Friday, June 11, 2010

Anitha anitha o anithaa...

గాయకుడు, స్వరరచన : నాగరాజు.
**************************
నా ప్రాణమా నను వీడిపోకుమా నీ ప్రేమలో నను కరగనీకుమా
పదే పదే నా మనసే నినే కలవరిస్తుంది..
వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటుంది.
అనితా అనితా అనితా ఓ వనితా నా అందమైన అనిత
దయ కాస్తయిన నా పేద ప్రేమ పైన
ప్రాణమా నను వీడిపోకుమా
ప్రాణమా నను వీడిపోకుమని ప్రేమలో నను కరగనీకు మా..

నమ్మవుగా చెలియా నే నిజమే చెబుతున్నానని
ప్రేమ అనే పంజరాన చుక్కాని పడి ఉన్న కలలో కూడా నీ రూపం
నను కలవర పరచానీకు పాప నిన్ను చూడాలని కన్నీరే పెట్టే
నువ్వొకచోట నేనోకచోట నిను చూడకుండానే క్షణం ఉండలేనుగా
నా పాటకు ప్రాణం నేవేన రేపటి స్వప్నం నీవేనా
ఆశల రానివి నీవేనా గుండెకు గాయం చెయ్యకే
అనిత అనిత అనితా ఓ వనిత నా అందమైన అనిత
దయలేదా కాస్తైన న పేద ప్రేమ పైన

నా ప్రాణమా నను వీడిపోకుమని ప్రేమలో నను కరగానీకుమా
నువ్వే నా దేవతవని ఎదలో కొలువుంచా
ప్రతిక్షణం ధ్యానిస్తూ, పసిపాపలా చూస్తా
విసుగు రాని నా హృదయం ని పిలుపుకే ఎదురు చూసే
నిన్ను పొందని ఈ జన్మే నాకెందుకు అనిపించే
కరునిస్తావో, కాటేస్తావో నువ్వు కాదని అంటే నే శిలనవుతానే
నను వీడని నీడవు నీవే ప్రతి జన్మకి తోడువు నీవేనా
కమ్మని కలలు కూల్చి నన్ను వంటరివాడిని చెయ్యకే!

అనిత ఓ వనిత ఆ అందమైన అనిత
దయలేదా కాస్తయినా నా పేద ప్రేమ పైన
నా ప్రాణమా నను వీడిపోకుమా నీ ప్రేమలో నను కరగానీకుమా
పదే పదే నా మనసు నినే కలవరిస్తోంది.
వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటుంది.
అనిత అనిత అనిత ఓ వనిత
నా అందమైన అనిత
దయలేదా కాస్తైన నా పేద ప్రేమపైన

ఏదోరోజు నాపై ప్రేమ కలుగుతుందని ఒక చిన్ని ఆశ
నాలో చచ్చేంత ప్రేమ మదిలో
ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా (2) 
ఒట్టేసి చెబుతున్నా నా ఊపిరి ఆగు వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా
అనిత అనిత అనితా ఓ వనిత
అందమైన అనిత దయ లేదా నా కాస్తైన నా పేద ప్రేమ పైనా

No comments:

Related Posts with Thumbnails