అంతర్జాలములో సోషల్ నెట్వర్కింగ్ సైట్లో చాలా మందికి సభ్యత్వం ఉండి ఉంటుంది. నేనూ రెండు సంవత్సరాలనుండీ అలాంటి సోషల్ నెట్వర్కింగ్ గ్రూపుల్లో మెంబర్ని.. అన్నింట్లోనూ ఉన్నట్లు వీటిల్లోనూ మంచీ, చెడూ గమనించాను. ఇది రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటిది. ఈ రెండు సంవత్సరాల నా గమనింపు / విశ్లేషణ మీకు చెబుతాను.
ఈ స్నేహాలు ఎందుకు చేయాలి అంటే?
ఈ ప్రపంచములో స్నేహం చెయ్యని వాడంటూ ఎవడూ లేడు. ఎప్పుడో ఒకప్పుడు స్నేహితులతో మాట్లాడటం తప్పనిసరి. చిన్నప్పుడు కలసి తిరిగిన స్నేహితులు పెద్దయ్యాక కూడా కల్సి తిరగటం చాలా తక్కువ ఈ రోజుల్లో. జీవనం సాగించుటకో, లేదా మనలోని స్నేహ వెలతిని దూరం చేసుకోవటానికో ఈ ఆన్లైన్ స్నేహాలు తప్పనిసరి అవుతున్నాయి.
అలా మనకి మంచి స్నేహాల కోసం ఆన్ లైన్ స్నేహాలు చెయ్యటములో తప్పులేదు.. నిజజీవితములో పరిచయం అయ్యేవారు అందరూ మంచివారే ఉంటారని ఎలా అనుకుంటాము. అందులో కూడా మోసపోతున్నామే! ఇదీ అలాగే.. కురిసే ప్రతి వర్షం బిందువు స్వాతి ముత్యం ఎలా కాదో, కనపడే ప్రతి రాయీ విగ్రహం ఎలా కాదో.. ఇదీ అలాగే. ఒకమంచివ్యక్తిని కలిసేముందు పదిమంది (అంతకన్నా ఎక్కువే) పనికిరాని వాళ్ళని కలవాల్సివస్తుంది. మనిషి ఆశాజీవి. ఎప్పుడూ ఆ ఆశతోనే బ్రతకాలి. తప్పదు. లేకుంటే జీవితం నిస్సారం అయిపోతుంది.
కానీ ఇక్కడ ఒక భయంకర నిజం చెప్పాలనుకుంటున్నాను. ప్రతి వారి వద్ద నుండీ ఏదో ఒకటి నేర్చుకోలేకుండా ఉండలేము.. ఈరోజు మంచివారు అనుకున్నవారు రేపు మోసగాల్లై కావచ్చును. ఈరోజు బేకార్ అన్నవారు రేపు మనకే మంచీ చేయవచ్చు. చెప్పాగా మనిషి ఆశాజీవి అనీ. హిందీలో ఒక సామెత ఉంది. అదిప్పుడు చెబుతాను .."సోనా ఘస్కే దేఖ్ నా, దోస్తాన్ కర్కె దేఖ్ నా.." అనేది. అంటే - బంగారాన్ని రాయి మీద గీటు పెడితే తెలుస్తుంది. స్నేహాన్ని మాత్రం చేస్తేనే తెలుస్తుంది అని. నిజమే కదూ..
అలాగే ఇంకో విషయం కూడా చెప్పదలచుకున్నాను. ఎవరో ఒకరు ఏదో అన్నారని, ఎవరో ఏదో కామెంట్ చేసారని ఆ ఎకౌంటు క్లోజ్ చేయటం మూర్ఖత్వం నా దృష్టిలో.. అలా చేసిన వారిని డిలీట్ చెయ్యండి. వారినుండి మీ స్నేహితులనీ దూరం ఉండమని చెప్పండి. ఆ ఒక్కరికోసం మిగతా వారిని దూరం చేసుకోవటం సరియైన చర్య కాదు అనే అంటాను.
ఈ రోజు ఉదయం ఈ టపా పోస్ట్ చేశాక ఆర్కుట్ కి వెళ్లాను. అక్కడ ఈ టాపిక్ కి సంబంధించిన కో - ఇన్సిడెంట్ కనిపించింది. దాని తెరపట్టు (స్క్రీన్ షాట్) లను తీశాను అదే ఇప్పుడు మీకు చూపిస్తాను. కొద్దిగా వివరణ ఇస్తాను.. మీరే అర్థం చేసుకోండి. ఈ మొదటి తెరపట్టు ని చూడండి. అది నా ఆర్కుట్ అకౌంట్ ని ఓపెన్ చేసినప్పుడు ప్రమోషన్ దగ్గర ఇలా కనిపించింది. ఇలా రావటము ఇదే క్రొత్తానుకొని ఓపెన్ చేసి చూసి.. నాకే ఈ సైటు వాడకం దారుల మీద అసహ్యం వేసింది. అదేమిటో మీరూ చూడండి. ఇందులో promotion అన్న దగ్గర చూడండి. ఒక అమ్మాయి ఫోటో ఉండ చూడండి. క్రింద అబ్బాయి ఫోటో ఉంది. నిజానికి ఇది ఒక మంచి పనికోసం ఆ ఆర్కుట్ వాడు పెడితే - ఇలా ఉపయోగిస్తున్నారు. ఆ అమ్మాయికి అబ్బాయికి ఏదో గొడవలు అయినట్లున్నాయి. మనసులో దాచుకొని, అందరికీ మంచివాడిలా కనపడాలని (పబ్లిక్ తెలివిమీరారు) ఇలా I have suggested Priya as new friend to you అని పెట్టాడు. నిజానికి ఆమె ఎకౌంటు నేను ఎప్పుడూ చూడలేదు కనుక ఇది నిజమా తెలీదు. (తాజాకలము: (3-జూన్) ఈ విషయానికి వివరణగా కామెంట్స్ లో సుజిత్ గారి కామెంట్ చూడండి. అసలు విషయం తెలుస్తుంది.)
పర్సనల్ విషయాలు :
మీ పర్సనల్ విషయాలు అంటే మీ ఇంటి అడ్రెస్, ఆఫీస్ అడ్రెస్, ఫోన్ నంబర్స్, బాంక్ అక్కౌంట్స్, ప్రాపర్టీ విషయాలూ, క్రెడిట్ కార్డ్ డిటైల్స్, పర్సనల్ విషయాలూ.. అలాంటివి అసలు చెప్పకూడదు. చెప్పారా.. ఇక మీరు ఇబ్బందుల్లో పడటం ఖాయం. ఇక ఆడవారు ఇలాంటివి చెబితే.. .. ఇక ఆ దేవుడే రక్షించాలి. చాట్ లలో కూడా ఈ విషయాలు అసలు ప్రసక్తి రానేకూడదు. అసలు మనం చేసేది ఫ్రెండ్షిప్పా.. లేక మోసపోవటమా.. అనేది బాగా గుర్తుంచుకోవాలి..
ఫోటోలు :
ఆడవారు అంటే ఏదో భద్రత కోసం తమ పూర్తి వివరాలు సోషల్ వర్కింగ్ సైట్లలో పెట్టకూడదు. ప్రొఫైల్ ఫోటోగా మరీ బాగున్న, అందముగా దిగిన ఫోటో పెట్టకండి. అలాంటిది పెట్టినా తోడుగా భర్తనో, అన్నయ్యో, తమ్ముడో, పిల్లలో కలసి ఉన్న ఫోటో పెట్టండి. మీ ఫోటో ఆల్బం అంటూ పెట్టుకుంటే నమ్మదగ్గ వ్యక్తులకి మాత్రమే అగుపించేలా సెట్టింగులు పెట్టండి..
ఆడవారు తమ ఫొటోస్ ఎక్స్పోజింగ్ లా ఉండేవి పెట్టకండి. బహుశా ఇండియా లో అలా ఫొటోస్ పెట్టడం చాలా తక్కువ. (ఉన్నారు. కాకపోతే వారి ఫోటోలకి తాళాలు వేసి ఉంటాయి.) కొండకచోట అన్నట్టుగా ఉన్నారు. విదేశాలలో ఇది చాలా ఎక్కువ. ఫేస్ బుక్ లలో ఇలాంటివి చాలా ఎక్కువ. అవన్నీ కాపీ చేసి బ్లాక్మెయిల్ చెయ్యగలరు జాగ్రత్త..
సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో అమ్మాయిల ప్రొఫైల్ కి ఫోటో, ఇతర వివరాలు అనవసరం. ఒకవేళ ప్రొఫైల్ కి ఫోటో పెట్టినా మరీ బాగున్న ఫోటో పెట్టకండి. ఇక్కడ మనం చేసేది స్నేహమే.. నాకొక ఫ్రెండ్ ఉంది - తన ఫోటో చూపించింది.. అబ్బో! అలాంటి అమ్మాయిని బహుశా ఏ అబ్బాయి ఇష్టపడకపోవచ్చు. అయినా తను మంచి మనసున్న అమ్మాయి. ఆమె మాటలు మాత్రం చాలా స్వచ్ఛముగా, బాగుండేడివి.
అసలు ఒక్కసారి ఫోటో పెడితే అది ఇక శాశ్వతం అని గుర్తుపెట్టుకోండి. చాలామంది అనుకుంటారు ఇలా ఫొటోస్ పెడితే కాపీ చేసుకోరాదని. ఎందుకంటే వారు అలా ఫోటో మీద రైట్ క్లిక్ చేసి "Save picture as.." అనే ఆప్షన్ కోసం చూస్తారు కాని. అది రాదు కనుక ఇక ఎవరూ కాపీ చేసుకోరని అనుకుంటారు.. వాస్తవం మాత్రం వేరు.. అలా నా బ్లాగులో ఫొటోస్ కాపీ చేసుకోవచ్చు.. (అలా చాలా మంది కాపీ చేసుకుంటున్నారనీ, నాకు తెలుసు.) వేరే ఎక్కడైనా కాపీ చేసుకోవచ్చు.. అలా సోషల్ సైట్లలో కాదు అని అనుకుంటారు.. నాకైతే చాలా సింపుల్ అయిన రెండు పద్దతులు తెలుసు. అలాని నేను ఇంతవరకూ దుర్వినియోగం చెయ్యలేదు. అయినా ఈ విషయాలు చాలామందికి తెలుసు.. ఆ పద్ధతుల గురించి ఇక్కడ వివరించను - క్షమించాలి.
ఫోన్ నంబర్స్ :
సాధారణముగా ఎప్పుడూ వాడే ఫోన్ నంబర్స్ ఆన్ లైన్లో పెట్టకండి. ఒక డబుల్ సిమ్ ఫోన్ కొని మైంటైన్ చెయ్యండి. ఇప్పుడు సిమ్ ధరలు చాలా దిగివచ్చాయి. కొన్ని పది రూపాయలకే వస్తున్నాయ్. ఇంకొన్ని అయితే ఉచితముగానే ఇస్తున్నారు. (వారికేం లాభం అంటే: ప్రతి ఇన్ కమింగ్ కాల్ వస్తే ఆపరేటర్ కి నిముషానికి 37 పైసల ఆదాయం ఉంటుంది.) అలాంటిది ఒకటి తీసుకొని ఫోన్లో పెట్టాక అప్పుడు నంబరు చెప్పండి - అదీ అవతలివారు బాగా నమ్మకంగా అనిపించాకనే!
మీరు బిజీ ఉన్నప్పుడు ఎవరైనా ఫోన్ చేస్తే - ముందు ఫోన్ చేసిన విషయం ఏమిటో తెలుసుకోండి. తరవాత మాట్లాడుతా అని చెప్పి కట్ చెయ్యండి. వీలున్నప్పుడు వారికి కాల్ చేసి మాట్లాడండి.
ఫోన్‌చేసి బాగా విసిగిస్తే వారితో మాట్లాడుతూనే ఎటో వైపు చూసి (ఫోన్ ని కొద్ది దూరముగా పెట్టి) "రండి.. రండి.. మీకోసమే ఎదురుచూస్తున్నా.. బాగున్నారా.. కూర్చోండి.." అని, మీకు ఫోన్ చేసిన వారితో - "గెస్ట్స్ వచ్చారు తరవాత మాట్లాడుతా.." అని చెప్పి లైన్ కట్ చెయ్యండి. ఇలా నాలుగైదు సార్లు చేస్తే అవతలివారు ఇక ఫోన్ చెయ్యకపోవచ్చు..
మీరు వాడే సిమ్ మొబైల్ ఆపరేటర్ మీరిచ్చే నంబర్‌లోనే తెలుస్తుంది. నాకు తెలిసిన ఒక మిత్రుడు - మీరు XXXXXX కంపనీ మొబైల్ సిమ్ వాడుతున్నట్లయితే, ఆన్ లైన్లో చూసి మీరు ఆ ఫోన్ సిమ్ ఖరీదు చేసినప్పుడు ఇచ్చిన అడ్రెస్ ని ఆన్ లైన్లో చూసి చెప్పగలడు. టెక్నాలజీ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో, నష్టాలూ అంతే ఉన్నాయి. రెండువైపులా పదను ఉన్న కత్తి ఇది.
ఫోన్ చేసి ఎక్కడైనా కాలవాలని అనుకుంటే ముందుగా బాగా రష్ గా ఉండే పబ్లిక్ ప్లేస్ ఎంచుకోండి. తోడుగా ఇంకో మిత్రుడినీ దూరముగా ఉంచుకోండి. బోర్ వస్తే సైగ చెయ్యగానే మిమ్మల్ని పలకరించి, మిమ్మల్ని అక్కడి నుండి తీసుకేల్లెలా ఉండగలగాలి.
వీడియోలు :
వీడియోలు పెట్టాలి అనుకునేవారు సాధారణముగా ఇంట్లోని వీడియోలు పెట్టడం అంత మంచి పద్ధతి కాదు. ఒకవేళ పెట్టినా కొద్దిమంది చూసేలా పెట్టండి చాలు. ఇక బెడ్ రూం వీడియోలు అసలే వద్దు.. కొన్ని గ్రూపుల్లో అలాంటి వీడియోలు పెట్టారు. అవి సాధారణముగా పర్సనల్ కోసమని తమ "శక్తి సామర్థ్యాలు" ఇంకొకరికి చూపితే, అవతలి వారు గమ్మున చూసి వదిలేయకుండా, నెట్లో పబ్లిక్ గా పెట్టి విశ్వవ్యాప్తం చేశారు. అందుకే తస్మాత్ జాగ్రత్త.
ఎలాగూ ఆ టాపిక్ వచ్చింది కాబట్టి అలాంటి వీడియోలు మీ సిస్టం లలో పెట్టి ఉంటే ఒక CD లోకి మార్చుకొని డిలీట్ చెయ్యండి. మీ సిస్టం ఎప్పుడైనా హాకింగ్ కి గురవుతే.. ఇక మీ రహస్యాలు విశ్వవ్యాప్తమే! (ఇలాంటి విషయమే మొబైల్ ఫోన్ల గురించి త్వరలో మీకు చెబుతాను)
మీ పర్యటన వీడియోలు.. మీరు కనపడని వీడియోలు అయితే బెస్ట్.
ఫోటో కామెంట్స్ :
మీ ఫొటోస్ కి మీ మిత్రులు కామెంట్స్ చేస్తారు. అది చాలా సాధారణం. ఒకవేళ - ఆలా ఎవరూ చేయ్యవోద్దూ అంటే సెట్టింగ్స్ లలోకి వెళ్లి ఆ ఆప్షన్ ఎన్నుకోవాలి. కాని సరదా ఉండే కామెంట్స్ అయితేనే మంచిది. బోర్ గా ఉన్నప్పుడు అవన్నీ చూస్తే మనసుకి ఉల్లాసముగా ఉంటుంది. నాకైతే బోర్ అనిపించినప్పుడల్లా అలా మళ్ళీ చూస్తాను.. ఈ కామెంట్ కి ఇలా వ్రాయాల్సి ఉండెను అనిపిస్తుంది. ఒక్కోసారి నవ్వు వస్తుంది కూడా..
కామెంట్స్ వ్రాయండి. వారు పెట్టిన ఫొటోస్ బాగుంటే మరీ, మరీ కామెంట్స్ చేసి బాగున్నాయని చెప్పండి. చిన్నగా బాగున్నాయి అని చెప్పకుండా ఒకటి, రెండు వాక్యాల్లో కామెంట్స్ చెప్పడానికే ప్రయత్నించండి. మొదట్లో ఇలా చేయటం కష్టమే అయిననూ.. కొంత అభ్యాసం చేస్తే ఈజీగా వస్తాయి. ఇంకా ఈజీగా తెలుసుకోవాలంటే వారివీ, వీరివీ ఫొటోస్ చూడండి.. అందులోని ఫొటోస్ లకి కామెంట్స్ ఎలా ఉన్నాయో గమనించండి. వాటికి వచ్చిన రిప్లైలను కూడా గమనించండి.
కొంతమంది సరదాగా, వ్యంగముగా, బాంబులు పేల్చినట్లుగా వ్రాస్తారు.. సరదాగా తీసుకోండి. ఇబ్బందిగా ఉంటే ఆ ఫోటో కామెంట్ ని డెలీట్ చేసెయ్యండి. మీ ఇబ్బందిని వారికి పర్సనల్ మెయిల్ లో సున్నితముగా వివరించండి. అలా చేస్తే మీ వ్యక్తిత్వం ఇంకా గొప్పగా ఎదుటివారికి కనిపిస్తుంది. వారు - మనుష్యులు అయితే మళ్ళీ అలా మీకు వ్రాయాలని అనుకోడు.
మీకు బాగా తెలివితేటలూ ఉంటే వారు వ్రాసిన దానికి మీరూ కట్ చేసినట్లుగా చెప్పండి. లేదా మీ దగ్గరి స్నేహితుల్లో, ఆన్ లైన్ స్నేహితుల్లో సహాయము తీసుకోండి. ఇది అన్నివేళలా సాధ్యం కాదు. కొద్దిగా అభ్యాసం చేస్తే ఈ టాలెంటు అబ్బుతుంది.
మీరే ముందుగా ఎవరి ఫోటోలకైన కామెంట్స్ - అదీ వారిని గెలికేలా వ్రాశారే అనుకుందాం. ఆ తరవాత వారు వ్రాసే రిప్లై వాటికి మీరు తట్టుకోగలిగి ఉండాలి. అలా అయితేనే ఎదుటివారిని గెలకండి. బుద్ధిగా ఉన్న, ఉంటున్న వారి జోలికి వెళ్ళకండి.
ఫ్రెండ్ రిక్వెస్టులు :
అసలైయిన చాప్టర్ ఇదే.. నిజజీవితములో కొందరిని రోడ్డు మీదే, ఇంకొందరిని ఇంటి ముందు గేటు వద్దే, మరికొందరిని ఇంటి డ్రాయింగ్ రూం లో.. ఎలా పలకరిస్తామో ఇక్కడా అంతే! వారి మీద అభిప్రాయాలతో మనకి దగ్గర్గానా, దూరము గానా ఉంచేది అన్నది ఎలా ఉంటుందో వారు మనల్ని ఆకట్టుకున్నా దానిమీద ఆధారపడుతుంది. నాకు తెలిసిన కొన్ని పద్ధతుల్ని చెబుతాను. మీకిష్టమైతేనే పాటించండి.
ఆడవారివి అయితే ఏదో వారికీ ఉండే స్వతహాగా ఉండే భయాల వల్లనో.. పూర్తిగా వివరాలు ఉండవు. ఇక్కడ వారు నిజముగా ఆడవారేనా అని తెలుసుకోవాలి. అలా తెలుసుకోవటానికి వారికి వచ్చేస్క్రాప్స్, వారు వ్రాసే స్క్రాప్స్ పరిశీలిస్తే తెలుస్తాయి. కొందరు మొగవారు కూడా ఇలా ఆడ పేర్లు పెట్టుకొని స్నేహాలు చేస్తున్నారు. అలా ఒకడిని నేను గుర్తించాను కూడా.
ఇక మీరు మగవారి / ఇతరుల నుండి నుండి వచ్చే అభ్యర్టనల లోని గమనించాల్సిన పద్ధతులు ఏమిటంటే :
1. ఎవరి వద్దనుండైనా మీకు ఫ్రెండ్ ఆడ్ రిక్వెస్ట్ వచ్చిందే అనుకోండి. వెంటనే ఆక్సెప్ట్ చెయ్యకండి.
2. అలా పంపిన వారి ప్రొఫైల్ ఫోటో మీద, లేదా మెయిల్ ID మీద గానీ క్లిక్ చెయ్యండి. వారి ప్రొఫైల్ కనీసం సగమైనా నిండి ఉందా చూడండి. కొందరి దాంట్లో ఏ...మీ ఉండదు. కేవలం మేల్, ఇండియా అని అంతే! మిగతావి చెప్పకపోవటములో వారికేం అభ్యంతరం? పోనీ అలా ఖాళీలు నింపకపొవటములో నిర్లక్ష్యమే అనుకుందాము.. అలాగే మనమీద కూడా నిర్లక్ష్యం చూపరని గ్యారంటీ ఏమిటీ?
3. అతను మొగవాడయితే ప్రొఫైల్ ఫోటో తనది పెట్టకుండా ఏదో పువ్వులూ, సినీ హీరోల బొమ్మలు పెట్టాడే అనుకుందాము.. కొద్దిగా అనుమానించాల్సిందే. అతని ఫోటో పెట్టుకోలేనంతగా వికారియా?.. లేక పెద్ద ఫాన్ ఫాలోయింగ్ హీరోలా? నేను గమనించిన వారిలో మాత్రం - అమ్మాయిలతో హస్కు వేసే, అందమైన మాటలూ చెప్పే వారే కనిపించారు. అలాంటి విషయాల్లో వారు ఫుల్లీ టాలెంటేడ్ పర్సన్స్.. అదే ఫోటో పెట్టుకున్న వారిలో అమ్మాయిలతో చాలా మర్యాదగా ఉంటున్నారు / మాట్లాడుతున్నారు. రేపు ప్రొద్దున ఏమైనా జరిగితే - అయ్యో నావల్ల ఇది జరిగిందే అని ఫీల్ అయ్యే వారిని చాలా మందిని చూశాను. ఉదాహరణకి - పైన నేను పరిచయం చేసిన ప్రమోషన్ అబ్బాయి. అతడు ఆ మాత్రం దానికే తెగ ఫీలయ్యాడు.. ఇలా ఒక్క ఫొటోనే పెట్టుకున్న వారు కాదు. తమ వివరాలూ దాదాపు అన్నీ పెట్టిన వారు చాలా బుద్ధిగా ఉండటం గమనించాను. అలా ఎందుకోగాని, కారణం ఏమి ఉంటుందో గాని తెలియదు.. .. బహుశా ఎవరైనా చీకట్లో ఉండి ఏమైనా ఎదుటి వారిని అనొచ్చు.. అదే వాడిని స్టేజి ఎక్కించి ఏదైనా మాట్లాడమంటే మాట్లాడక పోతాడుగా, కాళ్ళూ చేతులు వణుకుతాయి... ఇదీ అలాగే అనుకుంటాను. ఫోటో ఉన్నవారు చాలా అనుకువగా ఉన్నవారే ఉన్నారు. ఫోటో ఉన్న, మర్యాద తెలీని వాడిని ఒక్కడిని చూసాను. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపితే.. నేను అతని పేజిలో ఏమీ డిటైల్స్ లేవని, అందుకే రిజెక్ట్ చేస్తున్నా అంటే అమర్యాదగా మాట్లాడాడు. ఆ ఒక్కటి కేసు మినహా అంతా నేను అనుకున్నట్లే - ఫొటోస్ ఉన్నవారు అందరూ బుద్ధిమంతులే..(నేను చూసిన వరకు)
4. నా మిత్రురాలు ఒక లింక్ చెప్పారు.. అందులో ఉన్నది ఈమె మహిళా ఫ్రెండ్ కి ఫ్రెండ్. కొద్దిగా బంధుత్వం కూడా నట. అతను ఫోటో లేదు.. వివరాలూ లేవు. ఆడ్ చేసుకున్నాక బంధువు తెలిసింది.. ఎప్పటివో పగలు ఉంచుకొని రోజూ సతాయిస్తున్నాడు. డెలీట్ చెయ్యనివ్వడు.. నరకం చూపిస్తున్నాడు. అన్నింటికన్నా మించి అతను గవర్నమెంట్ ఆఫీసరు. తరచి చూస్తే ఇలాంటివి ఎన్నెన్నో వ్యధలు.
5. అమ్మయిలెప్పుడూ రాత్రి తొమ్మిది అవగానే నెట్ లోంచి వెళ్ళిపొండి. రాత్రి గడుస్తున్నా ఇంకా చాట్ అవైలబుల్ లో ఉన్నారే అనుకోండి - దీనికి బాగా ........... ఎక్కువ అయినట్లుంది.. అనుకుంటూ చాట్ చర్చలు అన్నీ "అటువైపు" దారి తీస్తాయి. ఇది నిజమే.. నాకు తెలిసిన ఒక FM రేడియో యాంకరూ, వారి అమ్మగారూ ఇలా బలయ్యారు. లండన్ లో వారి కూతురు ఉండేడిది. అలా రోజూ రాత్రి పన్నెండు గంటలకి జిమెయిల్ లో చాట్ చేసుకోనేడివారు. వీరు చేసినపోరబాటు ఏమిటంటే చాట్ అవైలబుల్ లో ఉండి చాట్ చేసేవారు. నిజానికి వారు చాలా అందముగా ఉండెడివారు అనుకోండి. వీరేంటీ! ఇలా చాట్ అవైలబుల్ లో ఉండి చాట్ చేస్తారు.. ఇలా ఇబ్బంది కాదా వీరికి.. అనుకున్నాను. ఇలా మీరు ఉండొద్దు అని చెప్పే చనువు నాకు వారితో లేదు. అనుకున్నట్లే వారు ఆ తరవాత వారం పదిరోజుల్లో వారిద్దరూ నెట్ కి రావటం కట్ అయ్యింది. ఒకరు నెట్ కి అసలే రానని, ఇంకొకరు ఇలా వచ్చి తనకి వచ్చిన ఆర్కుట్ స్క్రాప్స్ చూసుకొని వెళతారు. వారు చేసిన పోరబాటులు మీరే చూడండి. అంత రాత్రిపూట చాట్ అవైలబుల్ పెట్టడం, ఫొటోస్ అందరికీ కనపడేలా పెట్టడం (తమ మిత్రులకే కాదు వేరేవారు చూసినా కనపడేలా), తమ అక్కౌంట్ కి తగిన సెట్టింగ్స్ ఎలాపెట్టాలో తెలీకపోవటం.. అడిగితే ఎవరైనా చెబుతారుగా.. అదే నెట్లో, లేదా అదే సోషల్ సైట్‌లోని మిత్రులతో చర్చించినా ఏ సమస్యకి పరిష్కారం దొరికేది వారికి. ఆ అమ్మాయి పుట్టినరోజు కి ఆమె స్క్రాప్ బుక్‌లో పదిహేడు పేజీల వరకూ స్క్రాప్స్ ఉండేడివి.అంటే 170 వరకూ పుట్టినరోజు శుభాకాంక్షల సందేశాలు. నాకే ఈసారి కష్టపడితే ఏడు పేజీల గ్రీటింగ్స్ ( అంటే డెబ్భై ) అంతే. అంతగా ఫాలోయింగ్ ఉన్న వారిని ఎక్కడా చూడలేదు. (చాలా అందమైన అమ్మాయి కదా) అలాంటిది ఆమె చేసిన పొరబాట్లకి, ఆమెనే మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఏమైంది ఆన్లైన్ కి రావటం లేదూ అని తనతో అంటే అసహ్యకర వ్రాతలూ, చేష్టలను చూసి మొత్తానికి వెళ్ళిపోయాను - అన్నారు. నాకైతే వీరే పొరబాటు చేశారేమోనని అనిపిస్తుంది అప్పుడప్పుడు. అలా ఇబ్బంది పెట్టినవారిని తీసేస్తే సరిపోయేడిది. ఇక్కడ మరొక విషయాన్ని గమనించాలి. ఇలా అయిందని తన అకౌంట్ ని పూర్తిగా తీసేశారు. తరవాత నచ్చిన మిత్రులతో (వందకు లోపే) ఇంకో అకౌంట్ ఓపెన్ చేశారు. మళ్ళీ అలాగే అయ్యిందంట. ఇక లాభం లేదని మొత్తానికే దూరం అయ్యారుట. నన్ను పరిష్కారం అడిగితే - సెట్టింగ్స్ మార్చుకోండి అని చెప్పేవాడిని. అలాగే ఇంకొన్ని జాగ్రత్తలు చెప్పేవాడిని.
6. ఇంకో ఆమెది ఇలాంటి కథనే. వచ్చిన రిక్వెస్ట్ అన్నింటినీ ఓకే చేసి తీరుబాటుగా ఒక్కొక్కడినీ పరిచయం చేసుకొని, వారితో మాట్లాడాక అప్పుడు ఒక అభిప్రాయానికి వచ్చేడిది. ఎంచక్కా సాఫ్ట్వేర్ ఇంజనీర్ భార్య అయిన ఆమె దాంట్లో ఎన్నో పేరూ, అడ్డ్రెస్ లేనివి చాలానే ఉన్నాయి. నేను ఒకసారి చూసినప్పుడు తొమ్మిది వందలకి పైగా స్నేహితులు, అందులో కొంతమంది ప్రోఫైల్స్ లలో బాహాటముగానే సెక్స్ గురించిన అభిప్రాయాలు ఉన్నాయి. ఈవిడా అలాంటిదేనా అనే అనుమానం వచ్చింది.. కొద్ది నెలల క్రిందట వారూ, వీరూ "ఇబ్బంది" పెడుతున్నారని చాట్‌లో నాతో అంది.. కొన్ని నివారణా మార్గాలు చెప్పాను. ఆ తరవాతేమైందో గాని.. నాకు దూరం అయ్యారు. మనమేదో మేలు చేద్దాం అని చూస్తే అప్పుడప్పుడూ ఇలాంటి చిన్ని చిన్ని బహుమతులు దొరకవచ్చు.
7. అతనే కాదు, అతని మిత్రులు ఎలా అతన్ని ట్రీట్ చేస్తున్నారు, ఎలాంటి భావాలను వారు కలిగి ఉన్నారో మీకు వీలయితే గమనించండి.
8. ఆడ్ చేసుకునే ముందు - వారికీ మీకు మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారిద్దరి (ఆ క్రొత్త అతనూ, మీ మధ్య మ్యూచుయల్ ఫ్రెండ్) మధ్య ఉన్న / వ్రాసుకున్న స్క్రాప్స్ చూడండి. అతనికి వచ్చిన టెస్తిమోనియల్స్ కూడా ఒకసారి లుక్కెయ్యండి. అ తరవాత ఆ మ్యూచువల్ ఫ్రెండ్ ని అతడి గురించి అడగండి. అతని గురించి కనీసం ఫరవాలేదు అని వచ్చినా వెంటనే వారి ఫ్రెండ్ రిక్వెస్ట్ లని ఒప్పేసుకోండి. అతనికి నచ్చనివారు - మీకు నచ్చవచ్చు. లేదా అతనే వారిని తప్పుగా అర్థం చేసుకొని ఉండవచ్చును.
9. క్రొత్తవారు మీ పేజిలో స్క్రాప్స్ వ్రాసేలా సెట్టింగులు పెట్టండి. కొందరు - వారి ఫొటోస్, వీడియోలు చూడనీయకుండా పెట్టడములో అర్థం ఉంది.కానీ కొత్తవారు స్క్రాప్స్ వ్రాయనీకుండా సెట్టింగ్స్ పెట్టడములో ఉన్న ఇబ్బంది ఏమిటో నాకు అర్థం కాలేదు. నా పేజిలో అలా ఏమీ పెట్టలేదు. అయినా కొందరు మిత్రులు అలా నా స్క్రాప్స్ పేజిలో వ్రాసిన స్క్రాప్స్ వల్ల మిత్రులు అయ్యారు.. అలా అయినవారిలో ఇద్దరినీ కలిసాను కూడా.. ఎవరైనా అలా వచ్చి ఇబ్బంది పెడితే వారిని 'బ్లాక్' చెయ్యొచ్చు. అంటే వారిని మనదాకా రానీయకుండా ఆర్కుట్ వాడే (గూగుల్ వాడే) ఆపేస్తాడన్నమాట. ఇంకా మీకు నమ్మకం లేకపోతే.. ఈ మాత్రం దానికి ఆర్కుట్ కి వచ్చే బదులు హాయిగా జిమెయిల్ లో చాట్ చేసుకోవచ్చు, లేదా క్రొత్తగా వచ్చిన "బజ్" (ట్వీటార్ లాంటిది) వాడుకుంటే బెస్టు.
10. ఎన్ని వడపోతలూ,లెక్కలూ అయినా కూడా అప్పుడప్పుడూ కొందరు "మహానుభావులు" దొరుకుతారు. కొద్దిగా దూరం ఉంటే చాలు. ముందే చెప్పాగా - ఒకరు మంచి స్నేహితులుగా దొరికేముందు పదిమందికి పైగా పనికిరాని వాళ్ళని కలవాల్సి ఉంటుందని. మనం చిన్నప్పుడు క్లాసులో ముప్పై, నలభై మంది ఉన్నా.. అందరూ మనతో మాట్లాడినా కొద్దిమందితోనే ఎక్కువ సమయం గడుపుతాము.. ఇక్కడా అంతే అనుకోండి.
ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తూ..

చూశారు కదూ.. ఆ ఒక్క భాగమే క్రింద పెద్దగా చూపిస్తున్నాను. కావాలనే అమ్మాయి మొఖాన్ని ఎడిట్ చెయ్యటం లేదు - పరిస్థితి బాగా అర్థం కావాలని. (అ అమ్మాయి నన్ను మన్నించాలి). ఈ XXXX అనే అబ్బాయి ఆమె ఫోటో పెట్టి అలా ప్రమోషన్ చేశాడు. చెడుగా పెడితే.. కేసయితే కష్టమని కావచ్చు. ఆ వాక్య నిర్మాణం చూశారు కదూ. ఎంత పోలైట్ గా ఉందో.
ఆ అమ్మాయి ఫోటో మీద క్లిక్ చేశాను. నిజానికి అలా నొక్కితే ఆ అమ్మాయి ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. కాని అది ఓపెన్ అయ్యేముందు ఇలా ఇంకో బాక్స్ ఓపెన్ అయ్యింది. ఇందులో ఆమె ప్రొఫైల్ కోసమని నేను పసుపురంగులో ఉన్న బాణం గుర్తు వద్ద My Profile వద్ద నొక్కాను. అప్పటికే అలా నొక్కిన వారిలో నేను 8,53,038 వ వ్యక్తిని అన్న విషయం కూడా గమనించండి.
అలా నొక్కాక, ఇదిగో ఇలా డిలీట్ చేసారు.. అని వచ్చింది. ఆవిడ ఈ బాధపడలేక అలా డిలీట్ చేయవచ్చు. అందుకే జాగ్రత్తగా ఉండండి. చూసారు కదూ.. ఒక్కడి వల్ల ఆమె తన సామాజిక మిత్రులని దూరం చేసుకుంది. అందుకే చెబుతున్నాను. అందరినీ గుడ్డిగా నమ్మకండి. ఇలాంటిదే మరో యదార్థ సంఘటన కూడా ఉంది. అది ఇంకో టపాలో వ్రాస్తాను. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉంటారు కదూ!.. ఇందులో కాస్త ఐరనీ కూడా ఉంది. వాస్తవం ఏమిటో తెలీకుండా దీన్ని మా సోషల్ ఫ్రెండ్ స్ప్రెడ్ చేసాడు.. అంటే - అతని అక్కౌంట్ లో ఉన్న మిత్రులందరికీ ఇది చేరుతుందన్నమాట.. ఈ విషయమై అడగాలి అతడిని. సరైన సమాధానం రాకుంటే అతడిని నా ఫ్రెండ్స్ లోంచి రిమూవ్ చేసెయ్యాలి. (తాజా కలము:(2-జూన్ ) సాయంత్రం ఈ ఫ్రెండ్ ఆన్లైన్ లోకి వచ్చాడు.. నాకు తెలీక స్ప్రెడ్ చేశాను.. నీవు చెప్పేదాకా ఇలా అవుతుందని తెలీదు.. ఇంకెప్పుడూ మళ్ళీ ఇలాంటి పనులు అసలు చెయ్యనని మాట ఇచ్చాడు )
పర్సనల్ విషయాలు :
మీ పర్సనల్ విషయాలు అంటే మీ ఇంటి అడ్రెస్, ఆఫీస్ అడ్రెస్, ఫోన్ నంబర్స్, బాంక్ అక్కౌంట్స్, ప్రాపర్టీ విషయాలూ, క్రెడిట్ కార్డ్ డిటైల్స్, పర్సనల్ విషయాలూ.. అలాంటివి అసలు చెప్పకూడదు. చెప్పారా.. ఇక మీరు ఇబ్బందుల్లో పడటం ఖాయం. ఇక ఆడవారు ఇలాంటివి చెబితే.. .. ఇక ఆ దేవుడే రక్షించాలి. చాట్ లలో కూడా ఈ విషయాలు అసలు ప్రసక్తి రానేకూడదు. అసలు మనం చేసేది ఫ్రెండ్షిప్పా.. లేక మోసపోవటమా.. అనేది బాగా గుర్తుంచుకోవాలి..
ఫోటోలు :
ఆడవారు అంటే ఏదో భద్రత కోసం తమ పూర్తి వివరాలు సోషల్ వర్కింగ్ సైట్లలో పెట్టకూడదు. ప్రొఫైల్ ఫోటోగా మరీ బాగున్న, అందముగా దిగిన ఫోటో పెట్టకండి. అలాంటిది పెట్టినా తోడుగా భర్తనో, అన్నయ్యో, తమ్ముడో, పిల్లలో కలసి ఉన్న ఫోటో పెట్టండి. మీ ఫోటో ఆల్బం అంటూ పెట్టుకుంటే నమ్మదగ్గ వ్యక్తులకి మాత్రమే అగుపించేలా సెట్టింగులు పెట్టండి..
ఆడవారు తమ ఫొటోస్ ఎక్స్పోజింగ్ లా ఉండేవి పెట్టకండి. బహుశా ఇండియా లో అలా ఫొటోస్ పెట్టడం చాలా తక్కువ. (ఉన్నారు. కాకపోతే వారి ఫోటోలకి తాళాలు వేసి ఉంటాయి.) కొండకచోట అన్నట్టుగా ఉన్నారు. విదేశాలలో ఇది చాలా ఎక్కువ. ఫేస్ బుక్ లలో ఇలాంటివి చాలా ఎక్కువ. అవన్నీ కాపీ చేసి బ్లాక్మెయిల్ చెయ్యగలరు జాగ్రత్త..
సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో అమ్మాయిల ప్రొఫైల్ కి ఫోటో, ఇతర వివరాలు అనవసరం. ఒకవేళ ప్రొఫైల్ కి ఫోటో పెట్టినా మరీ బాగున్న ఫోటో పెట్టకండి. ఇక్కడ మనం చేసేది స్నేహమే.. నాకొక ఫ్రెండ్ ఉంది - తన ఫోటో చూపించింది.. అబ్బో! అలాంటి అమ్మాయిని బహుశా ఏ అబ్బాయి ఇష్టపడకపోవచ్చు. అయినా తను మంచి మనసున్న అమ్మాయి. ఆమె మాటలు మాత్రం చాలా స్వచ్ఛముగా, బాగుండేడివి.
అసలు ఒక్కసారి ఫోటో పెడితే అది ఇక శాశ్వతం అని గుర్తుపెట్టుకోండి. చాలామంది అనుకుంటారు ఇలా ఫొటోస్ పెడితే కాపీ చేసుకోరాదని. ఎందుకంటే వారు అలా ఫోటో మీద రైట్ క్లిక్ చేసి "Save picture as.." అనే ఆప్షన్ కోసం చూస్తారు కాని. అది రాదు కనుక ఇక ఎవరూ కాపీ చేసుకోరని అనుకుంటారు.. వాస్తవం మాత్రం వేరు.. అలా నా బ్లాగులో ఫొటోస్ కాపీ చేసుకోవచ్చు.. (అలా చాలా మంది కాపీ చేసుకుంటున్నారనీ, నాకు తెలుసు.) వేరే ఎక్కడైనా కాపీ చేసుకోవచ్చు.. అలా సోషల్ సైట్లలో కాదు అని అనుకుంటారు.. నాకైతే చాలా సింపుల్ అయిన రెండు పద్దతులు తెలుసు. అలాని నేను ఇంతవరకూ దుర్వినియోగం చెయ్యలేదు. అయినా ఈ విషయాలు చాలామందికి తెలుసు.. ఆ పద్ధతుల గురించి ఇక్కడ వివరించను - క్షమించాలి.
ఫోన్ నంబర్స్ :
సాధారణముగా ఎప్పుడూ వాడే ఫోన్ నంబర్స్ ఆన్ లైన్లో పెట్టకండి. ఒక డబుల్ సిమ్ ఫోన్ కొని మైంటైన్ చెయ్యండి. ఇప్పుడు సిమ్ ధరలు చాలా దిగివచ్చాయి. కొన్ని పది రూపాయలకే వస్తున్నాయ్. ఇంకొన్ని అయితే ఉచితముగానే ఇస్తున్నారు. (వారికేం లాభం అంటే: ప్రతి ఇన్ కమింగ్ కాల్ వస్తే ఆపరేటర్ కి నిముషానికి 37 పైసల ఆదాయం ఉంటుంది.) అలాంటిది ఒకటి తీసుకొని ఫోన్లో పెట్టాక అప్పుడు నంబరు చెప్పండి - అదీ అవతలివారు బాగా నమ్మకంగా అనిపించాకనే!
మీరు బిజీ ఉన్నప్పుడు ఎవరైనా ఫోన్ చేస్తే - ముందు ఫోన్ చేసిన విషయం ఏమిటో తెలుసుకోండి. తరవాత మాట్లాడుతా అని చెప్పి కట్ చెయ్యండి. వీలున్నప్పుడు వారికి కాల్ చేసి మాట్లాడండి.
ఫోన్‌చేసి బాగా విసిగిస్తే వారితో మాట్లాడుతూనే ఎటో వైపు చూసి (ఫోన్ ని కొద్ది దూరముగా పెట్టి) "రండి.. రండి.. మీకోసమే ఎదురుచూస్తున్నా.. బాగున్నారా.. కూర్చోండి.." అని, మీకు ఫోన్ చేసిన వారితో - "గెస్ట్స్ వచ్చారు తరవాత మాట్లాడుతా.." అని చెప్పి లైన్ కట్ చెయ్యండి. ఇలా నాలుగైదు సార్లు చేస్తే అవతలివారు ఇక ఫోన్ చెయ్యకపోవచ్చు..
మీరు వాడే సిమ్ మొబైల్ ఆపరేటర్ మీరిచ్చే నంబర్‌లోనే తెలుస్తుంది. నాకు తెలిసిన ఒక మిత్రుడు - మీరు XXXXXX కంపనీ మొబైల్ సిమ్ వాడుతున్నట్లయితే, ఆన్ లైన్లో చూసి మీరు ఆ ఫోన్ సిమ్ ఖరీదు చేసినప్పుడు ఇచ్చిన అడ్రెస్ ని ఆన్ లైన్లో చూసి చెప్పగలడు. టెక్నాలజీ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో, నష్టాలూ అంతే ఉన్నాయి. రెండువైపులా పదను ఉన్న కత్తి ఇది.
ఫోన్ చేసి ఎక్కడైనా కాలవాలని అనుకుంటే ముందుగా బాగా రష్ గా ఉండే పబ్లిక్ ప్లేస్ ఎంచుకోండి. తోడుగా ఇంకో మిత్రుడినీ దూరముగా ఉంచుకోండి. బోర్ వస్తే సైగ చెయ్యగానే మిమ్మల్ని పలకరించి, మిమ్మల్ని అక్కడి నుండి తీసుకేల్లెలా ఉండగలగాలి.
వీడియోలు :
వీడియోలు పెట్టాలి అనుకునేవారు సాధారణముగా ఇంట్లోని వీడియోలు పెట్టడం అంత మంచి పద్ధతి కాదు. ఒకవేళ పెట్టినా కొద్దిమంది చూసేలా పెట్టండి చాలు. ఇక బెడ్ రూం వీడియోలు అసలే వద్దు.. కొన్ని గ్రూపుల్లో అలాంటి వీడియోలు పెట్టారు. అవి సాధారణముగా పర్సనల్ కోసమని తమ "శక్తి సామర్థ్యాలు" ఇంకొకరికి చూపితే, అవతలి వారు గమ్మున చూసి వదిలేయకుండా, నెట్లో పబ్లిక్ గా పెట్టి విశ్వవ్యాప్తం చేశారు. అందుకే తస్మాత్ జాగ్రత్త.
ఎలాగూ ఆ టాపిక్ వచ్చింది కాబట్టి అలాంటి వీడియోలు మీ సిస్టం లలో పెట్టి ఉంటే ఒక CD లోకి మార్చుకొని డిలీట్ చెయ్యండి. మీ సిస్టం ఎప్పుడైనా హాకింగ్ కి గురవుతే.. ఇక మీ రహస్యాలు విశ్వవ్యాప్తమే! (ఇలాంటి విషయమే మొబైల్ ఫోన్ల గురించి త్వరలో మీకు చెబుతాను)
మీ పర్యటన వీడియోలు.. మీరు కనపడని వీడియోలు అయితే బెస్ట్.
ఫోటో కామెంట్స్ :
మీ ఫొటోస్ కి మీ మిత్రులు కామెంట్స్ చేస్తారు. అది చాలా సాధారణం. ఒకవేళ - ఆలా ఎవరూ చేయ్యవోద్దూ అంటే సెట్టింగ్స్ లలోకి వెళ్లి ఆ ఆప్షన్ ఎన్నుకోవాలి. కాని సరదా ఉండే కామెంట్స్ అయితేనే మంచిది. బోర్ గా ఉన్నప్పుడు అవన్నీ చూస్తే మనసుకి ఉల్లాసముగా ఉంటుంది. నాకైతే బోర్ అనిపించినప్పుడల్లా అలా మళ్ళీ చూస్తాను.. ఈ కామెంట్ కి ఇలా వ్రాయాల్సి ఉండెను అనిపిస్తుంది. ఒక్కోసారి నవ్వు వస్తుంది కూడా..
కామెంట్స్ వ్రాయండి. వారు పెట్టిన ఫొటోస్ బాగుంటే మరీ, మరీ కామెంట్స్ చేసి బాగున్నాయని చెప్పండి. చిన్నగా బాగున్నాయి అని చెప్పకుండా ఒకటి, రెండు వాక్యాల్లో కామెంట్స్ చెప్పడానికే ప్రయత్నించండి. మొదట్లో ఇలా చేయటం కష్టమే అయిననూ.. కొంత అభ్యాసం చేస్తే ఈజీగా వస్తాయి. ఇంకా ఈజీగా తెలుసుకోవాలంటే వారివీ, వీరివీ ఫొటోస్ చూడండి.. అందులోని ఫొటోస్ లకి కామెంట్స్ ఎలా ఉన్నాయో గమనించండి. వాటికి వచ్చిన రిప్లైలను కూడా గమనించండి.
కొంతమంది సరదాగా, వ్యంగముగా, బాంబులు పేల్చినట్లుగా వ్రాస్తారు.. సరదాగా తీసుకోండి. ఇబ్బందిగా ఉంటే ఆ ఫోటో కామెంట్ ని డెలీట్ చేసెయ్యండి. మీ ఇబ్బందిని వారికి పర్సనల్ మెయిల్ లో సున్నితముగా వివరించండి. అలా చేస్తే మీ వ్యక్తిత్వం ఇంకా గొప్పగా ఎదుటివారికి కనిపిస్తుంది. వారు - మనుష్యులు అయితే మళ్ళీ అలా మీకు వ్రాయాలని అనుకోడు.
మీకు బాగా తెలివితేటలూ ఉంటే వారు వ్రాసిన దానికి మీరూ కట్ చేసినట్లుగా చెప్పండి. లేదా మీ దగ్గరి స్నేహితుల్లో, ఆన్ లైన్ స్నేహితుల్లో సహాయము తీసుకోండి. ఇది అన్నివేళలా సాధ్యం కాదు. కొద్దిగా అభ్యాసం చేస్తే ఈ టాలెంటు అబ్బుతుంది.
మీరే ముందుగా ఎవరి ఫోటోలకైన కామెంట్స్ - అదీ వారిని గెలికేలా వ్రాశారే అనుకుందాం. ఆ తరవాత వారు వ్రాసే రిప్లై వాటికి మీరు తట్టుకోగలిగి ఉండాలి. అలా అయితేనే ఎదుటివారిని గెలకండి. బుద్ధిగా ఉన్న, ఉంటున్న వారి జోలికి వెళ్ళకండి.
ఫ్రెండ్ రిక్వెస్టులు :
అసలైయిన చాప్టర్ ఇదే.. నిజజీవితములో కొందరిని రోడ్డు మీదే, ఇంకొందరిని ఇంటి ముందు గేటు వద్దే, మరికొందరిని ఇంటి డ్రాయింగ్ రూం లో.. ఎలా పలకరిస్తామో ఇక్కడా అంతే! వారి మీద అభిప్రాయాలతో మనకి దగ్గర్గానా, దూరము గానా ఉంచేది అన్నది ఎలా ఉంటుందో వారు మనల్ని ఆకట్టుకున్నా దానిమీద ఆధారపడుతుంది. నాకు తెలిసిన కొన్ని పద్ధతుల్ని చెబుతాను. మీకిష్టమైతేనే పాటించండి.
ఆడవారివి అయితే ఏదో వారికీ ఉండే స్వతహాగా ఉండే భయాల వల్లనో.. పూర్తిగా వివరాలు ఉండవు. ఇక్కడ వారు నిజముగా ఆడవారేనా అని తెలుసుకోవాలి. అలా తెలుసుకోవటానికి వారికి వచ్చేస్క్రాప్స్, వారు వ్రాసే స్క్రాప్స్ పరిశీలిస్తే తెలుస్తాయి. కొందరు మొగవారు కూడా ఇలా ఆడ పేర్లు పెట్టుకొని స్నేహాలు చేస్తున్నారు. అలా ఒకడిని నేను గుర్తించాను కూడా.
ఇక మీరు మగవారి / ఇతరుల నుండి నుండి వచ్చే అభ్యర్టనల లోని గమనించాల్సిన పద్ధతులు ఏమిటంటే :
1. ఎవరి వద్దనుండైనా మీకు ఫ్రెండ్ ఆడ్ రిక్వెస్ట్ వచ్చిందే అనుకోండి. వెంటనే ఆక్సెప్ట్ చెయ్యకండి.
2. అలా పంపిన వారి ప్రొఫైల్ ఫోటో మీద, లేదా మెయిల్ ID మీద గానీ క్లిక్ చెయ్యండి. వారి ప్రొఫైల్ కనీసం సగమైనా నిండి ఉందా చూడండి. కొందరి దాంట్లో ఏ...మీ ఉండదు. కేవలం మేల్, ఇండియా అని అంతే! మిగతావి చెప్పకపోవటములో వారికేం అభ్యంతరం? పోనీ అలా ఖాళీలు నింపకపొవటములో నిర్లక్ష్యమే అనుకుందాము.. అలాగే మనమీద కూడా నిర్లక్ష్యం చూపరని గ్యారంటీ ఏమిటీ?
3. అతను మొగవాడయితే ప్రొఫైల్ ఫోటో తనది పెట్టకుండా ఏదో పువ్వులూ, సినీ హీరోల బొమ్మలు పెట్టాడే అనుకుందాము.. కొద్దిగా అనుమానించాల్సిందే. అతని ఫోటో పెట్టుకోలేనంతగా వికారియా?.. లేక పెద్ద ఫాన్ ఫాలోయింగ్ హీరోలా? నేను గమనించిన వారిలో మాత్రం - అమ్మాయిలతో హస్కు వేసే, అందమైన మాటలూ చెప్పే వారే కనిపించారు. అలాంటి విషయాల్లో వారు ఫుల్లీ టాలెంటేడ్ పర్సన్స్.. అదే ఫోటో పెట్టుకున్న వారిలో అమ్మాయిలతో చాలా మర్యాదగా ఉంటున్నారు / మాట్లాడుతున్నారు. రేపు ప్రొద్దున ఏమైనా జరిగితే - అయ్యో నావల్ల ఇది జరిగిందే అని ఫీల్ అయ్యే వారిని చాలా మందిని చూశాను. ఉదాహరణకి - పైన నేను పరిచయం చేసిన ప్రమోషన్ అబ్బాయి. అతడు ఆ మాత్రం దానికే తెగ ఫీలయ్యాడు.. ఇలా ఒక్క ఫొటోనే పెట్టుకున్న వారు కాదు. తమ వివరాలూ దాదాపు అన్నీ పెట్టిన వారు చాలా బుద్ధిగా ఉండటం గమనించాను. అలా ఎందుకోగాని, కారణం ఏమి ఉంటుందో గాని తెలియదు.. .. బహుశా ఎవరైనా చీకట్లో ఉండి ఏమైనా ఎదుటి వారిని అనొచ్చు.. అదే వాడిని స్టేజి ఎక్కించి ఏదైనా మాట్లాడమంటే మాట్లాడక పోతాడుగా, కాళ్ళూ చేతులు వణుకుతాయి... ఇదీ అలాగే అనుకుంటాను. ఫోటో ఉన్నవారు చాలా అనుకువగా ఉన్నవారే ఉన్నారు. ఫోటో ఉన్న, మర్యాద తెలీని వాడిని ఒక్కడిని చూసాను. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపితే.. నేను అతని పేజిలో ఏమీ డిటైల్స్ లేవని, అందుకే రిజెక్ట్ చేస్తున్నా అంటే అమర్యాదగా మాట్లాడాడు. ఆ ఒక్కటి కేసు మినహా అంతా నేను అనుకున్నట్లే - ఫొటోస్ ఉన్నవారు అందరూ బుద్ధిమంతులే..(నేను చూసిన వరకు)
4. నా మిత్రురాలు ఒక లింక్ చెప్పారు.. అందులో ఉన్నది ఈమె మహిళా ఫ్రెండ్ కి ఫ్రెండ్. కొద్దిగా బంధుత్వం కూడా నట. అతను ఫోటో లేదు.. వివరాలూ లేవు. ఆడ్ చేసుకున్నాక బంధువు తెలిసింది.. ఎప్పటివో పగలు ఉంచుకొని రోజూ సతాయిస్తున్నాడు. డెలీట్ చెయ్యనివ్వడు.. నరకం చూపిస్తున్నాడు. అన్నింటికన్నా మించి అతను గవర్నమెంట్ ఆఫీసరు. తరచి చూస్తే ఇలాంటివి ఎన్నెన్నో వ్యధలు.
5. అమ్మయిలెప్పుడూ రాత్రి తొమ్మిది అవగానే నెట్ లోంచి వెళ్ళిపొండి. రాత్రి గడుస్తున్నా ఇంకా చాట్ అవైలబుల్ లో ఉన్నారే అనుకోండి - దీనికి బాగా ........... ఎక్కువ అయినట్లుంది.. అనుకుంటూ చాట్ చర్చలు అన్నీ "అటువైపు" దారి తీస్తాయి. ఇది నిజమే.. నాకు తెలిసిన ఒక FM రేడియో యాంకరూ, వారి అమ్మగారూ ఇలా బలయ్యారు. లండన్ లో వారి కూతురు ఉండేడిది. అలా రోజూ రాత్రి పన్నెండు గంటలకి జిమెయిల్ లో చాట్ చేసుకోనేడివారు. వీరు చేసినపోరబాటు ఏమిటంటే చాట్ అవైలబుల్ లో ఉండి చాట్ చేసేవారు. నిజానికి వారు చాలా అందముగా ఉండెడివారు అనుకోండి. వీరేంటీ! ఇలా చాట్ అవైలబుల్ లో ఉండి చాట్ చేస్తారు.. ఇలా ఇబ్బంది కాదా వీరికి.. అనుకున్నాను. ఇలా మీరు ఉండొద్దు అని చెప్పే చనువు నాకు వారితో లేదు. అనుకున్నట్లే వారు ఆ తరవాత వారం పదిరోజుల్లో వారిద్దరూ నెట్ కి రావటం కట్ అయ్యింది. ఒకరు నెట్ కి అసలే రానని, ఇంకొకరు ఇలా వచ్చి తనకి వచ్చిన ఆర్కుట్ స్క్రాప్స్ చూసుకొని వెళతారు. వారు చేసిన పోరబాటులు మీరే చూడండి. అంత రాత్రిపూట చాట్ అవైలబుల్ పెట్టడం, ఫొటోస్ అందరికీ కనపడేలా పెట్టడం (తమ మిత్రులకే కాదు వేరేవారు చూసినా కనపడేలా), తమ అక్కౌంట్ కి తగిన సెట్టింగ్స్ ఎలాపెట్టాలో తెలీకపోవటం.. అడిగితే ఎవరైనా చెబుతారుగా.. అదే నెట్లో, లేదా అదే సోషల్ సైట్‌లోని మిత్రులతో చర్చించినా ఏ సమస్యకి పరిష్కారం దొరికేది వారికి. ఆ అమ్మాయి పుట్టినరోజు కి ఆమె స్క్రాప్ బుక్‌లో పదిహేడు పేజీల వరకూ స్క్రాప్స్ ఉండేడివి.అంటే 170 వరకూ పుట్టినరోజు శుభాకాంక్షల సందేశాలు. నాకే ఈసారి కష్టపడితే ఏడు పేజీల గ్రీటింగ్స్ ( అంటే డెబ్భై ) అంతే. అంతగా ఫాలోయింగ్ ఉన్న వారిని ఎక్కడా చూడలేదు. (చాలా అందమైన అమ్మాయి కదా) అలాంటిది ఆమె చేసిన పొరబాట్లకి, ఆమెనే మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఏమైంది ఆన్లైన్ కి రావటం లేదూ అని తనతో అంటే అసహ్యకర వ్రాతలూ, చేష్టలను చూసి మొత్తానికి వెళ్ళిపోయాను - అన్నారు. నాకైతే వీరే పొరబాటు చేశారేమోనని అనిపిస్తుంది అప్పుడప్పుడు. అలా ఇబ్బంది పెట్టినవారిని తీసేస్తే సరిపోయేడిది. ఇక్కడ మరొక విషయాన్ని గమనించాలి. ఇలా అయిందని తన అకౌంట్ ని పూర్తిగా తీసేశారు. తరవాత నచ్చిన మిత్రులతో (వందకు లోపే) ఇంకో అకౌంట్ ఓపెన్ చేశారు. మళ్ళీ అలాగే అయ్యిందంట. ఇక లాభం లేదని మొత్తానికే దూరం అయ్యారుట. నన్ను పరిష్కారం అడిగితే - సెట్టింగ్స్ మార్చుకోండి అని చెప్పేవాడిని. అలాగే ఇంకొన్ని జాగ్రత్తలు చెప్పేవాడిని.
6. ఇంకో ఆమెది ఇలాంటి కథనే. వచ్చిన రిక్వెస్ట్ అన్నింటినీ ఓకే చేసి తీరుబాటుగా ఒక్కొక్కడినీ పరిచయం చేసుకొని, వారితో మాట్లాడాక అప్పుడు ఒక అభిప్రాయానికి వచ్చేడిది. ఎంచక్కా సాఫ్ట్వేర్ ఇంజనీర్ భార్య అయిన ఆమె దాంట్లో ఎన్నో పేరూ, అడ్డ్రెస్ లేనివి చాలానే ఉన్నాయి. నేను ఒకసారి చూసినప్పుడు తొమ్మిది వందలకి పైగా స్నేహితులు, అందులో కొంతమంది ప్రోఫైల్స్ లలో బాహాటముగానే సెక్స్ గురించిన అభిప్రాయాలు ఉన్నాయి. ఈవిడా అలాంటిదేనా అనే అనుమానం వచ్చింది.. కొద్ది నెలల క్రిందట వారూ, వీరూ "ఇబ్బంది" పెడుతున్నారని చాట్‌లో నాతో అంది.. కొన్ని నివారణా మార్గాలు చెప్పాను. ఆ తరవాతేమైందో గాని.. నాకు దూరం అయ్యారు. మనమేదో మేలు చేద్దాం అని చూస్తే అప్పుడప్పుడూ ఇలాంటి చిన్ని చిన్ని బహుమతులు దొరకవచ్చు.
7. అతనే కాదు, అతని మిత్రులు ఎలా అతన్ని ట్రీట్ చేస్తున్నారు, ఎలాంటి భావాలను వారు కలిగి ఉన్నారో మీకు వీలయితే గమనించండి.
8. ఆడ్ చేసుకునే ముందు - వారికీ మీకు మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారిద్దరి (ఆ క్రొత్త అతనూ, మీ మధ్య మ్యూచుయల్ ఫ్రెండ్) మధ్య ఉన్న / వ్రాసుకున్న స్క్రాప్స్ చూడండి. అతనికి వచ్చిన టెస్తిమోనియల్స్ కూడా ఒకసారి లుక్కెయ్యండి. అ తరవాత ఆ మ్యూచువల్ ఫ్రెండ్ ని అతడి గురించి అడగండి. అతని గురించి కనీసం ఫరవాలేదు అని వచ్చినా వెంటనే వారి ఫ్రెండ్ రిక్వెస్ట్ లని ఒప్పేసుకోండి. అతనికి నచ్చనివారు - మీకు నచ్చవచ్చు. లేదా అతనే వారిని తప్పుగా అర్థం చేసుకొని ఉండవచ్చును.
9. క్రొత్తవారు మీ పేజిలో స్క్రాప్స్ వ్రాసేలా సెట్టింగులు పెట్టండి. కొందరు - వారి ఫొటోస్, వీడియోలు చూడనీయకుండా పెట్టడములో అర్థం ఉంది.కానీ కొత్తవారు స్క్రాప్స్ వ్రాయనీకుండా సెట్టింగ్స్ పెట్టడములో ఉన్న ఇబ్బంది ఏమిటో నాకు అర్థం కాలేదు. నా పేజిలో అలా ఏమీ పెట్టలేదు. అయినా కొందరు మిత్రులు అలా నా స్క్రాప్స్ పేజిలో వ్రాసిన స్క్రాప్స్ వల్ల మిత్రులు అయ్యారు.. అలా అయినవారిలో ఇద్దరినీ కలిసాను కూడా.. ఎవరైనా అలా వచ్చి ఇబ్బంది పెడితే వారిని 'బ్లాక్' చెయ్యొచ్చు. అంటే వారిని మనదాకా రానీయకుండా ఆర్కుట్ వాడే (గూగుల్ వాడే) ఆపేస్తాడన్నమాట. ఇంకా మీకు నమ్మకం లేకపోతే.. ఈ మాత్రం దానికి ఆర్కుట్ కి వచ్చే బదులు హాయిగా జిమెయిల్ లో చాట్ చేసుకోవచ్చు, లేదా క్రొత్తగా వచ్చిన "బజ్" (ట్వీటార్ లాంటిది) వాడుకుంటే బెస్టు.
10. ఎన్ని వడపోతలూ,లెక్కలూ అయినా కూడా అప్పుడప్పుడూ కొందరు "మహానుభావులు" దొరుకుతారు. కొద్దిగా దూరం ఉంటే చాలు. ముందే చెప్పాగా - ఒకరు మంచి స్నేహితులుగా దొరికేముందు పదిమందికి పైగా పనికిరాని వాళ్ళని కలవాల్సి ఉంటుందని. మనం చిన్నప్పుడు క్లాసులో ముప్పై, నలభై మంది ఉన్నా.. అందరూ మనతో మాట్లాడినా కొద్దిమందితోనే ఎక్కువ సమయం గడుపుతాము.. ఇక్కడా అంతే అనుకోండి.
ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తూ..
8 comments:
manchi post raj garu...informative gaa undi.....mottam complete cheyandi...kaani naa side nunchi oka point...meeru cheppinde....evaro edo annaru ani account close cheyakunda undatam...and scrap book lo vere vallu kooda scrap pettetattu settings undali....kotta vallu meetho matladakoodadu anukunte...social networking site lo join avvadame anavasaram...only meeku telisina friends tho chat cheyadaniki, pics and videos share chesukodaniki google buzz chaalu...orkut loki ravakkarledu...
miku chala opika undi Raj ji nice work...
raju garu oka chinna thing..akkada meru aa profile click chesaka vochindhi ..webpage .. lo adds unnay kada ...
nak telsi aa MADHU ane abbayiki google ads account undhi soo...ataniki money ravataniki ee chinna technique use chesadu..girl photo untey evarina click cehstharu kada..soo ..click chesaka vachina webpage lo anni adds unnay kada..soo vatillo edi click chesina MADHU ki money velthay..tats the thing..
soo ala pettadu ... telivi use chesadu...
nd one more thing
nijaniki nak telisi aa ammayiki orkut account ee undi undadhu...vadu jst aa photo ni vadukunnadu...kani adi kuda tappu..
nd inko thing raju garu..
kontha mandhi hackers kuda ela promotions creat chesthunnaru...adi click chesthe me system lo ni web browser lo cookiess anni valla mail ki velli pothay...aa cookies tho me password ni identify cheyachu...soo
better to dont click on those promotions ..
any way gud post raju garu..
ఆ ఫోటో తో ఆర్కుట్ అకౌంట్ వుంది.నాకుతెలుసు.రాజ్ గారూ .. మీరు ఈ అమ్మాయి ఫోటో ని బ్లర్ చేసి వుంటే బాగుండేది అనుకుంటున్నా.
-పుట్ల హేమలత
అవునండీ!.. తనకి ఆర్కుట్ అక్కౌంట్ ఉందని నాకు తెలుసండీ!.. కాని ఒకటి కాదు రెండు. ఆదే అమ్మాయి ఫోటో ఉన్నవి అప్పుడే రెండు అక్కౌంట్స్ చూశాను. అలా ఎలా ఉంటాయీ అంటే చాలా సులభం. ఫోటో మార్చటం అని మీకూ తెలుసు. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ప్రక్కన ఒక లింక్ ఉంటుంది. అది నొక్కితే ఆ అమ్మాయి పేజీ వరకూ డైరెక్ట్ గా వెళతాం. అలా వెళ్లి చూశాను. అప్పటికే ఆ అకౌంట్ డిలీట్ చేసేసింది తను. అప్పుడు ఆ ఆవిషయాన్ని ఫోటో తీయటం మరిచాను. లేకుంటే అదీపెట్టేవాడిని. అంటే మిగతా రెండు ఆ అక్కౌంట్స్ లలో ఏదో ఒకటి నిజం కావచ్చు.. లేదా రెండూ ఫేక్ కావచ్చును. అందుకే పాటకులను హెచ్చరించటానికి, బ్లర్ గా మార్చక అలాగే నేరుగా పెట్టేశాను -ఆ ఫోటో లో ఉన్న ఆమెది బోగస్ అనీ, వారందరూ జాగ్రత్తగా ఉంటారనీ.. అలా స్పష్టమైన ఆ ఫోటో చూసి అందరూ జాగ్రత్త పడతారని ఆశించాను. ఒరిజినల్ ఆమెతన ఇంకో స్టైల్లో పెట్టుకొని దిగటం, అక్కౌంట్ క్రియేట్ చేసుకోవటం చాలా ఈజీ..
ఎలాగూ ఇంతగా చెప్పానుగా. ఇలాంటిదే ఇంకో కథ కూడా చెబుతాను. ఇంకో ఆవిడ అక్కౌంట్ మొత్తానికే హైజాక్ చేసిన కథ .. కాదు కాదు నిజం.. అది వాస్తాను.. అతి త్వరలోనే.. దానివల్ల ఇంకా చాలా వివరాలు తెలుస్తాయి చూడండి. మాటర్ సేకరిస్తున్నాను.
Rajugaru....
chala manchi upayogakaramaina post.Thankyou
chala upayogakaramaina post....andariki..
thankyou
Welcome Himabindu garu.
Post a Comment