మనిషి తన నుంచి తాను విడికానంత కాలం, అతడు దేన్నీ చూడలేడు. తనని తాను తెలుసుకోవడం చాలా కష్టం. దానికి తీవ్ర సాధన కావాలి.
మనిషి తననుండి తాను అంటే బాహ్య ప్రాపంచిక విషయాలు, బంధాల నుండి విడిగా / దూరం కానంత కాలం అతడు దేన్నీ చూడలేకపోతాడు. సరిగా అర్థం చేసుకోలేకపోతాడు. అలా ఉన్నన్ని రోజులూ అతను జ్ఞాని కాలేకపోతాడు. ఈ మాయా ప్రపంచం లోని భవ బంధాల నుండి దూరముగా జరిగి తనను తాను ఏమిటో, తను ఈ లోకములోకి ఎందుకు వచ్చాడో, ఎందుకు పుట్టాడో, ఏమి సాధించాలనుకుంటున్నాడో, అంతకు తగ్గ ఆచరణ సాధ్యాసాధ్యాలు ఏమిటో.. తెలుసుకోవడం చాలాకష్టం. అలా తెలుసుకోవాలంటే దానికి చాలా కఠోర సాధన అవసరం.
No comments:
Post a Comment