మీరు కంప్యూటర్ వాడతునప్పుడు ఎన్నో పేజీలు ఓపెన్ చేస్తారు.. మధ్యలో డెస్క్టాపు మీద ఉన్న షార్ట్ కట్ అవసరం ఉంటుంది. అప్పుడు ఓపెన్ చేసిన ప్రతి పేజి మినిమైజ్ చేసి.. అప్పుడు షార్ట్ కట్ ని వాడుకొని.. ఇందాక మినిమైజ్ చేసిన వాటన్నింటినీ తిరిగి ఓపెన్ చేసుకుంటారుగా.. ఇదంతా తలనొప్పిగా ఉంటుందా..
ఇంకేం! ఇప్పుడు అంతా సిద్ధముగా ఉందన్నమాటే!.. ఇంకేం హాయిగా వాడుకోండి..
అయితే మీకిప్పుడు ఒక సాఫ్ట్వేర్ ROCKET DOCK అని పరిచయం చేస్తాను.. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని, దిగువ ఫొటోస్ లలో చూపించిన విధముగా మీ సిస్టమ్ లో ఓపెన్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇది ఇన్స్టాల్ చేసుకున్నాక మీరు మధ్యలో యే పేజిలో ఉన్ననూ మీ మోనిటర్ మీద పై బోర్డర్ కి కర్సర్ తో తాకగానే మీకు ఇందులో పెట్టుకున్న షార్ట్ కట్స్ అన్నీ మీకు అందుబాటులోకి వస్తాయి. కర్సర్ తీసేయగానే ఆ షార్ట్ కట్స్ టాబ్ పైకి / లోపలి వెళ్ళిపోతుంది. ఇది ఫ్రీ వేర్. భయమేమీ అవసరం లేదు. నేను మూడు సంవత్సరాలనుండీ వాడుతున్నాను. సరేనా.. ఈ క్రింది ఫోటోలాగా కర్సర్ తో మీ మానిటర్ మీద తాకగానే ఇలా వచ్చి మీకు కనపడుతుంది.
ఇలా బాగుంది కదూ! ఇంకేం.. మొదలెడుదామా! సూచనలని మీకు సులభముగా అర్థమయ్యే రీతిలో చెబుతాను.. వాటిని అర్థం చేసుకొని పాటించండి. సిద్ధమేనా!..
** ఎక్కడైనా ఫోటో అర్థం కాకుంటే ఫోటో మీద క్లిక్ చెయ్యండి. పెద్దగా కనిపిస్తుంది. **
ముందుగా మీరు ఈ ROCKET DOCK సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసుకొని, WINRAR సహాయముతో ఒక ఫోల్డర్ లోకి వేసుకోండి. ఇలా ఒక సాఫ్ట్వేర్ ల ఫోల్డర్ అంటూ ఒక ఫోల్డర్ ని తయారు చేయండి. దీన్ని మీరు మీ హార్డ్ డిస్క్ లోని D డ్రైవ్ లో పెట్టుకోండి.
ఇలా పెట్టేసుకున్నారు కదూ!.. ఇప్పడు మొదలెడుదామా!..
1. ఆ సాఫ్ట్వేర్ ని డబుల్ క్లిక్ చేయడం ద్వారా రన్ చేద్దాము.
2. ఇక్కడ బాణము గుర్తుని నొక్కి మీకు అర్థమయ్యే భాషని ఎన్నుకోండి. అనగా English ని ఎన్నుకోండి.
3. OK చెయ్యండి. ఇపుడు ఆ సాఫ్ట్వేర్ ఇంగ్లీష్ భాషలో ఇన్స్టాల్ అవుతుంది.
అప్పుడు ఇలా సాఫ్ట్వేర్ పాపప్ విండో వస్తుంది.
4. వద్ద Next ని నొక్కండి.
అప్పుడు ఇలా రాకెట్ డాక్ సెటప్ పేజి వస్తుంది.
5. I accept the agreement వద్ద OK చెయ్యండి.
6. వద్ద Next ని నొక్కండి.
ఇలా వచ్చిన దాంట్లో :
7. వద్ద ఆ సాఫ్ట్వేర్ ఎక్కడ ఇన్స్టాల్ కావాలో అక్కడి అడ్రెస్ టైప్ చెయ్యాలి. నేను మాత్రం అందులో వచ్చే అడ్రెస్ ఎంచుకోమనే చెబుతాను. అంటే C డ్రైవ్ లోని ప్రోగ్రాం ఫైల్స్ లో వేసుకోవాలి.
8. తరవాత Next ని నొక్కండి.
9. వద్ద ఉన్న చిన్న గడిలో క్లిక్ చేస్తే డెస్క్ టాప్ మీద "షార్ట్ కట్ ఐకాన్" వస్తుంది.
10. వద్ద Next ని నొక్కండి.
11. ఇప్పడు ఇన్స్టాల్ కి సిద్ధముగా ఉందన్న మాట! ఇప్పుడు Install ని నొక్కండి.
ఇప్పుడు ఇలా మీ సిస్టములో ఇన్స్టాల్ అవుతుంది.
12. ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయినట్లు Finish చూపుతుంది. ఇప్పుడు ఈ Finish నొక్కండి. (మీరు ఫినిష్ ఏమీ కారు.. పూచీ నాది.)
13. దగ్గర చూపినట్లు మీ మోనిటర్ డెస్క్ టాప్ మీద ఇలా ROCKET DOCK సాఫ్ట్వేర్ షార్ట్ కట్ ఐకాన్ మీకు కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చెయ్యండి. చేశారా?
అప్పుడు ఇలా ఒక టూల్ బార్ మానిటర్ పై భాగాన కనిపిస్తుంది.
14. ఇక్కడ ఉన్న Dock settings ని నొక్కండి. నొక్కారా?
15. అప్పుడు ఇలా చిన్ని మెనూ వస్తుంది.
16. వద్ద చూపినట్లు ఆ టూల్ బార్ లో మీకు అవసరం లేనివి తీసేయండి ( Right click on icon > select Delete )
17. అలాగే అదే మెనూలో ఉన్న Auto hide ని ఎన్నుకోండి. ఇదిఎంచుకోవడం వల్లనే ఈ సాఫ్ట్వేర్ బాగా నచ్చుతుంది. అలా చేయటం వలన మనము ఎన్ని పేజీలు ఓపెన్ చేసినా వెంటనే కీలక సాఫ్ట్వేర్ షార్ట్ కట్ లని పొంది వాడుకోవచ్చును. కర్సర్ ని పైకి మోనిటర్ పైకి తీసుకెళ్ళి బోర్దర్నీ తాకితే టూల్ బార్ వస్తుంది. దానిపైనుండి తీసేస్తే లోపలి వెళ్ళిపోయి, మాయం అవుతుంది.
18. ఇక్కడున్న Screen Position ని ఎంచుకుంటే ఈ టూల్ బార్ ఎడమ వైపు ఉండాలా, కుడివైపు ఉండాలో, లేక క్రింది భాగములో ఉండాలో, లేదా పై భాగములో నిర్ణయించుకోవచ్చు. పై భాగములోనే ఉంచడం చాలా అనుకూలము.
19. Add item తో ఏదైనా సాఫ్ట్వేర్ షార్ట్ కట్ గానీ, ఫోటో, వీడియో, ఫైల్.....
20. దేనిదైనా షార్ట్ కట్ సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు.
ఇప్పుడు Dock setings ని ఓపెన్ చెయ్యండి. అందులో మొదటిది 21 General ని సెలెక్ట్ చెయ్యండి. అందులో సెటింగ్స్ ని ఈ క్రింది ఫోటోలో లాగా పెట్టుకోండి.
22. దగ్గర నొక్కండి.మీకు కావలసిన భాషని ఎన్నుకోండి.
23. English ని ఎన్నుకోండి.
24. వద్ద Run at Startup వద్ద OK చెయ్యండి.
25. వద్ద OK నొక్కండి.
26. వద్ద Icons ని సెలెక్ట్ చేసి.. ఇందులో చూపినట్లుగా అన్నీ అడ్జస్ట్ చెయ్యండి.
27. OK నొక్కండి.
28. వద్ద Position ఎన్నుకొని ఇలా అన్నీ ఎంచుకోండి.
29. OK చేయండి.
30. వద్ద Style ని ఎంచుకోండి.
31. పై ఫోటో లోలాగా అన్ని సెట్టింగులూ పెట్టాక ఇప్పుడు OK నొక్కండి.
32. వద్ద Behavior ఎన్నుకోండి.
33. పై ఫోటో లోలాగా అన్ని సెట్టింగులూ పెట్టాక ఇప్పుడు OK నొక్కండి.
ఇంకేం! ఇప్పుడు అంతా సిద్ధముగా ఉందన్నమాటే!.. ఇంకేం హాయిగా వాడుకోండి..
సాఫ్ట్వేర్ పేరు: ROCKET DOCK
వెర్షన్: 1.3.5
సాఫ్ట్వేర్ సైజ్: 6.16 MB
2 comments:
GOOD CHALA BAAGA ANDARIKI USE AYYELA CHEPUTUNNARU... MANAM MANCHI CHESTE MANAKU MANCHI JARUGUTUNDI..MEERU ILA PADIMANDIKI USE AYYEDI CHEPPATAM OKA SEVA ANUKONDI...GOOD KEEPIT UP...
Thank you..
Post a Comment