పూర్వీకులు తనకు ఏమీ ఇవ్వలేదనుకునేవాడే పేదవాడిగా మిగిలిపోతాడు. తానేం చెయ్యాలో తెలుసుకున్నవాడు ఎదుగుతాడు. పుట్టెడు కష్టాల్లో కూడా ఈరోజు గురించి కాకుండా భవిష్యత్తు గురించి ఆలోచించేవాడు ఏరోజుకైనా గొప్పవాడు అవుతాడు.
నా తల్లితండ్రులు, తాత, ముత్తాతలు నాకు ఏమీ ఆస్థి ఇవ్వలేదు అని ఎప్పుడూ బెంగ పడేవాడు ఏమీ కష్టపడకుండానే గొప్పవాడిని కాలేకపోయానని బాధపడుతూ ఎప్పటికీ పేదవాడిగానే మిగిలిపోతాడు. నాకేమీ లేకున్నా, నా అంతట నేనుగా సంపాదించుకొని, గొప్పవాడిగా మారటానికి తగిన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ఇచ్చినదే చాలు.. ఈమాత్రం దానితో నేను ఒక గొప్ప స్థాయికి చేరుకుంటాను అనుకున్నవాడు ఖచ్చితముగా ఎదుగుతాడు.
కష్టాలు అనేవి వస్తూనే ఉంటాయి. వాటిని చూసి, బెంబేలెత్తి పోయేవాడు - పలాయన మంత్రం పాటించి, జీవితాన అధముడిగా తయారవుతాడు. ఒక్కోసారి కాలం కచ్చగా దాడి చేస్తుంది. ఆ సమయాన, తట్టుకొని నిలిచి, ఆ ప్రతికూల పరిస్థితులని ఎదురుకొని, వాటికి ఎదురునిలిచి, లక్ష్యసాధన చేసి, ఉన్నత స్థాయికి చేరుకోవాలని తపించేవాడు - ఏ రోజుకైనా గొప్పవాడు అవుతాడు.
No comments:
Post a Comment