Tuesday, November 26, 2013

Tit for tat

మనుష్యులు తమకో నీతి, ప్రక్క వారికో నీతి అన్నట్లు ఎలా ప్రవర్తిస్తారో మీకు చెబుతానిపుడు. అలాంటివాటికి ఎలా సమాధానం ఇచ్చానో కూడా చెబుతాను.

మా ప్రక్కన ఉండే ఆవిడ తన ఇంట్లోకి ఎవరూ తొంగి చూడకుండా, కర్టేన్లూ, కిటికీలకు ప్లాస్టిక్ దోమల తెరలూ పెట్టేసుకున్నారు. ఎవరి ప్రైవసీ వారిది. అయినా మాకు అలా చాటుగా చూసే అలవాటూ లేదు. నిజానికి ఆ చుట్టుప్రక్కల ఇంట్లో ఎవరూ అలా కర్టేన్స్, దోమతెరలు వేయించుకోవటం అంటూ చెయ్యటం లేదు. సరేలే.. ఎవరిష్టం వారిది.. అనుకున్నాం. తను మాత్రం ఇతరుల కిటికీల నుండి త్రొంగిచూసి, మాతో మాట్లాడుతూ - అలా మాట్లాడుతూనే దృష్టి మామీద కాకుండా ఇంట్లో వస్తువులు ఏమున్నాయి అంటూ పరిశీలనగా చూసేవారు. అయినా మేము పట్టించుకోలేదు. అందరిళ్ళల్లో ఉండే వస్తువులే మా ఇంట్లో ఉన్నాయిగా అనుకొని, పట్టించుకోవటం మానేశాం. నిజానికి వారింట్లో కన్నా మా ఇల్లే అన్నివిధాలా బాగుంటుంది. 

తను మామీద చాలా చాలా చెడుగా - ఇతరులతో అన్నారు. వారు వచ్చి మాకు చెప్పారు. నిజముగా షాక్ తిన్నాం. చాలా మంచావిడ అనుకున్నాం కానీ మాతో క్లోజ్ గా ఉంటూ, మామీద ఇలా చెబుతారు అని అనుకోలేదు. అవన్నీ ఇక్కడ చెప్పలేను. మొత్తానికి ఇక తనతో కాసింత దూరం మైంటైన్ చెయ్యాలని అనుకున్నాం. ఎలాని మా ఆవిడ నన్నడిగితే - నేను చేసి చూపిస్తాను.. కొద్దిరోజులు ఆగమన్నాను. 

ఇలాంటి సందర్భాలల్లో ఎవరినీ ఏమీ అనవద్దు. అంటే - ఆ సమస్య ఇంకా పెరుగుతూనే ఉంటుంది. 

మన జీవితమే చాలా చిన్నది. అందులో సంతోష పాలు ఎక్కువ ఉండాలి గానీ, ఇలా చింతలూ, చీకాకులు పెంచుకుంటూ వెళితే ఏమి లాభం. చెత్తకుండీలా మారుతుంది. మన సహచర్యం కోల్పోయాము, దానివల్ల నా జీవితాన ఒక మంచివారిని మిస్ చేసుకున్నాను అని వారికి అర్థమయ్యేసరికి సగం జీవితం గడిచాక అర్థం కావాలనుకున్నాను. 

ముందుగా - 
తన గురించి ఆలోచించటం మానేయ్యమన్నాను. 
తను తెచ్చి ఇచ్చే వాటిని ఏమీ తీసుకోవద్దన్నాను. 
మనమూ ఏమీ ఇచ్చేది లేదని చెప్పా. 
ఇదంతా వెంటనే కాదు.. ఒక గ్రాడ్యుయల్ గా / మెల్లమెల్లగా జరగాలని అన్నాను. 

తను పాటించే పద్దతులనే మేమూ వాడాము. ఎప్పుడూ తెరిచి ఉంచే ముందు తలుపు దగ్గర వేసేవాళ్ళం - లోపలి చూడకుండా. వంటగది కిటికీ ఎప్పుడూ తెరిచి, ఉంచేవాళ్ళం మేము. దానిగుండా తను లోపలికి చూస్తూ మాట్లాడేవారు తను. ఆ అవకాశంని ఇక నుండీ ఇవ్వదలచుకోలేదు. తను వాళ్ళ ఇంటి కిటికీలకి కొట్టించిన ప్లాస్టిక్ దోమతెరని మేమూ మా వంటగది కిటికీలకి కొట్టాను. ఫలితముగా ఇక మా ఇంట్లోకి త్రొంగి చూసే అవకాశం ఇక ఉండదు. పగలు మేము ఆ జాలీ వల్ల - ఆ బయట అంతా చూడవచ్చును. కానీ బయటవారు లోన ఎవరున్నది మాత్రం చూడలేరు. రాత్రిన ఈ పద్ధతి రివర్స్ అవుతుంది. కావున రాత్రి తప్పనిసరిగా కిటికీలను మూసేస్తాం. దెబ్బకి దెబ్బ. ఇక మాతో మాట్లాడటానికి చాయిస్ లేకుండా చేశాం. పిలిస్తే - మేమే బయటకి వెళ్ళి మాట్లాడుతున్నాం. 

ఇలా చేశాక, తను ఇతరులతో అన్నారు - ఈమధ్య నుండీ వారు మాతో వారు కలిసి మాట్లాడేలా లేరు అనీ.. అందుకు మేమన్నాం - అదేమీ లేదు - దోమల బాధవల్ల అలా చేశామనీ అంతే అని చెప్పాం. ఇక వారితో ఏమీ కలిపించుకోవటం లేదు. ఇక వారిని దూరముగా అట్టి పెట్టేయడమే. 

నిజానికి ఇలాంటి విషయాల్ని ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. మన చుట్టూ ఉన్నవారితో - అంటే వారి మధ్యనే మన దైనందిక జీవితం గడుస్తున్నదీ, గడవబోతుందీ అన్నప్పుడు - వారితో కొట్లాడుతూ ఉంటే - మన అభివృద్ధి ఆగిపోతుంది. ఇది చాలామందికి తెలీకుండానే ప్రక్కవారితో, ఎదుటివారితో... ఎప్పుడూ పోట్లాడుతునే ఉంటారు. దానివల్ల వారిరువురూ కోల్పోయేది చాలానే ఎక్కువ. కానీ మన అభివృద్ధిని మనమే నిరోధించుకోవాలనుకోవటం ఎంతవరకూ సరియైనది.? ఈ విషయం గురించి మరోసారి వివరముగా చెప్పుకుందాం. 

No comments:

Related Posts with Thumbnails