నువ్వు వెతుక్కుంటూ వెళ్ళే ప్రేమ కన్నా నీ నీడ వెంటే ఉండే ప్రేమ ఎంతో మేలు. ముందు దాన్ని గుర్తించు.
దీన్నే మరొక రకముగా కూడా చెప్పోచ్చును. మనం ఇష్టపడ్డవారి వెంటబడి, వారి ప్రేమని పొందటంలో వెంపర్లాడటం కన్నా, మనల్ని అభిమానించేవారు చూపే ప్రేమ ఎన్నో రెట్లు మేలు.
ఉదాహరణగా చెప్పాలీ అంటే మనం అభిమానించేవారి శుభకార్యాలకి వెళ్ళామే అనుకోండి. అక్కడ వారి కష్టాల్లో, పనుల్లో సాయం అందించడానికి ముందుకు చొరవగా వెళ్తాం. మన శ్రమ వారి దృష్టిలో పడటానికి ఎన్నెన్నో పనులు చిన్న గుర్తింపు కోసం చేస్తాం. వారి గుర్తింపు వస్తే - సంతోషం. రాకుంటే వారి బీజీలో వారున్నారు అని సర్దిపుచ్చేసుకుంటాం. అక్కడ మనకి అంత VIP ట్రీట్మెంట్ అంటూ ఏమీ ఉండకపోవచ్చును.
అదే మనల్ని అభిమానించే వారి ఇంటికి ఇలాంటి ఫంక్షన్ కే వెళ్ళామే అనుకోండి. అక్కడ మనతో ఒక్క పని కూడా చేయించరు. ఒకవేళ మనం చెయ్యాలని చూసినా, వస్తువులు లాగేసుకొని, " అయ్యో! మీరు అతిధులు. మీరు పని చెయ్యటమా..? అక్కడ ఊరికే కూర్చోండి.. " అంటూ హాయిగా కూర్చోండబెడతారు. కానీ మనల్ని ఒక్క సాయమూ చేయ్యనివ్వరు. మొత్తానికి మనల్ని, VVIP వారిలా చూసుకుంటారు. ఇలాంటివారి దగ్గరే మనకి నిజమైన ప్రేమ దొరుకుతుంది. వారినే ఎక్కువగా పట్టించుకోవాలి. కానీ వాస్తవ జీవితాన ఇలాంటి వారిని ప్రక్కన పెట్టేస్తాం. మనకి అందనివారి మెప్పుకోసం, వారి నుండి వచ్చే గుర్తింపు కోసం, చిన్న పొగడ్త కోసం.. వారి కనుసన్నల్లో ఉండటానికి తెగ తాపత్రయపడుతాం. కానీ, అలా చెయ్యటం ఎన్నడూ మంచిది కాదు.
No comments:
Post a Comment