నిన్ను ఎవరు ఏమన్నారన్నది ముఖ్యం కాదు.. వారన్నదానికి నువ్వెలా ప్రతిస్పందించావన్నది ముఖ్యం. కొన్నిసార్లు తప్పుకొని వెళ్ళిపోవడం కంటే, నిలబడి నవ్వడం మంచి ఫలితాన్నిస్తుంది.
మనల్ని ఎవరు ఏమి అన్నారు అన్నది ప్రధానం కాదు. వారు ఏదో తెలీకనో, తెలిసీ తెలీనిది తెలిసినట్లుగానో, మరేదో ఊహించుకొని గానీ, అస్సలుకే మన గురించి తెలీక కావొచ్చు.. ఏదేదో మన మనసు గాయపడేలా అంటుంటారు. అలా అన్నదానికి మనం ఎలా ప్రతిస్పందిస్తామో అన్నది చాలా ముఖ్యం. వారు అన్నదానికి ఏమీ బదులివ్వక మౌనం వహించి, ఆ మాటలు పడుతాం. లేదా వాళ్ళతో వాదించి గొడవపడుతాం. మాటలు పడి, మౌనముగా తప్పుకుంటే - మనం ఆ మాటల్ని నిజం చేస్తాం. ఎదిరించి వాదిస్తే - చులకన కావొచ్చు + వారితో శాశ్వత ఎడబాటుకి గురి అవొచ్చు. కొన్నిసార్లు మనం వారి మాటలు పడి, ప్రక్కకి తప్పుకొనే బదులు, కాస్తంత చిరునవ్వు చిందిస్తూ, వారి మాటలకు సమాధానముగా చిరునవ్వు చిందిస్తే - అది మంచి ఫలితాన్ని ఇస్తుంది.
No comments:
Post a Comment