నిజమైన ప్రేమ అంటే.. ఒకరి కోసం ఒకరు చనిపోయిన రోమియో జూలియెట్ లది కాదు.
ఒకరికోసం ఒకరు బ్రతికిన మన అమ్మమ్మ తాతయ్యదీ, నాన్నమ్మ తాతయ్యదీను..!
అవును.. ఈ ప్రపంచములో ఒక్క రోమియో జూలియెట్ లది మాత్రమే నిజమైన ప్రేమ కాదు. మనకీ ఉన్నాయి అలాంటి నిజమైన ప్రేమ కథలు.. కథలు కూడా కాదు - నిజమైన జీవిత సత్యాలు. ఒకరికోసం ఒకరు చనిపోవడం కన్నా, ఒకరి కోసం ఒకరు జీవించడం గొప్ప. అలాంటి యాదార్థాలు మన చుట్టూ ఉన్న వారిలో అనేకం కనిపిస్తూ ఉంటాయి. మన చుట్టూ ఉన్న మాణిక్యాలు, మణులూ పెట్టుకొని, వాటిని పట్టించుకోక, ఎక్కడో ఉన్న వాటిని గుర్తిస్తాం. అంతే కానీ మన మాణిక్యాలని గొప్పగా కీర్తించం. అది వారు చేసుకున్న దౌర్భాగ్యమే అనుకుంటాను నేను.
No comments:
Post a Comment