చిత్రం: ఇంద్రధనుస్సు (1978) 
రచన: ఆచార్య ఆత్రేయ 
సంగీతం: కె.వి.మహాదేవన్ 
గానం: S.P.బాలు 
********************** 
పల్లవి: 
నేనొక ప్రేమ పిపాసిని - నీవొక ఆశ్రమవాసివి 
నా దాహం తీరనిది - నీ హృదయం కదలనిది 
నేనొక ప్రేమ పిపాసిని - నీవొక ఆశ్రమవాసివి 
నా దాహం తీరనిది - నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని..
చరణం 1: 
తలుపు మూసినా తలవాకిటనే - పగలు రేయి నిలుచున్నా 
పిలిచి పిలిచీ బదులేరాక - అలసి తిరిగి వెళుతున్నా 
తలుపు మూసినా తలవాకిటనే - పగలు రేయి నిలుచున్నా 
పిలిచి పిలిచీ బదులేరాక - అలసి తిరిగి వెళుతున్నా 
నా దాహం తీరనిది - నీ హృదయం కదలనిది 
నేనొక ప్రేమ పిపాసిని..
చరణం 2: 
పూట పూట నీ పూజ కోసమని - పువ్వులు తెచ్చాను 
ప్రేమభిక్షను పెట్టగలవని - దోసిలి ఒగ్గాను 
నీ అడుగులకు మడుగులోత్తగా - ఎడదను పరిచాను 
నీవు రాకనే అడుగు పడకనే - నలిగిపోయాను 
నేనొక ప్రేమ పిపాసిని.. 
చరణం 3: 
పగటికి రేయి - రేయికి పగలు - పలికే వీడ్కోలు  
సెగ రేగిన గుండెకు చెబుతున్నా - నీ చెవిన పడితే చాలు 
నీ జ్ఞాపకాల నీడలలో నన్నెపుడో చూస్తావు  
నను వలచావని తెలిపేలోగా - నివురైపోతాను.. 
నేనొక ప్రేమ పిపాసిని
Friday, May 14, 2010
Subscribe to:
Post Comments (Atom)
 
 
 
 
 
 
 
 
 
 

 
1 comment:
ఇదొక అద్భుతమైన పాట.. ప్రేయసి కనుచూపు కటాక్షం కోసం ఎంతగా ఎదురుచూస్తున్నాడో, ఆవేదనతో పాడే ఈ గీతం అంటే నాకు భలే ఇష్టం.
Post a Comment