విజయాలు, ఓటములు దినచర్యలో చిన్న భాగం మాత్రమే.. జీవితానికి అంతకు మించిన లోతైన నిర్వచనం ఉంది.
మన జీవితాల్లో విజయాలూ, అపజయాలూ - మన దినచర్యలో చాలా చిన్న భాగం. ఒకసారి విజయాలే ఎదురవచ్చును.. చాలాసార్లు అపజయాలే ఎదుర్కునే ఉండి ఉండొచ్చును. కానీ ఏవీ శాశ్వతం కాదు. ఆకాశం లోని మబ్బుల వలె వస్తూ వెళుతుంటాయి. ఎప్పుడూ ఏదీ మన దగ్గర ఉండదు కూడా. ఒక వ్యక్తి విజయం సాధించినప్పుడు దగ్గరికి చేరటం, ఓటమి పాలవుతే - దూరముండి, విమర్శించటం సరియైన పద్ధతి కాదు. అదే మిత్రులయితే ఈ ఓటమి పొందినవారికి ధైర్యం చెప్పి, నిరాశకి లోను కాకుండా చూసి, గెలుపు దిశగా ప్రయత్నించేలా చూడాల్సిన బాధ్యత మీద ఉంటుంది కూడా.. నిజానికి ఈ గెలుపు ఓటమిలు ఈ సృష్టిలో ప్రతి ప్రాణికి తప్పవు. అడవిలోని మృగరాజుకి కూడా ఒక్కోసారి ఓటమి తప్పదు. ఈ ఓటమి మనకి ఎంత తక్కువగా నష్టాన్ని పొందేలా చేసుకున్నామనేది - చాలా ముఖ్యం.
మన జీవితాన ఇంతగా ప్రభావితం చేసే ఈ గెలుపు, ఓటమిలు నిజానికి చాలా చిన్న భాగాన్ని ఆక్రమిస్తాయి. చాలామంది ఇవే ప్రముఖముగా చూస్తూ ఉంటారు. దీన్ని బట్టే ఆ మనిషికి విలువనిస్తూ ఉంటారు. కానీ కొద్దిమంది మాత్రమే ఈ అశాశ్వతమైన గెలుపు, ఓటమిలకు తక్కువ ప్రాధాన్యతని ఇస్తుంటారు. ఎందుకంటే ఈ జీవితానికి అంతకన్నా లోతైన అర్థం, పరమార్థం.. ఉంది. దాన్ని గురించి ఆలోచించే వారికి ఈ గెలుపు, ఓటమిలు అంతగా ప్రభావం చూపించవు.
No comments:
Post a Comment