Saturday, November 30, 2013

Good Morning - 511


Friday, November 29, 2013

Good Morning - 510


చక్కని ప్రణాళికకు మంచి ఊహాశక్తిని జోడిస్తే గొప్ప విజయాలను పొందగలుగుతాం. ఊహాశక్తి కొరవడిన ప్రణాళికలు మన పనిని నాశనం చేస్తాయి. 

జీవితములో మన లక్ష్యాన్ని చేరుకోవటంలో , అనుకున్నది సాధించటానికి ఎన్నో ఆలోచనలు చేస్తాం.. చక్కని ప్రణాళికలు Route maps వేస్తాం. అయితే - వీటివల్ల విజయాలని సాధించాలీ అంటే శ్రనే కాకుండా, ప్రణాళికలకు తగిన నంచి ఊహాశక్తి కూడా ఉండాలి. అలా అయితేనే, మనం ఏమైనా సాధించింది మన్నలను పొందుతుంది. ఆ ఊహాశక్తిలో లొసుగులు ఉండకూడదు. ప్రతి అంశమూ పరిపూర్ణతతో కూడుకొన్నదై ఉండాలి. ఇలాంటి ఊహాశక్తి కొరవడిన ప్రణాళికలు మన పనిని నాశనం చేస్తాయి. 

Thursday, November 28, 2013

కృతజ్ఞతా దినోత్సవం Thanks giving day.


కృతజ్ఞతా దినోత్సవం Thanksgiving day అనేది నూతన సంవత్సర వేడుకల్లాగా, ఫాదర్ డే, మదర్ డే.. లాగా ఇదీ సంవత్సరానికి ఒకరోజు వచ్చే ఆధునిక దినోత్సవం. ఈరోజున అమెరికా దేశస్థులు తమ తమ జీవితాన - తమ అభివృద్ధి కొరకు పాటుపడిన వారందరికీ కృతజ్ఞతలు తెలియచేయ్యటానికి ఈ దినోత్సవాన్ని నిర్ణయించారు. ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నవంబర్ నాలుగో గురువారం రోజున జరుపుకుంటారు. అనగా ఈ సంవత్సరం 2013 లో నవంబర్ 28 న ఈ వేడుక జరుపుకుంటారు. నాకు ఎందుకో ఈ దినోత్సవము నచ్చి, నేనూ జరుపుకుంటున్నాను. 

మన జీవితాల్లో పుట్టినప్పటి నుండీ మరణించే వరకూ ఎందరెందరి తోడ్పాటు వల్లే మనం ప్రస్తుతమున్న స్థాయికి చేరుకోగాలిగాం. ఒకస్థాయికి వచ్చాక, మనలో ఒక్కసారిగా ఫలానా వారి వల్లే నేను ఈస్థాయికి రాగలిగాను.. వారి వద్దకి ఒకసారి వెళ్ళి, కలిసి రావాలి అనుకుంటాం. ఆ దిశగా ఆలోచన చేస్తాం..కానీ చాలామందికి పనులు, బాధ్యతల వత్తిడికి కలవాలనుకున్నా కలవలేకపోతారు. కనీసం సంవత్సరానికి ఒక్కరోజైనా మన అభివృద్ధిలో సహకరించిన వారికి కృతజ్ఞతలు చెప్పినా, వారు చేసిన సేవ, మేలు, త్యాగం.. స్మరించుకోవటానికి ఈరోజుని ఏర్పాటు చేశారు. 

వీరే కాదు.. ఇంకా చాలామంది అజ్ఞాతముగా ఉండి, మనకు మేలు చేసే ఉంటారు. కొందరు మనకి గొప్ప మేలు చేస్తారు కానీ వారి వివరాలు తెలీవు. కనీసం కృతజ్ఞతలు చెప్పుకోవాలని అనుకుంటాం. ఆ పరిస్థితుల్లో  - తొందరలో మరచిపోతాం. తరవాత వారికి చెప్పాలని చూసినా వారు మనకి కనిపించరు. అప్పుడు మనం వారికి ఏదో బాకీ పడిపోయాం అన్న భావనలో ఉండిపోతాం. ఈ భావన మనల్ని జీవితాంతం వెంటాడుతుంది. వారికోసమని గుర్తుకొచ్చినప్పుడల్లా స్మరిస్తూనే ఉంటాం. అదిగో అలాంటి వాటిని మరొకసారి జ్ఞాపకాల తుట్టెని కదపటం. వారికి ఎలాగైనా కలిసి కృతజ్ఞతలు చెప్పాలని అనుకుంటాం. అలాంటి వారిని మరొకసారి స్మరించుకోవటానికి ఏర్పడినదే ఈ కృతజ్ఞతా దినోత్సవం. Thanks giving day 

నా జీవితాన నాకు మేలూ, ఉపకారం, అపకారం, నమ్మకం, ద్రోహం, మంచి అందమైన జ్ఞాపకాలు, మరచిపోలేని చెడు జ్ఞాపకాలు, వెన్నుపోటులూ, చక్కని సాయం, వెక్కిరింపులు, మోటివేట్... ... చేసిన అందరికీ వేవేల కృతజ్ఞతలు. 

Wednesday, November 27, 2013

Good Morning - 509


వ్యక్తిగత సంతోషానికి రాచమార్గంమేమిటంటే - నిన్ను నిర్దేశిస్తున్న శక్తులకీ, నీ నిర్దేశలతో సహకరించడమే.. చురుగ్గా ఉండు. బాధ్యత తీసుకో, నువ్వు నమ్మిన వాటి కోసం కృషి చెయ్యి. అలా చెయ్యడం లేదంటే నీ విధిని ఎవరికో అప్పగిస్తున్నావన్నమాటే. 

మన వ్యక్తిగతముగా సంతోషముగా ఉండటానికి మేలైన మార్గం ఏమిటంటే - మనల్ని ఆజ్ఞాపిస్తున్న శక్తులకి ( యజమాని, బాస్, లోకం, సమాజం, ప్రకృతి... ) మన లక్ష్యాలతో సహకరించడం చెయ్యాలి. అందులకు మన బాధ్యతతో చురుకుగా, పని పట్ల శ్రద్ధతో లక్ష్యం దిశగా సాగుతూ ఉండాలి. అలా సాగాలి అంటే - బాధ్యత తీసుకోవాలి. ఆ పనిని విజయవంతముగా చెయ్యటానికి వచ్చిన బాధ్యతని శిరసావహించాలి. మనం నమ్మిన వాటికోసం అహర్నిశలూ కృషి చెయ్యాలి. అవే పరమావధిలా అనుకొని, ఆయా విషయాల్లో లక్ష్యం దిశగా కొనసాగాలి. ఇలా మనం చెయ్యకుండా ఉంటే - మనం భవిష్యత్తుని ఎవరి చేతుల్లోనో పెట్టేయబోతున్నావని అర్థం. 

Tuesday, November 26, 2013

Tit for tat

మనుష్యులు తమకో నీతి, ప్రక్క వారికో నీతి అన్నట్లు ఎలా ప్రవర్తిస్తారో మీకు చెబుతానిపుడు. అలాంటివాటికి ఎలా సమాధానం ఇచ్చానో కూడా చెబుతాను.

మా ప్రక్కన ఉండే ఆవిడ తన ఇంట్లోకి ఎవరూ తొంగి చూడకుండా, కర్టేన్లూ, కిటికీలకు ప్లాస్టిక్ దోమల తెరలూ పెట్టేసుకున్నారు. ఎవరి ప్రైవసీ వారిది. అయినా మాకు అలా చాటుగా చూసే అలవాటూ లేదు. నిజానికి ఆ చుట్టుప్రక్కల ఇంట్లో ఎవరూ అలా కర్టేన్స్, దోమతెరలు వేయించుకోవటం అంటూ చెయ్యటం లేదు. సరేలే.. ఎవరిష్టం వారిది.. అనుకున్నాం. తను మాత్రం ఇతరుల కిటికీల నుండి త్రొంగిచూసి, మాతో మాట్లాడుతూ - అలా మాట్లాడుతూనే దృష్టి మామీద కాకుండా ఇంట్లో వస్తువులు ఏమున్నాయి అంటూ పరిశీలనగా చూసేవారు. అయినా మేము పట్టించుకోలేదు. అందరిళ్ళల్లో ఉండే వస్తువులే మా ఇంట్లో ఉన్నాయిగా అనుకొని, పట్టించుకోవటం మానేశాం. నిజానికి వారింట్లో కన్నా మా ఇల్లే అన్నివిధాలా బాగుంటుంది. 

తను మామీద చాలా చాలా చెడుగా - ఇతరులతో అన్నారు. వారు వచ్చి మాకు చెప్పారు. నిజముగా షాక్ తిన్నాం. చాలా మంచావిడ అనుకున్నాం కానీ మాతో క్లోజ్ గా ఉంటూ, మామీద ఇలా చెబుతారు అని అనుకోలేదు. అవన్నీ ఇక్కడ చెప్పలేను. మొత్తానికి ఇక తనతో కాసింత దూరం మైంటైన్ చెయ్యాలని అనుకున్నాం. ఎలాని మా ఆవిడ నన్నడిగితే - నేను చేసి చూపిస్తాను.. కొద్దిరోజులు ఆగమన్నాను. 

ఇలాంటి సందర్భాలల్లో ఎవరినీ ఏమీ అనవద్దు. అంటే - ఆ సమస్య ఇంకా పెరుగుతూనే ఉంటుంది. 

మన జీవితమే చాలా చిన్నది. అందులో సంతోష పాలు ఎక్కువ ఉండాలి గానీ, ఇలా చింతలూ, చీకాకులు పెంచుకుంటూ వెళితే ఏమి లాభం. చెత్తకుండీలా మారుతుంది. మన సహచర్యం కోల్పోయాము, దానివల్ల నా జీవితాన ఒక మంచివారిని మిస్ చేసుకున్నాను అని వారికి అర్థమయ్యేసరికి సగం జీవితం గడిచాక అర్థం కావాలనుకున్నాను. 

ముందుగా - 
తన గురించి ఆలోచించటం మానేయ్యమన్నాను. 
తను తెచ్చి ఇచ్చే వాటిని ఏమీ తీసుకోవద్దన్నాను. 
మనమూ ఏమీ ఇచ్చేది లేదని చెప్పా. 
ఇదంతా వెంటనే కాదు.. ఒక గ్రాడ్యుయల్ గా / మెల్లమెల్లగా జరగాలని అన్నాను. 

తను పాటించే పద్దతులనే మేమూ వాడాము. ఎప్పుడూ తెరిచి ఉంచే ముందు తలుపు దగ్గర వేసేవాళ్ళం - లోపలి చూడకుండా. వంటగది కిటికీ ఎప్పుడూ తెరిచి, ఉంచేవాళ్ళం మేము. దానిగుండా తను లోపలికి చూస్తూ మాట్లాడేవారు తను. ఆ అవకాశంని ఇక నుండీ ఇవ్వదలచుకోలేదు. తను వాళ్ళ ఇంటి కిటికీలకి కొట్టించిన ప్లాస్టిక్ దోమతెరని మేమూ మా వంటగది కిటికీలకి కొట్టాను. ఫలితముగా ఇక మా ఇంట్లోకి త్రొంగి చూసే అవకాశం ఇక ఉండదు. పగలు మేము ఆ జాలీ వల్ల - ఆ బయట అంతా చూడవచ్చును. కానీ బయటవారు లోన ఎవరున్నది మాత్రం చూడలేరు. రాత్రిన ఈ పద్ధతి రివర్స్ అవుతుంది. కావున రాత్రి తప్పనిసరిగా కిటికీలను మూసేస్తాం. దెబ్బకి దెబ్బ. ఇక మాతో మాట్లాడటానికి చాయిస్ లేకుండా చేశాం. పిలిస్తే - మేమే బయటకి వెళ్ళి మాట్లాడుతున్నాం. 

ఇలా చేశాక, తను ఇతరులతో అన్నారు - ఈమధ్య నుండీ వారు మాతో వారు కలిసి మాట్లాడేలా లేరు అనీ.. అందుకు మేమన్నాం - అదేమీ లేదు - దోమల బాధవల్ల అలా చేశామనీ అంతే అని చెప్పాం. ఇక వారితో ఏమీ కలిపించుకోవటం లేదు. ఇక వారిని దూరముగా అట్టి పెట్టేయడమే. 

నిజానికి ఇలాంటి విషయాల్ని ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. మన చుట్టూ ఉన్నవారితో - అంటే వారి మధ్యనే మన దైనందిక జీవితం గడుస్తున్నదీ, గడవబోతుందీ అన్నప్పుడు - వారితో కొట్లాడుతూ ఉంటే - మన అభివృద్ధి ఆగిపోతుంది. ఇది చాలామందికి తెలీకుండానే ప్రక్కవారితో, ఎదుటివారితో... ఎప్పుడూ పోట్లాడుతునే ఉంటారు. దానివల్ల వారిరువురూ కోల్పోయేది చాలానే ఎక్కువ. కానీ మన అభివృద్ధిని మనమే నిరోధించుకోవాలనుకోవటం ఎంతవరకూ సరియైనది.? ఈ విషయం గురించి మరోసారి వివరముగా చెప్పుకుందాం. 

Monday, November 25, 2013

Good Morning - 508


మనిషి తన నుంచి తాను విడికానంత కాలం, అతడు దేన్నీ చూడలేడు. 
తనని తాను తెలుసుకోవడం చాలా కష్టం. 
దానికి తీవ్ర సాధన కావాలి. 

మనిషి తన నుండి తాను విడిపోతేనే, తను దేన్నీ అంటే - తన గురించి గానీ, తన చుట్టూరా ఉన్నవారు తన గురించి ఏమి అనుకుంటున్నారే అని కానీ, తను ఎదుటివ్యక్తులతో ఎలా ఉంటున్నాడు అని గానీ, తాను వారితో ఎలా సంబంధాలు నిర్వహిస్తున్నాడు అని గానీ తనకు తానుగా తెలుసుకోవటం సులభం. ఇలా తెలుసుకోగోరటం చాలా కష్టమే. చాలా సాధన చేస్తే గానీ తాన్ గురించి తాను తెలుసుకోవడం చాలా కష్టం. 

Sunday, November 24, 2013

Good Morning - 507


నువ్వు నా కంటిపాపకెంత దూరంగా ఉన్నా, 
నా కలలకెప్పుడూ దగ్గరే..
నువ్వు నా మాటలకెంత దూరముగా ఉన్నా, 
నా మనస్పందనలకెప్పుడూ దగ్గరే.. 
కానీ, నేను నీకెంత దూరముగా ఉన్నా, 
నువ్వు మాత్రం నాకెప్పుడూ దగ్గరే.. 
ఎప్పటికీ నీ నేను.. 


Saturday, November 23, 2013

Good Morning - 506


జీవితాన్ని ఎంతగా అడ్జస్ట్ చేసుకొంటే - 
అంతమంది మితృలు మనతో ఉంటారు. 

అవును.. మన జీవితాన్ని ఎంత అడ్జస్ట్ చేసుకుంటే అంత బాగా మన మితృలు మనతో ఉంటారు. మనమెంత అందగాళ్ళం, ఆస్థిపరులం, సెలెబ్రిటీ వాళ్ళమే కావొచ్చును. కానీ మన మితృలు మనతో ఉన్నప్పుడు - కాసింత తగ్గి, వారి వారి స్థాయిల్లోకి మనం వెళ్ళి, వారితో గడిపితేనే - సఖ్యతగా ఉండగలం. అలా కాకుండా నేనేదో సెలెబ్రిటీని, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, బాగా రిచ్ పర్సన్ ని అంటూ వారి ముందు దర్పం ప్రదర్శిస్తే, ఎవరూ మన దగ్గరకి కూడా రారు. పైగా ఏదైనా ఎక్కువ ఉంటే - మడిచి, ...... పెట్టుకో.. అంటారు. 

పైన ఉన్న చిత్రాన్ని ఒకసారి పరిశీలనగా చూడండి. మన చేతివ్రేళ్ళని ఎంత దగ్గరగా ఉంచి, ఆ దోసిలి నిండా నీరు పట్టుకొంటే - అంతగా నీరు మన చేతుల్లో / దోసిలిలో ఉంటుంది. కొద్దిగా తేడా చూపిస్తే, మన చేతుల్లోన నీరు అసలే ఉండదు. ఈ విషయాన్ని తెలుసుకున్న వారందరికీ మంచి మితృలు వారితో వెన్నంటే ఉండిపోతారు. 

Friday, November 22, 2013

Good Morning - 505


ప్రేమలో నువ్వు వేరు నేను వేరు కాదు. 
ప్రేమంటే మనం అనుకొనే మనమే. 
చిన్ని గొడవ వల్లనో నువ్వా ? నేనా? అనేంత పంతం పట్టేస్తాం ఒక్కోసారి.. 
మనం ప్రేమించిన వారిలోని మంచిని ప్రేమించినట్లే 
వారిలోని లోపాల్ని ప్రేమించలేమా ?

చంద్రుడిలో మచ్చ ఉందని వెన్నెల్లో తడవటం ( ఆడటం ) మానేస్తున్నామా ?  
 ప్రేమలో  నువ్వు వేరనీ, నేను వేరనీ కాదు. ప్రేమంటే మనం అనుకొనే మనమే.. అంతా మనమే అన్న భావన. 
ఒక్కోసారి - చిన్ని గొడవ వల్లనో, ఏదైనా అపార్థం వల్లనో, ఏదైనా మాట పట్టింపు వల్లనో  నాదే సరియైనది, నా వాదననే నిజమనీ పంతాలకు పోతాం. మాట్లాడకుండా బెట్టు చేస్తాం. అవతలివారు వచ్చి, క్షమాపణలు అడిగి, తమది తప్పనీ, నీదే సరియైనదని అడగాలని అనుకుంటాం. అలాని ఎదురుచూస్తాం కూడా. కానీ ఒక్క మెట్టు దిగి మనమే వారితో సఖ్యతగా ఉండాలని అనుకోము. మనం వారిలో ఇష్టపడ్డ మంచిని ప్రేమించినట్లే - వారిలోని లోపాలని ప్రేమించలేమా ? అసలు లోపాలు లేనిదంటూ ఎవరూ ? అందరికీ కొద్దో, గొప్పో లోపాలంటూ ఉండనే ఉంటాయి. చంద్రునిలో మచ్చ ఉందని ఆ వెన్నెల్లో తిరగటం, ఆడుకోవటం వంటివి మానేస్తున్నామా ? 

ఇలా ప్రేమలోనే కాదు, స్నేహం కూడా అంతే. 

Thursday, November 21, 2013

Good Morning - 504


ఆకాశములో ఉండాల్సిన తారవు నువ్వు, 
హృదయం అనే నా ముంగిట వాలావు, 
మెరుపల్లే మెరిసావు, 
చినుకల్లే వర్షించావు, 
చెలిలా కవ్విస్తూ ఆనందింపచేశావు, 
ఇంతలోనే మాయమయ్యావు.. 
నన్నెందుకు ఇంత మాయ చేశావు..? 


Wednesday, November 20, 2013

Good Morning - 503


నువ్వు చెప్పేది అందరూ చెవులతో వింటారు. 
ఆత్మీయులు మనసుతో వింటారు. 
ఒక్క స్నేహితుడు మాత్రమే నువ్వు చెప్పలేని మాటల్నీ, 
గుండెలోని ఊసుల్నీ వినగలడు. 

మనం చెప్పే ఊసులూ, భావాలూ, మాటలనీ ఆత్మీయులు ఏమాత్రం ఇబ్బంది కలిగించకుండా, అన్యమనస్కముగా కాకుండా - మనసు పెట్టి శ్రద్ధగా వింటారు. అవే మాటల్ని అందరూ కేవలం చెవులతో - అంటే హృదయముతో వినరు. సరిగా చెప్పాలీ అంటే మనం చెప్పే విషయం మీద అంత ఆసక్తి చూపకుండా, ఏదో వినాలి నీ సోది అన్నట్లు వింటారు. అదే స్నేహితుడు అయితే మనం చెప్పే మాటలు మాత్రమే కాకుండా, మనం చెప్పని ఊసులూ, వెల్లడించలేని భావాలనూ, గుండె గదిలో దాచిన మాటల్నీ కూడా వినగలడు. అదే స్నేహితుని - స్నేహం యొక్క గొప్పదనం. 

అలా కుదరాలీ అంటే - ఆ స్నేహం, వారిద్దరి మనసులూ మమేకమై పోవాలి. మామూలుగా స్నేహం అనుకున్ననాళ్ళూ ఇలా కుదరటం కష్టమే. నా స్నేహితుడు బాగుండాలీ, వాడి శ్రేయస్సుని కోరుకునే మనసు, అవతలి వాడి మనసుతో అనుసంధానమైనప్పుడు, ఇరువురి వేవ్ లెంత్స్ ఒకేలా ఉన్నప్పుడు మాత్రమే అలా కుదురుతుందని నేను అనుకుంటాను. 

Tuesday, November 19, 2013

Good Morning - 502


మనిషిని తక్కువగా అంచనా వేసినా - ఒక్కోసారి మన్నింపు ఉంటుందేమో కానీ, మనసుని తక్కువ అంచనా వేసి, చులకన చేస్తే ఆ కసి రావణ కాష్టంలా రగులుతూనే ఉంటుంది. 

ఎదుటి మనుష్యులను ఒక్కోసారి తక్కువ అంచనా వేస్తాం. అప్పుడు వారిని చులకనగా చూడటం, సమయం దొరికినప్పుడల్లా హేళన చెయ్యటం, వీరి మీద ఏవేవో చెప్పుకొని ఫన్ చేసుకోవడాలు చేస్తుంటాం. అలా ఆ మనుష్యులను తక్కువ అంచనా వేసినప్పుడు - నిజం తెలుసుకున్నప్పుడు మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలీదు. మళ్ళీ వారికి మొహం చూపించలేకపోతాం. ఇక్కడ ఒక ఉదాహరణ చెబుతాను. మా దగ్గర ప్రైవేట్ కంపనీలో నెలకి ఆరువేల రూపాయలకి పనిచేసే ఒకతను - నా ముందే ఒక కులవృత్తి పని చేసుకుంటున్న అతనిని చూసి, వెక్కిరింపుగా చాలా అలకగా / తేలికగా మాటలు మాట్లాడాడు. నేను అతని గురించి, అతని స్థాయి గురించీ చెప్పాను. ఆ వృత్తిలో అతను రోజుకి తక్కువ తక్కువగా వేయి రూపాయల నుండి మొదలు పెడితే, ------- వేల రూపాయలు సంపాదిస్తున్నాడు. నెలకి కనీసం యాభై వేలు తక్కువ కావు.. అన్నాను. అలాగే అతని ప్రాపర్టీ మొత్తం రెండు కోట్ల రూపాయల మీద ఉంటుందని చెప్పా. అప్పటిదాకా తేలికభావంతో ఆయన ఒక్కసారిగా భయంగా, గౌరవముగా మాట్లాడాడు. " చూస్తే పిచ్చోడిలా కనిపిస్తాడు.. అందుకే అలా అన్నా..సారీ " అన్నాడు. అప్పుడైతే మన్నించవచ్చును. 

మనసుని తక్కువ అంచనా వేసి, చులకనగా చేసి, చూస్తే - అప్పుడు ఏర్పడే కసి, రావణ కాష్టంలా ఎప్పటికీ రగిలిపోతునే ఉంటుంది. నా మీద నా నేస్తం మితృలు వెక్కిరించిన మాటలూ, చులకనగా అన్న మాటలూ, నా మీద చెప్పుకొని చేసుకున్న ఫన్, నా మీద పెట్టిన నిఘా, సెక్యూరిటీ చూపులు.. ఎప్పుడూ అదే విషయాలు నా నేస్తంతో మాట్లాడి, నాకు దూరం చేశారు. తను దూరం అయినందులకు బాధ లేదు. ఏమీ అనను / బాధ పెట్టను మాట ఇచ్చాను కాబట్టి ఎవరినీ ఏమీ అనలేకపోయాను. కానీ అవి నాకు గుర్తుకువచ్చినప్పుడల్లా - ఏదో తెలీని కసీ, బాధా నాలోనుండి ఇంకా తన్నుకవస్తూనే ఉన్నాయి. 

Monday, November 18, 2013

Good Morning - 501


మనం చేసే ప్రతి పనిలోనూ ఆనందం లేకపోవచ్చును..! 
కానీ ఏ పనీ చెయ్యకుండా ఆనందాన్ని మాత్రం పొందలేము.. 

అవును.. మనం చేసే ప్రతి పనీ మనకిష్టముతో, మనసు పెట్టి చేస్తాము అనేది అన్నింట్లోనూ జరుగదు. అలాగే మనం చేసే ప్రతి పనిలోనూ ఆనందం లేకపోవచ్చును. ఏదో మొహమాటానికో, బలవంతం మీదో, చెయ్యక తప్పదు గాక తప్పదు అనో, ఉద్యోగ బాధ్యత వల్లనో, మరే ఇతర కారణం వల్లనే గానీ.. ఇత్యాది కారణాలవల్ల ఇలా చేసే ప్రతి పనిలో ఆసక్తి, ఇష్టం, ఆత్మ పెట్టి పనిచెయ్యలేం. ఏదో మమః అనిపిస్తాం. ఏదో వచ్చాం.. చేశాం, వెళ్ళాం.. అన్న భావన అందులో స్పష్టముగా కనిపిస్తుంది. అలాగే ఏ పనీ చెయ్యకుండా ఆనందాన్నీ పొందలేం.. చివరకు ఆనందించాలన్నా మనసు దాని మీద లగ్నం చెయ్యాలి, కళ్ళతో చూడాలి, చెవులతో వినాలి, అవి మదిని చేరాలి. వాటికి మది స్పందించాలి. అప్పుడే ఆనందించే విషయం అయితే ఆనందం వేస్తుంది. 

Sunday, November 17, 2013

Good Morning - 500


మనిషి తన నుంచి తాను విడికానంత కాలం, అతడు దేన్నీ చూడలేడు. తనని తాను తెలుసుకోవడం చాలా కష్టం. దానికి తీవ్ర సాధన కావాలి. 

మనిషి తననుండి తాను అంటే బాహ్య ప్రాపంచిక విషయాలు, బంధాల నుండి విడిగా / దూరం కానంత కాలం అతడు దేన్నీ చూడలేకపోతాడు. సరిగా అర్థం చేసుకోలేకపోతాడు.  అలా ఉన్నన్ని రోజులూ అతను జ్ఞాని కాలేకపోతాడు. ఈ మాయా ప్రపంచం లోని భవ బంధాల నుండి దూరముగా జరిగి తనను తాను ఏమిటో, తను ఈ లోకములోకి ఎందుకు వచ్చాడో, ఎందుకు పుట్టాడో, ఏమి సాధించాలనుకుంటున్నాడో, అంతకు తగ్గ ఆచరణ సాధ్యాసాధ్యాలు ఏమిటో.. తెలుసుకోవడం చాలాకష్టం. అలా తెలుసుకోవాలంటే దానికి చాలా కఠోర సాధన అవసరం. 

Saturday, November 16, 2013

Good Morning - 499


జీవితంలో తప్పనిసరిగా స్వేఛ్చ, బాహ్య విషయ ప్రభావాల నుండి బయటపడి, అంతరంగిక స్వభావాల నుంచి విముక్తి పొందనిదే - స్వేచ్చలేదు. 

Friday, November 15, 2013

Good Morning - 498


ఎంత ఎక్కువగా ప్రేమను పెంచుకుంటే జీవించే సామర్థ్యం అంత ఎక్కువగా పెరుగుతుంది. 

భర్త మీదనే కానీ, భార్య మీదే కానీ, సంతానం మీదే కానీ, తోబుట్టువుల మీదే కానీ, మితృల మీదే కానీ, ప్రేయసి, ప్రియుడి మీదే కానీ - వారు ఎవరైనా సరే ( అలాని ఎవరిని పడితే వారిని ఎంచుకొని ఇబ్బందిపడకండి . హ హ్హ హా ) మన ఆత్మీయులు అనుకున్నవారి మీద ప్రేమను పెంచుకోండి. ప్రేమలో ఎన్నెన్నో రకాలు. అందులో మీరు ఏ రకమైన ప్రేమను ఎంచుకుంటారు అన్నది మీ మీ వివేకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. తల్లి తండ్రిలా ప్రేమ అవొచ్చు, గురు శిష్య ప్రేమనే కావొచ్చు, స్నేహ సంబంధ ప్రేమనే ఉండొచ్చు, ఆత్మీయ అనురాగపు బంధపు ప్రేమనే కావొచ్చును.. ఏదైనా కావొచ్చును. ప్రేమించిన కొలదీ ప్రతిదీ క్రొత్తగా కనిపిస్తుంది. ఎప్పుడూ చూడని క్రొత్త కోణాలను ఆవిష్కరిస్తుందీ ప్రేమ. ప్రేమ యొక్క పర్యావసానాలు ఎలా ఉన్నా - ప్రేమలో ఉన్న మహిమ వల్ల జీవించే సామర్థ్యం పెరుగుతుంది. 

నమ్మలేకున్నారా? అది నిజం. ప్రేమలో మీరు చేసేది డబుల్ వే ప్రేమ బంధమే కావొచ్చు, వన్ వే ట్రాఫిక్ ప్రేమనే కావొచ్చును.. మీరు ప్రేమించకున్నా ఎదుటివారు చూపించే ప్రేమనే మీరు అంగీకరించి, ఆ తాదాత్మికతని అనుభవిస్తున్నాసరే - మీరు మీ జీవన సామర్థ్యాన్ని పెంచుకున్నవారే అవుతారు. నమ్మకున్నా అది నిజం. అప్పటిదాకా మీలో ఉన్న కోపం, విసుగు, నిర్లక్ష్యం, దేనిమీద శ్రద్ధ పెట్టకపోవటం, జీవితం మీద చిన్న చూపు ఉండటం, మనమీద మనకే శ్రద్ధ లేకపోవటం...... ఇత్యాది లోపాలన్నీ మారిపోతాయి. వాటి స్థానాన మంచి పద్ధతులు చేరుతాయి. ఆ ప్రేమలో పడ్డాక / అనుభవిస్తున్నప్పుడు - తిట్టినా మధురమైన మాటలుగా వినిపిస్తుంటాయి. విసుగు అంటూ ఏమీ ఉండదు. ఎన్నిసార్లు చెయ్యమన్నా ఆనందముగా చేస్తారు. నిర్లక్ష్యం తగ్గుతుంది. ( మీ వృత్తి పని మాత్రం దెబ్బ తింటుంది ) జీవితం ఇంతకు ముందు కన్నా మరెంతో అందముగా కనిపిస్తుంది. మనవారి కోసం మరింత శ్రద్ధగా మనల్ని మనం అలకరించుకుంటాం. 

Thursday, November 14, 2013

Good Morning - 497


నమ్మకం : ఇది ఏర్పడాలీ అంటే కొన్ని సంవత్సరాలు కావాలి. కానీ నమ్మకం పోవటానికి కొద్ది క్షణాలు చాలు. 

మనం ఎదుటి వ్యక్తితో స్నేహమే కానీ, ఒక చక్కని బంధమే కానీ ఏర్పడటానికి ముందుగా కావాల్సింది నమ్మకం. అప్పటిదాకా పరిచయంగా ఉన్న స్నేహం / పరిచయం ఎదుటివారి మీద మంచి నమ్మకం ఏర్పడాలి. అలా ఏర్పడటానికి ఆ ఎదుటివారు తమ మీద నమ్మకం ఏర్పడేలా మాటలు, చేతలు, ఆహార్యం, మానసిక భావనలు, సంస్కారం, బాడీ లాంగ్వేజ్, తమ ఆలోచనలు.. చెయ్యాలి / చూపాలి. వీటన్నింటీ వల్ల మనలో ఒక చక్కని అభిప్రాయం ఏర్పడుతుంది. 

అదే ఏర్పడిన నమ్మకం పోవాలీ అంటే కొద్దిక్షణాలు చాలు. ఏదో తప్పుగా ఊహించుకోవడమో, మన స్నేహితులు చెప్పిన మాటలు ఎంత నిజమో తెలుసుకోకుండా చటుక్కున ఒక అభిప్రాయానికి రావటమో, కష్టపడి నమ్మకం ఏర్పరుచుకున్న స్నేహాన్ని / బంధాన్ని చిన్న చిన్న అపోహలు ( తమంతట తాముగా క్లారిఫై చేసుకుంటే చాలా తక్కువ సమయములో మబ్బుల్లా తేలిపోతాయి) వల్ల అప్పటిదాకా ఆత్మీయులు, శ్రేయోభిలాషులు అనుకున్న వారినీ దూరం చేసుకుంటాం. అలా పోగొట్టుకున్న నమ్మకాన్ని తిరిగిపొందటం చాలా కష్టమే.. 

Wednesday, November 13, 2013

Good Morning - 496


చక్కని ప్రణాళికకు మంచి ఊహాశక్తిని జోడిస్తే గొప్ప విజయాలను పొందగలుగుతాము. ఊహాశక్తి కొరవడిన ప్రణాళికలు మన పనిని నాశనం చేస్తాయి. 

చక్కని ప్రణాళికకు చాలా చక్కగా ఊహించి ఆలోచనలు చేసి, ఈ ప్రణాళికకు జోడిస్తే, తప్పకుండా విజయాలను పొందగలం. మన ఊహలు వాస్తవిక దృక్పతములో, నేలను విడిచి సాము చెయ్యకుండా ఉండాలి. ఏవేవో వాస్తవ సాధ్యం కాని ఆలోచనలు చేస్తే, అవి ఖచ్చితముగా మన పనినీ, మన విలువనీ, గౌరవాన్నీ దెబ్బతీస్తాయి. 

Tuesday, November 12, 2013

Good Morning - 495


విజయాలు, ఓటములు దినచర్యలో చిన్న భాగం మాత్రమే.. జీవితానికి అంతకు మించిన లోతైన నిర్వచనం ఉంది. 

మన జీవితాల్లో విజయాలూ, అపజయాలూ - మన దినచర్యలో చాలా చిన్న భాగం. ఒకసారి విజయాలే ఎదురవచ్చును.. చాలాసార్లు అపజయాలే ఎదుర్కునే ఉండి ఉండొచ్చును. కానీ ఏవీ శాశ్వతం కాదు. ఆకాశం లోని మబ్బుల వలె వస్తూ వెళుతుంటాయి. ఎప్పుడూ ఏదీ మన దగ్గర ఉండదు కూడా. ఒక వ్యక్తి విజయం సాధించినప్పుడు దగ్గరికి చేరటం, ఓటమి పాలవుతే - దూరముండి, విమర్శించటం సరియైన పద్ధతి కాదు. అదే మిత్రులయితే ఈ ఓటమి పొందినవారికి ధైర్యం చెప్పి, నిరాశకి లోను కాకుండా చూసి, గెలుపు దిశగా ప్రయత్నించేలా చూడాల్సిన బాధ్యత మీద ఉంటుంది కూడా.. నిజానికి ఈ గెలుపు ఓటమిలు ఈ సృష్టిలో ప్రతి ప్రాణికి తప్పవు. అడవిలోని మృగరాజుకి కూడా ఒక్కోసారి ఓటమి తప్పదు. ఈ ఓటమి మనకి ఎంత తక్కువగా నష్టాన్ని పొందేలా చేసుకున్నామనేది - చాలా ముఖ్యం. 

మన జీవితాన ఇంతగా ప్రభావితం చేసే ఈ గెలుపు, ఓటమిలు నిజానికి చాలా చిన్న భాగాన్ని ఆక్రమిస్తాయి. చాలామంది ఇవే ప్రముఖముగా చూస్తూ ఉంటారు. దీన్ని బట్టే ఆ మనిషికి విలువనిస్తూ ఉంటారు. కానీ కొద్దిమంది మాత్రమే ఈ అశాశ్వతమైన గెలుపు, ఓటమిలకు తక్కువ ప్రాధాన్యతని ఇస్తుంటారు. ఎందుకంటే ఈ జీవితానికి అంతకన్నా లోతైన అర్థం, పరమార్థం.. ఉంది. దాన్ని గురించి ఆలోచించే వారికి ఈ గెలుపు, ఓటమిలు అంతగా ప్రభావం చూపించవు. 

Monday, November 11, 2013

Good Morning - 494


ఎన్నటికీ తిరిగిరాని ఆ మధురానుభూతులు.. ఆ రోజులు..
అప్పట్లో ఆ విలువ తెలీదు.. ఇప్పట్లో పొందాలనుకున్నా పొందలేం.. 

బాల్యం ఒక మధురానుభూతి.. ఎన్నెన్నో మరపురాని అనుభూతులకు నెలవు అది. మది లోలోతుల్లో దాగుండి పోయే చక్కని, చిక్కనైన, అందమైన, ప్రత్యేక పరిమళం అద్దుకున్న వెలకట్టలేని జ్ఞాపకాలు అవి. 

నాన్నగారికి ఉండే పాత డొక్కు సైకిల్ మీద ముందున ఉండే అడ్డు రాడ్ మీద చెల్లినీ, వెనకాల ఉండే క్యారియర్ మీద మనల్నీ, పుస్తకాల బరువుతొ సహా ఎక్కించుకొని, వయసు పెరిగినా, లేని శక్తిని కూడబెట్టుకొని, తాను ఆయాసపడుతూ, హాయిగా ముందూ వెనకాల కూర్చున్న మనకు ఎన్నెన్నో కబుర్లు చెబుతూ, ఎక్కడా విసుక్కోకుండా, మధ్య మధ్య సరిగా కూర్చున్నారా? అని ఆరా తీస్తూ, మధ్యలో చాక్లెట్స్ ఇప్పిస్తూ (ఆ నెపం మీద తనకొచ్చిన ఆయాసం తీర్చుకుంటూ , అదీ కనపడకుండా దాచుతూ ) దారిలో వచ్చే అడ్డంకులను తప్పించుకొంటూ, స్కూల్ కి చేర్చి, అలాగే స్కూల్ అయ్యాక మళ్ళీ అదే పద్ధతిలో ఇంటికి తీసుకవచ్చే నాన్న - నిజముగా మహోన్నత వ్యక్తి. గమ్యం చేర్చాక కండువాతో / జేబులోని రుమాలుతో మొహానికి పట్టిన చెమటని తుడుచుకుంటూ ఇవాల్టి తన బాధ్యత తీరిందని ఆనందపడుతూ ఉండే నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలాంటి మనసు మదిలో దాగుండి పోయే మధురాభూతులు మరెన్నో.. 

ఎంతైనా ఆరోజులే వేరు.. ఈరోజుల్లో అన్నీ ఉన్నా, అంతకు మించి మోటార్ సైకిల్, కార్ ఉన్నా - రోజూ స్కూల్ వద్ద దిగబెడుతున్నా - అది బై బై చెప్పుకోవడం కన్నా ఇంకేమీ ఉండటం లేదు. అప్పటి రోజుల్లో ఉన్న ఆర్ద్రత ఇప్పుడు శూన్యం. అప్పట్లో బుద్ధి వికసించదు. ఆ కష్టం, ఆ ఆర్ద్రత, మమకారం వెనుక  ఉండే భావనలని అర్థం చేసుకోలేం. ఇప్పుడు అన్నీ అర్థం చేసుకుంటున్నా - చెయ్యటానికి ఏదో నామోషీగా ఫీల్ అవుతుంటాం. మన పిల్లలకు చేద్దామనుకున్నా ఏదోలా అనిపిస్తుంటుంది. ఎవరో, ఎక్కడి నుండో తొంగి చూస్తూ, ఏదో అనుకుంటున్నారని ఫీల్ అవుతూ ఆ ఆత్మీయతని పంచలేక పోతున్నాం. ఎంత తప్పు చేస్తున్నాం కదూ.. ఎంతైనా, ఎన్ని చెప్పినా ఆరోజులూ, ఆ భావనలూ, ఆ జ్ఞాపకాలు అన్నీ ప్రత్యేకాతిప్రత్యేకం..

Sunday, November 10, 2013

Good Morning - 493


గతంలో సాధించిన విజయంను చూసుకొని మురిసిపడితే - భవిష్యత్తులో వచ్చే విజయాలు అన్నీ దూరం అవుతాయి.. అన్నింటినీ సమానముగా పరిగాస్తూ పయనము చేసినప్పుడే మనం అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతాము. 


Saturday, November 9, 2013

Good Morning - 492


మనం సంతోషముగా ఉన్నప్పుడు ఆ ఆనందాన్ని పంచుకోవడానికి ఒక నిండు హృదయం కావాలి.. మనం బాధపడుతున్నప్పుడు మనం వాలడానికి ఒక భుజం కావాలి.. అప్పుడే జీవితానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది.. 

మనకి సంతోషం వచ్చినప్పుడో, విజయం సాధించినప్పుడో ఆ తాలూకు ఆనందాన్ని ఎందరిలో ప్రకటించుకున్నా, మనకు బాగా నచ్చిన వారి దగ్గర పంచుకోవటానికి ఎంతో ఉత్సుకత చూపిస్తాం. ఆ భావన తాలూకు సంతోషాన్ని పెద్దమనసుతో విని, అర్థం చేసుకొనే హృదయం ఉన్న ఆత్మీయుల పట్ల అమితాసక్తిని చూపిస్తాం. వారు చెప్పే, చూపించే చిన్న ఆనంద భావ ప్రకటన కోసం వెంపర్లాడుతాం. 

మనం బాధపడుతున్నప్పుడు - ఆ బాధని పంచుకోవడానికి ఒక తోడు ఉంటే బాగుండును అని అనిపిస్తుంది. నిజం చెప్పాలీ అంటే మనసుకి బాగా నచ్చిన ఆత్మీయ నేస్తమే కావొచ్చును.. తోడబుట్టిన బంధమే కావొచ్చును.. లేదా తల్లితండ్రులే కావొచ్చును. ఎవరైనా సరే - వారిపట్ల అచంచల నమ్మకం, ఎవరికీ ఏదీ తిరిగి చెప్పరు, ఆ విషయాన్ని వారిలోనే దాచేసుకుంటారు - అన్న నమ్మకం కలిగించేవారి భుజం మీదనో, ఒడిలో వాలి తనివితీరా బాధపడాలని, వారి గట్టిగా కౌగిలించుకొని - మన దుఃఖాన్ని వారితో పంచుకోవాలని అనుకుంటాం. బేలగా, గాయపడిన హృదయాన్ని సేదదీర్చి, ఆ విషయములో మనం ఎక్కడ పొరబాట్లు చేశామో, ఎలా సరిదిద్దుకోవాలో చెప్పేవారు మనకి ఉంటే, మరీ వారి సన్నిహిత్యాన్నే కోరుకుంటాం. అలాంటివారు దొరకడం మన అదృష్టమే అనుకోవాలి. 

అలా దొరికిననాడు, అలా సంతోషమొచ్చినా, బాధ వచ్చినా పంచుకోవడానికి ఒక ఆత్మీయ హృదయం ఉంటే - ఇక ఆ జీవితానికి అర్థం, పరమార్థం ఇంకా ఏముంటుంది..? అంతకన్నా అదృష్టం ఏముందీ..

Friday, November 8, 2013

Good Morning - 491


నీకు బాగా దగ్గరివారు ఎవరో తెలుసా..? 
ఎవరిని నువ్వు కలిసినప్పుడు నీకు ఆనందం కలుగుతుందో వారు కాదు.. 
ఎవరిని కోల్పోయినప్పుడు నీకు అమితమైన దుఃఖం కలుగుతుందో వారు. 

అవును కదా.. మన దగ్గరివాళ్ళు / ఆత్మీయులు అంటూ కొందరిని అనుకుంటాం.. వారు మన రక్త సంబంధీకులే కావచ్చు, జన్మనిచ్చిన తల్లితండ్రులే కావొచ్చును.. లేదా మిత్రులే కావొచ్చును.. వారు మన మనసుకి దగ్గరై ఉంటారు. మన హృదయములో వారికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. వారి చెంతకి చేరినప్పుడు - మన కష్టాలు, బాధలు మరచిపోతాం.. వారితో చెప్పుకున్నప్పుడు అవి సగం తగ్గిపోయాయి అనిపిస్తుంది. వారి సమక్షములో ఉన్నప్పుడు మనలో ఎప్పుడూ చూడని ఏదో సంతోషం, ఆనందం కలుగుతుంది. అప్పుడు మన హోదా, పరపతి, వయసు, లింగభేదం అన్నీ మరచిపోతాం. అవన్నీ మనకి చెందినవి కాకుండా అన్నట్లు ప్రక్కన పెట్టేస్తాం. ప్లాస్టిక్ నవ్వుల్లా పై పై నవ్వుల్లా కాకుండా, చిన్నపిల్లల్లా స్వచ్చమైన మనసుతో, హృదయ లోతుల్లోంచి మనసారా నవ్వేస్తాం. వారి వద్ద గంటలు నిమిషాల్లా గడిపేస్తుంటాం. సమయం క్షణాల్లా గడిచిపోతుంటాయి. నిజానికి నిజమైన  ఆత్మీయత అంటేనే అలాగే ఉంటుంది. ఆలాగే ఉండాలి కూడా.. అదో రూలు. 

అలాంటివారిని దూరం చేసుకున్న నాడు - పై పరిస్థితికి భిన్నముగా జరుగుతుంది. క్షణాలు యుగాలుగా, ఈ లోకములో మనకేవ్వరూ లేరు, మన భావనలు ఎవరూ వినరు.. మన మాటల కోసం ఎవరూ ఎదురుచూడరు, మనకంటూ ఒక ఆత్మీయ ఆత్మ నేస్తం లేరు అన్న తలంపుతో - కళ్ళు జలపాతాలు అవుతాయి. అవి ఎప్పటికీ ఆగిపోని, ఉప్పొంగే జలప్రవాహాల్లా సాగిపోతుంటాయి. వారు లేని ఈలోకములో ఎందరున్నా - వారివల్ల వచ్చే అనుభూతి మరెవ్వరి వల్లా దొరకక, లోకమంతా చిన్నబోయినట్లు అగుపిస్తుంది. అనుక్షణం వారి జ్ఞాపకాలు గుర్తుక వస్తాయి. ఈ సమయములో ఇలా అన్నారు, ఇలా చేశారు. అవి తలచుకుంటుంటే ఒకవైపు సంతోషం, అవి అయిపోగానే శూన్యంలో కూరుకపోయిన భావన వెంటాడుతుంది. అప్పుడే ఇలాంటి నరకయాతన పగవారికీ రాకూడదని అనుకుంటాం. ఇంతటి మానసిక పరిస్థితిని మనలో కలుగచేసే వారే మన దగ్గరివారు.. అంటే మన ఆత్మీయులు. ఇలాంటి పరిస్థితి - వారు చనిపోయినపుడో, మనకి దూరం అయినపుడో  జరుగుతుంది. 

నావిషయం వరకు వస్తే - ఇలాంటి పరిస్థితిని ఇప్పటికి కేవలం రెండు సార్లు మాత్రమే ఎదురుకున్నాను. ఒకసారి చాలా ఏళ్ళ క్రితం (ఇరవై రెండేళ్ళ క్రితం).. మరోసారి దాదాపు రెండు సంవత్సరాల  క్రిందట. అంతే!. 

Thursday, November 7, 2013

Good Morning - 490


చూశారా - ఈ అన్యోన్య దాంపత్యాన్ని.. వారి ప్రేమ ఇసుమంత కూడా తగ్గలేదు అన్నట్లు ఎలా నవ్వుతూ ఉన్నారో చూశారు కదూ.. ఎంత అదృష్టవంతులు వారు.. హాయిగా నవ్వుతూ ఫోటో తీయించుకున్నారు.. అతడేమిటీ..? తన వెనకాల అలా వీపు మీద ఎక్కాడు.. తను అతన్ని ఎలా మోస్తుంది? అని అనుకుంటున్నారా ?.. ఇప్పటిదాకా మీకు వచ్చిన కోపం - ఒకసారి అతని మరియు ఆమె చేతుల క్రిందుగా చూడండి. షాక్ అయ్యారా? ఇప్పుడు మీకు వచ్చిన కోపం స్థానాన్నే - జాలీ, దయ... ఏర్పడ్డాయా? 

అవును.. తను కాళ్ళు పోయిన వికలాంగుడే. తను ఎక్కడికీ కదలలేడు. అయినా ఫరవాలేదు.. నేనున్నాను అంటూ తన మీద ప్రేమతో, తనని ఎత్తుకొని అలా తీసుక వెళుతుంది తను. ఎప్పుడూ తగువులాడుకొనే భార్యాభర్తలు వీరిని చూసి, ఆదర్శముగా తీసుకోవాలి. వారిరువురి వివరాలు ఈ క్రింది లింక్ లో చూడండి.  http://blogs.militarytimes.com/battle-rattle/tag/jesse-cottle/

Wednesday, November 6, 2013

Good Morning - 489


నేను ఒంటరిగా ఎలా బ్రతకాలో నేర్పించటానికే - నీవు నా జీవితములోకి వచ్చావు.. 

ఒక వ్యక్తి జీవితాన వేరొకరు ప్రవేశించి, అభిమానం సంపాదించుకున్నాక, తప్పని పరిస్థితుల్లో తనని వదిలి వెళ్ళిపోతారు. వారు ప్రేమికుడో, ప్రేయసో, హితుడు, లేదా ఒక స్నేహితుడే కావచ్చును. వారు విడిపోయాక ఆ వ్యక్తి మదిలో కలిగే భావమది. " తన సహచర్యం లేకపోతే - నేను ఈ లోకాన ఒంటరిగా ఎలా బ్రతకాలో నేర్పించటానికే - నా జీవితాన ప్రవేశించావు.. " అనే బాధ / ఆవేదన / భావం అది. 



Tuesday, November 5, 2013

Good Morning - 488


నీ కన్నీళ్ళు నావి, 
నా నవ్వులు నీవి, 
ఈ ప్రపంచం నీదే.. 
నా ప్రపంచం నువ్వే..!  

Monday, November 4, 2013

Good Morning - 487


ఎప్పుడూ బాధపడుతూ ఉంటే - బ్రతుకు భయపడుతుంది. 
అదే ప్రతిక్షణం నవ్వుతూ  ఉంటే జీవితం తలవంచుతుంది. 

నిజమే ఇది. మొదట్లో నేనూ నమ్మేవాడినే కాదు.. ఒక స్నేహితురాలి జీవితం చూశాక - నేనూ మారాను. అందాక బ్రతుకు అంటే ఏదో తెలీని భయం.. రేపు ఏమవుతుందో? ఎలా అనీ.. ఆఫ్కోర్స్! ఇలా ప్రతివారికీ ఉంటుంది. కానీ బయటకు చెప్పుకోలేం - ఎక్కడ పిచ్చోడా..! ఎందుకలా భయపడుతావ్.. అని మాటలు వినాల్సి వస్తుందని.. (నిజానికి అలా అనేవాడికీ కూడా యే మూలో ఆ భయం తప్పక ఉంటుంది కూడా..) 

నా స్నేహితురాలి జీవితం దగ్గరనుండి చూశాను కాబట్టి, అప్పటిదాకా బ్రతుకు మీద కాస్తో కూస్తో భయం ఉన్నవాడిని ఇప్పుడు చాలా ధైర్యముగా ఉంటున్నాను. తను అయితే అన్నిరకాల కష్టాలనీ అనుభవించారు. లోపల ఎన్ని బాధలు ఉన్నా, పైకి మాత్రం చెదరని చిరునవ్వుతో స్వాగతిస్తుంది. తనదగ్గరికి వచ్చిన వారిని ఆప్యాయముగా పలకరించి, వారిని తన మాటలతో, నవ్వులతో ఉల్లాసపరుస్తుంది. కానీ ఆ నవ్వుల వెనుక చాలా బాధలు. చెబితే ఎవరూ నమ్మరు కానీ బాగా బాధలు అనుభవిస్తున్నవారే - చక్కగా నవ్వుకోగలరు. ఈ విషయాన్ని నేనూ స్వయానా అనుభవించాను.. అనుభవిస్తున్నాను కూడా. నాకు తనలో నచ్చిన గొప్ప విషయమూ ఇదే. చిన్నవయసులో పంటి క్రిందనే ఉంచేసి, బయటకి నవ్వుని మాత్రమే తీసుకరావటం చాలా గొప్పవిషయమే. మామూలుగా సాధ్యమయ్యే పని మాత్రం కాదు. అలా నేనూ ఇంప్రెస్ అయ్యాను. సంతోషాన్ని పంచితే అది రెట్టింపై మనల్ని తిరిగి సంతోషపరుస్తుంది అని అప్పుడే తెలుసుకున్నాను. 

ఇక్కడ ఒక సినిమా సన్నివేశం గుర్తుక వస్తుంది. గీతాంజలి సినిమాలో - హీరోయిన్ చనిపోతుందని తెలుసుకున్న హీరో బాధతో ఆమె ఇంటికి వెళ్ళి, ఆ విషయాన్ని అడిగితే, ఆ హీరోయిన్ చెప్పే మాటలు అద్భుతం. అక్కడి నుండీ - తనూ మరణించబోతున్న ఆ హీరో కూడా మారుతాడు. (ఈ సీన్ కొద్దిగా ఈ సందర్భానికి చెందింది కాబట్టి అదీ పోస్ట్ చేస్తున్నాను.. చూడండి) అభిమానించేవారు తాము ఎంతో అభిమానిస్తున్న వారు చెబితే ఎంతగా మారిపోతారు అన్నదానికి కూడా ఇది చక్కని ఉదాహరణ. 

Sunday, November 3, 2013

Saturday, November 2, 2013

Good Morning - 485


There are things you would love to hear that you would never hear that you would never hear from the person whom you would like to hear them from, but do not be so deaf as not to hear it from the on who says it from his heart. 

Friday, November 1, 2013

Good Morning - 484


Giving someone all your love is never an assurance that they will love you back. Do not expect love in return, just wait for it to grow in their heart. But if it does not, be content that it grew in yours. 

Related Posts with Thumbnails