Ramappa Temple - 9 తరవాయి భాగం
ఆ రామప్ప గుడిలోని బండలు పునాదుల్లోని మెతకదనం వల్ల ఇలా ఎగుడుదిగుడు అయ్యాయి.
ఇది శ్రీ రామలింగేశ్వర స్వామి గర్భగుడి ఎదురుగా ఉన్న మండపం పైకప్పు. చక్కని శిల్పసంపద కలిగిన పైకప్పు. చాలా నునుపుగా, సూక్ష్మముగా చెక్కిన శిల్ప కళాఖండం ఇది. కానీ పైకప్పు నుండి కారుతున్న నీటివల్ల, అది ఏర్పరిచిన నీటి చారికల వల్ల అంత అందముగా కనిపించదు. పురావస్తు శాఖ వారు ఈ విషయమై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే మరీ బాగుంటుంది.
చూశారు కదా.. అలా సన్నని పనితనం, నునుపుదనం ఇక్కడి శిల్పాల ప్రత్యేకత.
ఈ స్థంభాలు పైకప్పుకి ఆధారముగా ఉన్న నాలుగు నల్లని గ్రానైట్ స్థంభాలు. చక్కని పనితనముతో ఇవి చేసి ఉన్నాయి. సన్నని రంధ్రాల పనితనం ఇక్కడ చక్కగా చూడవచ్చు. సాంకేతికత ఏమీ లేని కాలములో ఇంతగా పనితనం చూపించటం మనల్ని మరీ అబ్బురపరుస్తుంది. ఈ క్రింది ఫోటోని మీకోసం పెద్దగా పెట్టాను.. పరిశీలనగా చూడండి. నిజమే అని మీరే ఒప్పుకుంటారు.
ఇంకా ఉంది.. మరో టపాలో కలుద్దాం.
No comments:
Post a Comment