మీరు ఎప్పుడైనా CD కాని, DVD నింపేటప్పుడు ఆ డిస్క్ లో పట్టే పరిమాణము కన్నా మీరు ఆ డిస్క్ లో నింపే డాటా ఎక్కువగా ఉంటే "Over burn CD" అనే ఆప్షన్ ఎంచుకోకండి. దానివలన మీరు కొంత డాటా కోల్పోవుతారు.
మీరు ఏదైనా ఫైల్ గానీ, డాటా గానీ, ఫొటోస్ గానీ, పాటలు గానీ ఒక డిస్క్ లో నింపాలీ ( బర్న్ ) అనుకున్నప్పుడు ఒక DVD ని DVD రైటర్ లో పెట్టి, సమాచారాన్ని నీరో ద్వారా గానీ, మరే ఇతర సాప్ట్ వేర్ తో గానీ, మీరు అందులో బర్న్ చేస్తున్నారే అనుకుందాము. అందులో సింగిల్ లేయర్ DVD [DVD-5] (మనదగ్గర దొరికేవి అన్నీ ఇవే..) మరియు DVD-9 అంటే డబుల్ లేయర్ DVD లు ఉంటాయి. DVD రైటర్ లో పెట్టాక అందులో ఆ DVD లో 4485 MB డాటా అందులో పడుతుంది. ఇందులో కొంత డాటా స్పేస్ సిస్టం అవసరాలకి పోతుంది. అంటే నికరముగా మనకి అందుబాటులో ఉండేది 4450 MB మాత్రమే. ఇప్పుడు మీకు చెబుతున్నది ఏమిటంటే ఈ 4483 MB జాగాలో అంతకన్నా ఎక్కువ డాటా స్టోర్ చెయ్యాలి అనుకున్నప్పుడు 'Overburn CD' అనే ఆప్షన్ ఎంచుకోకండి. అలా ఎంచుకున్నప్పుడు ఆ ఎక్కువగా ఉన్న డాటా అందులో స్టోర్ అవుతుంది.. కాని కొన్నిసార్లు (చాలాసార్లు) ఆ డాటా రీడ్ అవ్వదు. అప్పుడు కొంత (విలువైన) డాటా కోల్పోతాము. అందుకే ఎక్కువ డాటా స్టోర్ ఈ ఆప్షన్ ఉపయోగించి చెయ్యకండి.
అలాగే DVD చివరల వరకూ డాటా నింపకండి. కొంత ఖాళీ స్థలాన్ని వదిలెయ్యండి. DVD ని పట్టుకునేటప్పుడో, స్థలం మార్చునపుడో.. వాటిమీద గీతలు, మడ్డి, మురికి పడే అవకాశాలు ఎక్కువ. అంటే ఆ DVD లో మీరు 4400 MB వరకూ డాటా నింపాలన్న మాట. ఇలా చేస్తే డాటా కోల్పోయే అవకాశాలు తగ్గుతాయి.
ఇక్కడ:
1 వద్ద త్రికోణ గుర్తుని నొక్కితే advanced మెనూ ఓపెన్ అవుతుంది.
2 వద్ద Options ని ఎన్నుకోండి.
3 వద్ద నున్న Expert features ని నొక్కండి.
4 వద్ద టిక్ మార్కుతో ఎనేబుల్ చేసి ఉంటే తీసెయ్యండి.
ఇప్పుడు ఓకే చెయ్యండి.
No comments:
Post a Comment