ఎప్పుడూ బాధపడుతూ ఉంటే - బ్రతుకు భయపడుతుంది.
అదే ప్రతిక్షణం నవ్వుతూ ఉంటే జీవితం తలవంచుతుంది.
నిజమే ఇది. మొదట్లో నేనూ నమ్మేవాడినే కాదు.. ఒక స్నేహితురాలి జీవితం చూశాక - నేనూ మారాను. అందాక బ్రతుకు అంటే ఏదో తెలీని భయం.. రేపు ఏమవుతుందో? ఎలా అనీ.. ఆఫ్కోర్స్! ఇలా ప్రతివారికీ ఉంటుంది. కానీ బయటకు చెప్పుకోలేం - ఎక్కడ పిచ్చోడా..! ఎందుకలా భయపడుతావ్.. అని మాటలు వినాల్సి వస్తుందని.. (నిజానికి అలా అనేవాడికీ కూడా యే మూలో ఆ భయం తప్పక ఉంటుంది కూడా..)
నా స్నేహితురాలి జీవితం దగ్గరనుండి చూశాను కాబట్టి, అప్పటిదాకా బ్రతుకు మీద కాస్తో కూస్తో భయం ఉన్నవాడిని ఇప్పుడు చాలా ధైర్యముగా ఉంటున్నాను. తను అయితే అన్నిరకాల కష్టాలనీ అనుభవించారు. లోపల ఎన్ని బాధలు ఉన్నా, పైకి మాత్రం చెదరని చిరునవ్వుతో స్వాగతిస్తుంది. తనదగ్గరికి వచ్చిన వారిని ఆప్యాయముగా పలకరించి, వారిని తన మాటలతో, నవ్వులతో ఉల్లాసపరుస్తుంది. కానీ ఆ నవ్వుల వెనుక చాలా బాధలు. చెబితే ఎవరూ నమ్మరు కానీ బాగా బాధలు అనుభవిస్తున్నవారే - చక్కగా నవ్వుకోగలరు. ఈ విషయాన్ని నేనూ స్వయానా అనుభవించాను.. అనుభవిస్తున్నాను కూడా. నాకు తనలో నచ్చిన గొప్ప విషయమూ ఇదే. చిన్నవయసులో పంటి క్రిందనే ఉంచేసి, బయటకి నవ్వుని మాత్రమే తీసుకరావటం చాలా గొప్పవిషయమే. మామూలుగా సాధ్యమయ్యే పని మాత్రం కాదు. అలా నేనూ ఇంప్రెస్ అయ్యాను. సంతోషాన్ని పంచితే అది రెట్టింపై మనల్ని తిరిగి సంతోషపరుస్తుంది అని అప్పుడే తెలుసుకున్నాను.
ఇక్కడ ఒక సినిమా సన్నివేశం గుర్తుక వస్తుంది. గీతాంజలి సినిమాలో - హీరోయిన్ చనిపోతుందని తెలుసుకున్న హీరో బాధతో ఆమె ఇంటికి వెళ్ళి, ఆ విషయాన్ని అడిగితే, ఆ హీరోయిన్ చెప్పే మాటలు అద్భుతం. అక్కడి నుండీ - తనూ మరణించబోతున్న ఆ హీరో కూడా మారుతాడు. (ఈ సీన్ కొద్దిగా ఈ సందర్భానికి చెందింది కాబట్టి అదీ పోస్ట్ చేస్తున్నాను.. చూడండి) అభిమానించేవారు తాము ఎంతో అభిమానిస్తున్న వారు చెబితే ఎంతగా మారిపోతారు అన్నదానికి కూడా ఇది చక్కని ఉదాహరణ.
No comments:
Post a Comment