Saturday, October 5, 2013

Good Morning - 471


కోపానికి బద్ధ శత్రువు - ఓర్పు. 
ఆ ఓర్పుకి ప్రతీక - సాలె పురుగు. 
కోపం వచ్చినప్పుడు, సాలేపురుగుని గుర్తు చేసుకో!.. 

గదిలో ఒక మూలగా నిశ్శబ్దముగా - 
ఓర్పుగా - ఒంటరిగా అది గూడు కట్టుకుంటుంది. 
ఎవరినీ సాయం అడగకుండా, ఎవరినీ బాధించకుండా.. 
తన నుంచి తాను విడిపడుతూ  తనని తాను త్యాగం చేసుకుంటూ, 
పోగు తరవాత పోగు గొప్ప ఏకాగ్రతతో ఒక శిల్పి చెక్కినట్లు.. 
గొప్ప నైపుణ్యముతో, ఒక డాక్టర్ నరాల్ని ముళ్ళు వేసినట్లు, 
తన సామ్రాజ్యాన్ని, తాను నిర్మించుకుంటుంది. 
ఒక హడావిడి ఉదయాన్నే - 
గోడమీద నుంచి పెద్ద శబ్దముతో వచ్చిన చీపురుకట్ట ఒక్క వేటుతో - 
దాని శ్రమనంతా తుడిచి పెడుతుంది. 
సర్వ నాశనం అయిన సామ్రాజ్యంలో నుంచి సాలెపురుగు 
అనాధలా నేల మీద పడుతుంది. 
కానీ, ఎవరినీ కుట్టదు. 
ఎవరి మీదా కోపం ప్రదర్శించదు. 
మళ్ళీ తన మనుగడ కోసం - క్రొత్త వంతెన నిర్మించుకుంటుంది. 
సహనం పోగులని, నమ్మకం గోడల మీద తిరిగి తిరిగి స్రవిస్తుంది. 
ఎలా బ్రతకాలో మనిషికి పాఠం చెబుతుంది. 

No comments:

Related Posts with Thumbnails