చిత్రం : సుందరకాండ (1992)
సంగీతం : M. M. కీరవాణి
పాడినవారు : S. P. బాలసుబ్రమణ్యం
***********************
పల్లవి:
ఆకాశాన సూర్యుడుండడు - సంధ్య వేళకే
చందమామకి రూపముండదు - తెల్లవారితే
ఈ మజిలీ మూడు నాళ్ళే - ఈ జీవయాత్రలో
ఒక పూటలొనే రాలు - పూవులెన్నో
నవ్వవే నవమల్లికా - ఆశలే అందాలుగా
ఎదలోతుల్లో ఒక ముల్లున్నా - వికసించాలే ఇక రోజాలా
కన్నీటి మీద నావ సాగనేల
నవ్వవే నవమల్లికా - ఆశలే అందాలుగా
చరణం 1:
కొమ్మలు రెమ్మలు గొంతే విప్పిన - కొత్త పూల మధుమాసంలో
తుమ్మెద జన్మకు నూరేళ్ళెందుకు - రోజే చాలులే
చింత పడే చిలిపి చిలకా - చిత్రములే బ్రతుకు నడకా
పుట్టే ప్రతి మనిషి కను మూసే తీరు - మళ్ళీ తన మనిషై ఒడిలోకే చేరు
మమతానురాగ స్వాగతాలు పాడ
నవ్వవే నవమల్లికా - ఆశలే అందాలుగా
చరణం 2:
నీ సిగపాయల నీలపు ఛాయల - చేరుకున్న ఈ రోజాలే
నీ జడ కోరని కోవెల చేరని - రోజే వచ్చులే
పంజరమై బ్రతుకు మిగులు - పావురమే బైటికెగురూ
మైనా క్షణమైనా పలికిందే భాష ఉన్నా - కలగన్నా విడిపోదీ ఆశ
విధి రాతకన్నా లేదు వింత పాట
నవ్వవే నవమల్లికా - ఆశలే అందాలుగా
ఎదలోతుల్లో ఒక ముల్లున్నా - వికసించాలే ఇక రోజాలా
కన్నీటి మీద - నావ సాగనేల
నవ్వవే నవమల్లికా - ఆశలే అందాలుగా
Tuesday, May 11, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment