మీరు అంటి వైరస్ ప్రోగ్రాం ని మీ సిస్టం లో ఇన్స్టాల్ చెయ్యాలని అనుకుంటున్నారా? అయితే ఈ పద్దతులని పాటించండి.
ముందుగా మీరు ఏదైనా అంటివైరస్ ప్రోగ్రాం ని డౌన్లోడ్ చెయ్యండి.
http://www.avira.com/ ,
http://www.avast.com/ ,
http://www.avg.com/ ,
http://www.kaspersky.com/ లాంటి ఏదో ఒక నమ్మకమైన సైట్లనుండి డౌన్లోడ్ చెయ్యండి.
డౌన్లోడ్ అయ్యిందా.. ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ని "D" డ్రైవ్ లో ఒక ఫోల్డర్ క్రొత్తగా పెట్టి ఆ ఫోల్డర్ పేరు "SOFTWARES " అని పేరు పెట్టండి.. ఆ ఫోల్డర్ లోకి ఈ సాఫ్ట్వేర్ ని పేస్ట్ చెయ్యండి. ఇలా చెయ్యడం ఎందుకు అంటే అవసరం అనుకున్నప్పుడు డౌన్లోడ్ చేసే పని తప్పుతుంది. సమయమూ మిగులుతుంది. ఎవరికైనా కాపీ చేసి ఇవ్వటానికి ఈజీగా ఉంటుంది.. మనం మన సిస్టం ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ క్రొత్తగా ఇన్స్టాల్ చేసినప్పుడు డౌన్లోడ్ / CD నుండి కాపీ లాంటి సమయం వృధా పనులు ఉండవు..
ఇప్పుడు మీ సిస్టం లోని ముఖ్యమైన ఫైల్స్ ని ఒక DVD లోకి కాపీ చెయ్యండి. అవి వైరస్ తో ఉన్నా సరే.. వేరు వేరు ఫైల్స్ గా చెయ్యండి.. ఒకే ఫోల్డర్ గా చెయ్యకండి. ఒక్కటే ఫోల్డర్ లాగా మీ సిస్టం లో ఎలా ఉంటే అలాగే చెయ్యండి.. క్రొత్తగా ముద్దగా అంటే ఒకే ఫోల్డర్ లో వేయకండి. ఇలా చేస్తే వైరస్ అన్నింటికీ అంటో- చ్చు అని నా ఆలోచన. ఒకసారి అలాగే జరిగింది కూడా.. ఇలా DVD లోకి కాపీ చెయ్యటం ఎందుకూ అంటే వైరస్ ఉండి ఆ ఫైల్స్ పోయాయే అనుకోండి. మీకు ఆ డాటా దొరకటం కష్టం. ఇలా సేవ్ చేసి పెడితే కనీసం ప్రింటవుట్ అయినా తీసుకోవచ్చు. మహా ఒక DVD విలువ ఎనిమిది రూపాయలేగా! అందుకని.
ఆ అంటి వైరస్ సాఫ్ట్వేర్ ని రన్ చేసి ఇన్స్టాల్ మొదలు పెట్టండి. :
1. ఇంటర్నెట్ ఆన్ చేసి "C" డ్రైవ్ లో ఆ అంటివైరస్ ప్రోగ్రాం ని ఇన్స్టాల్ చేయండి.. ఇలా చేయటం వలన అప్డేట్ ఉంటే అదీ ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ అవుతాయి. ఆన్లైన్ లో ఉండి ఇన్స్టాల్ చేస్తే ఇదొక లాభం. మాటి మాటికీ అప్డేట్స్ వెదకాల్సిన అవసరం ఉండదు. సాఫ్ట్వేర్ లని అప్డేట్ చెయ్యాల్సిన సాఫ్ట్వేర్ వేసుకోవాల్సిన అవసరం లేదు..
2. ఇన్స్టాల్ అయ్యాక, ఒక్కసారి మీ సిస్టం ని అంతా (అన్ని డ్రైవ్ లూ కలిపి) ఒక్కసారి ఆ సాఫ్ట్వేర్ తో స్కాన్ చెయ్యండి..
3. అంతా స్కాన్ అయ్యాక వైరస్ లు ఏమైనా ఉంటే వైరస్ చెస్ట్ కి పంపిస్తుంది - మీరు అనుమతి ఇస్తేనే!
4. అలా స్కాన్ అయ్యాక ఇప్పుడు రిజిస్టర్ చేసుకోవాలి. (ఈ పాపప్ విండో దానంతట అదే వస్తుంది.. వెదకాలసిన అవసరముండదు. కొన్నింటికి అంతా స్కాన్ అయ్యాక వస్తుంది. కొన్నింటికి ముందే వస్తుంది. )
5. అప్పుడు మీ మెయిల్ ID, మీ వయస్సు, లింగం, ఎన్ని రోజులనుండి వాడుతున్నారు, ఈ సాఫ్ట్వేర్ గురించి మీకెలా తెలిసింది?.. అలాంటి ప్రశ్నలు అడుగుతుంది. వాటికి జస్ట్ క్లిక్ (ఆబ్జెక్టివ్ టైప్) ఇచ్చేలా ఉంటాయి.
6. అవన్నీ క్లిక్ చేశాక వెంటనే మీ మెయిల్ ID కి ఒక రిజిస్టర్ కోడ్ వస్తుంది.
7. దాని ఆ పాపప్ విండో లో అడిగిన చోట పేస్ట్ చేసి ఓకే చేస్తే ఇక మీరు ఆ సాఫ్ట్వేర్ వాడుటకి అంతా సవ్యముగా జరిగినట్లే! ఇక మీరు నిశ్చింతగా ఉండొచ్చు..
8. రెండు అంటి వైరస్లు వేసుకోవచ్చు.. కాని ఒక్కోసారి ఒకదాన్ని ఒకటి తొలగించే క్రమములో మీ సిస్టం హ్యాంగ్ కావచ్చును. అందుకే "నిక్కమైన నీలము ఒక్కటైనను చాలు.." అనే సామెత గుర్తుపెట్టుకోండి.
ఇదీ పద్ధతులు.. వీటిని తూ.చ. తప్పకుండా పాటించండి..

డౌన్లోడ్ ఫైల్ సైజు సాధారణముగా 25 MB నుండి 50 MB వరకూ ఉంటుంది.

No comments:
Post a Comment