..వరంగల్ లో వేకువ జామునే నిద్ర లేచాను. అప్పటికే ఇంకా చీకటిగానే ఉంది. మొదట చేసిన పని కెమరా బ్యాటరీలు చార్జింగ్, అలాగే నా మొబైల్ ఫోన్ బ్యాటరీ కూడా. అవి ఫుల్ చార్జింగ్ అయ్యాయి. నా సామానులు అన్నీ చూసుకొని, స్నానపానాదులు అన్నీ ముగించుకొని, రామప్ప టెంపుల్ Ramappa Temple కి బయలు దేరాను. బైక్ లో పెట్రోల్ చూసుకున్నాను. సరిపోతుంది.. అయినా మళ్ళీ కొంత పోయించాను. క్రొత్త దారి కదా.. మధ్యలో ఎక్కడ పెట్రోల్ బంక్స్ ఉంటాయో తెలీదు కదా.
వెళ్ళింది మరీ మె మాసపు ఎండాకాలం కదా.. వేసవి తీవ్రత మరీ ఎక్కువ కాకముందే తిరిగి రావాలన్నది నా ఆలోచన. నాకంటే నిండు వేసవుల్లో లాంగ్ డ్రైవ్స్ అలవాటే. కానీ కుటుంబంతో వెళ్ళినప్పుడు వారి శక్తీ, సాధ్యాసాధ్యాలు పరిగణలోకి తీసుకోవాలి కదా. అందుకే ఇంకా వెలుతురు రాకముందే బండి హెడ్ లైట్ వెలుతురులో బయలుదేరాం. అమ్మో అంత చీకట్లోనా అనుకునేరు. వరంగల్ సిటీ అవుట్ స్కర్ట్స్ లోని పెట్రోల్ బంక్ వద్దకి వచ్చేసరికి కొద్దిగా వెలుతురు వచ్చేసింది. హెడ్ లైట్ ఆఫ్ చేశాను.
పెట్రోల్ కొట్టిస్తూ, ఆపరేటర్ ని దారి అడిగాను. అదే దారి అంటూ ముందున్న రోడ్ ని చూపెట్టాడు. ఎంతదూరం అంటే బహుశా 70 kms. ఉండొచ్చును అన్నాడు. సరే అన్నాను. డబ్బులు ఇచ్చేసి, అతని సహాయానికి థాంక్ యూ మరియు బై చెప్పేసి, బైక్ ని ముందుకు దూకించాను.
ఆ బంక్ నుండి కొద్ది దూరం కి రాగానే నా మొబైల్ ని ఓపెన్ చేశాను. అందులో GPS ఆన్ చేశాను. అదే దారి. అక్కడి నుండి ఇంకో 70+ kms. గంటన్నర సమయం పట్టొచ్చు అని చూపెట్టింది. తరవాత టర్నింగ్ ఎక్కడ అని చూశాను. ఆ ఊరిపేరు గుర్తుపెట్టుకున్నాను. కొద్దిచోట్ల సింగల్ రోడ్ ఉన్నా హైవే లా ఉంది. తొందరగా వెళ్లాలని, సరిగ్గా కూర్చోమని చెప్పి, 60 - 70 స్పీడ్ మైంటైన్ చేస్తూ బండి నడపసాగాను. వేకువ ఝాము కాబట్టి, ఎక్కువగా ట్రాఫిక్ లేదు. ఆ బైక్ నాది కాదు. బంధువులది. దాని వెనక బ్రేక్ సరిగ్గా లేదు. లైనర్స్ బాగా అరిగిపోయాయి. బ్రేక్ చాలా నెమ్మదిగా పడుతున్నది. అంతా ఓకే ఉన్న బండి ఇమ్మంటే ఇది ఇచ్చారు వారు. ఏమీ అనలేక అదే నడపక తప్పలేదు. మధ్యలో లైనర్స్ మార్పిద్దాం అనుకున్నాను. కానీ సమయం సరిపోలేదు. లేకుంటే ఇంకా ఎక్కువగానే వేగంగా వెళ్ళేవాడిని.
దారిలో ఇంకో బైక్ వారు ఎదురొచ్చారు. మాకు ఎదురుగా ఉన్నప్పుడు - రోడ్ గతుకుల వల్ల బండికి పెట్టిన వారి లగేజ్ బ్యాగ్ ఊడి క్రింద పడింది. మేము బండి ఆపి, వారిని పిలిచినా పలకకుండా, కనీసం చూడకుండా వెళ్ళిపోతున్నారు. నేను బండి త్రిప్పి, వారిని ఫాలో అయ్యి, ఓవర్ టేక్ చేసి, కారణం చెప్పాను. వారు ముగ్గురు ఉన్నా చూడకుండా అలా వెళ్ళిపోతూనే ఉన్నారు. ఆ బ్యాగ్ తీసుకొని, థాంక్స్ చెప్పారు వారు.
మళ్ళీ మా ప్రయాణం చేశాం. దారిలో ఎక్కడైనా టిఫిన్, కాఫీ త్రాగుదాం అంటే అంత ప్రొద్దున ఎక్కడా హోటల్స్ తీయలేదు. కొన్ని దగ్గర తీశారు కాని అక్కడి అపరిశుభ్రత వల్ల ఆగలేదు. అలా రామప్ప టెంపుల్ వద్ద వరకూ అలాగే వెళ్ళక తప్పలేదు.
దారిలో అక్కడక్కడ సుందర దృశ్యాలు బాగానే కనిపించాయి. ఉషోదయ వేళల్లో కనిపించే దృశ్యాలు అవి. ఫోటో తీద్దామనుకున్నాను. కానీ నేను డ్రైవింగ్ ఉండటంలో వీలుకాలేదు. అలా అలా మెయిన్ రోడ్డు మీద నుండి సింగిల్ రోడ్డు మీదకి వచ్చాను. అక్కడి నుండి కొద్ది కిలోమీటర్ల దూరములో రామప్ప టెంపుల్. ఆ గుడి ములుగు మండలము, పాలంపేటలో ఉంది. ఆ మండల కేంద్రములో ఏమైనా దొరుకుతాయేమో అనుకున్నాను. కానీ అంత ప్రొద్దున ఎవరు షాప్స్ తెరుస్తారు? అక్కడ నుండి కొద్దిదూరములో ఉన్న జంగాల పల్లి వద్ద టర్న్ తీసుకొని, వెళ్ళాం. దారిలో ఆ ఆలయ స్వాగత తోరణం కనిపించింది. ఇక్కడ నుండి రామప్ప గుడి కొద్ది దూరమే. ఇక్కడ కూడా ఇంకా హోటల్స్ తీయలేదు.
( ఫోటోలలో దాదాపు అన్నీ కంప్రెస్ చేశాను. నాకు అప్లోడింగ్ కి కాస్త వీలుగా ఉండాలని. కొన్ని అలానే మాస్టర్ ఫొటోస్ - కంప్రెస్ చెయ్యనివీ ఉంచాను. మొత్తం చదివాక - ఈ ఫోటోల మీద డబల్ క్లిక్ చేస్తే, పెద్దగా కనిపిస్తాయి. అప్పుడు బాణం గుర్తు కీలను వాడితే, అక్కడే ఉండి, చూస్తున్నట్లుగా ఉంటుంది. గమనించ ప్రార్థన )

ఇదే రామప్ప ఆలయ స్వాగత తోరణం. ఈ కమాను క్రిందుగా లోనికి వెళ్ళాలి. అలా వెళ్ళితే శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం ( రామప్ప గుడి ) వస్తుంది.
కొంత దూరం వెళ్ళాక ఇలా రామప్ప గుడికి వెళ్ళే చిన్న, ఇరుకు వంతెన కనిపిస్తుంది. ఇందులో బస్సులు పట్టడం కష్టం అనుకుంటాను. అక్కడ బస్ ల పార్కింగ్ కి తగిన స్థలం కూడా లేదు. నిజానికి ఈ దారి ఆలయ వెనక వైపు గుండా ఆ గుడి లోనికి వెళ్ళే దారి. మాకు GPS లో అలాగే అగుపిస్తే అలాగే వెళ్ళాం. నిజానికి ఇక్కడి నుండి వెళ్ళటమే బాగుంటుంది. వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్. ఆటవస్తువులు, కీ చైన్స్.. లాంటివి ఇక్కడే కనిపిస్తాయి. తూర్పు ద్వారం గుండా లోనికి వెళితే మీకు అక్కడ ఇలా షాప్స్ ఏమీ కనిపించవు. ఏమైనా కావాల్సివస్తే ఉసూరుమంటూ మళ్ళీ అరకిలోమీటర్ దూరం ( గుడి ప్రాకారం మధ్యగా వస్తే ఈ దూరం. చుట్టూరా వస్తే ఇంకా ఎక్కువే ) ఉన్న ఇక్కడి వరకూ నడిచి, రాక తప్పదు. అప్పటికే చాలామంది వచ్చేశారు. శివదీక్షల్లో ఉన్న స్వాములవారు చాలానే మంది బైకుల మీద వచ్చేశారు. కొంతమంది కారుల్లో వచ్చారు.
ఇక్కడ ఉండేవి ఐదారు చిన్న చిన్న షాప్స్. అందులోనే అవి అమ్ముతారు. టీ, టిఫిన్స్ అప్పటికి ఇక్కడా మొదలెట్టలేదు. ఏమి చెయ్యాలో తెలీదు. అప్పుడే డ్రింకింగ్ వాటర్ బబుల్స్ ఆటోలో వచ్చాయి. ఆ షాపుల వారికి సప్లయ్ చేస్తున్నారు. ఒక షాపులో లీటర్ వాటర్ బాటిల్ బాగా చల్లగా ఉన్నది అడిగితే - ఇరవై రూపాయలు చెప్పారు. అబ్బా అంతనా ? అంటే ( మేము వెంట నీరు తెచ్చుకున్నాం.. అవి అక్కడికే సరిపోయాయి ) ఈ బాటిల్స్ తీసుకోండి అన్నారు. అవి - ఈ డ్రింకింగ్ బబుల్ నీటితో నింపి చల్లగా అందిస్తున్నారు. బాటిల్ కాకుండా కేవలం చల్లని నీటికి లీటర్ కి రెండు రూపాయలు. ఇంకేం.! తలో లీటర్ వాటర్ త్రాగాం. అవి బాగా చల్లగా ఉన్నాయి. మా బాటిల్ లో ఆ నీరు నింపుకున్నాం. కొన్ని బాగున్న కీ చైన్స్ అక్కడ కొన్నాం. అవి తప్ప అక్కడ మరేవీ బాగోలేవు.
ఈ సింగిల్ ఫేస్ ట్రాన్స్ ఫార్మరే అక్కడి దుకాణాలకి విద్యుత్తును ఇస్తుంది. ఆ ట్రాన్స్ ఫార్మర్ కి ఉండే జంపర్ రాడ్ స్థానాన ఇలా కర్ర ఉంది. దానిని లాగి - ఫ్యూస్ పోయినప్పుడల్లా క్రొత్త ప్యూజ్ వేస్తుంటారు. ఇలా కర్ర ఉండటం వల్ల విద్యుత్ ఘాతం బారిన పడమని వారి ఆలోచన కాబోలు. హాస్చర్యముగా ఉందని ఈ ఫోటో తీశాను.
ఇదే ఆలయ వెనక భాగం గుండా రామప్ప గుడి లోనికి వెళ్ళే గేటు. కంకర తేలిన దారి మీదుగా వెళ్ళాలి. ఇక్కడ పర్యాటకులు కూర్చోవటానికి పచ్చిక, త్రాగటానికి నీరు ఏర్పాటు చేశారు. ఇక్కడే లోనికి వెళ్లేందుకు టికెట్స్ అమ్ముతారు. మనిషికి రూ. 5
ఆలయ ప్రవేశ సమయ పట్టిక. ఉదయం ఆరు నుండీ సాయంత్రము ఆరు వరకూ గుడి తెరుస్తారు. మేము అప్పటికే చేరుకున్నాం. ఆరుంపావుకి గానీ లోనికి ప్రవేశం చెయ్యనివ్వలేదు. అప్పటికే లోపల కొద్దిమంది పర్యాటకులు, శివభక్తులు ఉన్నారు. లోన పూజలు చేసుకొని తిరుగు ప్రయాణమయ్యారు వారు.
ఆ గేటుని దాటగానే ఇలా కంకర తేలిన దారి వస్తుంది. ఆ దారిలో వెళితే ఇలా పశ్చిమ ద్వార దిశగా చేరుకుంటాం.
ఇదే రామప్ప గుడి. పశ్చిమ వాయవ్య దిశ నుండి ఇప్పుడు ఆ గుడి మీకు కనిపిస్తున్నది. పైన తెల్లగా కనిపిస్తున్నది ఆలయ గోపురం.
ఈ ఆలయ గోపురాన్ని తేలికైన ఇటుకలతో కట్టారు. ఆలయబరువు ఎక్కువ అవటంతో ఇలా తేలికైన ఇటుకలు - అవీ నీటిలో వేస్తే తేలేవి అయిన వాటితో కట్టారు. అలా ఎందుకో మీకు ముందు తెలుస్తుంది.
పశ్చిమ ద్వారము. బరువైన రాతి పిల్లర్ల మీద రాతి స్థంభం క్రిందుగా లోపలికి వెళ్ళాలి. అంత బరులని ఎలా అంతగా నిలబెట్టారో అప్పటివారు.
రామప్ప గుడి గురించి పురావస్తు పర్యవేక్షణ శాఖ వారు ఏర్పరిచిన తెలుగులో ఉన్న వివరణ బోర్డు.
రామప్ప గుడి గురించి పురావస్తు పర్యవేక్షణ శాఖ వారు ఏర్పరిచిన ఇంగ్లీష్ లో ఉన్న వివరణ బోర్డు.
రామప్ప గుడి ప్రధాన ఆలయ వెనక భాగం. వెనక ద్వారం గుండా వస్తే మీకు మొదటగా మీకు ఈ భాగమే కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న దిశ - పశ్చిమ వాయవ్య దిశ. North-west.
రామప్ప ఆలయానికి ఎడమవైపు అంటే - ఉత్తర North భాగములో ఉండే మరో చిన్న గుడి. ఈ గుడి శిధిలావస్థలో ఉంది.
ఆ ప్రక్కగా ఉండే గుడి యొక్క కుడి ప్రక్క భాగం. ( Right side )
ఆ శిథిలావస్థలో ఉన్న గుడి ఈ కట్టడం వెనక భాగములో మీకు కనిపిస్తున్నది. ఈ కట్టడం - శిలాశాసనం.
( ఇంకా ఉంది. రెండో భాగములో చూడండి. ఫొటోస్ తేలికగా కనిపించుటకై ఇలా భాగాలుగా చెయ్యాల్సి వచ్చింది.)
No comments:
Post a Comment