తెలుగులో టైప్ చెయ్యటం ఎలా లో ఇప్పుడు అతి ముఖ్యమైన పాఠం నేర్పబోతున్నాను. ఇది ఎప్పుడో చెప్పేది కాని.. నేను అనుకున్న పదాలు చాలావరకి గూగుల్ వాడు మార్చేశాడు. అంటే ఇలా టైప్ చేసి స్పేస్ నొక్కితే వచ్చేవి అనుకొని చెప్పే పదాలు అన్నీ.. అలా రావటం లేదు. ఫేస్బుక్, యాహూ ధాటికి ఈ మధ్య కొద్దిగా వెనకబడ్డ గూగుల్ తన స్థానాన్ని నిలబెట్టుకోవటానికి చాలా ప్రయత్నిస్తున్నాడు. ఎంతగా మారుస్తున్నాడూ అంటే రోజుకు కనీసం ఒకటైనా మారుతున్నది. గూగుల్ యొక్క జి మెయిల్, చాట్, ఆర్కుట్, ఆర్కుట్ లోని చాట్, బ్లాగర్... ఇలా అన్నింట్లోనూ చాలా చాలా మార్పులు వచ్చాయి. ఏవో ఒకటి, రెండు మినహా నిజానికి ఇవన్నీ చాలా తేలిక పద్దతులు. అలా మార్చిన వాటిల్లో నా ఎంచుకున్న పదాలు కూడా ఉన్నాయి. వాటిని ఓదగ్గర వ్రాసుకున్నాను కాని.. వాటిని పేస్ట్ చేసే సమయములో చెక్ చేసుకుంటే రావటం లేదు. మామూలుగాఎలా వ్రాస్తామో అలాగే వ్రాస్తే వచ్చేస్తున్నాయి. ఇప్పుడు పెట్టబోయే పదాలని కూడా ఎంత కాలము పనికివస్తాయో తెలీదు. అయినా తప్పదుగా.. అందుకే ఇలా కంటిన్యూ చేస్తున్నాను.
ఇందులో మీకు ముఖ్యమైన సూత్రం ఏమిటంటే: తెలుగు పదాలు టైపింగ్ లో రాకుంటే ఎలా మాట్లాడుతామో అలాగే వ్రాయండి. అప్పుడు స్పేస్ నొక్కితే తెలుగు లోకి వస్తుంది.
ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చెబుతున్నాను.. చూడండి:
Register = రిజిస్టర్ = Rijistar / rijishtar = రిజిస్టర్ (చూశారా.. అప్పుడు రాదనుకుంటే ఇప్పుడు డైరెక్ట్ గా వచ్చేస్తున్నది.)
available = అవైలబ్లె = availabul = అవైలబుల్
month = మొంత్ = manth = మంత్
promote = ప్రోమోతే = pramot = ప్రమోట్
donate = దొనతె = donet = డొనేట్
update = ఉప్దతె = apdet = అప్డేట్
visitors = విసితొర్స్ = vijitars = విజిటర్స్
mechine = మేచినే = meshin = మెషీన్
Browse = బ్రౌసె = brous = బ్రౌస్
Enable = ఎనబ్లె = Enebul = ఎనేబుల్
Exersizes = ఏక్షెర్సిజెస్ = Eksarsaijulu = ఎక్సర్సైజులు
Specials = స్పెసిఅల్స్ = Speshals = స్పెషల్స్
Surprise = సుర్ప్రిసె = Sarpraij = సర్ప్రైజ్
presentation = ప్రెసెన్తతిఒన్ = prajenteshan = ప్రజెంటేషన్
speciality = స్పెసిఅలితి = speshaalitee = స్పెషాలిటీ
verification = వెరిఫికతిఒన్ = Verifikeshan = వెరిఫికేషన్
perfectionist = పెర్ఫెక్తిఒనిస్త = parfekshanist = పర్ఫెక్షనిస్ట్
fashion = ఫషిఒన్ = faashan / fyaashan = ఫాషన్ / ఫ్యాషన్
చూశారా.. ఇలాంటివి చాలానే ఉన్నాయి.. ఇలాగే మాట్లాడుతున్నప్పుడు ఎలా పలుకుతామో అలా వ్రాయాలి.
Saturday, May 8, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment