మనం చేసే ప్రతి పనిలోనూ ఆనందం లేకపోవచ్చును..!
కానీ ఏ పనీ చెయ్యకుండా ఆనందాన్ని మాత్రం పొందలేము..
అవును.. మనం చేసే ప్రతి పనీ మనకిష్టముతో, మనసు పెట్టి చేస్తాము అనేది అన్నింట్లోనూ జరుగదు. అలాగే మనం చేసే ప్రతి పనిలోనూ ఆనందం లేకపోవచ్చును. ఏదో మొహమాటానికో, బలవంతం మీదో, చెయ్యక తప్పదు గాక తప్పదు అనో, ఉద్యోగ బాధ్యత వల్లనో, మరే ఇతర కారణం వల్లనే గానీ.. ఇత్యాది కారణాలవల్ల ఇలా చేసే ప్రతి పనిలో ఆసక్తి, ఇష్టం, ఆత్మ పెట్టి పనిచెయ్యలేం. ఏదో మమః అనిపిస్తాం. ఏదో వచ్చాం.. చేశాం, వెళ్ళాం.. అన్న భావన అందులో స్పష్టముగా కనిపిస్తుంది. అలాగే ఏ పనీ చెయ్యకుండా ఆనందాన్నీ పొందలేం.. చివరకు ఆనందించాలన్నా మనసు దాని మీద లగ్నం చెయ్యాలి, కళ్ళతో చూడాలి, చెవులతో వినాలి, అవి మదిని చేరాలి. వాటికి మది స్పందించాలి. అప్పుడే ఆనందించే విషయం అయితే ఆనందం వేస్తుంది.
No comments:
Post a Comment