Sunday, October 6, 2013

Good Morning - 472


( ఈ ఈ-కార్డ్ ని - నేను ఈ కార్డ్స్ చేసే మొదట్లో చేసినది. అప్పట్లో తెలుగులో వ్రాయడం మొదలెట్టలేదు. )

Never break four things in your life - 
Trust, 
Promise, 
Relation & 
Heart 
because when they break, they don't make noise but pains lot. 

మీ జీవితాన ఎలాంటి పరిస్థితుల్లోనూ - నాలుగు విషయాల్లో భగ్నం చెయ్యకూడదు. అవేమిటంటే : 
నమ్మకం, 
ఇచ్చిన మాట, 
బంధం మరియు 
హృదయం ( మనసు ).. 
ఎందుకలా చెయ్యకూడదు అంటే - అవి విచ్చిన్నం అయినప్పుడు - అవి చాలా లోలోన బాధ పడుతాయే కానీ, పైకి ఏమీ వ్యక్తం చెయ్యవు. 

అవును. పై విషయాల్లో ఎప్పుడూ అలా చెయ్యనేకూడదు. ఒకవేళ తప్పనిసరిగా చెయ్యాల్సి వచ్చినప్పుడు, ముందుగా స్థిమితముగా ఆలోచించండి. అవసరమైతే, మీకు మొహమాటానికి పోకుండా, సరియైన దిశానిర్దేశం చెయ్యగలవారు మీకు అందుబాటులో గనుక ఉంటే - వారి సలహాలని తీసుకోండి. కేవలం సలహాలని మాత్రమే. నిర్ణయం మాత్రం మీరు మాత్రమే తీసుకోండి. ఎందుకంటే - ఏది జరిగినా, కోల్పోయినా అది మీ నిర్ణయం వల్లే అలా అయ్యింది.. అనే కాసింత ఊరట మీలో ఉంటుంది. అలా ఉన్నప్పుడు కోల్పోయినప్పుడు - మీకు మరీ అంత బాధ కలగదు. 

అలాగే ఒక నిర్ణయం తీసుకోనేటప్పుడు - అలా తీసుకోవడానికి ముందు అనేకానేక దారులు ఉంటాయి. ఇది స్థిమితముగా కూర్చోండి, ఆలోచిస్తే అగుపిస్తాయి. ఆవేశములో గానీ, కోపములో గానీ మాటలు తూలి, చెడు నిర్ణయం తీసుకొంటే - అప్పుడు మీరే మిక్కిలి బాధ పడుతారు. ఈ బాధ కూడా అవతలివారి మాటల వల్ల రాదు. మాటల వల్ల వచ్చేది - అది తాత్కాలికం. కొద్దికాలం మాత్రమే ఆ బాధ ఉంటుంది. అదే మనల్ని పట్టించుకోకుండా నిశ్శబ్దముగా ఉంటే - ఆ నిశ్శబ్దమే మరింతగా బాధిస్తుంది. ఆ బాధ వర్ణింపతరం కాదు. 

పనిలో పనిగా ఇంకోమాట.! విచ్చిన్నం తప్పదు అన్నప్పుడు, మీకు ఇష్టమైన అవతలవారికి తక్కువ బాధ ఉండేలా నిర్ణయం తీసుకోండి. మీకు ఎక్కువ బాధ కలిగినా, అది కాసింత మధురముగానే ( Sweet Pain ) ఉంటుంది. ఇక్కడ ఒక ఉదాహరణ కూడా చెప్పాలనిపిస్తుంది. 

కొంతకాలం క్రిందట - ఒకరి విషయం లో పైన చెప్పిన నాలుగింటినీ - తప్పని పరిస్థితుల్లో విచ్చిన్నం చెయ్యాల్సి వచ్చింది. అది నా పరముగా - అందమైన బంధం అది. బోలెడంత నమ్మకం కుదుర్చుకున్నా. వ్యక్తిగత విషయాల్ని కూడా పంచుకొనే స్థాయిలో మా బంధం ఉండేది. కానీ కొన్ని పరిస్థితుల్లో - భగ్నం చేసి, దూరం కావాల్సివచ్చింది. వారిని ఎప్పుడూ ఇక బాధ పెట్టను అని మాట ఇచ్చిన నేను, దూరం జరగాల్సివచ్చి, నామీద ఏర్పడిన నమ్మకాన్నీ, మాతో ఏర్పడిన బంధాన్నీ, వారి మనసునీ ముక్కలుగా చెయ్యాల్సివచ్చి, ఇచ్చిన మాటనీ తప్పాల్సివచ్చింది. ఆ పరిస్థితుల్లో అలా చెయ్యటం తప్పనిసరి. నేనేకాదు.. నా స్థానాన ఎవరైనా ఉంటే - అలా చెయ్యటం తప్పదు. వారు సంతోషముగా ఉంటేనే మాకు సంతోషం. ఎంత ఆలోచించినా, ఎన్ని దారుల వైపు చూసినా అదే సరియైన పరిష్కారం. కాకపోతే - అవతలివారిని తక్కువ బాధపెట్టాలి అనుకొని, అన్ని తప్పులూ నావే అనుకొనేలా చేశాను. ఇలాంటివాడితోనా అంతవరకూ వచ్చాను అనుకొనేలా చేశాను. బాగా ఆలోచించి, మరో ముగ్గురి సలహాలను తీసుకొని, తన బాధ " కాసింత " తగ్గేలా చూసుకొని, దూరమయ్యాను. ఆ బాధ నేను భరించినా, వారికోసం ఆ మాత్రం చెయ్యకపోతే ఎలా అనుకొన్నా. ఇదంతా నా గొప్పకోసం చెప్పాలని చెప్పలేదు. కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు ఎదురయినప్పుడు - ఏమి చెయ్యాలో నాకున్న జ్ఞానం మేరకి - ఒక సలహాగా చెప్పాను. 


No comments:

Related Posts with Thumbnails