Wednesday, October 9, 2013

Good Morning - 475


ఎంత పరుగులెట్టినా తెలిసీ.. ఎన్ని దారులు మారినా అలసినప్పుడు నేను కోరే మజిలీ నీ జ్ఞాపకం. ఎంత దూరమెళ్లినా - గతంపై ఎన్ని రంగులద్దినా అప్పుడప్పుడూ తరచి, తరచి చూసే పేజీ మన స్నేహం. 

మన జీవిత ప్రయాణంలో ఎంతగా కష్టపడి, ఎన్ని శిఖరాలు ఎక్కినా, ఎన్నెన్ని దారుల్లో ప్రయాణించినా, ఎంత దూరం సాగినా - అలసినప్పుడు మనం కోరే అందమైన అందమైన మజిలీ ( తాత్కాలిక విడిది ) మనకిష్టమైన వారి జ్ఞాపకమే. ఆ జ్ఞాపకాల్లో మనల్ని మనం మమేకమై పోతాం. జీవితాన ఎంత దూరం వెళ్ళినా, మన గతంలోని జ్ఞాపకాలని తలచుకోకుండా ఎంతగా అనుకున్నా, వాటిని దూరం చేసుకున్నాం అని మనం అనుకున్నా - అప్పుడప్పుడూ - మళ్ళీ మళ్ళీ ఆ జ్ఞాపకాలని చూడాలని మనసు ఉవ్విళ్ళూరుతుంది. పైకి ఎంత వద్దనుకున్నా, ఎంత బెట్టు చేసినా మళ్ళీ మన ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు.. అనుకున్న వారి జ్ఞాపకాలని మళ్ళీ గుర్తుచేసుకుంటాం. 

No comments:

Related Posts with Thumbnails