చూశారా - ఈ అన్యోన్య దాంపత్యాన్ని.. వారి ప్రేమ ఇసుమంత కూడా తగ్గలేదు అన్నట్లు ఎలా నవ్వుతూ ఉన్నారో చూశారు కదూ.. ఎంత అదృష్టవంతులు వారు.. హాయిగా నవ్వుతూ ఫోటో తీయించుకున్నారు.. అతడేమిటీ..? తన వెనకాల అలా వీపు మీద ఎక్కాడు.. తను అతన్ని ఎలా మోస్తుంది? అని అనుకుంటున్నారా ?.. ఇప్పటిదాకా మీకు వచ్చిన కోపం - ఒకసారి అతని మరియు ఆమె చేతుల క్రిందుగా చూడండి. షాక్ అయ్యారా? ఇప్పుడు మీకు వచ్చిన కోపం స్థానాన్నే - జాలీ, దయ... ఏర్పడ్డాయా?
అవును.. తను కాళ్ళు పోయిన వికలాంగుడే. తను ఎక్కడికీ కదలలేడు. అయినా ఫరవాలేదు.. నేనున్నాను అంటూ తన మీద ప్రేమతో, తనని ఎత్తుకొని అలా తీసుక వెళుతుంది తను. ఎప్పుడూ తగువులాడుకొనే భార్యాభర్తలు వీరిని చూసి, ఆదర్శముగా తీసుకోవాలి. వారిరువురి వివరాలు ఈ క్రింది లింక్ లో చూడండి. http://blogs.militarytimes.com/battle-rattle/tag/jesse-cottle/
No comments:
Post a Comment