రెండో భాగం Ramappa Temple - 2 తరవాయి.
( అప్లోడ్ చేసిన ఫోటోలలో దాదాపు అన్నీ కంప్రెస్ చేశాను. నాకు అప్లోడింగ్ కి కాస్త వీలుగా ఉండాలని. అలాగే కొన్ని మాస్టర్ ఫొటోస్ కూడా పెట్టాను. మొత్తం చదివాక ఆ ఫోటోల మీద క్లిక్ చేస్తే - పెద్దగా కనిపిస్తాయి. అప్పుడు బాణం గుర్తు కీలను < > లను వాడి, అక్కడే ఉండి, చూస్తున్నట్లుగా ఉంటుంది. గమనించ ప్రార్థన. )
ఆగ్నేయ మూల నుండి మీకు ఆలయం ఇలా కనిపిస్తుంది. సరియైన ఈ కోణములో ఆ రామప్ప గుడిని ఫుల్ ఫోటో తీసుకోవాలంటే ఆ మామిడి చెట్టు అడ్డుగా ఉంటుంది.
గుడికి కుడి ( Right side ) భాగములో ఇలా ఉంటుంది.
గుడికి కుడి వైపున ఉండే ప్రవేశ ద్వారము. ఇక్కడ నుండి ప్రవేశం లేదు అన్నట్లు ఒక పైపుని ఇలా రెండు ఏనుగుల మీదుగా అమర్చారు. ఈ ఏనుగులు కూడా - మహమదీయుల దండయాత్రల్లో వాటి కాళ్ళు, తొండాలు.. నాశనం చెయ్యబడ్డాయి.
గుడికి కుడి ప్రక్క భాగం. ఇక్కడి శిల్పకళ చాతుర్యం మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
ఇలా ఒక గద్దె ఏర్పాటు చేసి, ఆ గద్దె లో చాలా లోతుగా చెక్కి, దాని మీద ఆలయం ఏర్పరచటం కాకతీయుల శిల్పులకే చెల్లింది.
ఈ శిలా ఏనుగులు నిజానికి ఆ గుడి మెట్ల - చెరోవైపునా ఉండి, స్వాగతం పలికేలా ఉంటాయి. కానీ తురుష్కుల దండయాత్రల్లో అలా ధ్వంసం కావించబడ్డాయి.
ఇది రామలింగేశ్వర ఆలయానికి కుడివైపున ఉంటుంది. కూలిపోయి, శిథిలావస్థలో ఉంది. లోనికి పోవద్దని బోర్డ్ పెట్టారు. దగ్గరగా వెళ్ళి పరికిస్తే - మరో శివాలయం లా కనిపిస్తుంది.
ఇదే మనం ఈ గుడి లోపలి ప్రవేశించిన - పశ్చిమ ద్వారము. ఇది ఆలయ వెనక భాగాన ఉంటుంది. లోపలి నుండి చూస్తే - ఈ ఆలయ ప్రవేశ మార్గం ఇలా కనిపిస్తుంది. ప్రక్కనే ఆలయ చరిత్ర గురించి, తెలుగు ఇంగ్లీష్ లలో - పురావస్తు శాఖ వారు ఏర్పాటు చేసినవి కనిపిస్తాయి. ఆ ద్వారము మీద అంత పెద్ద రాతి బండ కమానుగా అమర్చారు. ఇదీ అప్పటి సాంకేతిక నైపుణ్యం. ఇప్పుడు ఇలా చెయ్యటం చాలా కష్టసాధ్యమేమో..
మొత్తానికి గుడి చుట్టూ ఉన్న వాటిని పరిచయం చేశాను. ఇక్కడితో రామప్ప గుడి బాహ్య పరిస్థితి గురించి తెలియచేశాను. ఇక మరో టపాలో లోపలి విశేషాలు తెలుసుకుందాం.
(ఇంకా ఉంది.. )
No comments:
Post a Comment