చిత్రం : డార్లింగ్ (2010)
రచన : అనంత శ్రీరాం
పాడినవారు : సూరజ్, ప్రశాంతిని
************************
పల్లవి :
ఇంకా ఏదో ఇంకా ఏదో - ఇదైపోతావే ఇష్టాలే తెలిపేందుకు
సంకెళ్ళతో బంధించకూ - ఏదె చేరాలి ఈరోజే చెలీ చెంతకు
తనలోని స్వరం వినరో ఈక్షణం - అనుకుండేది నీలోనీ నువ్వు దాచకు
నీ మనసే నీకిలా ఆ మగువై నిండుగా - కనిపించక మౌనాన్నే చూపించకు
పద పద రారా పరుగున రా రా - గురువా గురువా
ఇక భయపడకుండా బయటకి తేరా - చొరవా చొరవా
ఇంకా ఏదో ఇంకా ఏదో - ఇదైపోతావే ఇష్టాలే తెలిపేందుకు
చరణం 2:
మేఘాల వొళ్లోనే ఎదిగిందనీ - జాబిల్లి చల్లేనా జడి వాననీ
ముళ్ళపై మేమిలా విచ్చుకున్నామనీ - నీకు పూరేకులే గుచ్చుకోవే మరి
తీరమే మారిన తీరులో మారునా - మారదు ఆ ప్రాణం
పద పద రారా పరుగున రా రా - గురువా గురువా
ఇక భయపడకుండా బయటకి తేరా - చొరవా చొరవా
ఇంకా ఏదో ఇంకా ఏదో - ఇదైపోతావే ఇష్టాలే తెలిపేందుకు
చరణం 3 :
వేల్లెల్లు చెప్పేసే ఏమవ్వదు - లోలోన దాగుంటే ప్రేమవ్వదు
అమృతం పంచడం నేరమే అవదురా - హాయినే పొందడం భారమే అనదురా
హారతే చూపుతూ స్వాగతం చెప్పదా - ఇప్పుడే ఆ అందం
పద పద రారా పరుగున రా రా - గురువా గురువా
ఇక భయపడకుండా బయటకి తేరా - చొరవా చొరవా
ఇంకా ఏదో ఇంకా ఏదో - ఇదై పోతావే ఇష్టాలే తెలిపేందుకు
సంకెళ్ళతో బంధించకు - ఏదే చేరాలి ఈరోజే చెలీ చెంతకు
తనలోని స్వరం వినరో ఈక్షణం - అనుకుండేది నీలోనే నువు దాచకు
నీ మనసే నీకిలా - ఆ మగువై నిండుగా - కనిపించాక మౌనాన్నే చూపించకు
Tuesday, May 18, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment