సోషల్ సైట్ లో నాకు ఈమధ్యనే ఒకావిడ పరిచయం.. అయి మహా అంటే రెండు, మూడు నెలలు కావచ్చును.. ఏదో హాయ్ అంటే హాయ్ పోలైట్ గా నడుస్తున్నదీ మా మధ్య ఆన్లైన్ స్నేహం. బహుశా నెల రోజుల క్రితం అనుకుంటాను.. ఆర్కుట్ లోకి లాగిన్ అవగానే చాట్ కి వచ్చారు ఆవిడ. అసలు ఆవిడ అలా చాట్ చేస్తారని ఊహించలేదు.. అయినా కంటిన్యూ చేశాను..
ఆవిడకి కొన్ని పాత తెలుగు పాటలు కావాలని అడిగారు.
ఎందుకూ అన్నాను..
చెప్పారు ఆవిడ - తను ఉండేది విదేశములో.. ఇండియా లోని ఒక మహా నగరం లో వారి డాడీ ఉంటారు. వారి డాడీ కోసమని ఒక ఐపాడ్ కొనుగోలు చేశారట. అందులో ఆయనకిష్టమైన పాత సినిమా పాటలు నింపి - ఆ ఐపాడ్ ని కానుకగా ఇవ్వాలని తన ఆలోచన. రెండురోజులనుండీ తనకి తెలిసిన మిత్రులను, ఆన్లైన్ మిత్రులనూ అడిగినా కొన్నిపాటలు మాత్రమే సేకరించగలిగారు. కొందరు ఆ పాత పాటల లింకులని చెప్పారు.. కాని తనకి అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ( పేమెంట్ సైట్లు అవి ) అర్థం కావటం లేదని - వదిలేసింది. తనకోరిక నెరవేరేలా లేదని నిరాశలో ఉంది తను.
ఎందుకో నాకే తన బాధని చూడబుద్ది కాలేదు.
ఇక "మీరు ఆ విషయం మరచిపోండి" అన్నాను.
అంటే "మీ వల్ల కాదా..?" అని అటువైపు నుండి ప్రశ్న.
"కాదని అనలేదే.. అవుతుంది. మీకు ఏ ఏ సినిమాల పాటలు కావాలో చెప్పండి" అన్నాను.
కొన్ని సినిమాల పేర్లు తను చెప్పారు. "ఇంకా ఏమున్నాయి.. మీ దగ్గర" అని అడిగారు.
"మీకు ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి" అన్నాను.
"ఆన్లైన్ లో పంపండి ప్లీజ్!" అన్నారు.
నేను వాటిని అప్లోడ్ చేసి.. ఆవిడ డౌన్లోడ్ చేసుకొని, ఆ ఐపాడ్ లోకి లోడ్ చెయ్యటం.. అంత సమయం లేదు. ఎందుకంటే అప్పటికే ఆవిడ ఫ్లైట్ టికెట్ కన్ఫర్మ్ అయ్యింది. మరుసటి రోజు తెల్లవారిఝామున ఇండియా కి ప్రయాణం.
"ఇలా అయితే కాదు.. మీరు ఇండియా లో మీరు ఎక్కడ ఉండబోతున్నారో అక్కడ నెట్ కనెక్షన్ ఉన్న సిస్టమ్ ఉందా" అని అడిగితే లేదని చెప్పారావిడ.
"అబ్బో! పెద్ద చిక్కే వచ్చింది" అనుకున్నాను.
"పోనీ మీది లాప్ టాపా? అది ఇండియా కి తీసుకొస్తున్నారా?" అని అడిగాను.
"ఆ.. తీసుకొస్తున్నాను.. అయితే ఏం!" అని తను అంటే
"ఇక మీ బాధ అంతా తీరినట్లే.. ఇక నిశ్చింతగా ఉండండి.. మీరు ఇండియాకి యధావిధిగా వచ్చేస్తారు.. అంతలోగా నేను మీకు కావలసిన పాటలని ఒక DVD లోకి మార్చి, మీకు కొరియర్ చేస్తానని, అక్కడ మీరు ఆ పాటలని మీ లాప్ టాప్ లో లోడ్ చేసి, అనక ఆ ఐపాడ్ లోకి లోడ్ చేసివ్వండి.. కాకపోతే చిన్న ఒక కండీషన్.. థాంక్స్ అంటూ ఏమీ వద్దు.. నేను మీకు సహాయం చేసినట్లు అనుకోకండి.. ఏదో ఇలా సరదాగా చేసాను - మన ఫ్రెండ్ షిప్ కి గుర్తుగా మాత్రమే అనుకోండి" అన్నాను.
తను "సరే" నని అన్నారు..
తనకి చెప్పినట్లుగానే నేను ఆ పాత పాటలని ( 865 పాటలు - 2.85 GB) ఒక DVD లోకి కాపీ చేసిచ్చాను. తను చెప్పిన అడ్రెస్ కి కొరియర్ చేసాను. ఆవిడకి అందింది. లోడ్ చేసి.. వారి నాన్నగారికి ఇచ్చారు.. నా సోషల్ అకౌంట్ కి ఓ చిన్ని స్క్రాప్. "Thanks" అని.(నా కండీషన్ మేరకు)
నా మనసులో ఒక సంతోషం.. ఒకరికి అజ్ఞాతముగా ఉండి సహాయపడ్డానని. వారెవరో నాకు తెలీదు.. తన డాడీ ఇంతవరకు తెలీనే తెలీదు. అయినా సహాయం చేశాను. అందులో నాకు ఎంతో ఆనందం దొరికింది. నేను దీనికోసం చేసింది కొంత సమయం కేటాయింపూ, కొరియర్ ఖర్చూ.. అంతే!.. కాని నేను పొందిన మానసిక ఉల్లాసం చెప్పంలేనంత.. ఇదంతా నా గొప్పకోసం చెప్పటం లేదు. ఏదో ఇలా చేస్తానూ అని షో చెయ్యటానికి కాదు.
మన స్నేహితుల అవసరాలు మనం తీర్చగలం అనుకుంటే - అవి పెద్ద ఖర్చూ లేనివి, వారికీ మనకీ అంతులేని ఆనందం లభించేటివియితే - తప్పక తీర్చాలి. ఇలాంటి అనుకోని సహాయాల వల్ల స్నేహబంధం బాగా పెనవేసుకుంటుంది. అలాని మళ్ళీ నిరూపితం అయ్యింది. అలాని ఆవిడతో చాట్లూ, స్క్రాప్స్.. అంటూ మరింతగా ఏమీ లేదు. ఈ సంఘటన జరగక ముందు మా మధ్య ఎలా స్నేహం ఉందో ఇప్పుడూ అలాగే ఉంది. అంతే! అలాగే ఉండటం నాకిష్టం.
1 comment:
meeru chesina sahyam meeku chinnadhi kavacchu..kaani naaku entho veluvainadhi..naa jeevitham lo marchipolenidhi...meeru chesina sahyaniki thanks ani oka mukkalo cheppi dhanni chinna bucchalenu...aa rooju maa abbayi mobile nundi meeku aa scrap pettanu...kaani prathi rooju na mansulo meku thanks cheputhuntanu...marokkasari malli meeku naa hrudhyapurvakam ga thanks cheppukuntunnanu..
Post a Comment