ప్రేమలో నువ్వు వేరు నేను వేరు కాదు.
ప్రేమంటే మనం అనుకొనే మనమే.
చిన్ని గొడవ వల్లనో నువ్వా ? నేనా? అనేంత పంతం పట్టేస్తాం ఒక్కోసారి..
మనం ప్రేమించిన వారిలోని మంచిని ప్రేమించినట్లే
వారిలోని లోపాల్ని ప్రేమించలేమా ?
చంద్రుడిలో మచ్చ ఉందని వెన్నెల్లో తడవటం ( ఆడటం ) మానేస్తున్నామా ?
ప్రేమలో నువ్వు వేరనీ, నేను వేరనీ కాదు. ప్రేమంటే మనం అనుకొనే మనమే.. అంతా మనమే అన్న భావన.
ఒక్కోసారి - చిన్ని గొడవ వల్లనో, ఏదైనా అపార్థం వల్లనో, ఏదైనా మాట పట్టింపు వల్లనో నాదే సరియైనది, నా వాదననే నిజమనీ పంతాలకు పోతాం. మాట్లాడకుండా బెట్టు చేస్తాం. అవతలివారు వచ్చి, క్షమాపణలు అడిగి, తమది తప్పనీ, నీదే సరియైనదని అడగాలని అనుకుంటాం. అలాని ఎదురుచూస్తాం కూడా. కానీ ఒక్క మెట్టు దిగి మనమే వారితో సఖ్యతగా ఉండాలని అనుకోము. మనం వారిలో ఇష్టపడ్డ మంచిని ప్రేమించినట్లే - వారిలోని లోపాలని ప్రేమించలేమా ? అసలు లోపాలు లేనిదంటూ ఎవరూ ? అందరికీ కొద్దో, గొప్పో లోపాలంటూ ఉండనే ఉంటాయి. చంద్రునిలో మచ్చ ఉందని ఆ వెన్నెల్లో తిరగటం, ఆడుకోవటం వంటివి మానేస్తున్నామా ?
ఇలా ప్రేమలోనే కాదు, స్నేహం కూడా అంతే.
No comments:
Post a Comment