Sunday, March 18, 2012

(No) Chat please..

మొన్న సోషల్ సైట్లో ఒకతను ఆడ్ రిక్వెస్ట్ పెట్టాడు. అలాగే చాట్ కి కూడా.. సరే అని అతని గురించి వివరాలు చూసాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఫోటో కూడా ఉంది. నా ఫ్రెండ్స్ లిస్టు లోకి ఆడ్ చేశాను. ఆడ్ చేసిన మరుక్షణమే, ఎంతోసేపటి నుండి ఆ అవకాశం ఎదురుచూస్తున్నట్లు చాట్ కి వచ్చాడు.

సరే! అని నా పనులన్నీ ప్రక్కన పెట్టి చాట్ మొదలెట్టాను. మొదటి నుండీ తన ప్రశ్నలే. తను అడగటమే! నేను జవాబు ఇవ్వాల్సిందే. మామూలుగా నన్ను ఏమైనా ప్రశ్నలు అడిగితే వారినీ అడిగితే, నేనూ వారివీ అడుగుతాను. అది సహజమే కదా.. కానీ ఇక్కడ నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం లేదు. ఒకటివెంట మరొకటి అన్నట్లు బుల్లెట్లలా ప్రశ్నల వర్షం. అయినా ఓపికగా జవాబివ్వసాగాను.

నిజానికి అతను అప్పుడే పరిచయం. అయినా ఎంతో చనువుగా డిటైల్స్ అడగటం మొదలెట్టాడు. మూడు ప్రశ్నల తరవాత జెనరల్ ప్రశ్నల నుండి పర్సనల్ విషయాల మీద (కుటుంబం, ఉద్యోగం, ఆస్తులూ..) అడగటం మొదలెట్టాడు. "అవన్నీ అవసరమా.." అన్నాను.

అయినా మానక, అలాగే అడగటం మొదలెట్టాడు. ఎందుకో అనుమానం వచ్చి, ఇంకో టాబ్ ఓపెన్ చేసి, అతని ప్రొఫైల్ ఓపెన్ చేసి, అతని ఆల్బం లోని షేర్ చేసిన (ఉన్న) ఒకేఒక ఫోటో చూస్తూ "ఇతను ఎక్కడైనా, ఎప్పుడైనా పరిచయమా?.." అని ఆలోచించసాగాను.

"అవన్నీ మీకు అనవసరం.. మీరు ఫ్రెండ్ గా ఆడ్ అయ్యారే ఇప్పుడు. అంత లోతుగా నా వివరాలు మీకు అవసరమా?.." అడిగాను.

"ఫ్రెండ్ అన్నాక ఆమాత్రం తెలుసుకోవాలి కదా!.. ఒకరి వివరాలు ఒకరు తెలుసుకోవాలి కదా.. అయితే మీకు ఫ్రెండ్షిప్ మీద నమ్మకం లేదు. జస్ట్ టైం పాస్ అన్నమాట. మీ గురించి నేను ఏదో గొప్పగా ఊహించుకున్నాను.. " అన్నాడు.

ఇదే అదను అనుకొని వెంటనే అతని గురించి ప్రశ్నలు వేశాను. వాటికి రెండు నిమిషాలైనా జవాబు లేదు. అంతలోగా అతని ఫోటోని పరిశీలనగా చూశాను.

అతను ఇందాక నేను వేసిన నా ప్రశ్నలకి జవాబు ఇవ్వక - ఇంకా నా డిటైల్స్ అడగటం మొదలెట్టాడు.

నేను అడిగిన ప్రశ్నలకి జవాబు గురించి అడిగాను. "వాటికి జవాబు ఇస్తాను. నమ్మకం ఉండాలి.. " అని అతని సమాధానం. కానీ అతని గురించి అతడు ఒక్క విషయమూ చెప్పలేదు.

"చూడు బాస్! స్నేహం అని అంటావ్..!! నమ్మకం అనీ అంటావ్..!!! నావే అన్నీ డిటైల్స్ ఆడుగుతున్నారు. అదీ CBI ఎంక్వయిరీ చేసినట్లు, అన్నీ పర్సనల్ విషయాలు అడుగుతున్నారు. మీవి మాత్రం అడిగినా చెప్పటం లేదు. ఇప్పటికే ఈ ప్రశ్నని రెండుసార్లు అడిగాను. ఇప్పుడు మూడోసారీ గుర్తుచేస్తున్నాను. అయినా జవాబు లేదు. ఇక నేను మిమ్మల్ని ఎలా నమ్మేది?. ఏమి చూసి నా విషయాలు మీతో చెప్పాలి?. నాకు అంత అవసరం లేదు.." అన్నాను.

"అంటే మీకు ఫ్రెండ్షిప్ మీద నమ్మకం లేదు.. అందుకే సరిగా చెప్పటం లేదు (?) అసలు మీదే ఫేక్ ప్రొఫైల్.. అందుకే చెప్పటానికి భయం. లేకపోతే చెప్పేవారు కదా.." అని అతను అన్నాడు.

అప్పటికే దాదాపు పది ప్రశ్నలకి సమాధానం ఇచ్చాను. కానీ నా ప్రశ్నలకి ఒక్క సమాధానం కూడా లేదు. చివరిగా నేనే "మీరు ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయా?.." అని అడిగా. "కాదు.. సాఫ్ట్వేర్ ఉద్యోగి" అని చెప్పాడు.

"నాకు కాసింత పని ఉంది.. మళ్ళీ కలుద్దాం.. నైస్ మీటింగ్ టూ యూ.. హావ్ ఏ నైస్ డే.." అని చెప్పి ఆ చాట్ క్లోజ్ చేశాను.

అప్పుడు - ఇందాక ఇంకో ట్యాబ్ లో ఓపెన్ చేసిన అతని ఆల్బం లోని ఫోటో కనిపించింది. అప్పుడే నా బుర్రలో మెరిసింది. అతనెవరో తెలిసింది. మళ్ళీ పరిశీలనగా చూశాను. నిజమే!.. అవే పోలికలు. " య్యెస్.. ఐ గాట్ ఇట్.." అనుకున్నాను. కానీ అందులో సంతోషం లేదు. కాసింత వెగటు, అసహ్యం, కోపముతో "ఛీ!! ఇతనా?.." అనుకున్నాను.

నా ఫ్రెండ్స్ లిస్టు నుండి అతన్ని వెంటనే తొలగించాను. అలాగే బ్లాక్ కూడా చేశాను.

అతను.. ఒకప్పుడు మామూలుగా నాకు సోషల్ సైట్ లో పరిచయం అయ్యి, ఆ తరవాత తన ఆన్లైన్ లోనే తన "అసలు రూపం" చూపి, నా వెంట పడ్డాడు. అతని "విషయం" తెలిసి అతన్ని నా ఫ్రెండ్ లిస్టు నుండి తొలగించాను. మళ్ళీ ఇంకో ప్రొఫైల్ పెట్టేసుకొని మళ్ళీ వెంటపడటం. సోషల్ సైట్లలో ఆడవారికే కాదు.. మగవారు ఫొటోస్ పెట్టుకుంటే వారికీ స్వజాతి నుండి "వెంటపడటం.." లాంటి బాధలు ఉంటాయని చదువుకునే రోజుల్లో వినేవాడిని.. కానీ ఈ ఆన్లైన్ కి వచ్చాక ప్రత్యక్షముగా చూస్తున్నాను. "ఈ (e) బాధల" నుండి నాకు విముక్తి ఎప్పుడ్రా దేవుడోయ్..!!

4 comments:

వనజవనమాలి said...

మీ అనుభవం లొ చాలా విషయం ఉంది. ఏమిటొ.. చాలా మంది ని మీ పరిశీలనలో చూసి మీరు చెపుతుంటే నిజంగానే పాఠాలు నేర్చుకున్నట్లే ఉంటుంది. విలువైన పోస్ట్ రాజ్ గారు.

Raj said...

కృతజ్ఞతలు. నా అనుభవాల పరిచయం వల్ల మిగతా అందరూ బాగుండాలని నాకోరిక అంతే!

buddha murali said...

రాజ్ గారు చాటింగ్ లోనే కాదు చివరకు పోస్ట్ లో సైతం మన సమాచారం ఎతవరకు ఉండాలి అనేది బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి

Raj said...

అవునండీ. పోస్ట్ లో కూడా మన సమాచారం కూడా బాగా అలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ నేను "అలాంటివాడిని" కానురా మొర్రో! వారితో క్లియర్ గా అన్నా వదలకుండా వెంటపడటం, ఇలా ఒక్కరు కాదు, ఆరుగురి (Six) వల్ల అలా ఇబ్బంది పడ్డాను. దానివల్ల అసలు క్రొత్త ఫ్రెండ్స్ ని ఎంచుకోవాలంటే - చాలా నియమాలు పెట్టుకోవాల్సి వస్తున్నది. వీరికి నేను అలాంటివాడిని కాను అన్నా మాటిమాటికీ అలా చెయ్యటం , ఎంతగా బ్లాక్ చేసినా మళ్ళీ వేరే ప్రొఫైల్ పెట్టుకొని రావటం.. అసలు ఆన్ లైన్ కి రావాలంటేనే ఆసక్తి పోయేలా చేస్తున్నారు. అసలు ఆ పోస్ట్ వ్రాయోద్దని అనుకున్నా.. అలా వ్రాస్తే నామీదే చేదు అభిప్రాయం వస్తుంది అని తెలిసినా - ఇంకొకరు ఇలా గురికావద్దని ఒక పాఠం లా చెప్పటం.

Related Posts with Thumbnails