Wednesday, May 5, 2010

Maata rani mounamidi - Maharshi

చిత్రం: మహర్షి
సంగీతం : ఇళయరాజా
పాడినవారు:   ఎస్. పి. బాలు. ...
*****************************
  video 

పల్లవి:
మాట రాని మౌనమిది - మౌన వీణ గానమిది
మాట రాని మౌనమిది - మౌన వీణ గానమిది
గానమిదీ నీ ధ్యానమిదీ - ధ్యానములో నా ప్రాణమిదీ
ప్రాణమైన మూగ గుండె రాగమిది

మాట రాని మౌనమిది - మౌన వీణ గానమిది
మాట రాని మౌనమిది - మౌన వీణ గానమిది

చరణం 1:
ముత్యాల పాటల్లో కోయిలమ్మా - ముద్దారబోసేది ఎప్పుడమ్మా
ఆ పాల నవ్వులో వెన్నెలమ్మా - దీపాలు పెట్టేది ఎన్నడమ్మా
ఈ మౌన రాగాల ప్రేమావేశం - ఏనాడో ఒకరి సొంతం
ఆకాశ దీపాలు జాబిలి కోసం - నీకేల ఇంత పంతం
నింగీ నేల కూడే వేళ - నీకూ నాకూ దూరాలేల
అందరాని కొమ్మ ఇది - కొమ్మ చాటు అందమిది
మాట రాని మౌనమిది - మౌన వీణ గానమిది

చరణం 2:
చైత్రాన కూసేను కోయిలమ్మా - గ్రీష్మానికాపాట ఎందుకమ్మ
రేయంతా నవ్వేను వెన్నెలమ్మా - నీరెండకానవ్వు దేనికమ్మ
రాగల తీగల్లొ వీణానాదం - కోరింది ప్రణయవేదం
వేశారు గుండెల్లొ రేగె గాయం - పాడింది మధుర గేయం
ఆకాశాన తారతీరం - అంతేలేని ఎంతో దూరం

మాట రాని మౌనమిది - మౌన వీణ గానమిది
అందరాని కొమ్మ ఇది - కొమ్మ చాటు అందమిది
కూడనిదీ జత కూడనిదీ - చూడనిదీ మది పాడనిదీ
చెప్పరాని చిక్కుముడి వీడనిదీ

మాట రాని మౌనమిది..మౌన వీణ గానమిది
అందరాని కొమ్మ ఇది.. కొమ్మ చాటు అందమిది

2 comments:

నీహారిక said...
This comment has been removed by the author.
Anonymous said...

Looks like "amaavaasya" is getting close :-)

Related Posts with Thumbnails