Thursday, October 31, 2013
Wednesday, October 30, 2013
Tuesday, October 29, 2013
Monday, October 28, 2013
Ramappa Temple - 13
Sree Ramalingeshwara Swamy Temple బయట నుండి ఇలా కనిపిస్తుంది.
ఆ ఆలయం ప్రక్కన ఉన్న మామిడి చెట్టు క్రింద ఇలా మరో శివలింగం ఉంటుంది.
ఆలయానికి ఎదురుగా నందీశ్వర స్వామి గద్దె ఉంటుంది. దీని పైకి చేరుటకి - ముందున ఉన్న ఇనుప మెట్ల మీదుగా పైకి ఎక్కాలి.
కొద్దిగా శిధిలమయిన ఆ నందీశ్వరుని గద్దె.
ఇలా వచ్చి కూర్చుందా అన్నట్లు అగుపించే నల్లని నంది.
ఆ నంది గద్దెకి ఇరువైపులా ఉండే ద్వారపాలకులు.
ఆ నంది పూర్తి రూపం.
ఆ నందికి చెక్కిన / వేసిన రాతి ఆభరణాలు.
హ్మ్.. అద్భుత అనుభూతిలో ఉన్నారా ? అలాగే ఉండిపోండి. ఈ టపాతో రామప్ప గుడి Ramappa Temple పర్యటన పూర్తి అయ్యింది.
( అయిపొయింది - సమాప్తం )
Sunday, October 27, 2013
Ramappa Temple - 12
Ramappa Temple - 11 తరవాయి భాగం..
..ఇక రామప్ప గుడిలోని ప్రధాన ఆలయం లోని మండపం పైకప్పు సౌందర్యం గురించి, వర్ణింప వీలుకాదు. అదేమిటో మీరే చూడండి. నాకు మాటలు రావటం లేదు కూడా - అంతగా ముగ్దుడనయ్యాను.
నిజమే కదూ..
ఈ డిజైన్ ప్రధాన ఆలయ గర్భ గుడి వెలుపలది. ఈ గర్భగుడికి ఇంకా చక్కని డిజైన్స్ ఉన్నాయి కానీ, అనుమతించలేదు. ఇంతకన్నా దాటి కెమరా వెళ్ళలేదు. గర్భగుడిలో పెద్ద శివలింగం ఉంటుంది. అర్చనలూ, పూజలూ చేసుకోవచ్చును. లోపల ఒక పూజారి ఉంటారు.
ఈ గర్భగుడి ద్వారం ప్రక్కన ఈ డిజైన్స్ ఉన్నాయి. ఇంతవరకే ఫొటోస్ తీసుకోవటానికి అనుమతిని ఇచ్చారు. కొద్దిగా ప్రక్కన రెండు రాతి త్రాళ్ళు పెనవేసుకొని ఉన్నట్లు ఉన్న నిలువు శిల్పకృతిని ఫోటో తీసుకోవడానికి అనుమతి ఇవ్వలేదు. అది ఇంకా చాలా బాగుంటుంది.
శ్రీ రామలింగేశ్వర స్వామివారి తూర్పు ద్వారం. ఇందులోంచి అవతలకి వస్తే - నేరుగా ఎదురుగా కూర్చొని ఉన్న నందీశ్వరుని దగ్గరికి చేరుకుంటాం.
(మరిన్ని మరో టపాలో.. )
Saturday, October 26, 2013
Ramappa Temple - 11
Ramappa Temple - 10 తరవాయి భాగం.
రామప్ప గుడిలో మరో సంభ్రముగా కనిపించేవి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న మండపం స్థంభాలు, మధ్యలో ఉన్న పైకప్పు నగిషీ పనితనం. సరిగా పర్యవేక్షణ లేకుండా ఉండి, దానివల్ల కళాకాంతులు కోల్పోయినట్లుండే ఈ ఆలయ శిల్ప సంపద - నిజముగా వెల కట్టలేనివి. ఇంత అద్భుతమైన పనితనం కాపాడి, ముందు తరాల వారికి అందించే బాధ్యత ఆలయ నిర్వాహకులకు ఉంది.
ఆలయానికి ఎదురుగా ఉండే నాలుగు స్థంభాలలో ఇది ఒకటి. అచ్చు ఇలాగే మరో మూడు ఉంటాయి. వీటి మీద ఉన్న శిల్ప సంపద వెల కట్టలేనివి. చాలా అత్యద్భుతముగా ఉంటాయి.
ఇదే ఆ అద్భుత శిల్ప సౌందర్యం ఉన్న నాలుగు స్థంభాల మండపం లోని స్థంభాలు. వాటి మీద ఉన్న కళాకృతులు, నునుపుదనం.. ఓహ్! వర్ణింప వీలుకాదు. నేను చూసినవాతిల్లో మాస్టర్ పీస్ అనదగ్గ గొప్ప కళా నిలయాలు.
ఆ నాలుగు స్తంభాలలో - ప్రతివాటికీ ఉన్న ఈ డిజైన్ ని గమనించారా? చుట్టూ వలయాకృతిలో, సన్నని శిల్ప పట్టిని అలా సున్నితముగా, విరిగిపోకుండా - ఎలా చెక్కారో, ఎంతగా కష్టపడ్డారో ఒక పట్టాన అర్థం కాదు. ఆలోచిస్తుంటే - ఒక పట్టాన కొరుకుడుపడని శిల్ప సంపద. ఆ పట్టీలోని అన్నింటికీ రంధ్రాలు చెయ్యటం మరీ అద్భుతమనే చెప్పాలి.
చూశారు కదూ.. నేను చెప్పిన మాటలు నిజమే కదూ..
వీటిల్లో ఉన్న సన్నని గొలుసు డిజైన్స్ చూశారా ? నిజమే అవి అన్నట్లుగా ఎంత బాగా చెక్కారు కదూ..
(మరికొన్ని ఇంకో భాగము లో..)
Friday, October 25, 2013
Ramappa Temple - 10
Ramappa Temple - 9 తరవాయి భాగం
ఆ రామప్ప గుడిలోని బండలు పునాదుల్లోని మెతకదనం వల్ల ఇలా ఎగుడుదిగుడు అయ్యాయి.
ఇది శ్రీ రామలింగేశ్వర స్వామి గర్భగుడి ఎదురుగా ఉన్న మండపం పైకప్పు. చక్కని శిల్పసంపద కలిగిన పైకప్పు. చాలా నునుపుగా, సూక్ష్మముగా చెక్కిన శిల్ప కళాఖండం ఇది. కానీ పైకప్పు నుండి కారుతున్న నీటివల్ల, అది ఏర్పరిచిన నీటి చారికల వల్ల అంత అందముగా కనిపించదు. పురావస్తు శాఖ వారు ఈ విషయమై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే మరీ బాగుంటుంది.
చూశారు కదా.. అలా సన్నని పనితనం, నునుపుదనం ఇక్కడి శిల్పాల ప్రత్యేకత.
ఈ స్థంభాలు పైకప్పుకి ఆధారముగా ఉన్న నాలుగు నల్లని గ్రానైట్ స్థంభాలు. చక్కని పనితనముతో ఇవి చేసి ఉన్నాయి. సన్నని రంధ్రాల పనితనం ఇక్కడ చక్కగా చూడవచ్చు. సాంకేతికత ఏమీ లేని కాలములో ఇంతగా పనితనం చూపించటం మనల్ని మరీ అబ్బురపరుస్తుంది. ఈ క్రింది ఫోటోని మీకోసం పెద్దగా పెట్టాను.. పరిశీలనగా చూడండి. నిజమే అని మీరే ఒప్పుకుంటారు.
ఇంకా ఉంది.. మరో టపాలో కలుద్దాం.
Thursday, October 24, 2013
Ramappa Temple - 9
Ramappa Temple - 8 తరవాయి భాగం..
ఆలయ గర్భ గుడి వెలుపల ఎడమ భాగం.
ఇలా పిల్లర్లు ఎందుకంటే - ఆలయ పునాదులు కాసింత మెత్తదనం ఉన్న భూమిలో ఉన్నాయి. ఆలయ నిర్మాణము సగంలో ఉన్నప్పుడు ఈ విషయం శిల్పులు తెలుసుకున్నారు అనుకుంటా. అందుకే ఆలయ పైకప్పు తేలికైన, నీటిలో వేసినా తేలే పదార్థముతో ఇటుకలు చేసి గోపురం నిర్మించారు. అలా బాగా పెరిగిన పైకప్పు పడిపోకుండా ఉండటానికి ఇలా పిల్లర్లని ఏర్పాటు చేశారు.
ఇందాక చెప్పిన గుడి గోపురం ఇదే.
మరిన్ని శిల్పాలు.
గుడిలోకి పోవుటకు దారి - ఆలయానికి మూడువైపులా దారి ఉంది. అందులో ప్రధానమైనది తూర్పు దారి. ఇది ఎదురుగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫోటో గుడికి ఎడమవైపునది.
రామప్ప గుడి శిల్పాల బరువుకి ఇలా మండపం లోని గద్దెలన్నీ ఇలా కృంగి పోయాయి. అక్కడక్కడా లేచాయి. నేల ఆ ఆలయ బరువును మోయలేక, నేల స్వభావం మెత్తగా ఉండి ఉంటే ఇలా అవుతుంది.
ఆలయానికి ఎదురుగా ఇలా నందీశ్వర గద్దె ఉంటుంది.
నేలలో ఇలా రాళ్ళు లేచి ఉంటాయి. ఆలయ సౌందర్యం చూస్తూ కాళ్ళకి తట్టుకొని, ప్రమాదాల బారిన పడకుండా చూసుకోవాలి.
మరిన్ని మరో టపాలో..
Wednesday, October 23, 2013
Ramappa Temple - 8
Ramappa Temple - 7 తరవాయి భాగం.
.
మరిన్ని శిల్పాలనీ చూడండి
ఆ ఆలయ గోడల మీద శిల్ప కళ.
ఆ గుడి వాయవ్య మూల నుండి ఇలా కనిపిస్తుంది.
గర్భ గుడికి అటూ, ఇటూ రెండు గవాక్షాలు ఉంటాయి. వీటికి వేసిన శిల్పకళ, చెక్కిన బొడ్డేలు..... వావ్.. అద్భుతం. కిటికీ మీద కిటికీ అంటూ ఏర్పాటు చేశారు.
గుడి పైకప్పునకు చేసిన బొడ్డేల వరుసలు..
ఆ గవాక్షాల సైడ్ వ్యూ..
అంతస్థుల గవాక్షాలు.
వాటికి ఉన్న శిల్పకళ
ఇంకా ఉంది.. మరిన్ని ఫోటోలు మరో భాగం లో..
Subscribe to:
Posts (Atom)