మీరు తరచుగా మీ కంప్యూటర్ ని ఆన్ చేసి పని చూసుకొని, తరవాత షట్ డౌన్ చేసి.. మళ్ళీ పని ఉందనుకొని మళ్ళీ ఆన్ చేస్తున్నారా? ఇలా చేస్తే చాలా సమయం వృధా! అలాగే విద్యుత్ ఖర్చూ పెరుగుతుంది.. మీ హార్డ్ డిస్క్ మన్నిక తక్కువ ఉంటుంది.
- మీరు ఆఫీసు కి వెళ్ళాకనో, లేక ఇంట్లోనో సిస్టం ఆన్ చేసాక... మీ పని ముగిసాక మీరు ఇంకా ఆఫీసు లోనో, ఇంట్లోనో ఉన్నట్లయితే మీ సిస్టాన్ని షట్ డౌన్ చెయ్యకుండా స్టాండ్ బై లో ఉంచండి.
- ఇలా చెయ్యటం వల్ల మాటి మాటికీ ఆన్ / ఆఫ్ చెయ్యాల్సిన అవసరం ఉండదు.
- విద్యుత్తు కొంత వాడకాన్ని తగ్గించిన వారిమీ అవుతాము.
- స్టాండ్ బై లో ఉంచడం వల్ల గంటకు కేవలం 3 (మూడు) వాట్ల విద్యుత్ ని మాత్రమే వాడుకుంటుంది. అంటే మూడు వందల ముప్పై మూడు గంటలు స్టాండ్ బై లో ఉంచితే కాలేది ఒక యూనిట్ విద్యుత్ మాత్రమే. అంటే ఇంటికి అయితే 2 నుండి 4 రూపాయలు, వాణిజ్యం అయితే 3 నుండి 7 రూపాయలు అన్నమాట!
- ఊరి వూరికే సిస్టాన్ని ఆఫ్ / ఆన్ చేస్తే మీ హార్డ్ డిస్క్ మన్నిక తగ్గుతుంది. గీతలు పడే అవకాశం ఎక్కువ.
- హార్డ్ డిస్క్ లో ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉండి, అవన్నీ సిస్టం ఆన్ చేసినప్పుడు రన్ అయ్యేవి అయితే మీ సిస్టం వాడకానికి / సిద్ధం అవటానికి కొంత సమయం పడుతుంది.
- మీరు ఇలా స్టాండ్ బై లో ఉంచటం వల్ల ఆన్ చేసిన వెంటనే అన్ని ప్రోగ్రామ్స్ ని రన్ చేసి వాడుకోవచ్చును.
- మీది మోనిటర్ CRT అయితే విద్యుత్ వినియోగం ఎక్కువే.. LCD అయితే తక్కువ విద్యుత్ వాడుకుంటుంది.
- స్టాండ్ బై లో ఉంచడం వల్ల CRT మోనిటర్ ని UPS మీదనూ, ఇన్వర్టార్ మీద సులభముగా వాడుకోవచ్చును.
- ఇలా చేయటానికి మీరు కేవలం షట్ డౌన్ అని చేసేముందు స్టాండ్ బై ని ఎంచుకుంటే సరి.
- ఆఫీసులో కాసేపు అలా బయటకో, వేరేపని ఉండో సిస్టాన్ని వాడక్కున్నట్లయితే, ఇలా స్టాండ్ బై లో ఉంచటం మంచిది.
No comments:
Post a Comment