Friday, November 15, 2013

Good Morning - 498


ఎంత ఎక్కువగా ప్రేమను పెంచుకుంటే జీవించే సామర్థ్యం అంత ఎక్కువగా పెరుగుతుంది. 

భర్త మీదనే కానీ, భార్య మీదే కానీ, సంతానం మీదే కానీ, తోబుట్టువుల మీదే కానీ, మితృల మీదే కానీ, ప్రేయసి, ప్రియుడి మీదే కానీ - వారు ఎవరైనా సరే ( అలాని ఎవరిని పడితే వారిని ఎంచుకొని ఇబ్బందిపడకండి . హ హ్హ హా ) మన ఆత్మీయులు అనుకున్నవారి మీద ప్రేమను పెంచుకోండి. ప్రేమలో ఎన్నెన్నో రకాలు. అందులో మీరు ఏ రకమైన ప్రేమను ఎంచుకుంటారు అన్నది మీ మీ వివేకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. తల్లి తండ్రిలా ప్రేమ అవొచ్చు, గురు శిష్య ప్రేమనే కావొచ్చు, స్నేహ సంబంధ ప్రేమనే ఉండొచ్చు, ఆత్మీయ అనురాగపు బంధపు ప్రేమనే కావొచ్చును.. ఏదైనా కావొచ్చును. ప్రేమించిన కొలదీ ప్రతిదీ క్రొత్తగా కనిపిస్తుంది. ఎప్పుడూ చూడని క్రొత్త కోణాలను ఆవిష్కరిస్తుందీ ప్రేమ. ప్రేమ యొక్క పర్యావసానాలు ఎలా ఉన్నా - ప్రేమలో ఉన్న మహిమ వల్ల జీవించే సామర్థ్యం పెరుగుతుంది. 

నమ్మలేకున్నారా? అది నిజం. ప్రేమలో మీరు చేసేది డబుల్ వే ప్రేమ బంధమే కావొచ్చు, వన్ వే ట్రాఫిక్ ప్రేమనే కావొచ్చును.. మీరు ప్రేమించకున్నా ఎదుటివారు చూపించే ప్రేమనే మీరు అంగీకరించి, ఆ తాదాత్మికతని అనుభవిస్తున్నాసరే - మీరు మీ జీవన సామర్థ్యాన్ని పెంచుకున్నవారే అవుతారు. నమ్మకున్నా అది నిజం. అప్పటిదాకా మీలో ఉన్న కోపం, విసుగు, నిర్లక్ష్యం, దేనిమీద శ్రద్ధ పెట్టకపోవటం, జీవితం మీద చిన్న చూపు ఉండటం, మనమీద మనకే శ్రద్ధ లేకపోవటం...... ఇత్యాది లోపాలన్నీ మారిపోతాయి. వాటి స్థానాన మంచి పద్ధతులు చేరుతాయి. ఆ ప్రేమలో పడ్డాక / అనుభవిస్తున్నప్పుడు - తిట్టినా మధురమైన మాటలుగా వినిపిస్తుంటాయి. విసుగు అంటూ ఏమీ ఉండదు. ఎన్నిసార్లు చెయ్యమన్నా ఆనందముగా చేస్తారు. నిర్లక్ష్యం తగ్గుతుంది. ( మీ వృత్తి పని మాత్రం దెబ్బ తింటుంది ) జీవితం ఇంతకు ముందు కన్నా మరెంతో అందముగా కనిపిస్తుంది. మనవారి కోసం మరింత శ్రద్ధగా మనల్ని మనం అలకరించుకుంటాం. 

No comments:

Related Posts with Thumbnails