నమ్మకం : ఇది ఏర్పడాలీ అంటే కొన్ని సంవత్సరాలు కావాలి. కానీ నమ్మకం పోవటానికి కొద్ది క్షణాలు చాలు.
మనం ఎదుటి వ్యక్తితో స్నేహమే కానీ, ఒక చక్కని బంధమే కానీ ఏర్పడటానికి ముందుగా కావాల్సింది నమ్మకం. అప్పటిదాకా పరిచయంగా ఉన్న స్నేహం / పరిచయం ఎదుటివారి మీద మంచి నమ్మకం ఏర్పడాలి. అలా ఏర్పడటానికి ఆ ఎదుటివారు తమ మీద నమ్మకం ఏర్పడేలా మాటలు, చేతలు, ఆహార్యం, మానసిక భావనలు, సంస్కారం, బాడీ లాంగ్వేజ్, తమ ఆలోచనలు.. చెయ్యాలి / చూపాలి. వీటన్నింటీ వల్ల మనలో ఒక చక్కని అభిప్రాయం ఏర్పడుతుంది.
అదే ఏర్పడిన నమ్మకం పోవాలీ అంటే కొద్దిక్షణాలు చాలు. ఏదో తప్పుగా ఊహించుకోవడమో, మన స్నేహితులు చెప్పిన మాటలు ఎంత నిజమో తెలుసుకోకుండా చటుక్కున ఒక అభిప్రాయానికి రావటమో, కష్టపడి నమ్మకం ఏర్పరుచుకున్న స్నేహాన్ని / బంధాన్ని చిన్న చిన్న అపోహలు ( తమంతట తాముగా క్లారిఫై చేసుకుంటే చాలా తక్కువ సమయములో మబ్బుల్లా తేలిపోతాయి) వల్ల అప్పటిదాకా ఆత్మీయులు, శ్రేయోభిలాషులు అనుకున్న వారినీ దూరం చేసుకుంటాం. అలా పోగొట్టుకున్న నమ్మకాన్ని తిరిగిపొందటం చాలా కష్టమే..
No comments:
Post a Comment