Tuesday, October 8, 2013

Good Morning - 474


కరిగిపోయిన కాలం తిరిగిరాని జ్ఞాపకం. 
తలచి, తలచి నిలిచిపోతే సాగదు నీ జీవితం. 
తిరిగిరాదు నీకు ఇష్టమైన గతం. 
ఆగిపోదు కష్టమైనా వర్తమానం. 
ఎన్ని ఆటుపోటులు ఎదురైనా ఆగదు నీ హృదయం. 
అది ఆగేసరికి - మిగలదు ఈ జీవితం. 
మరెందుకు నీ దారికిరాని వాటికై ఈ ఆరాటం. 
అనుభవించు - కష్టమైనా నష్టమైనా తిరిగిరాని ఈ నిముషం. 

కరిగి, వెళ్ళిపోయిన కాలం ఎప్పుడూ మళ్ళీ మన జీవితాన తిరిగిరాని జ్ఞాపకం. అది మధురమై ఉండొచ్చు, లేదా చేదుగా ఉండచ్చు. ఆ జ్ఞాపకమై అక్కడే నిలిచి, దాని గురించే ఆలోచిస్తూ ఉంటే మన జీవితం సాగదు. మన జీవితాన జరిగిన అందమైన, ఎంతో ఇష్టమైన గడిచిన జ్ఞాపకాలు ఎన్నడూ తిరిగిరావు. ప్రస్తుతం ఉన్న కొనసాగుతున్న జీవితం కష్టముగా ఉన్నా అది ఎన్నడూ దేనికోసమనీ ఆగదు. 

ఎన్ని ఎగుడు దిగుడ్లు ఉన్నా మన మనసు ఆలోచన ఆగిపోదు. ఒకవేళ అది ఆగిపోవడమంటూ జరిగితే, మన ప్రాణం పోయినప్పుడే కానీ మామూలుగా మాత్రం అలా జరుగదు. మన దగ్గరికి మళ్ళీ తిరిగిరాని - గతించిన జ్ఞాపకాల వెంట ఎందుకు పరుగులాటలు? ప్రస్తుతం మీ ముందున్న వర్తమానం లోని ప్రతి నిమిషాన్నీ - అది సంతోషమే గానీ, బాధతో కూడినదై ఉండనీ - దాన్ని మనస్పూర్తిగా అనుభవించడం చేయకతప్పదు. 

No comments:

Related Posts with Thumbnails