[తెలుగుబ్లా గు:22082] కి నా సమాధానం.
బ్లాగ్ మిత్రులారా!
నమస్కారం.బ్లాగులో ఏదైనా ఒక టపా పోస్ట్ చేస్తున్నప్పుడు సేవ్ ( Save ) అవక, అంతరాయం ఏర్పడింది అని హెచ్చరిక వస్తుంది. అంటే ఇలా క్రింది రూపంలో మనకు కనిపిస్తుంది. అలా వచ్చినప్పుడు అందాక మనం వ్రాసిన పోస్ట్ - ఆ బ్లాగ్ లో పబ్లిష్ కాలేదు అని అర్థం. అంటే ఇంకా డ్రాఫ్ట్ ( తయారీ ) లోనే ఉందని అర్థం. మనం వ్రాసిన భావజాలం ఇంకా జాగ్రత్త చెయ్యబడలేదు అని అర్థం చేసుకోవాలి. ఇలా వచ్చినప్పుడు కాసింత జాగ్రత్తగా ఉండాలి కూడా.
ఇలా వచ్చిందీ అంటే - నాకు తెలిసీ కొన్ని కారణాలు ఉన్నాయి.
1. మనం పోస్ట్ చెయ్యాలీ అనుకున్న టపాలో వీడియో, ఫొటోస్ అప్లోడ్ చేస్తున్నప్పుడు - అవి సగం వరకూ అప్లోడ్ అయినప్పుడు
2. బ్లాగర్ సర్వర్ బీజీగా ఉండటం మూలాన అలా జరగవచ్చు.
3. మన ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడ్ - తగినంతగా ఉండక, డ్రాప్ అయి ఉండొచ్చును. ఇలా నెట్ వేగం సరిపోనంతగా లేనప్పుడు కూడా టపా పబ్లిష్ కాదు.
పైన చిత్రం లో చూపినట్లుగా - బ్లాగ్ లో టపా పబ్లిష్ చేయబోతున్నప్పుడు మీకు అలా వచ్చినట్లయితే, ఆ నీలిరంగు బాణం గుర్తు వద్ద చూపినట్లుగా, Ignore warning మీద మౌస్ కర్సర్ ఉంచి, నొక్కితే ఆ అంతరాయం సూచన పోతుంది. అప్పుడు మళ్ళీ మీరు Save గానీ, Publish అనే బొత్తామును గానీ నొక్కి సేవ్ / పబ్లిష్ చేసుకోవచ్చును. అప్పటికీ అలాగే వస్తుంటే మీరు మళ్ళీ ఆ అంతరాయ సూచనని తొలగించి, సేవ్ / పబ్లిష్ నొక్కుతూ వెళ్లాల్సిందే.
రండు, మూడు సార్లు ఇలాగే జరిగితే - అప్పుడు మీరు మీ టపా ని మళ్ళీ ఒకసారి ప్రూఫ్ చెయ్యండి. ఎక్కడో ఒకదగ్గర ఏదైనా టైపు గానీ, స్పేస్ గానీ పెట్టి మళ్ళీ పబ్లిష్ చెయ్యండి. ఒక్కోసారి ఇలా కూడా యాదృచ్చికంగా వర్కౌట్ అవుతుంది.

అలాగే మాటి మాటికీ రావటం, లేదా పవర్ పోవడం వల్లనో, మరే కారణం వల్లనో ఇలా సేవ్ గానీ, పబ్లిష్ గానీ చేసుకోలేనప్పుడు - అప్పటిదాకా మనం వ్రాసిన టపా లో ఎంతవరకు ఆటో సేవ్ ( Auto save ) పద్ధతిలో సేవ్ అయ్యిందో, అంతవరకే సేవ్ అవుతుంది. మిగతా అంతా కోల్పోయినట్లే. ఇలా జరిగితే - సేవ్ కాని విషయం మీకు గుర్తుంటే ఫరవాలేదు. మళ్ళీ టైప్ చేసుకోవచ్చు. లేకుంటే అంతే సంగతులు.
ఇలా సేవ్ కానప్పుడు, మీకు పవర్ పోతుంది అని గానీ, లేదా ఏదైనా పని ఉంది ప్రక్కకి వెళ్ళాల్సిన అవసరం గనుక ఉంటే - మీరు వ్రాసిన దాంట్లో ఆటో సేవ్ కాని విషయాన్ని - ఉజ్జాయింపుగా అంచనా వేసి, కర్సర్ తో మార్క్ చేసుకొని, నోట్ ప్యాడ్ లో గానీ, ఎక్సెల్ ఫైల్ లో గానీ, మీ సోషల్ సైట్ లో ( ప్రవైట్ ఆప్షన్ లో ) గానీ, మీ జీమెయిల్ లోని Compose లో క్రొత్త మెయిల్ గా సేవ్ చేసుకోవాలి. పైన చెప్పిన సమస్యలు తోలిగాక, కాపీ - పేస్ట్ పద్ధతిలో పూర్తి చేసుకొని, అంతా మళ్ళీ సేవ్ చేసుకోవచ్చును.
ఇక్కడ మరో విషయం గమనించాల్సిందేమిటీ అంటే - ఇలా కాపీ పేస్ట్ చేస్తే - జిమెయిల్ లో మెసేజ్ బాడీలో చేసుకొంటే - టపాలోని విషయమే కాకుండా, ఫొటోస్ కూడా కాపీ పేస్ట్ లో వచ్చేస్తాయి. కానీ బ్లాగర్, జిమెయిల్ రెండూ గూగుల్ వారివే కాబట్టి, ఈ సందర్భాల్లో అంతగా వర్కౌట్ కాదు. ఫేస్ బుక్ సర్వర్లలో ఇలాంటి సమస్య ఉండదు. అక్కడ మితృలకి ఇబ్బంది కాకుండా - ప్రైవేట్ గా స్టేటస్ మెస్సేజ్ గా పోస్ట్ చేసుకోవడం మీకు తెలిస్తే, అలా కూడా చేసుకోవచ్చును. అయినా ఇంత దూరం వరకూ మీకు అవసరం రాదు. ఇలా జరగటం చాలా అరుదుగా ఉంటుంది. విషయ పరిజ్ఞానం క్రింద ఇది చెప్పాను. అంతే!.

No comments:
Post a Comment