చిత్రం పేరు : మురళీకృష్ణ (1964)
పాడిన వారు : ఘంటసాల
సంగీతం : మాస్టర్ వేణు
రచన : ఆత్రేయ
నటీనటులు : అక్కినేని, హరినాథ్, జమున, శారద..
****************
పల్లవి :
ఎక్కడ ఉన్నా ఏమైనా - మనమెవరికి వారై వేరైనా
నీ సుఖమే నేను కోరుకున్నా - నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుకున్నా
చరణం 1:
అనుకున్నామని జరగవు అన్నీ - అనుకోలేదనీ ఆగవు కొన్ని
జరిగేవన్నీ మంచికనీ - అనోకోవడమే మనిషి పనీ..
నీ సుఖమే నేను కోరుకున్నా
నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుకున్నా
చరణం 2:
పసిపాపవలె ఒడి చేరినాను - కనుపాపవలె కాపాడినాను
గుండెను గుడిగా చేశానూ -
గుండెను గుడిగా చేశానూ - నువ్వుండ లేననీ వెళ్లావూ
నీ సుఖమే నేను కోరుకున్నా
నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుకున్నా
చరణం 3:
వలచుట తెలిసిన నా మనసునకు - మరచుట మాత్రం తెలియనిదా
మనసిచ్చినదే నిజమైతే - మన్నించుటయే ఋజువు కదా!
నీ సుఖమే నేను కోరుకున్నా
నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుకున్నా
నీ కలలే కమ్మగా పండనీ - నాతలపే నీలో వాడనీ
కలకాలం చల్లగా ఉండాలనీ - దీవిస్తున్నా నా దేవిని
దీవిస్తున్నా నా దేవిని
ఎక్కడ ఉన్నా ఏమైనా - మనమెవరికి వారై వేరైనా
నీ సుఖమే నేను కోరుకున్నా - నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుకున్నా
నీ సుఖమే నేను కోరుకున్నా..
Tuesday, May 25, 2010
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
chaalaa baagundandee. Thanks.. ee paata lirik kosam vedikithe mee daantlo unnadi baagaa nachhindi.. once again thankyou..
Post a Comment