కృతజ్ఞతా దినోత్సవం Thanksgiving day అనేది నూతన సంవత్సర వేడుకల్లాగా, ఫాదర్ డే, మదర్ డే.. లాగా ఇదీ సంవత్సరానికి ఒకరోజు వచ్చే ఆధునిక దినోత్సవం. ఈరోజున అమెరికా దేశస్థులు తమ తమ జీవితాన - తమ అభివృద్ధి కొరకు పాటుపడిన వారందరికీ కృతజ్ఞతలు తెలియచేయ్యటానికి ఈ దినోత్సవాన్ని నిర్ణయించారు. ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నవంబర్ నాలుగో గురువారం రోజున జరుపుకుంటారు. అనగా ఈ సంవత్సరం 2013 లో నవంబర్ 28 న ఈ వేడుక జరుపుకుంటారు. నాకు ఎందుకో ఈ దినోత్సవము నచ్చి, నేనూ జరుపుకుంటున్నాను.
మన జీవితాల్లో పుట్టినప్పటి నుండీ మరణించే వరకూ ఎందరెందరి తోడ్పాటు వల్లే మనం ప్రస్తుతమున్న స్థాయికి చేరుకోగాలిగాం. ఒకస్థాయికి వచ్చాక, మనలో ఒక్కసారిగా ఫలానా వారి వల్లే నేను ఈస్థాయికి రాగలిగాను.. వారి వద్దకి ఒకసారి వెళ్ళి, కలిసి రావాలి అనుకుంటాం. ఆ దిశగా ఆలోచన చేస్తాం..కానీ చాలామందికి పనులు, బాధ్యతల వత్తిడికి కలవాలనుకున్నా కలవలేకపోతారు. కనీసం సంవత్సరానికి ఒక్కరోజైనా మన అభివృద్ధిలో సహకరించిన వారికి కృతజ్ఞతలు చెప్పినా, వారు చేసిన సేవ, మేలు, త్యాగం.. స్మరించుకోవటానికి ఈరోజుని ఏర్పాటు చేశారు.
వీరే కాదు.. ఇంకా చాలామంది అజ్ఞాతముగా ఉండి, మనకు మేలు చేసే ఉంటారు. కొందరు మనకి గొప్ప మేలు చేస్తారు కానీ వారి వివరాలు తెలీవు. కనీసం కృతజ్ఞతలు చెప్పుకోవాలని అనుకుంటాం. ఆ పరిస్థితుల్లో - తొందరలో మరచిపోతాం. తరవాత వారికి చెప్పాలని చూసినా వారు మనకి కనిపించరు. అప్పుడు మనం వారికి ఏదో బాకీ పడిపోయాం అన్న భావనలో ఉండిపోతాం. ఈ భావన మనల్ని జీవితాంతం వెంటాడుతుంది. వారికోసమని గుర్తుకొచ్చినప్పుడల్లా స్మరిస్తూనే ఉంటాం. అదిగో అలాంటి వాటిని మరొకసారి జ్ఞాపకాల తుట్టెని కదపటం. వారికి ఎలాగైనా కలిసి కృతజ్ఞతలు చెప్పాలని అనుకుంటాం. అలాంటి వారిని మరొకసారి స్మరించుకోవటానికి ఏర్పడినదే ఈ కృతజ్ఞతా దినోత్సవం. Thanks giving day
నా జీవితాన నాకు మేలూ, ఉపకారం, అపకారం, నమ్మకం, ద్రోహం, మంచి అందమైన జ్ఞాపకాలు, మరచిపోలేని చెడు జ్ఞాపకాలు, వెన్నుపోటులూ, చక్కని సాయం, వెక్కిరింపులు, మోటివేట్... ... చేసిన అందరికీ వేవేల కృతజ్ఞతలు.
No comments:
Post a Comment