని ఇంకో భాగము లో..)
No comments:
Post a Comment